పెద్దకందుకూర్‌లో లభ్యమైన గడువు ముగిసిన పాల ప్యాకెట్లు
యాదగిరిగుట్ట : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేయాలి.. అం దుకోసం ప్రతి కేంద్రానికి పౌష్టికాహారం, కోడి గుడ్లు, పాల ప్యాకెట్లు తదితరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పదేపదే చెబుతు న్నా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి.
పౌష్టికాహారం అందించి పసి పిల్లల ఎదుగుదలకు చర్యలు చేపట్టాల్సిన కేంద్రాలు.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని వెలుగు చూస్తున్న నిజాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆకస్మిక తనిఖీలకు వచ్చిన అధికారులు.. కేంద్రాల్లో బయటపడుతున్న గడువు ముగిసిన పాలప్యాకెట్లు, కుళ్లిపోయిన కోడిగుడ్లు చూసి నివ్వెరపోతున్నారు.
తనిఖీల్లో నిజాలు...
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, చొల్లేరు, మ ర్రిగూడెం, ఆహ్మద్‌నగర్, పెద్దకందుకూర్‌లోని అం గన్‌వాడీ కేంద్రాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మేడ్చ ల్, యాదాద్రి భువనగిరి రిజినల్ ఆర్గనైజర్ మల్లేపల్లి సువర్ణరెడ్డి సోమవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన కుర్‌కురే, పాల ప్యాకెట్లు, ఇతర స్నాక్స్ ప్యాకెట్లు లభ్యమయ్యా యి.
మూడు రోజుల క్రితం ఆలేరు మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ కుళ్లిపోయిన కోడిగు డ్లు, గడువు తీరిన పాల ప్యాకెట్లు బయటపడ్డ విష యం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అంగన్‌వా డీ టీచర్లు, సిబ్బంది కాలం చెల్లిన పాల ప్యాకెట్లు, ఇతర పౌష్టికాహారాలను పడేస్తున్నారు. పెద్దకందుకూర్‌లో 2018 మే 2నుంచి ఉన్న 30పాల ప్యాకె ట్లు, చొల్లేరు కేంద్రంలో 2017 డిసెంబర్ 17లో ఇవ్వాల్సిన పాల ప్యాకెట్లు, గడువు ముగిసిన కురుకురేలతో పాటు స్నాక్స్ లభించాయి.
ప్రాణాలతో చెలగాటమే...
ఇటీవల కాలంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో గడువు ముగిసి, కాలం చెల్లిన పాలు, గుడ్డు, కుర్‌కురే వం టి ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. వీటినే చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్నా రు. దీంతో వారి ఆరోగ్యానికి ముప్పు వాటి ప్ర మాదం లేకపోలేదు.
వీటిని సరాఫరా చేసే కాంట్రాక్టులు నాణ్యమైనవి ఇస్తున్నారా.. లేక కాలం చెల్లినవి ఇస్తున్నారా? అనే విషయాలను కూడా స్థానికంగా కేంద్రాల్లో ఉండే టీచర్లు గమణించకపోవడం విడ్డూరంగా ఉందని తనిఖీలకు వచ్చిన అధికారులు అంటున్నారు.
తనిఖీలకు వచ్చిన అధికారులకు ఫోన్లు!
అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీలకు వచ్చిన అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. మన వారే.. పట్టించుకోవద్దంటూ హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇటీవల కాలం చెల్లిన కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు లభ్యమైన విషయం బటయకు పొక్కకుండా కాపాడేందుకు అంగన్‌వాడీ టీచర్ల వద్ద వారి పై స్థాయి అధికారులు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఉపేక్షించేది లేదు
మూడు రోజులుగా ఆలేరులోని అన్ని సెక్టార్లలో తనిఖీలు చేస్తున్నాను. ఈ తనిఖీల్లో చెప్పలేని నిజాలు వెలుగుచూస్తున్నాయి. కుళ్లిపోయిన కోడి గుడ్ల, గడువు ముగిసిన పాల ప్యాకెట్లు, కుర్‌కురేలతో పాటు ఇతర స్నాక్స్ బయట పడుతున్నాయి.
గడువు ముగిసిన వస్తువులను గుర్తించడంలో అంగన్‌వాడీ సిబ్బంది విఫలమవుతున్నారు. కేం ద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షిం చేది లేదు. కింది స్థాయి సిబ్బంది అయినా పై స్థాయి అధికారులైన చర్యలు తప్పవు. –మల్లెపల్లి సువర్ణ, స్త్రీ, శిశు సంక్షేమ రీజినల్ ఆర్గనైజర్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment