పాడైన పాల ప్యాకెట్లు
బేస్తవారిపేట: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలప్యాకెట్లు ఉబ్బి దుర్వాసన వెదజల్లుతూ పాడైపోవడంతో కాంట్రాక్టర్ కలగొట్ల సమీపంలో పడేశాడు. బేస్తవారిపేట గోడౌన్‌లో నిల్వ ఉంచిన అన్న అమృతహస్తం పథకంలో గర్భిణులు, బాలింతలకు, బరువు తక్కువ చిన్నారులకు అందించే ట్రాక్టర్ పాల ప్యాకెట్లు పనికిరాకుండా పోవడంతో పడేశారు. జిల్లా అంతటికీ పాల ప్యాకెట్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ బేస్తవారిపేటలోని గోడౌన్‌కు సకాలంలో చేర్చాడు. గోడౌన్ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సబ్ కాంట్రాక్టర్ సరఫరా చేయలేదు.
మే నెలలో లబ్ధిదారులకు అందని పాలు: బేస్తవారిపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అర్థవీడు, కంభం, బేస్తవారిపేట, గిద్దలూరు ప్రాజెక్ట్ పరిధిలోని కొమరోలు, గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెలలో అన్న అమృతహస్తం పథకంలో అందించాల్సిన పాల ప్యాకెట్ల సరఫరా నిలిచిపోయింది. గర్భిణులు, బాలింతలు, బరువు తక్కువ ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందకుండాపోయింది. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్లలో కొన్ని దుర్వాసన రావడం, ప్యాకెట్లు ఉబ్బిపోయాయి. పట్టించుకోవాల్సిన ఐసీడీఎస్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారు. బేస్తవారిపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణులు 950, బాలింతలు 1050, బరువు తక్కువ పిల్లలు 550, గిద్దలూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణులు, బాలింతలు 2,452 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment