రంగారెడ్డి: ఎయిర్‌గన్‌తో బాతును చంపిన వ్యక్తులపై పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి గ్రామ శివారులోని హుస్సేన్ ఫాం హౌస్‌లో వాచ్‌మెన్ అహ్మద్ బాతులు, చిలుకలను పెంచుతున్నాడు.
ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ ఫహద్(27), రక్షాపురంకు చెందిన మహ్మద్ అజ్మలుద్దీన్ (35) ఫాంహౌస్‌లోకి వచ్చి ఎయిర్‌గన్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటామని అడిగారు. ఈ క్రమంలోనే రోటెక్స్ ఆర్‌ఎం–8 ఎయిర్‌గన్‌తో బాతును షూట్ చేసి చంపేశారు. ఇది గమనించిన వాచ్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment