స్వీట్స్‌ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే | FSSAI Act on Expired Date Show on Sweets And Packages | Sakshi
Sakshi News home page

స్వీట్స్‌ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే

Published Wed, Feb 26 2020 8:01 AM | Last Updated on Wed, Feb 26 2020 8:01 AM

FSSAI Act on Expired Date Show on Sweets And Packages - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటి వరకు ప్యాక్‌ చేసిన స్వీట్స్‌కు మాత్రమే గడువు తేదీతోపాటు తయారీ తేదీని ఉత్పత్తిదార్లు ముద్రిస్తున్నారు. ఇక నుంచి సాధారణ స్వీట్‌ షాపుల్లో కూడా విడిగా విక్రయించే తీపి పదార్థాల ముందు ఈ తేదీలను ప్రదర్శించాల్సిందే. 2020 జూన్‌ 1 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నట్టు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. గడువు ముగిసిన తీపి పదార్థాలను దుకాణదార్లు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిబంధన అమలు చేయాల్సిందిగా ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement