milk packets
-
TIPS: రోజూ వాడే పాలప్యాకెట్లను పడేస్తున్నారా.. ఇలా వాడుకోవచ్చు
పాలు నిల్వచేయడానికి వాడే ప్యాకెట్ గట్టిగా ఉంటుంది. అందువల్ల ప్యాకెట్లన్నింటిని వెడల్పుగా కత్తిరించి శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత ఒకదానితో ఒకటి కలిపి చిన్న చిన్న బుక్స్‌కు అట్టలుగా, ప్యాకింగ్ కవర్లుగా వాడుకోవచ్చు. దీనివల్ల నోట్‌బుక్స్, ప్యాకింగ్ చేసిన వస్తువులు తడవకుండా ఉంటాయి. ►పాలప్యాకెట్లను గరాటు ఆకారంలో రోల్ చేసి ఊడకుండా టేప్‌తో గట్టిగా అతికించాలి. ఈ గరాటులో ఫుడ్క్రీమ్, మెహిందీ వేసి నచ్చిన విధంగా డిజైన్లు వేసుకోవచ్చు. ∙ఇంట్లో చాలా పాల ప్యాకెట్లు ఉన్నప్పుడు అన్నింటిని కలిపి మ్యాట్లా కుట్టు్టకుని వాడుకోవచ్చు. ►ప్యాకెట్లతో విసనకర్రలా తయారు చేసి వాడుకుంటే చల్లటి గాలి వస్తుంది. ►కుండీల్లో మొక్కలు పెంచే స్థలం లేనప్పుడు పాలప్యాకెట్లలో మొక్కలను పెంచుకోవచ్చు. ప్యాకెట్స్‌లో కొద్దిగా మట్టి పోసి విత్తనాలు వేసి చిన్నచిన్న మొక్కలు పెంచుకోవచ్చు. -
ఆ పాపాలు ఎవరివంటే..?
భామిని: వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వా రా పిల్లలు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన ఐసీడీఎస్ పాలు ఆక్రమ రవాణా కేసులో ఇద్దరిని అరె స్టు చేశామని, మరో ముగ్గురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. అరెస్టయిన వారిలో వ్యాన్ యజమాని, డ్రైవర్ ఉన్నట్టు పేర్కొన్నారు. భామిని మండలం బత్తిలి పోలీస్ స్టేషన్లో ఎస్సై కె.వి.సురేష్‌తో కలిసి పాలు ఆక్రమ రవాణా కేసు వివరాలను ఆది వారం వెల్లడించారు. బత్తిలి పోలీస్‌లు చెక్‌పోస్టు వ ద్ద శనివారం పట్టుకున్న 1919 లీటర్ల పాల అక్రమ రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్లను సరఫరా చేసే సబ్‌డీలర్లే కార్యకర్తల వద్ద కొనుగోలు చేసి అ క్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధి నుంచి పాల ప్యా కెట్లు తరలివచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీటిని మిఠాయి, టీ షాపులకు విక్రయిస్తున్నారన్నా రు. ప్యాకెట్లపై ఉన్న నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయగా.. వీరఘట్టం ప్రాజెక్టుకు చెందిన ప్యాకెట్లు కూడా ఉన్నట్టు వివరించారు. వీటి అమ్మకాలపై డి విజన్‌లోని కొన్ని మండలాల్లో తనిఖీలు నిర్వహించి పలు దుకాణాల్లో ఇవే రకం పాలు ప్యాకెట్లు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. సీజ్ చేసిన ప్యాకెట్లను ఐసీడీఎస్ పీడీకి అప్పగించామన్నారు. -
శిశు సంక్షేమం.. అనారోగ్యం పాలు!
రామగిరి: మహిళా శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత ఇలాకాలోనే మహిళలు, శిశువులకు అన్యాయం జరుగుతోంది. పౌష్టికాహారం పేరుతో అందజేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపిస్తుండడంతో వాటిని స్వీకరించిన పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌కు ఉన్నత స్థాయి పలుకుబడి ఉండడంతో అధికారులు పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. దీంతో నాసిరకం కోడిగుడ్లు, కాలంచెల్లిన పాల ప్యాకెట్లు గర్భిణులు, చిన్నారులు, బాలింతల వద్దకు చేరిపోతున్నాయి. మంత్రి సునీత సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్త పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాలం చెల్లిన పాలు :రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ పాలను సరఫరా చేశారు. వీటిని తయారు చేసిన మూడు నెలల్లోపు వినియోగించాల్సి ఉంది. అయితే ఆరు నెలల క్రితం ప్యాక్ చేసిన పాలు కొన్నింటిని సరఫరా చేయగా.. మరికొన్ని పాలుకు నేటితో (మంగళవారం)తో గడువు ముగియనుంది. వీటిని చెన్నేకొత్తపల్లి మండలంలోని 62 అంగన్ వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్ సరఫరా చేసి చేతులు దులుపుకున్నాడు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించారు. ప్రజారోగ్యంతో చెలగాటం : స్త్రీ శిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గొప్పలకు పోతున్న రాష్ట్ర మంత్రి పరిటాల సునీత.. తన సొంత నియోజకవర్గంలోనే మహిళలు, శిశువుల సంక్షేమాన్ని విస్మరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నాణ్యత లేని, నాసిరకంగా కాలం చెల్లిన సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నా.. ఆమె స్పందించకపోవడం ఇందుకు అద్దం పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. చెన్నేకొత్తపల్లి మండలంలోని మొత్తం 62 అంగన్ వాడీ కేంద్రాలకు ఇటీవల కాలం చెల్లిన పాలను సరఫరా చేశారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో 2,408 మంది చిన్నారులు, 281 మంది బాలింతలు, 294 మంది గర్భిణులు ఉన్నారు. వీరందరికీ పౌష్టికాహారం కింద కోడి గుడ్లు, పాల ప్యాకెట్లను అందజేస్తున్నారు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు కానీ.. కాలం చెల్లిన, నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడడం దుమారం రేపుతోంది. వెనక్కు తెప్పిస్తాం చెన్నేకొత్తపల్లి మండలంలో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు సరఫరా చేసిన మాట వాస్తవమే. అంగన్వాడీ కేంద్రాల నుంచి వాటన్నింటినీ వెనక్కు తెప్పిస్తున్నాం. పాలు సరఫరా చేసే ఏజన్సీ వారు అదనంగా స్టాక్ ఉందని ఎక్కువగా సరఫరా చేయడం వల్లనే ఈ సమస్య తలెత్తింది. ఇకపై ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.– గాయత్రి, సీడీపీవో, చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ -
అమృతం..విషమైంది
బేస్తవారిపేట: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలప్యాకెట్లు ఉబ్బి దుర్వాసన వెదజల్లుతూ పాడైపోవడంతో కాంట్రాక్టర్ కలగొట్ల సమీపంలో పడేశాడు. బేస్తవారిపేట గోడౌన్లో నిల్వ ఉంచిన అన్న అమృతహస్తం పథకంలో గర్భిణులు, బాలింతలకు, బరువు తక్కువ చిన్నారులకు అందించే ట్రాక్టర్ పాల ప్యాకెట్లు పనికిరాకుండా పోవడంతో పడేశారు. జిల్లా అంతటికీ పాల ప్యాకెట్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ బేస్తవారిపేటలోని గోడౌన్‌కు సకాలంలో చేర్చాడు. గోడౌన్ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సబ్ కాంట్రాక్టర్ సరఫరా చేయలేదు. మే నెలలో లబ్ధిదారులకు అందని పాలు: బేస్తవారిపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అర్థవీడు, కంభం, బేస్తవారిపేట, గిద్దలూరు ప్రాజెక్ట్ పరిధిలోని కొమరోలు, గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు మే నెలలో అన్న అమృతహస్తం పథకంలో అందించాల్సిన పాల ప్యాకెట్ల సరఫరా నిలిచిపోయింది. గర్భిణులు, బాలింతలు, బరువు తక్కువ ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందకుండాపోయింది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్లలో కొన్ని దుర్వాసన రావడం, ప్యాకెట్లు ఉబ్బిపోయాయి. పట్టించుకోవాల్సిన ఐసీడీఎస్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారు. బేస్తవారిపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణులు 950, బాలింతలు 1050, బరువు తక్కువ పిల్లలు 550, గిద్దలూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణులు, బాలింతలు 2,452 మంది ఉన్నారు. -
పసి ప్రాణాలతో చెలగాటమా?
యాదగిరిగుట్ట : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేయాలి.. అం దుకోసం ప్రతి కేంద్రానికి పౌష్టికాహారం, కోడి గుడ్లు, పాల ప్యాకెట్లు తదితరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పదేపదే చెబుతు న్నా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. పౌష్టికాహారం అందించి పసి పిల్లల ఎదుగుదలకు చర్యలు చేపట్టాల్సిన కేంద్రాలు.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని వెలుగు చూస్తున్న నిజాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆకస్మిక తనిఖీలకు వచ్చిన అధికారులు.. కేంద్రాల్లో బయటపడుతున్న గడువు ముగిసిన పాలప్యాకెట్లు, కుళ్లిపోయిన కోడిగుడ్లు చూసి నివ్వెరపోతున్నారు. తనిఖీల్లో నిజాలు... యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, చొల్లేరు, మ ర్రిగూడెం, ఆహ్మద్‌నగర్, పెద్దకందుకూర్‌లోని అం గన్వాడీ కేంద్రాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మేడ్చ ల్, యాదాద్రి భువనగిరి రిజినల్ ఆర్గనైజర్ మల్లేపల్లి సువర్ణరెడ్డి సోమవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన కుర్కురే, పాల ప్యాకెట్లు, ఇతర స్నాక్స్ ప్యాకెట్లు లభ్యమయ్యా యి. మూడు రోజుల క్రితం ఆలేరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లోనూ కుళ్లిపోయిన కోడిగు డ్లు, గడువు తీరిన పాల ప్యాకెట్లు బయటపడ్డ విష యం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అంగన్వా డీ టీచర్లు, సిబ్బంది కాలం చెల్లిన పాల ప్యాకెట్లు, ఇతర పౌష్టికాహారాలను పడేస్తున్నారు. పెద్దకందుకూర్‌లో 2018 మే 2నుంచి ఉన్న 30పాల ప్యాకె ట్లు, చొల్లేరు కేంద్రంలో 2017 డిసెంబర్ 17లో ఇవ్వాల్సిన పాల ప్యాకెట్లు, గడువు ముగిసిన కురుకురేలతో పాటు స్నాక్స్ లభించాయి. ప్రాణాలతో చెలగాటమే... ఇటీవల కాలంలో అంగన్వాడీ కేంద్రాల్లో గడువు ముగిసి, కాలం చెల్లిన పాలు, గుడ్డు, కుర్కురే వం టి ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. వీటినే చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్నా రు. దీంతో వారి ఆరోగ్యానికి ముప్పు వాటి ప్ర మాదం లేకపోలేదు. వీటిని సరాఫరా చేసే కాంట్రాక్టులు నాణ్యమైనవి ఇస్తున్నారా.. లేక కాలం చెల్లినవి ఇస్తున్నారా? అనే విషయాలను కూడా స్థానికంగా కేంద్రాల్లో ఉండే టీచర్లు గమణించకపోవడం విడ్డూరంగా ఉందని తనిఖీలకు వచ్చిన అధికారులు అంటున్నారు. తనిఖీలకు వచ్చిన అధికారులకు ఫోన్లు! అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలకు వచ్చిన అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. మన వారే.. పట్టించుకోవద్దంటూ హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇటీవల కాలం చెల్లిన కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు లభ్యమైన విషయం బటయకు పొక్కకుండా కాపాడేందుకు అంగన్వాడీ టీచర్ల వద్ద వారి పై స్థాయి అధికారులు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉపేక్షించేది లేదు మూడు రోజులుగా ఆలేరులోని అన్ని సెక్టార్లలో తనిఖీలు చేస్తున్నాను. ఈ తనిఖీల్లో చెప్పలేని నిజాలు వెలుగుచూస్తున్నాయి. కుళ్లిపోయిన కోడి గుడ్ల, గడువు ముగిసిన పాల ప్యాకెట్లు, కుర్కురేలతో పాటు ఇతర స్నాక్స్ బయట పడుతున్నాయి. గడువు ముగిసిన వస్తువులను గుర్తించడంలో అంగన్వాడీ సిబ్బంది విఫలమవుతున్నారు. కేం ద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షిం చేది లేదు. కింది స్థాయి సిబ్బంది అయినా పై స్థాయి అధికారులైన చర్యలు తప్పవు. –మల్లెపల్లి సువర్ణ, స్త్రీ, శిశు సంక్షేమ రీజినల్ ఆర్గనైజర్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లా -
కల్తీలను నిమిషాల్లో నిగ్గు తేలుస్తుంది
-
నిమిషాల్లో నిగ్గు తేలుస్తుంది
సాక్షి, హైదరాబాద్: పాల ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్ల నుంచి వంటల్లో వాడే మసాలాలు, నూనెల వరకు...కిరాణా కొట్లో కొనే సరుకుల నుంచి కర్రీ పాయింట్లలో విక్రయించే కూరలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వడ్డించే వంటకాల వరకు జరుగుతున్న కల్తీలకు ఇకపై నిమిషాల వ్యవధిలోనే అడ్డుకట్ట పడనుంది. ఇప్పటివరకు ఆహార నమూనాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి వాటి నాణ్యతను తేల్చేందుకు ఎక్కువ కాలం పడుతుండగా ఇక నుంచి ఫిర్యాదులు అందిన చోటే పరీక్షలు జరగనున్నాయి. ఆహార పదార్థాల నాణ్యతపై అక్కడికక్కడే ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఆహార కల్తీని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్’రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) కార్యాలయ ఆవరణలో ఈ వాహనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి, శాసన మండలి చైర్మన్ వి.స్వామిగౌడ్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ తదితరులు ప్రారంభించారు. రూ. 50 లక్షలతో రూపొందిన ఈ వాహనంలో కల్తీలను నియంత్రించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహన నిర్వహణ, ఇంధన ఖర్చుల కోసం ఏటా రూ. 5 లక్షలను సైతం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనుంది. ఇకపై ఈ వ్యాన్ నేరుగా హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఫిర్యాదులు చేసే వినియోగదారుల ఇళ్ల వద్దకు వచ్చి మరీ పరీక్షలు చేయనుంది. చాలా రకాల నమూనాలపై కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను వెల్లడించనుంది. ఆహార ఉత్పత్తుల వ్యాపారం ఎక్కువగా జరిగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ వాహనం సేవలను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక అవగాహన... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ కేవలం ఆహార పరీక్షలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ సంచరించనుంది. ఆహారం, తాగునీరు కల్తీ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు, స్వీయ శుభ్రతలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించనుంది. వాహనంలోని టీవీ ద్వారా కల్తీకి సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. వాహనంలో డ్రైవర్, ఫుడ్ అనలిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, అటెండర్ ఉంటారు. నెలవారీ టార్గెట్ ప్రకారం ఈ వాహనం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పర్యటిస్తుంది. వెంటనే ఫలితాలు ప్రకటిస్తాం కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం 54 రకాల పదార్థాలపై పరీక్షలు నిర్వహిస్తాం. వెంటనే ఫలితాలను కూడా ప్రకటిస్తాం. ఈ వ్యాన్ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. – డాక్టర్ కె.సావిత్రి, చీఫ్ ఫుడ్ ఎనలిస్ట్ (ఐపీఎం) ఇంట్లో వాటినీ పరీక్షించుకోవచ్చు ఇళ్లలో పాల నాణ్యతపై సందేహం ఉన్న వారు నేరుగా ఈ వ్యాన్ వద్దకు వచ్చి పాలను పరీక్షించుకోవచ్చు. – బి.విజయలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ వైరాలజీ స్పాట్‌కు వెళ్తాం సాల్వ్ చేస్తాం మాకు ఫిర్యాదు అందినా..అందకున్నా మేం స్పాట్‌కు వెళ్తాం. పాలు, ఉప్పు, పప్పు, కూరలు, అన్నం, నూనె వంటి వాటిపై తక్షణం పరీక్షలు నిర్వహిస్తాం. అక్కడికక్కడే రిజల్ట్‌ని ప్రకటిస్తాం. – బి.శారద, ఫుడ్ ఎనలిస్ట్ వీటిపై పరీక్షలు.. పాలు, నెయ్యి, పన్నీరు, నూనె, కారం, కారాబూందీ, ఆలూ చిప్స్, తీపిపదార్థాలు, ఉప్పు, మసాలాలతో కూడిన నిల్వ పదార్థాలు, అన్ని రకాల పచ్చళ్లను పరీక్షించి మొబైల్ ల్యాబ్ అప్పటికప్పుడే ఫలితాలను వెల్లడిస్తుంది. ఆహార పదార్థాల్లో నిషేధిత రంగులుంటే వెంటనే పసిగడుతుంది. సందేహాలు ఉన్న కొన్ని నమూనాలను మాత్రం ఐపీఎంకు తరలించి పరీక్షిస్తారు. అలాగే చిన్న దుకాణాలు, బేకరీల్లో విక్రయించే నీళ్ల ప్యాకెట్లు, బాటిళ్లు, పాల ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా ఉందో లేదో పరీక్షించేందుకు మొబైల్ ల్యాబ్‌లో 24 గంటల సమయం పట్టనుంది. ఫోన్ కొట్టు భరతం పట్టు.. ఆహార కల్తీలపై 9100107309 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సిబ్బంది వాహనంతో వచ్చి నమూనాలు సేకరించి అక్కడికక్కడే ఫలితాలు ప్రకటిస్తారు. కల్తీ నిజమని తేలితే కల్తీదారుడిని జైలుకు పంపుతారు. వ్యాన్‌లో ఉండేవి ఇవే... వ్యాన్‌లో పరీక్షలు నిర్వహించడానికి ‘మిల్క్ స్క్రీన్, పీహెచ్ మీటర్ (నీరు, ఆయిల్ల అనాలసిస్ కోసం), న్యూమరికల్ బ్యాలెన్స్ పరికరం, కెమికల్ స్టాండ్, బ్యూరెట్, బ్యూరెట్ స్టాండ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, ల్యాడర్, సెటప్ రేడియో, యాంప్లిఫ్లయర్, వర్క్ బెంచ్, జనరేటర్, రిఫ్రిజిరేటర్, గ్యాస్ సిలిండర్, వాటర్ ట్యాంక్, సింక్, ఫైర్ ఎగ్జాస్ట్, కంప్యూటర్, ప్రింటర్, టీవీ ఉన్నాయి. త్వరలో మరో వాహనం: లక్ష్మారెడ్డి ఆహార కల్తీని నియంత్రించేందుకు తొలి దశలో రెండు వాహనాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ప్రస్తుతానికి ఒక వాహనాన్ని పంపారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలోనే మరో వాహనం వస్తుందని చెప్పారు. ఆహార కల్తీ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు, వ్యాపారులు కల్తీలను అరికట్టడంలో నిజాయితీగా వ్యవహరించాలని కోరారు. ఆహార కల్తీ చట్టాన్ని మరింత కఠినంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. పటిష్టమైన చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. -
పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లు!
సాక్షి, అమరావతి: టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాలలో అక్రమాలు అరికట్టేందుకు పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కొత్త టెట్రా విధానాన్ని ఎక్సైజ్ శాఖ పరిశీలిస్తోంది. ఈమేరకు మహారాష్ట్రలోని పుణేలో మద్యం ప్యాకెట్లను ఉత్పత్తి చేసే కంపెనీని పరిశీలించేందుకు అడిషనల్, జాయింట్ కమిషనర్లు ఆదివారం అక్కడికి వెళ్లారు. చీప్ లిక్కర్‌ను 180 ఎం.ఎల్ ప్యాకెట్లలో సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమలు అవుతున్న ప్యాకెట్ విధానం విజయవంతం కాకపోవడంతో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు పాల ప్యాకెట్ తరహా టెట్రా ప్యాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తలుస్తోంది. -
అర లీటర్ ప్యాకెట్లో 420 ఎంఎల్ పాలు !
హొసూరు (తమిళనాడు): హెరిటేజ్ డెయిరీ వినియోగదారులను నిండా ముంచుతోంది. ప్యాకెట్‌పై 500 ఎంఎల్ అని ముద్రిస్తున్నా, అందులో మాత్రం ఆ మేరకు పాలు ఉండడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హొసూరుకు చెందిన శ్రీనివాసన్ శనివారం ఉదయం హెరిటేజ్ దుకాణంలో అర లీటర్ పాకెట్లు రెండు కొనుగోలు చేశాడు. ఒక పాకెట్లో పాలు తక్కువగా ఉండటంతో దుకాణదారుడిని ప్రశ్నించాడు. అయితే సదరు దుకాణదారుడు తనకు సంబంధం లేదని, కర్ణాటక నుంచి పాకెట్లు ఎలా వస్తే తాము అలాగే విక్రయిస్తున్నట్లు దబాయించాడు. ఒక ప్యాకెట్లో 500 ఎంఎల్, మరో పాకెట్లో 420 ఎంఎల్ మాత్రమే ఉందని, తాను వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయనున్నట్లు శ్రీనివాసన్ తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలో హెరిటేజ్ లీలలపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
క్షీరం.. భారం
లీటరుకు రూ.8 వరకూ పెంచిన వ్యాపారులు ‘హుదూద్’ దెబ్బకు తగ్గిన పాల ప్యాకెట్ల ఉత్పత్తి దానికి తోడు రోజూ వేల లీటర్లు విశాఖకు తరలింపు సాక్షి, రాజమండ్రి :ఉత్తరాంధ్రపై విరుచుకుపడిన హుదూద్ తుపాను ప్రభావం కొంతమేర జిల్లాపైనా పడుతోంది. జిల్లాలో పాడిపంటలకు అంతగా నష్టం కలిగించని తుపాను ఇప్పుడు పాల కొరతకు, తద్వారా ధర పెరుగుదలకు కారణమవుతోంది. రెండురోజులుగా జిల్లాలో పలుచోట్ల పాల ప్యాకెట్లవిక్రేతలు లీటరుకు రూ.ఐదు నుంచి రూ.ఎనిమిది వరకు పెంచి అమ్ముతున్నారు. జిల్లాలో ప్యాకెట్ల రూపంలో అమ్ముడయ్యే పాలలో 80 శాతం విశాఖ డెయిరీ నుంచే వస్తాయి. విశాఖ పరిసరాల్లోని ఈ డెయిరీ విశాఖపట్నం నుంచి రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం మార్గాల్లో సుమారు 99 బల్క్ కూలింగ్ కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తుంది. వాటిని ప్యాకెట్లుగా మార్చి మూడు జిల్లాల్లోని 56 రూట్లలో రవాణా చేస్తుంది. తుపానుతో వీటిలో 30 రూట్లు దెబ్బ తిన్నాయి. రోజుకు అయిదు లక్షల అరలీటరు ప్యాకెట్లను తయారు చేసే విశాఖ డెయిరీలో తుపానుతో 60 శాతం ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రోజుకు 40 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాలసేకరణ 40 శాతం వరకూ నిలిచి పోయింది. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ నగరాలతో పాటు పలు ప్రధాన పట్టణాలకు విశాఖ డెయిరీ నుంచి పాల ప్యాకెట్లు సరఫరా అవుతుంటాయి. విశాఖ డెయిరీ ఉత్పత్తి చేసే పాల ప్యాకెట్లలో ఎక్కువ భాగం ఇప్పుడు తుపాను కారణంగా కకావికలమైన విశాఖలోని బాధితుల కోసం తరలిస్తున్నారు. ఈ అన్ని కారణాలతో జిల్లాకు వచ్చే ప్యాకెట్ల సంఖ్య తగ్గిపోయింది. దీనికి తోడు పలు సంస్థలు, దాతలు జిల్లాలో విశాఖ డెయిరీతో పాటు ఇతర డెయిరీల పాల ప్యాకెట్లను సేకరించి విశాఖ బాధితులకు పంపుతున్నారు. దీంతో జిల్లాలో పాలకు కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ధరను పెంచి అమ్ముతున్నారు వ్యాపారులు. మరింత పెరిగే అవకాశం సాధారణంగా జిల్లాలో స్థానికంగా ఉత్పత్తి అయ్యే పాలు రిటైల్ మార్కెట్‌కు రావు. ఇందులో ఎక్కువ భాగం హార్లిక్స్, అమూల్ తదితర పాల ఉత్పత్తుల కంపెనీలు సేకరిస్తాయి. మిగిలినవి నేరుగా వినియోగదారుల ఇళ్లకు లేదా డెయిరీల సేకరణ కేంద్రాలకు చేరుతుంది. దీంతో పాల ప్యాకెట్ల కోసం వినియోగదారులు విశాఖ డెయిరీ లేదా ఇతర డెయిరీలపై ఆధారపడుతున్నారు. జిల్లాలో లభించే పాల ప్యాకెట్లతో పాటు నిల్వ చేసుకోదగ్గ పాల ప్యాకెట్లనూ వేల సంఖ్యలో దాతలు కొనుగోలు చేసి విశాఖకు పంపిస్తుండడంతో మంగళవారం నుంచి స్థానిక అవసరాలకు సరిపడా పాలు దొరకడం లేదు. ప్రస్తుతం రూ.అయిదు నుంచి రూ.ఎనిమిది వరకూ పెంచి అమ్ముతున్నా.. విశాఖలో సాధారణ పరిస్థితి నెలకొనేలోగా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
అనకాపల్లిలో పాల ప్యాకెట్ల కోసం తొక్కిసలాట
విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుఫాను బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాల ప్యాకెట్ల క్యూలైన్ వద్ద తొక్కిసలాట జరిగింది. పాల ప్యాకెట్ల కోసం బాధితులు ఒక్కసారిగా తోసుకు రావటంతో గందరగోళం నెలకొంది. మరోవైపు పాల ప్యాకెట్ల కోసం జనాలు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే జనాలు పాల ప్యాకెట్ల కోసం రోడ్లపై బారులు తీరారు. కాగా పాల ప్యాకెట్ల పంపిణీలో ప్రణాళిక లేని కారణంగా నిజమైన బాధితులకు పాలు అందలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా తుఫాను వల్ల జనానాకి ఏమీ దొరకడంలేదు. కూరగాయలు, పాలు అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో ప్రభుత్వం సాధారణ ధరలకు పాల ప్యాకెట్లు ఇప్పిస్తోందని తెలిసి భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. కానీ అక్కడ ఏర్పాట్లు తగినంతగా లేకపోవడం, వచ్చిన పాలు అయిపోతాయేమోనన్న ఆందోళన తొక్కిసలాటకు కారణమైంది. -
బ్లాక్ మార్కెట్లో ‘క్షీరభాగ్య’
తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న గ్రామస్తులు సాక్షి, బళ్లారి : నగర శివార్లలోని గుగ్గరహట్టి ప్రభుత్వ పాఠశాల నుంచి క్షీరభాగ్య పాల ప్యాకెట్లును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యక్తిని గ్రామస్తులు బుధవారం పట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం క్షీర భాగ్య పథకం కింద పాలు పొడి ప్యాకెట్లను సరఫరా చేస్తోంది. అయితే వాటిని కొందరు హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గుగ్గరహట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇదే తంతు జరుగుతోంది. ఆ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలి భర్త బుధవారం 50 కిలోల పాలపొడిని బైక్‌లో తీసుకొని వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పాఠశాల హెడ్మాస్టర్ ఈ సంచిని తీసుకెళ్లి వేరే చోట పెట్టాలని ఆదేశించడంతో తాను తీసుకెళ్తున్నానని, అందులో ఏముందో తనకు తెలీదని పోలీసులకు ఆయన తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ నుంచి జారుకున్నారు. నిజానిజాలు తేల్చడానికి బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా పాల పొడిని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక నవ నిర్మాణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. -
పాల ప్యాకెట్లలో ఈగ!