Manufacturing Date
-
ఫుడ్ పార్సిళ్లపై ప్యాకింగ్ సమయమూ ఉండాలి
తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్లు ఆహార తనిఖీలను ముమ్మరం చేశారన్నారు. -
ఎక్స్పైరీ డేట్ ఎందుకు? ఆ తర్వాత వాడితే ఏమవుతుందో తెలుసా!
వివిధ రకాల ఉత్పత్తులపై ఎక్స్పైరీ డేట్ ఎందుకు వేస్తారు? కాలం చెల్లిన తర్వాత వాటిని వాడితే ఏమౌతుంది? కొన్ని రకాల ఆహారపదార్థాల పైన యూజ్ బై లేదా బెస్ట్ బిఫోర్ అని రాసి ఉంటుంది. దాని అర్థం ఆ తేదీ దాటిని తర్వాత వాటిని వినియోగించకూడదా? ఒకవేళ వాడితే ఏమవుతుంది? తెలుసుకుందామా..? ఇంటి అవసరాల కోసం మనం ఒకోసారి కొన్ని నెలలకు సరిపడా అన్ని రకాల కిరాణా సామాన్లు ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే కొద్దిరోజుల తర్వాత వాటిలో కొన్నింటికి ఎక్స్పైరీ డేట్ చూసి, అయ్యో, ఇది ఈ తేదీలోగా గమనిస్తే వాటిని అలాగే వాడుతున్నారా, లేక ఎక్స్పైరీ అయిపోయాయని పాడేస్తున్నారా తెలుస్తుంది. మన ఇండ్లల్లో కూడా తాతాల కాలం నుంచే కారం, పసుపు, చింతపండు అని ఎన్నో రకాల పదార్థాలను ఒకేసారి కొనుగోలు చేసి వాటినే భద్రంగా దాచుకొని సంవత్సరాల పాటు వాడటం మనకు తెలుసు. మరి ఇంతకాలంగా లేనిది ఇప్పుడు ఇప్పుడు ప్రతీదానికి ఈ ఎక్స్పైరీ తేదీతో సంబంధం ఏమిటి? ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తే ప్రతి దానిపై ధరతో పాటు ఎప్పుడు తయారు చేశారు(Manufacture Date), అది ఎప్పటిలోగా వాడాలో తెలిపే ఎక్స్పైరీ డేట్ ముద్రించి ఉంటుంది. అయితే ఏదైనా వస్తువు దాని కాలపరిమితి దాటిపోయింది అంటే అది పూర్తిగా పాడైపోయింది ఇక వినియోగించకూడదు అని కాదు. ఆ పదార్థం ప్యాకింగ్ చేసేటపుడు ఏదైతే తాజాదనం ఉంటుందో ఆ తేదీ దాటిన తర్వాత తిరిగి అదే తాజాదనం ఉండదు అని అర్థం. చదవండి: Health: పెళ్లి సంబంధాలు చూస్తున్నారు... కానీ ఆ సమస్య! పిల్లలు పుట్టే అవకాశాలు!? వాస్తవానికి ఏ వస్తువైనా మనం భద్రపరుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఉండి, ప్యాకింగ్ సరిగా లేకుంటే అది కూడా వెంటనే పాడవవచ్చు. ఉప్పులాంటి పదార్థాలను సంవత్సరాల కొద్దీ వాడుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ లాంటివి కూడా సరిగ్గా భద్రపరిస్తే సంవత్సరం వరకూ నిల్వ ఉంటాయి. ఏదైనా వస్తువు చెడిపోయింది అంటే అది దాని నుంచి వచ్చే వాసన, దాని స్వభావాన్ని చూసి మనం పసిగట్టవచ్చు. అలా అని ఇకపై ఎక్స్పైరీ డేట్ ఉన్నవన్నీ తినేయకండి. ఎందుకంటే, సాధారణంగా ఆహార పదార్థాలు కొద్ది కాలం వరకు మాత్రమే బాగుంటాయి. గడువు ముగిసే కొద్ది ఆహార పదార్థాలు పాడవుతాయి. మందుల విషయంలో ఎక్స్పైరీ తేదీని జాగ్రత్తగా గమనించాలి. ఆ తేదీ దాటిపోయిన తర్వాత వాడటం వల్ల ఆ మందు సమర్థంగా పని చేయకపోవచ్చు లేదా దానివల్ల మరింత ప్రమాదం ఏర్పడవచ్చు. అందువల్ల మందుల విషయంలో మాత్రం ఎక్స్పైరీ తేదీ దాటకముందే వాడటం మంచిది. -
స్వీట్స్ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ప్యాక్ చేసిన స్వీట్స్‌కు మాత్రమే గడువు తేదీతోపాటు తయారీ తేదీని ఉత్పత్తిదార్లు ముద్రిస్తున్నారు. ఇక నుంచి సాధారణ స్వీట్ షాపుల్లో కూడా విడిగా విక్రయించే తీపి పదార్థాల ముందు ఈ తేదీలను ప్రదర్శించాల్సిందే. 2020 జూన్ 1 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. గడువు ముగిసిన తీపి పదార్థాలను దుకాణదార్లు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిబంధన అమలు చేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. -
మరోసారి రాందేవ్ పతంజలి మాయ!
న్యూఢిల్లీ: మరోసారి యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద చర్చలోకి వచ్చారు. నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్న ఆయనకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఈసారి పెద్ద చర్చకే తెరతీసింది. ఏడు నెలల తర్వాత విడుదల చేయాల్సిన ఒక కేజీ పరిమాణంలో తయారు చేసిన పతంజలి 'అలా మురబ్బా' మెడిసిన్ ప్యాకెట్లను ముందుగానే విడుదల చేసి అందరినీ అనుమానంలో పడేసింది. దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్ డీఏ) ఎలా అనుమతిచ్చిందో కూడా అర్థంకానీ పరిస్థితి తయారైంది. ఉత్తరాఖండ్‌లో కేజీ పరిమాణంలో అలా మురబ్బా మెడిసిన్ ప్యాకెట్లను పతంజలి సంస్థ విడుదల చేసింది. అయితే, ఆ ప్యాకెట్లపై తయారీ తేదీ 20 అక్టోబర్ 2016గా పేర్కొనగా.. కాలపరిమితి అక్టోబర్ 19, 2017గా ముద్రించారు. ప్రస్తుతం మార్చిలోనే ఉండగా ఇంకా ఏడు నెలల సమయం తర్వాత విడుదల చేయాల్సిన ప్యాకెట్లను ఇప్పుడెలా విడుదల చేశారనేది ప్రశ్నగా కనిపిస్తోంది. అసలు దానిని నాణ్యతప్రమాణాలపై కూడా పలు అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణంగా.. ఒక వస్తువు మార్కెట్లోకి రావడానికంటే ముందు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్ డీఏ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా అనుమతిచ్చే ఎఫ్ఎస్ డీఏ ఈ అంశాన్ని గుర్తించకపోవడం మరోసారి విమర్శలకు తావిస్తోంది. అయితే, అసలు తాము ఆ ప్రొడక్ట్ కు అనుమతివ్వలేదని, క్వాలిటీ పరీక్షల్లో కూడా విఫలమైందని ఎఫ్ఎస్డీఏ చెప్తోంది. అంతేకాకుండా ఈ ప్రొడక్ట్‌ను క్వాలిటీ పరీక్షలు నిర్వహించగా ఇందులో సోనా పాపిడి, ఆవు పాలతో చేసిన నెయ్యి, పసుపు లవణాలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఈ విషయం తెలిసి ఉత్తరాఖండ్ ఆయుర్వేదిక్ శాఖ కూడా వాటిన బ్యాన్ చేసి పరీక్షలకోసం ల్యాబ్ లకు పంపించింది.