expired date
-
యూజ్బై, ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ మధ్య తేడా ఇదే..
కిరాణా దుకాణం, రిటైల్‌స్టోర్ వంటి సూపర్మార్కెట్లకు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేసేప్పుడు ప్రధానంగా దాని ఎక్స్పైరీ తేదీ గమనిస్తాం కదా. ఒక్కో ప్రోడక్ట్‌పై ఒక్కో విధంగా ఈ ఎక్స్పైరీ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు వివిధ కంపెనీలు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్‌పై యూజ్బై, ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ వంటి లేబుళ్లతో తేదీని నిర్ణయించడం గమనిస్తుంటాం. అందులో ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. కంపెనీ లేబుల్‌పై ప్రచురించిన డేట్ ముగిసినా కొన్ని పదార్థాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవచ్చని కొందరు చెబుతున్నారు. అయితే అలాంటి లేబుల్ ఉన్న ఉత్పత్తులను గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..ఎక్స్పైరీ డేట్: ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ లేబుల్‌పై ఎక్స్పైరీ డేట్ ఉంటే అందులోని వస్తువులు, పదార్థాలు కచ్చితంగా ఆతేదీ లోపే వినియోగించాల్సి ఉంటుంది. తేదీ ముగిసిన వాటిని అసలు ఉపయోగించకూడదు.యూజ్బై: కొన్ని వస్తువులు, పదార్థాల ప్యాకేజీ లేబుల్‌పై యూజ్బై తేదీ ఉంటుంది. ఎక్స్పైరీ తేదీలాగే ఆలోపే అందులోని పదార్థాలను ఉపయోగించుకోవాలి.బెస్ట్బిఫోర్: ఈ లేబుల్ ఉత్పత్తికి సంబంధించిన అత్యుత్తమ నాణ్యత తేదీని సూచిస్తుంది. ఈ తేదీ నాణ్యత, భద్రతకు సంబంధించిందని గమనించాలి. ‘బెస్ట్ బిఫోర్’ తేదీ తర్వాత ప్యాకేజీలోని పదార్థాలు తాజాగా, రుచిగా ఉండకపోవచ్చు. పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. బెస్ట్బిఫోర్ తేదీ ముగిసిన తర్వాత పదార్థాలు వాడకపోవడమే మంచిదని ఇంకొందరు చెబుతున్నారు. -
కాలం చెల్లిన మందుల విక్రయం.. జర జాగ్రత్త!
రంగారెడ్డి: మండల కేంద్రంలోని పట్నం మహేందర్‌రెడ్డి జనరల్ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఓ వ్యక్తి ఆరోపించాడు. మండలంలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి రెండు రోజుల కిత్రం చేవెళ్లకు చెందిన ఓ వ్యక్తి తన రెండేళ్ల కొడుకుకు చర్మ సమస్య ఉందని వెళ్లారు. వైద్యులను సంప్రదించగా మందులు రాసి ఇచ్చారు. దీంతో అక్కడే ఉన్న మెడికల్షాపులో మందులు తీసుకొని ఇంటికి వెళ్లి పరిశీలించగా గత రెండు నెలల కిత్రమే ఎక్స్పైర్ అయినట్లు ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రి ఇన్చార్జి వినోద్‌రెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. సోమవారం తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటామని వినోద్‌రెడ్డి తెలిపారు. ఉన్నత వైద్యాధికారులు మెడికల్ దుకాణాలపై తనిఖీలు నిర్వహించి పేద ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి వినోద్‌రెడ్డిని సాక్షి సంప్రదించగా అవును ఈ విషయం తన దృష్టికి ఉదయమే బాధితుడు ఫోన్లో చెప్పాడని తెలిపాడు. ఆస్పత్రిలోని మెడికల్ షాపులో తనిఖీ చేయించి కాలం చెల్లిన మందులు ఉంటే తొలగిస్తామని తెలిపారు. -
గ్యాస్ సిలిండర్‌కి ఎక్స్పైరీ తేదీ ఉంటుంది!..గడువు దాటితే ప్రమాదమే
బలిజిపేట: గ్యాస్ కనెక్షన్ కొనుగోలు చేసి వినియోగించడం ప్రస్తుతం ఎంత అవసరమో, దాని వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అందులో అత్యంత ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్‌కూ కాలపరిమితి ఉంటుందని తెలియకపోవడమే. గ్యాస్ సిలిండర్‌కు ఉండే కాలపరిమితిని సాధారణంగా ఎవరూ గమనించరని, కాలపరిమితి దాటితే పెనుప్రమాదం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ తేదీ ముగిసినా వినియోగిస్తే గ్యాస్ లీయయ్యే ప్రమాదం ఉందంటున్నారు. సరఫరా చేసే ప్రతి సిలిండర్‌పై ఎక్స్పైరీ సంవత్సరాన్ని, నెలను కోడ్ విధానంలో మెటల్ ప్లేట్‌పై వంటగ్యాస్ కంపెనీలు ముద్రిస్తాయి. సిలిండర్ మారుతున్నప్పుడల్లా ఎక్స్పైరీ గడువును చూసుకుని తీసుకోవడం, వినియోగించుకోవడం ఎంతో అవసరమని హితవు పలుకుతున్నారు. కాలపరిమితిని ఎలా గుర్తించాలంటే.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఆంగ్ల అక్షరంతో సంవత్సరం, నెల ఉంటుంది. దాని ప్రకారం అది ఏసంవత్సరం, ఏనెల తరువాత ఎక్స్పైరీ అవుతుందో తెలుస్తుంది. ఉదాహరణగా ఎ–24అని ఉంటే ఆ సిలిండర్ 2024 మార్చిలో ఎక్స్పైర్ అవుతుందని అర్థం. ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ఎ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు, బి అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అక్షరం జూలై నుంచి సెప్టెంబరు వరకు, డి అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు అని గుర్తించాలి. గడువును గుర్తించాలి సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేట్‌పై కోడ్ విధానంలో ఉండే ఎక్స్పైరీ గడువును గుర్తించి తీసుకోవాలి. అది నెల రోజులకు సమీపంలో ఉంటే అటువంటి సిలిండర్‌ను తీసుకోకూడదు. చిన్నచిన్న కుటుంబాలవారు, అతి తక్కువ వేతనం సంపాదించేవారు గ్యాస్ వినియోగం ఎక్కువ రోజులు చేస్తుంటారు. కనుక ఎక్స్పైరీ తేదీ లోపల వారి సిలిండర్ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అటువంటి సిలిండర్లతో ప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది. అందుకు గడువును గుర్తించి సిలిండర్ తీసుకోవాలి. దానిస్థానంలో వేరే సిలిండర్ అడిగే హక్కు వినియోగదారునికి ఉంది. సిలిండర్‌కు పదేళ్ల గడువు సిలిండర్ తయారైన నాటి నుంచి పదేళ్ల వరకు దానికి గడువు ఉంటుంది. సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో, లోపల భాగం సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎస్) ప్రమాణాలతో తయారుచేస్తారు. బీఐఎస్ అనుమతుల తరువాతే సిలిండర్ మార్కెట్లోకి వస్తుంది. గడువు ముగిసేవి ఉండవు గ్యాస్ సిలిండర్లు గడువు ముగిసేవి ఉండవు. ముందే వాటిని కండెమ్ సరుకుగా తీసివేస్తారు. తయారై వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు. పకడ్బందీగా చర్యలు ఉంటాయి. హర్ష, గ్యాస్ ఏజెన్సీ యజమాని, పలగర, బలిజిపేట మండలం (చదవండి: రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం) -
స్వీట్స్ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ప్యాక్ చేసిన స్వీట్స్‌కు మాత్రమే గడువు తేదీతోపాటు తయారీ తేదీని ఉత్పత్తిదార్లు ముద్రిస్తున్నారు. ఇక నుంచి సాధారణ స్వీట్ షాపుల్లో కూడా విడిగా విక్రయించే తీపి పదార్థాల ముందు ఈ తేదీలను ప్రదర్శించాల్సిందే. 2020 జూన్ 1 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. గడువు ముగిసిన తీపి పదార్థాలను దుకాణదార్లు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిబంధన అమలు చేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. -
గడువు తీరితే గండమే..!
సాక్షి, పొందూరు (శ్రీకాకుళం): మనం వినియోగించే ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదేవిధంగా మనం వంట గదిలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్‌కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దానిని సరైన సమయంలో గుర్తించి, సిలిండర్ మార్చుకోవడం వలన ప్రమాదాలు నుంచి బయటపడవచ్చు. ఎక్స్పైర్ డేట్ గుర్తించడం ఎలా..? గ్యాస్ సిలిండర్‌పైన ఉన్న రింగ్ కింద నిలువుగా మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వైపు గ్యాస్ సిలిండర్ గడువు తేదీ ముద్రించి ఉంటుంది. దీనిలో సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా గుర్తించి మూడు నెలలకు ఒక ఇంగ్లిష్ అక్షరం చొప్పున ఏ, బీ, సీ, డీగా ముద్రిస్తారు. అంటే జనవరి నుంచి మార్చి వరకు ‘ఏ’తో సూచిస్తారు. అలాగే ఏప్రిల్ నుంచి జూన్ ‘బీ’ గాను, జూలై నుంచి సెప్టెంబర్‌ను ‘సీ’ గాను, అక్టోబర్ నుంచి డిసెంబర్‌ను ‘డీ’ తో సూచిస్తారు. ఉదాహరణకు మీ సిలిండర్‌పై డీ 19 అని ఉంటే ఆ సిలిండర్‌ను 2019 డిసెంబర్ వరకు మాత్రమే ఉపయోగించాలి అని అర్థం. గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యం చాలా వరకు గ్యాస్ సిలిండర్లతో ప్రమాదాలు ఏజెన్సీల నిర్లక్ష్యం మూలంగా జరుగుతున్నాయి. కాలం చెల్లిన సిలిండర్లను ఏజెన్సీలు వినియోగదారులకు అందిస్తున్నారు. దీంతో అవి లీకవుతూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో పాటు గ్యాస్ వినియోగంపై వినియోగదారులకు అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలు పొందూరు మండలంలోని రాపాకలో నవంబర్ 22, 2017న, జనవరి 02, 2018న గ్యాస్ లీకేజి వలన ప్రమాదం జరిగింది. అక్టోబర్ 10, 2018న పొందూరులోని గాంధీనగర్ వీధిలోను, నవంబర్ 09, 2018న రాపాక గ్రామంలోను, జనవరి 01, 2019న పొందూరులోని పార్వతీనగర్ కాలనీలోను, జి.సిగడాం మండలం నక్కపేట గ్రామంలో డిసెంబర్ 13, 2017న, జనవరి 14, 2018న వాండ్రంగి గ్రామంలోను, మార్చి 01, 2019న పార్వతీనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం లోను, జూన్ 09, 2019న పైడిజోగిపేటలోను గ్యాస్ లీకై ప్రమాదాలు సంభవించాయి. అప్రమత్తమవ్వండిలా... ఏజెన్సీల నుంచి లక్షల సంఖ్యలో గ్యాస్ సిలండర్లు డిస్ట్రిబ్యూటర్‌కు వస్తుంటాయి. వాటన్నింటినీ పరిశీలించే సమయం వారికి లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రమాదాలు నుంచి తప్పించుకోవచ్చునని మేధావులు సూచిస్తున్నారు. → సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగా ఉంచాలి. → సిలిండర్ కన్నా స్టవ్ ఎత్తులో ఉండాలి. → ఇండ్లలోనైనా, హోటళ్లలో అయినా వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్‌ను ఆపాలి. → సిలిండర్ ఎక్స్పైర్ డేట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. గ్యాస్ వాసన వస్తే.. ⇒ ఇంట్లో గ్యాస్ వాసన వచ్చినట్లయితే వెంటనే రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. ⇒ సిలిండర్ మూతకు సేఫ్టీ కప్‌ను బిగించాలి. ⇒ విద్యుత్ స్విచ్‌లు వేయరాదు. ⇒ అగ్గిపుల్ల వెలిగించకూడదు. ⇒ ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా తలుపులు, కిటికీలు తెరవాలి. ⇒ దగ్గరలోని ఎల్పీజీ డీలర్‌కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలి. -
ఆడపడుచులకు కాలం చెల్లిన చెక్కులు!
తాండూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతున్నాయి. గతంలో జరిగిన మాదిరిగానే తాండూరులో మరోసారి లబ్ధిదారులకు కాలంచెల్లిన చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన వారికి గత 2వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా 149 చెక్కులు అందజేశారు. ఇందులో 63 కల్యాణలక్ష్మి, 86 షాదీముబారక్ చెక్కులు ఉన్నాయి. వీటిని పొందిన లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని కోరగా.. చెక్కుల గడువు ముగిసిందని చెప్పడంతో ఖంగుతిన్నారు. దీంతో చేసేదేమీ లేక మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆడపడుచులకు కట్నంగా సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక సాయం.. కేవలం అధికారుల నిర్లక్ష్యంతో అపహాస్యమవుతోందని మండిపడుతున్నారు. -
మీ సిలిండర్ పై డేట్ చూసుకున్నారా..
సత్యవేడు: మనం వినియోగించే ప్రతి వస్తువుకూ కాలపరిమితి ఉంటుంది, అలాగే నిత్యం వంట గదిలో మనం ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌కూ గడువు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. కాలం చెల్లిన సిలిండర్‌ను వినియోగించడం ప్రమాదకరం. అందుకే ఆలాంటి కాలపరిమితి తేదీని గుర్తించడం ఎలాగో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముందుగా సిలిండర్ గడువు తేదీని గుర్తించాలి. సిలిండర్‌పై ఉన్న రింగ్‌కు కింద భాగంలో మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వెనుక సిలిండర్ గడవు తేదీ ముద్రించి ఉంటుంది. రింగ్‌కు కింద భాగంలోలో బద్దె పై ముద్రించి ఉన్న తేదీల్లో ఏడాదిలోని 12 నెలలను నాలుగు భాగాలుగా విభజించి ప్రతి మూడు నెలలకు ఒక ఆంగ్ల అక్షరం చొప్పున రాసి ఉంటుంది. నిల్వవుంచే సిలిండర్లు ప్రమాదం.. కొందరు సిలిండర్లు కొన్న తర్వాత నెలలు తరబడి వాడకుండా నిల్వ ఉంచుతారు. మరి కొందరు బ్లాక్‌లో కొని మరీ వాడుతుంటారు. అయితే సిలిండర్లపై గుర్తించిన గడువు తేదీలోగా వాడితేనే ఉత్తమం, కాలం చెల్లిన సిలిండర్లను వాడకం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సిలిండర్లను సంబంధిత డీలర్‌కు వాపస్ చేయాలి. ముఖ్యంగా సిలిండర్ తీసుకున్న తేదీ నుంచి వాడుకునే తేదీ నాటికి గడువు నెలను గమనించి వాడుకోవాలి. -
అడిగింది వంట నూనె.. ఇచ్చింది దీపం నూనె
కేసముద్రం : వంట నూనె ఇవ్వమంటే గడువుతేదీ దాటిన నూనె ప్యాకెట్ ఇవ్వగా, ఆ నూనెతో వండిన కూర తిని ఇంటిల్లిపాది అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని అమీనాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన బిర్రు యుగంధర్ ఇంట్లో వంటకాల కోసం సోమవారం సాయంత్రం గ్రామంలోని ఓ కిరాణ షాపువద్దకు వెళ్లి నూనె ప్యాకెట్ ఇవ్వమని అడిగాడు. దీంతో షాపులో కూర్చున్న యజమాని వంటనూనెకు బదులు(అరకేజీ) దీపారాధన ప్యాకెట్‌ను ఇచ్చింది. ఇది వంటనూనె కాదు గదా అని తెలుపగా, అదేనంటూ చెప్పి మరి ఇవ్వడంతో అతడు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ నూనెతో కూరవండి తిన్నారు. దీంతో యుగంధర్ భార్య ప్రభ, కుమారుడు శ్రీవర్ధన్‌కు విరేచనాలయ్యాయి. స్థానిక వైద్యులను సంప్రదించి చికిత్స చేయించారు. వంట వండిన నూనె ప్యాకెట్‌ను పరిశీలించగా అది కేవలం దీపారాధనకు ఉపయోగించాలని ఉంది. పైగా గడవు తేదీ కూడా దాటిపోయింది. దీంతో బాధితుడు వెళ్లి షాపు యజమానిని ప్రశ్నించాడు. ఏదో పొరపాటున ఇచ్చామని వారు సర్దిచెప్పుకొచ్చారు. ఈ కిరాణంషాపుపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు.