రంగారెడ్డి: మండల కేంద్రంలోని పట్నం మహేందర్‌రెడ్డి జనరల్ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఓ వ్యక్తి ఆరోపించాడు. మండలంలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి రెండు రోజుల కిత్రం చేవెళ్లకు చెందిన ఓ వ్యక్తి తన రెండేళ్ల కొడుకుకు చర్మ సమస్య ఉందని వెళ్లారు.
వైద్యులను సంప్రదించగా మందులు రాసి ఇచ్చారు. దీంతో అక్కడే ఉన్న మెడికల్‌షాపులో మందులు తీసుకొని ఇంటికి వెళ్లి పరిశీలించగా గత రెండు నెలల కిత్రమే ఎక్స్పైర్ అయినట్లు ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రి ఇన్‌చార్జి వినోద్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. సోమవారం తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటామని వినోద్‌రెడ్డి తెలిపారు.
ఉన్నత వైద్యాధికారులు మెడికల్ దుకాణాలపై తనిఖీలు నిర్వహించి పేద ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ఆస్పత్రి ఇన్‌చార్జి వినోద్‌రెడ్డిని సాక్షి సంప్రదించగా అవును ఈ విషయం తన దృష్టికి ఉదయమే బాధితుడు ఫోన్‌లో చెప్పాడని తెలిపాడు. ఆస్పత్రిలోని మెడికల్ షాపులో తనిఖీ చేయించి కాలం చెల్లిన మందులు ఉంటే తొలగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment