ప్లాస్టిక్ బాటిల్ వాటర్‌తో హై రిస్క్‌: ఇండస్ట్రీ ఇవి కచ్చితంగా పాటించాల్సిందే! | India packaged drinking water is high risk food What it means | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ బాటిల్ వాటర్‌తో హై రిస్క్‌: ఇండస్ట్రీ ఇవి కచ్చితంగా పాటించాల్సిందే!

Published Tue, Dec 3 2024 3:54 PM | Last Updated on Tue, Dec 3 2024 4:57 PM

India packaged drinking water is high risk food What it means

ఎన్ని హెచ్చరికలు, సూచనలు జారీ  చేస్తున్నా, ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతున్న మనందరికి  భారతదేశ ఆహార నియంత్రణ సంస్థ ఒక హెచ్చరిక లాంటి వార్తను అందించింది.  ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , మినరల్ వాటర్‌ను "హై-రిస్క్ ఫుడ్" కేటగిరీలో చేర్చింది.  అంతేకాదు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను తొలగించాలనే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌ను ఆయా కంపెనీలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది


ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ ప్రకారం, కొత్త మార్గదర్శకాలకనుగుణంగా  ప్రకారం, తయారీదారులు , ప్రాసెసర్‌లు లైసెన్స్‌లు లేదా రిజిస్ట్రేషన్‌లను మంజూరు చేయడానికి ముందు తప్పనిసరిగా తనిఖీలు చేయించుకోవాలి. అక్టోబరులో, ప్యాకేజ్డ్ వాటర్‌కి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన నిబంధనల ప్రకారం, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మరియు మినరల్ వాటర్ తయారీ దారులందరూ ఇప్పుడు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందేందుకు తప్పనిసరిగా వార్షిక, రిస్క్ ఆధారిత తనిఖీలు చేయించుకోవాలి.

గతంలో, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ BIS , FSSAI రెండింటి ద్వారా ద్వంద్వ ధృవీకరణ అవసరాల తొలగించాలి  డిమాండ్‌ చేసింది. కానీ ఈ వాదనలను తోసిపుచ్చిన సంస్థలు  తప్పని సరిగా తనిఖీలు   చేయించాలని, సంబంధిత   ధృవీకరణ పత్రాలను పొందాలనిస్పష్టం చేశాయి. దీనికి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి హై-రిస్క్ ఫుడ్ కేటగిరీలలో  వ్యాపారం చేస్తున్నవారు, FSSAI-గుర్తింపు పొందిన మూడవ-పక్ష (థర్డ్‌పార్టీ) ఆహార భద్రతా ఏజెన్సీల వార్షిక ఆడిట్‌లను పొందాల్సి ఉంటుంది.

హై-రిస్క్ ఫుడ్ కేటగిరీల క్రింద వచ్చే ఇతర ఉత్పత్తులు:
పాల ఉత్పత్తులు,  అనలాగ్స్‌
పౌల్ట్రీతో సహా మాంసం , మాంసం ఉత్పత్తులు,
మొలస్క్‌లు, క్రస్టేసియన్‌లు , ఎచినోడెర్మ్‌లతో సహా చేపలు , చేప ఉత్పత్తులు
గుడ్లు , గుడ్డు ఉత్పత్తులు
నిర్దిష్ట పోషక అవసరాల కోసం ఉద్దేశించిన ఆహార ఉత్పత్తులు
తయారుచేసిన ఆహారాలు (ప్రిపేర్డ్‌ ఫుడ్‌)
భారతీయ స్వీట్లు
పోషకాలు, వాటి ఉత్పత్తులు (ఫోర్టిఫైడ్ బియ్యం  మాత్రమే)


కాగా ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లు తాగడం చాలా ప్రమాదమని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు కలిగించటమే కాదు, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అనేక రసాయనాలతో తయారైన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగటం వల్ల  ఒక్కోసారి కేన్సర్‌ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి  తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement