వివిధ రకాల ఉత్పత్తులపై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు వేస్తారు? కాలం చెల్లిన తర్వాత వాటిని వాడితే ఏమౌతుంది? కొన్ని రకాల ఆహారపదార్థాల పైన యూజ్ బై లేదా బెస్ట్ బిఫోర్ అని రాసి ఉంటుంది. దాని అర్థం ఆ తేదీ దాటిని తర్వాత వాటిని వినియోగించకూడదా? ఒకవేళ వాడితే ఏమవుతుంది? తెలుసుకుందామా..?
ఇంటి అవసరాల కోసం మనం ఒకోసారి కొన్ని నెలలకు సరిపడా అన్ని రకాల కిరాణా సామాన్లు ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే కొద్దిరోజుల తర్వాత వాటిలో కొన్నింటికి ఎక్స్‌పైరీ డేట్ చూసి, అయ్యో, ఇది ఈ తేదీలోగా గమనిస్తే వాటిని అలాగే వాడుతున్నారా, లేక ఎక్స్‌పైరీ అయిపోయాయని పాడేస్తున్నారా తెలుస్తుంది. మన ఇండ్లల్లో కూడా తాతాల కాలం నుంచే కారం, పసుపు, చింతపండు అని ఎన్నో రకాల పదార్థాలను ఒకేసారి కొనుగోలు చేసి వాటినే భద్రంగా దాచుకొని సంవత్సరాల పాటు వాడటం మనకు తెలుసు.
మరి ఇంతకాలంగా లేనిది ఇప్పుడు ఇప్పుడు ప్రతీదానికి ఈ ఎక్స్‌పైరీ తేదీతో సంబంధం ఏమిటి? ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తే ప్రతి దానిపై ధరతో పాటు ఎప్పుడు తయారు చేశారు(Manufacture Date), అది ఎప్పటిలోగా వాడాలో తెలిపే ఎక్స్‌పైరీ డేట్ ముద్రించి ఉంటుంది. అయితే ఏదైనా వస్తువు దాని కాలపరిమితి దాటిపోయింది అంటే అది పూర్తిగా పాడైపోయింది ఇక వినియోగించకూడదు అని కాదు. ఆ పదార్థం ప్యాకింగ్ చేసేటపుడు ఏదైతే తాజాదనం ఉంటుందో ఆ తేదీ దాటిన తర్వాత తిరిగి అదే తాజాదనం ఉండదు అని అర్థం.
చదవండి: Health: పెళ్లి సంబంధాలు చూస్తున్నారు... కానీ ఆ సమస్య! పిల్లలు పుట్టే అవకాశాలు!?
వాస్తవానికి ఏ వస్తువైనా మనం భద్రపరుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్‌పైరీ డేట్ ఉండి, ప్యాకింగ్ సరిగా లేకుంటే అది కూడా వెంటనే పాడవవచ్చు. ఉప్పులాంటి పదార్థాలను సంవత్సరాల కొద్దీ వాడుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ లాంటివి కూడా సరిగ్గా భద్రపరిస్తే సంవత్సరం వరకూ నిల్వ ఉంటాయి. ఏదైనా వస్తువు చెడిపోయింది అంటే అది దాని నుంచి వచ్చే వాసన, దాని స్వభావాన్ని చూసి మనం పసిగట్టవచ్చు.
అలా అని ఇకపై ఎక్స్‌పైరీ డేట్ ఉన్నవన్నీ తినేయకండి. ఎందుకంటే, సాధారణంగా ఆహార పదార్థాలు కొద్ది కాలం వరకు మాత్రమే బాగుంటాయి. గడువు ముగిసే కొద్ది ఆహార పదార్థాలు పాడవుతాయి. మందుల విషయంలో ఎక్స్‌పైరీ తేదీని జాగ్రత్తగా గమనించాలి. ఆ తేదీ దాటిపోయిన తర్వాత వాడటం వల్ల ఆ మందు సమర్థంగా పని చేయకపోవచ్చు లేదా దానివల్ల మరింత ప్రమాదం ఏర్పడవచ్చు. అందువల్ల మందుల విషయంలో మాత్రం ఎక్స్‌పైరీ తేదీ దాటకముందే వాడటం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment