Plastic bottle
-
ప్లాస్టిక్ బాటిల్ నీళ్లతో హై బీపీ
సాక్షి, హైదరాబాద్: మన రోజువారీ అలవాట్లే మన ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. అందులో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. ప్రస్తుతం మనం కూరగాయలు, పండ్లు, ఇతర ఆహారపదార్థాలు సులువుగా తీసుకెళ్లేందుకు వాడు తున్న ప్లాస్టిక్ కవర్లు, బ్యాగ్‌లు కూడా అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అంతేకాదు నీళ్లు తాగేందుకు అత్యధిక శాతం మంది ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలు కూడా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. నిత్యం ప్లాస్టిక్ సీసాలతో తాగుతున్న మంచినీటి ద్వారా శరీరంలోకి చేరుతున్న సూక్ష్మ రూపాల్లోని ప్లాస్టిక్ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్) అధిక రక్తపోటు (హై బ్లడ్‌ప్రెషర్)కు కారణమవుతున్నట్టు ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ తాజా పరిశోధనలో వెల్లడైంది.గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వంటి వాటికి బీపీనే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ఫ్లమేషన్, హార్మోన్ల అసమతుల్యత, కేన్సర్ వంటి వాటికి కారణమవుతున్నాయని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ తొలుత రక్త ప్రవాహంలోకి తర్వాత సలైవా, గుండె కణజాలం, కాలేయం, ఊపిరితిత్తులు ఇంకా ప్లాసెంటా (మావి).. ఇలా అన్ని అవయవాల్లోకీ చేరుతున్నాయి. ముఖ్యంగా ‘బాటిల్డ్ వాటర్’లో హెచ్చు స్థాయిల్లో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టుగా అధ్యయనంలో తేలింది.అధ్యయనంలో భాగంగా మైక్రో ప్లాస్టిక్స్ –పెరుగుతున్న రక్తపోటు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని పరిశీలించారు. ‘జర్నల్ మైక్రోప్లాస్టిక్స్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా రక్తపోటు సమస్యను గణనీయంగా తగ్గించవచ్చునని పేర్కొంది. రక్తపోటు సమస్యలను తగ్గించుకునేందుకు ప్లాసిక్ సీసాలలో మంచినీళ్లు, ఇతర పానీయాలు (ప్యాకేజ్డ్ బాటిల్స్) తీసుకునే అలవాటును మానుకుంటే మంచిదని సూచించింది. నల్లాల ద్వారా వచ్చే నీటిని కాచి వడబోశాక తాగడంతో పోల్చితే ప్లాస్టిక్ సీసాలలోని నీటిని, అలాగే కొన్ని సందర్భాల్లో గాజు సీసాల్లోని నీటిని తాగాక రక్తపోటు పెరిగినట్టుగా పరిశోధకులుగుర్తించారు. సింథటిక్ వ్రస్తాలు ఉతకడం వల్ల కూడా..నిత్యం ఐదు మిల్లీమీటర్ల కంటే కాస్త తక్కువ పరిమాణంలో మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరుతుండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధన స్పష్టం చేసింది. గతంలోనే నిర్వహించిన ఓ అధ్యయనంలో...ప్రతి వారం బాటిళ్ల ద్వారా తీసుకునే వివిధ రూపాల్లోని ద్రవాల ద్వారా ఐదు గ్రాముల చొప్పున మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరుతున్నట్టు వెల్లడైంది. కారు టైర్ల అరుగుదల మొదలు పెద్దమొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాల ధ్వంసం, సింథటిక్ వ్రస్తాలు ఉతకడం తదితర రూపాల్లో కూడా ఇవి శరీరంలో చేరుతున్నట్టు తెలిపింది. మనం తీసుకునే ఆహారం, నీళ్లు, పీల్చే గాలి తదితరాల ద్వారా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ రేణువులు శరీరాల్లో చేరుతున్నట్టు పేర్కొంది.అయితే బాటిల్ నీళ్లను తాగకుండా ఉంటే ఈ సమస్యను కొంతవరకు నివారించ వచ్చని, నల్లా నీళ్లను వేడిచేసి చల్లబరిచి, ఫిల్టర్ చేసి తాగడం మంచిదని సూచించింది. దీనిద్వారా మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ శరీరంలో చేరడాన్ని 90 శాతం దాకా తగ్గించవచ్చునని అధ్యయనం పేర్కొంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు..రోజువారి జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్లాస్టిక్ బాటిళ్లలో పానీయాలను భద్రపరచడం నిలిపేయాలని సూచించింది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లకు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని, స్టెయిన్లెస్ స్టీల్ లేదా గ్లాస్ కంటైనర్లు వినియోగించాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించాలని స్పష్టం చేసింది. -
Bharati Sumaria: చేదు అనుభవాలే తీపి విజయాలకు మెట్లు
జీవితంలో చెడు రోజులను ఎదుర్కోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ, మనలో దాగి ఉన్న ప్రతిభ, సామర్థ్యం, ధైర్యం గురించి మనల్ని మనం తెలుసుకునే సమయం ఇదే’ అంటుంది భారతీ సుమారియా. జీవించాలనే ఆశను కోల్పోయి అత్తవారింటి నుంచి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసిన ఆమె నేడు ఏడాదికి నాలుగు కోట్ల బిజినెస్ టర్నోవర్‌కి చేరుకునేంతగా ఎదిగింది. ముంబైలో పదేళ్ల క్రితం టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్ బాటిల్ .. వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను ఉత్పత్తి చేసే పనిని ప్రారంభించి, ఒంటరి పోరాటంతో ఎదిగిన భారతీ సుమారియా ధైర్యం ప్రతి ఒక్కరికీ పాఠం అవుతుంది. చేదు అనుభవాలే మనకు విజయవంతమైన మార్గానికి దారులు వేస్తాయి. దీనిని భారతీ సుమారియా చేసి చూపెట్టింది. సమస్యను సవాల్‌గా తీసుకొని ఎదిగిన వనితగా తనను తాను నిరూపించుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘నేను ముంబైలోని భివాండి ప్రాంతంలో పుట్టాను. కొన్నేళ్లకు ములుండ్కి వెళ్లాం. మా కుటుంబం సాధారణ మధ్యతరగతికి చెందినదే. ఆడపిల్లలకు ఎన్నో ఆంక్షలు. పదో తరగతి వరకు మాత్రమే చదవగలిగాను. పెళ్లయ్యాక వంటింటిని నడపాలి కానీ, ఆడపిల్లను చదివించి ఏం లాభం అనే మనస్తత్వం ఉన్న కుటుంబంలో పెరిగాను. అలా నా ప్రపంచం కూడా కుటుంబానికే పరిమితం అయ్యింది. నాకేమీ చేయాలనే కోరిక ఉండేది కాదు. నా ప్రపంచంలో నేను సంతోషంగానే ఉన్నాను. సక్సెస్ సాధించిన స్త్రీని చూసినా, అలాంటి వారి గురించి విన్నా, చదివినా నేను ఏదైనా చేయగలనా అనే ఆలోచన నా మదిలో మెదిలేది. కానీ, నా మనసులోని భావాలను కుటుంబ సభ్యులకు చెప్పుకునే ధైర్యం ఉండేది కాదు. పెళ్లితో మారిన జీవితం.. ఆడపిల్లలకు పెళ్లే జీవిత లక్ష్యంగా ఉన్న రోజుల్లో 20ఏళ్ల వయసులో నాకు వివాహం చేశారు. మా అమ్మనాన్నలు చెప్పినట్టుగా నా భర్త సలహాలను అనుసరించాను. అత్తమామల బాధ్యతలను నెరవేర్చడంలో తీరిక లేకుండా గడిపాను. అత్తింటిలో అడుగుపెట్టినప్పుడు అదే నా ప్రపంచం అయ్యింది. అయితే, నా భర్త ఏ పనీ చేసేవాడు కాదు. నేను ఆర్థికంగా స్వతంత్రురాలిని కాదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు, నా పిల్లలకు నోటిలో నాలుగు వేళ్లూ పోక కనీసావసరాలు తీరక నా భర్త నాపై తన కోపాన్ని, చిరాకును ప్రదర్శించటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడూ చేయి కూడా చేసుకునేవాడు. ఇది నన్ను బాగా ప్రభావితం చేసింది. దీంతో నాకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా మారింది. మామగారు పనిచేసేవారు. కానీ, నా భర్త అస్సలు పనిచేసేవాడు కాదు. పిల్లల ఖర్చులు కూడా మామగారే భరించేవారు. 20 ఏళ్లు నా కోసం నేను ఎలాంటి షాపింగ్ చేయలేదు. మా అక్క బట్టలు నాకు ఇచ్చేది. వాటిని సంతోషంగా తీసుకునేదాన్ని. అత్తింట్లో రోజు రోజుకీ నా పరిస్థితి దిగజారడం మొదలయ్యింది. అమ్మ నా పరిస్థితి గమనించి పుట్టింటికి తీసుకువచ్చింది. ఆ సమయంలో నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను. జీవించాలనే కోరికను కూడా కోల్పోయాను. డిప్రెషన్‌కు గురయ్యాను. ఏం చేయాలో అర్థం కాక గంటల తరబడి మౌనంగా కూర్చునేదాన్ని. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఆరు లక్షల రూపాయలతో.. దీపావళికి, పుట్టిన రోజుకి నాన్న డబ్బులు ఇస్తుండేవారు. ఆ డబ్బు కూడా మా అత్తింట్లో ఖర్చయిపోయేది. దీంతో నాకు డబ్బు ఇవ్వకుండా డిపాజిట్ చేయమని, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పాను. అత్తింటి నుంచి బయటకు వచ్చాక ఏం చేయలేని పరిస్థితిలో నాన్న నాకోసం డిపాజిట్ చేసిన డబ్బు ఆరు లక్షలకు పెరిగిందని తెలిసింది. 2005లో ఆ ఆరు లక్షల రూపాయలతో 300 అడుగల విస్తీర్ణంలో ఉన్న ఓ ప్లేస్ అద్దెకు తీసుకొని టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్‌బాటిల్ వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను తయారుచేసే పనిని ప్రారంభించాను. నా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పగలు రాత్రి కష్టపడ్డాను. త్వరలోనే సిప్లా, బిస్లరీ వంటి పెద్ద బ్రాండ్ల నుండి ఆర్డర్లను పొందడం ప్రారంభించాను. ఈ రోజు నా ఫ్యాక్టరీ లక్షా ఇరవై వేల అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది. భయం బలంగా మారింది ఎప్పుడూ పని కోసం ఇల్లు వదిలి వెళ్లలేదు. కానీ నాకు పని తప్ప వేరే మార్గం కనిపించలేదు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావించి, రాత్రింబగళ్లు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాను. చెడు సమయాలు నన్ను నేను తెలుసుకునేలా చేశాయి. నా సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎలా చేయగలిగాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతగా సహించానో అంతగా కష్టాలు పెరిగాయి. నాకు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. భగవంతుడు నా బలాన్ని గ్రహించి విజయపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చుట్టూ అలాంటి వాతావరణం సృష్టించాడని అనిపించింది. నా పురోభివృద్ధికి నా భర్త కోపం, తగాదాలే కారణమయ్యాయి. దాని వల్లనే నేను ఇదంతా చేయగలిగాను. పిల్లలే నా ప్రపంచం భార్యగా దృఢంగా ఉండలేకపోయినా పిల్లల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ అలిసిపోవడానికి, వదులుకోవడానికి సిద్ధంగా లేనని నన్ను నేను బలంగా తయారుచేసుకున్నాను. జీవించాలనే కోరిక కూడా కోల్పోయిన ఆ భారతి ఈమేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. నా పిల్లల మంచి భవిష్యత్తు కోసం నేను కృష్టి చేయాల్సిందే అని గట్టిగా అనుకున్నాను. నేను నా పని మొదలుపెట్టినప్పుడు పిల్లలు నాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. అప్పట్లో నా కూతురు ఎనిమిదో తరగతి, కొడుకులిద్దరూ ఐదో తరగతి చదువుతున్నారు. నా కూతురు తన చదువుతో పాటు తన తమ్ముళ్లనూ చూసుకుంటుంది. నేను ఇంటికి వెళ్లడం లేట్ అయితే ఆమే స్వయంగా వంట చేసి, తమ్ముళ్లకు పెట్టి, తినిపించి, నిద్రపుచ్చేది. పిల్లలను తండ్రి నుంచి దూరం చేయలేదు ఎప్పుడూ పిల్లలను వారి తండ్రి నుంచి కానీ, వారి కుటుంబం నుంచి కానీ దూరం చేయలేదు. పిల్లలు తల్లిదండ్రులిద్దరి ప్రేమను పొందాలని నమ్ముతాను. భార్యాభర్తల మధ్య తగాదాల వల్ల పిల్లలు బాధపడకూడదు. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత నా పిల్లలు వారి పూర్వీకుల ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి మా ఇంటికి మారిపోయాం. నా పోరాటం నా పిల్లలను కూడా బలపరిచినందుకు సంతోషంగా ఉంది’’ అని వివరిస్తుంది భారతీ సుమారియా. మహిళలకు మద్దతు లభించాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోకపోవడమే ఆడవాళ్లకున్న పెద్ద సమస్య. వాళ్ల అమ్మ ఇల్లు గానీ, అత్తమామల ఇల్లు గానీ తమ సొంతమని భావించరు. తల్లిదండ్రుల నుంచి ఆదరణ లభించక చాలా మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆసరా దొరికితే ఎంతోమంది ఆడపిల్లల ప్రాణాలు తీసుకోకుండా జీవించగలుగుతారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా పరిస్థితి చూసి మా తల్లిదండ్రులు నన్ను సొంతంగా వ్యాపారం చేయమని ప్రోత్సహించారు. నాన్న 3వ తరగతి వరకు మాత్రమే చదివారు. ముంబైలో బట్టల షాప్ పెట్టుకొని, మమ్మల్ని పోషించారు. మేం నలుగురం అక్కచెల్లెళ్లం. మా పెంపకం బాధ్యత అమ్మ తీసుకుంది. ఇంటిని చూసుకోవడంతో పాటు చుట్టుపక్కలవారితో ఎప్పుడూ కలుపుకోలుగా ఉండేది. ఇప్పుడు కూడా మా చుట్టుపక్కల వాళ్లకు సహాయం చేయడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. -
ఈ స్కూళ్లో ఫీజులుండవు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే చాలు..
అస్సాంలోని పామోహి ప్రాంతంలో ఉన్న ‘అక్షర్ స్కూల్’ ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూల్లో ఫీజులకు బదులు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుంటారు. పరిమిత శర్మ, మజిన్ ముఖ్తార్ అనే దంపతులు ఈ స్కూల్‌ను స్థాపించారు. ఫీజుల రూపంలో వచ్చిన బాటిల్స్‌ను వివిధ రూపాల్లో పునర్వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ను ఎలా రీసైకిల్ చేయాలో విద్యార్థులకు నేర్పుతున్నారు. నాగాలాండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి టెమ్జెన్ ఈ స్కూల్ గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ‘గుడ్ ఐడియా’ అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపించారు. If this doesn't surprise you, what does?#Incredible_NorthEast Credit: northeastview_ pic.twitter.com/6RO1SqhaNa — Temjen Imna Along (@AlongImna) October 12, 2023 -
‘కాకి ఇలా కూడా చేస్తుందా?’.. ఇంతకుముందెన్నడూ చూడని స్ఫూర్తిదాయక వీడియో!
సోషల్ మీడియాలో లెక్కుమించిన వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని వింతైనవి, మరికొన్ని అమూల్యమైనవి కూడా ఉంటాయి. అయితే గతంలో ఎవరూ కూడా చూడని ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని చూసినవారంతా కాకి ఇలాంటి పనిచేయడమేమిటంటూ, తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు. ఈ వీడియో ప్రతీఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉండటం విశేషం. అలాగే ఈ వీడియోను చూసిన వారంతా ఇకపై తాము కూడా బాధ్యతగా మెలుగుతామని కూడా చెప్పడం విశేషం. ఈ వీడియోను ట్విట్టర్లో @TansuYegen పేరుతో ఒక యూజర్ షేర్ చేశారు. ఈ 20 సెకెన్ల వీడియోలో ఒక కాకి తన ముక్కుతో ఒక ప్లాసిట్ బాటిల్ పట్టుకుని, ఇటునటు ఎగరడం కనిపిస్తుంది. తరువాత దానికి ఒక డస్ట్‌బిన్ కనిపించగానే దానిపై కూర్చుని, పలు ప్రయత్నాల అనంతరం ఆ బాటిల్‌ను ఆ డస్ట్‌బిన్ రంధ్రంలో నుంచి లోనికి పడవేస్తుంది. ఈ కాకి చేసిన పని చూసినవారంతా ఆశ్యర్యపోతున్నారు. ఈ విధమైన కాకిని ఎక్కడా చూడలేదని అంటున్నారు. అంత్యంత వేగంగా వైరల్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసినవారంతా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మనుషులు చేయాల్సిన పనిని ఒక పక్షిచేయడాన్ని చూసి మనమంతా సిగ్గుపడాలని అన్నారు. మరో యూజర్ పక్షులను చూసి మనం మరో గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! Be like this raven😊 pic.twitter.com/fyMhMqBWQJ — Tansu YEĞEN (@TansuYegen) July 20, 2023 -
మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్.. ఇంకా..
Summer Health Tips: అసలే ఎండాకాలం.. దాహం వేస్తుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడంటే కావలసినప్పుడల్లా నీళ్లు తాగుతుంటాం. మరి బయటికి వెళ్లేటప్పుడు? అందులో ఆలోచించేదేముంది... ఒక వాటర్ బాటిల్ తీసుకెళతాం.. అంతేకదా అని సింపుల్‌గా చెప్పేస్తాం. అయితే ఆ బాటిల్ దేనితో తయారు చేసింది... అంటే నూటికి తొంభై పాళ్లు ‘ప్లాస్టిక్ బాటిల్’ అనే సమాధానం వస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎంత ఉపయోగమో, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగడం అంత ప్రమాదం. అది ఎండాకాలం అయితే కనక ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ ఏమిటా నష్టాలు అంటారా? అదే చూద్దాం.. ప్లాస్టిక్ వాడకం ఎందుకంటే! ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు అని పదే పదే చెబుతున్నా కూడా ప్లాస్టిక్ ఇంకా వాడకంలోనే ఉండటానికి కారణం ఏమిటంటే, దానిని క్యారీ చేయడం చాలా సులువు. నిర్వహించడం ఇంకా సులువు. ఒకవేళ ఎక్కడైనా పెట్టి మరచిపోయినా పెద్ద ఖరీదు ఉండదు కాబట్టి దిగులు పడనక్కరలేదు. అందువల్ల పర్యావరణ ప్రేమికులు ఎంతగా నెత్తీ నోరు బాదుకుంటున్నా, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే విషయంలో వెనకబడవలసి వస్తోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా, భారీ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా వాటి నుంచి నీరు తాగడం ప్రమాదకరం. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీటిని అసలు తాగకూడదు. పరిశోధన ప్రకారం.. ►ప్లాస్టిక్ బాటిల్స్ మీద ఎండ పడితే.. అవి మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ నీటిని తాగితే.. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే.. ఎండోక్రైన్ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇలాంటి నీటిని ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయాన్ని కూడా పాడు చేస్తుంది. ►ఎండలో ఉండే.. ప్లాస్టిక్ బాటిల్ నుంచి డయాక్సిన్ లాంటి టాక్సిన్ నీటిలోకి విడుదల అవుతుంది. ఈ డయాక్సిన్ నీటిని తాగితే.. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగితే.. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గవచ్చు. ►బాటిల్ వాటర్‌లో మైక్రో ప్లాస్టిక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ►మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే పొత్తి కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యం, పీసీఓఎస్, ఒవేరియన్ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావొచ్చు. ►ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు ఎండ తగిలితే.. అస్సలే తాగొద్దు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను కొంతమంది అలానే ఉపయోగిస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. ఇది ఇంకా అపాయకరమైనది. ఇలా అస్సలు చేయొద్దు ఎప్పుడూ. ఏం చేయాలి మరి? ►ప్లాస్టిక్ బాటిల్స్ అంతగా వాడుకలోకి రాని రోజుల్లో పెద్దవాళ్లు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు స్టీలు లేదా ఇత్తడి మరచెంబులు తీసుకు వెళ్లేవారు. ఇప్పుడు కూడా అదే మంచిది. అందుకు తగ్గట్టు ఇప్పుడు మార్కెట్లో రకరకాల సైజుల్లో, ఆకారాలలో రాగి, స్టీలు, ఇత్తడి బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాస్తంత ఖరీదు ఎక్కువైనా, ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో పోల్చుకుంటే ఫరవాలేదనిపిస్తుంది. ►ప్లాంట్ బేస్డ్ బాటిల్స్, గాజుసీసాలు, అల్యూమినియం వాటర్ క్యాన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మనం వాడకం మొదలు పెడితే ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. చదవండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా.. -
గాజు సీసాల్లోనే నీళ్లు!
పర్యావరణ పరిరక్షణతో పాటూ ప్లాస్టిక్ ద్వారా కలుగుతున్న కాలుష్యాన్ని నివారించే దిశగా నగరంలోని హోటల్స్‌లో పలు మార్పు చేర్పులు చేపట్టారు. ఇందులో భాగంగా హోటల్లో తాగునీటిని అందించడానికి వినియోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో గాజు సీసాలను వినియోగించాలని నిర్ణయించారు. నగరంలోని ఆతిథ్యరంగంలో మంచి మార్పునకు ఇది దోహదం చేయనుంది. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హోటళ్లలో అతిథులకు ప్లాస్టిక్ సీసాల్లో నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి కొత్తగా మార్చి వినియోగించలేక పోవడం ఒక ఎత్తయితే మరోవైపు వినియోగించిన వాటిని ధ్వంసం చేయడం కూడా ఎంతో క్లిష్టమైన, కష్టసాధ్యమైన పని. దీంతో ఇవి తీవ్రస్థాయి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి గాజు బాటిళ్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ గ్లాస్ బాటిళ్లను వాడేసినప్పటికీ తిరిగి మళ్లీ వినియోగించడం సాధ్యమవుతుండడంతో సిటీలోని కొన్ని హోటల్స్ వీటినే ఎంచుకుంటున్నాయి. ఆటోమేటిక్‌గా.. ఆరోగ్యకరంగా.. దీని కోసం తక్కువ మానవ ప్రమేయంతో పూర్తిగా ఆటోమేటిక్‌గా నడిచే ఓ అత్యాధునిక వాటర్ ప్లాంట్‌ను హోటల్స్‌లో అమర్చుకుంటున్నారు. తద్వారా హోటల్ అవసరాలకు సరిపడా పూర్తిగా శుభ్రపరచబడిన ఆల్కలైన్ మినరల్ వాటర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వీరు చెబుతున్నారు. పూర్తి ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ యంత్రం తన ఫిల్టర్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రిస్తూ అత్యంత శుభ్రమైన తాగు నీటిని అందిస్తుంది. ఇలా తయారు చేసిన తాగు నీటిని మళ్లీ తిరిగి వినియోగించే వీలున్న రీ యూజబుల్ గాజు సీసాల ద్వారా అతిథులకు అందజేస్తున్నారు. నాలుగు దశలలో ఈ వాటర్ ప్లాంట్ పని చేస్తుంది. ముందుగా సాధారణ తాగు నీటిని పూర్తిగా శుభ్రపరచి సురక్షితమైన ఆల్కలైన్ మినరల్ వాటర్‌గా తయారు చేస్తుంది. అనంతరం యంత్రంలో ప్రవేశ పెట్టిన తాగునీటి గాజు సీసాలను పరిశుభ్రపరచి, పూర్తిగా పొడిగా మార్చిన తర్వాత వాటిలో ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్‌ను నింపుతారు. ఇలా నింపిన గ్లాసు బాటిల్స్‌ను హోటల్లోని గెస్ట్ రూమ్‌లు ఇతరత్రా ప్రదేశాలలో తాగు నీటిగా వినియోగించడానికి అందిస్తారు. రోజుకు 1500 బాటిళ్ల నీరు ఉత్పత్తి... ఆకార్ హోటల్స్ గ్రూప్ పూర్తి పర్యావరణ హితంగా హోటల్స్‌ను మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్లాస్టిక్ బాటిళ్ల నివారణకు గాను మా హోటల్లో సరికొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా రోజూ 1500 గ్లాసు బాటిళ్ల నీటిని అంటే సుమారు 300 లీటర్లను అతిథులకు సరఫరా చేయవచ్చు. అలానే కాలం చెల్లిన వాటిని రీ సైకిల్ చేసి సరికొత్త బాటిళ్ల తయారీలో వినియోగించవచ్చు. –సౌమిత్రి పహారి, జీఎం, హోటల్ మెర్క్యుర్ హైదరాబాద్ కెసీపీ (చదవండి: రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు) -
ప్లాస్టిక్ నీళ్ల సీసాలతో '450 ఏళ్లు' ఇబ్బందే.. ఇక టూత్‌బ్రష్ అయితే ఏకంగా 500 ఏళ్లు!
సాక్షి, అమరావతి: అందరం సాధారణంగా మంచినీళ్ల సీసాను ఉపయోగిస్తుంటాం. కానీ ఒకసారి వాడి బయట పారేసే ఆ ప్లాస్టిక్ నీళ్ల సీసా నామరూపాలు లేకుండా మట్టిలో కలిసి పోవడానికి ఏకంగా 450 సంవత్సరాల సమయం పడుతుందట. అలానే.. మనం వాడిపారేసిన టూత్‌బ్రష్ మట్టిలో కలవాలంటే 500 సంవత్సరాలు కావాలంట. పెళ్లిళ్లు, ఇతర పార్టీల సమయంలో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు భూమిలో కలిసిపోవడానికి 450 ఏళ్లు పడుతుంది. చివరకు అందరి చేతుల్లో కనిపించే ప్లాస్టిక్ కవర్ మట్టిలో కలవాలంటే 20 ఏళ్లదాక సమయం పడుతుంది. పర్యావరణానికి విపరీతమైన హానికలిగించే ఒకసారి ఉపయోగించిన తర్వాత పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై ఈ ఏడాది జూలై 1 నుంచి నిషేధం విధించిన కేంద్రం.. ప్రజలందరూ నిత్యం ఉపయోగించే రకరకాల ప్లాస్టిక్ వస్తువుల ద్వారా కలిగే అనర్ధాల గురించి విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో పనిచేసే గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుధ్య (డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్) విభాగం ఈ మేరకు కరపత్రాలను ముద్రించి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించే కార్యక్రమాలను మొదలుపెట్టింది. పొంచి ఉన్న ప్రమాదాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల పర్యావరణానికి విపరీతమైన హాని ఏర్పడుతుందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకసారి వాడి పారేసిన నీళ్ల సీసాలు ఒక్కొక్కటిగా చివరికి భూమి పొరల్లోకి చేరతాయి. ఇలా.. లక్షలు, కోట్ల ప్లాస్టిక్ సీసాలు 450 ఏళ్ల పాటు భూమి పొరల్లో ఉండి వర్షం నీరు కిందకు ఇంకకుండా అడ్డుపడడం వంటి కారణాలతో భూమిలోకి ఇంకే నీటిశాతం తగ్గిపోయి క్రమంగా భూగర్భ జలమట్టాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పటికే ఇంట్లో వేసుకునే బోరు 300–400 అడుగులు మేర తవ్వాల్సి రావడం.. కొన్నిచోట్ల 500 అడుగుల మేర తవ్వినా నీరు పడకపోవడం సర్వసాధారణంగా కనిపించే అంశాలే. -
ఇసుక, సిమెంట్ లేకుండా ఇల్లుని నిర్మించాడు, ఎలాగో తెలుసా?
Video of this house made of plastic bottles: ఇంతవరకు మనం అత్యాధునిక హంగులతో నిర్మించిన రకరకాల ఇళ్ల గురించి విన్నాం. అంతేకాదు తక్కువ బడ్జెట్‌తో నిర్మించే ఇళ్ల గురించి కూడా విన్నాం. పైగా విచిత్రమైన రీతిలో నిర్మించిన ఇళ్లను సైతం చూశాం. కానీ ఒక బాలుడు పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లతో అది కూడా నివాసం యోగ్యంగా ఉండేలా ఇల్లు రూపొందించాడు. ఆశ్యర్యంగా ఉంది కదూ! నిజమేనా? అనే సందేహంతో ఉండిపోకండి. అసలు విషయంలోకెళ్తే...ఇళ్లను నిర్మించేవాళ్ల సాయం కూడా తీసుకోకుండా ఒక బాలుడు ప్లాస్టిక్ బాటిళ్లతో ఇల్లుని నిర్మించాడు. పైగా భారత్‌లోని ఒక బాలుడు ఈ ఇల్లుని నిర్మించడం విశేషం. అంతేకాదు ఇటుక గానీ సిమెంట్ గానీ వినియోగించకుండా కేవలం ప్లాస్టిక్ బాటిళ్లతో రూపొందించాడు. పైగా ఈ ఇంట్లో, తలుపులు, కిటికీలు, లైట్లు కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ ఇల్లుని చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!) -
'హీరో ఇచ్చిన గిఫ్ట్ ఇదీ', అమీర్ పరువు తీసిన నెటిజన్!
అమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "లాల్ సింగ్ చద్దా". లద్దాఖ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా సెట్స్‌లో జాయిన అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్ లద్దాఖ్‌లోని వాఖా గ్రామంలో చిత్రయూనిట్ షూటింగ్ జరిపిన ప్రదేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలోని ప్రదేశంలో 'లాల్ సింగ్ చద్దా' టీం వదిలేసిన ప్లాస్టిక్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. "వాఖా గ్రామస్తుల కోసం అమీర్ ఖాన్ ఇచ్చిన బహుమతి ఇది. అమీర్ పర్యావరణం, శుభ్రత గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. సత్యమేవ జయతే అంటూ నినాదాలిస్తాడు. కానీ అసలు విషయం మాత్రం ఇదీ.." అంటూ అతడు హీరో టీం తీరుపై మండిపడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'సినిమా బడ్జెట్ కోట్లలో ఉన్నప్పుడు ఇది క్లీన్ చేయడానికి ఏం మాయరోగం', 'మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు అనడానికి ఇదే నిదర్శనం' అంటూ చిత్రయూనిట్‌ను ఏకిపారేస్తున్నారు. అయితే లద్దాఖ్‌లో షెడ్యూల్ ఇంకా పూర్తవనందునే ఆ ప్రాంతాన్ని ఇంకా శుభ్రం చేసి ఉండకపోవచ్చని అమీర్‌ను వెనకేసుకొస్తున్నారు ఆయన అభిమానులు. This is the gift Bollywood star Amir Khan's upcoming movie Lal Singh Chada has left for the villagers of Wakha in Ladakh. Amir Khan himself talks big about environmental cleanliness at Satyamev Jayate but this is what happens when it comes to himself. pic.twitter.com/exCE3bGHyB — Jigmat Ladakhi 🇮🇳 (@nontsay) July 8, 2021 -
ప్లాస్టిక్ బాటిల్స్ తో ఇల్లు నిర్మాణం
-
ఆహారాలు ప్లాస్టిక్ బౌల్లో వద్దు!
ఇటీవల మనం అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్‌లో ఆహారాలను వడ్డించడం అలవాటు చేసుకున్నాం. అయితే పైకి అందంగా కనిపించే ఈ బౌల్స్ ఆరోగ్యం విషయానికి వస్తే అంత మంచివి కాదు. ఈ బౌల్స్ ‘మెలమెన్’ అనే ప్లాస్టిక్‌లతో తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లో మెలమైన్... ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్తుంది. దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లోనూ ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్‌లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్‌లో తిన్న వారి మూత్రంలో మెలమైన్ పాళ్లు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతోపాటు క్యాన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మెలమైన్ బౌల్లో ఉంచి ఏ ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్‌లో వేడిచేయకూడదు. ఈ అంశాన్ని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ కూడా గట్టిగానే సిఫార్సు చేస్తోంది. ఈ ప్లాస్టిక్ ప్రభావం మహిళల్లోని ఈస్ట్రోజెన్ హార్మోన్‌పై ఉంటుంది. దీనివల్ల గర్భధారణ సమస్యలు రావచ్చు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గవచ్చు. చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా మరో అధ్యయనంలో తేలింది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీన పడి జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అలై్జమర్స్ వంటి వ్యాధులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందుకే కూరలు, పులుసులకు ప్లాస్టిక్ బౌల్స్ కాకుండా పింగాణీ బౌల్స్ వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు. చదవండి: కరోనా సెకండ్ వేవ్: ఆడవాళ్లు ఈ ఆహారం తీసుకోవాలి! -
'మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' తో కొత్త సందేశం
సాక్షి, న్యూఢిల్లీ : మురికి కాల్వల్లో మనం పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర జల మార్గాల్లో కలసి, వాటి నుంచి నదులకు, నదుల నుంచి సముద్రాలకు చేరి వాటిలొని సకల జల చరాలకు ప్రాణాంతకం అవుతున్నాయనే విషయం తెల్సిందే. అయితే ఇలా పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు జల మార్గాల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయో తెలిస్తే అంతులేని ఆశ్చర్యం కలగక మానదు. మానవాళికి పర్యావరణ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ' నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ' తరఫున బ్రిటన్‌లోని ఎక్సిటర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు భారత్‌లోని గంగా నదిలో, బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో 500 ఎంఎల్ కలిగిన కొన్నిబాటిళ్లను వదిలి పెట్టారు. వారి గమనాన్ని ఎప్పటికప్పుడు తెలసుకునేందుకు వీలుగా వాటిలో శాటిలైట్, జీపీఎస్ ట్యాగ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో ఆశ్చర్యంగా గంగా నదిలో వదిలేసిన ఓ ప్లాస్టిక్ బాటిల్ మిగితా రెండు వేర్వేరు సముద్రాల్లో వదిలేసిన బాటిళ్లకన్నా ఎక్కువ దూరం ప్రయాణించింది. 94 రోజుల్లో ఆ బాటిల్ 1768 మైళ్లు, అంటే 2, 845 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ ప్రయోగానికి స్ఫూర్తినిచ్చిందీ ' మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' అనే హాలీవుడ్ సినిమా. 1999లో లూయీ మండోకి దర్శకత్వంలో వెలువడిన ఆ ప్రేమ కథా చిత్రం నాటి కుర్రకారును ఎంతో ఆకట్టుకుంది. అందుకేనేమో అదే చిత్రం స్సూర్తితో ఈ ప్రయోగానికికూడా 'మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' అని పేరు పెట్టారు. ఇలాగే ప్రపంచ మానవాళి నిర్లక్ష్యంగా పడేసే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఏటా సముద్రాలకు 80 లక్షల టన్నులు చేరుకుంటోందని 'ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేషన్' లెక్కలు తెలియజేస్తున్నాయి. సముద్రాలకు చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల్లో 80 శాతం నదుల ద్వారా వస్తున్నవేనని కనుగొన్నారు. డాక్టర్ ఎమిలీ డంకన్ పరిశోధనకు నేతృత్వం వహించారు. పలు కారణాల వల్ల కొన్ని ప్లాస్టిక్ బాటిళ్లు మార్గమధ్యంలో ఆగిపోవచ్చనే ఉద్దేశంతో మొత్తం ప్రయోగానికి 25 బాటిళ్లను ఉపయోగించారు. వాటిలో 22 బాటిళ్లు సరాసరి దూరం 165 మైళ్లు, అంటే దాదాపు 267 కిలోమీటర్లు చేరుకున్నాయని పరిశోధకులు వివరించారు. ఆ తర్వాత వాటిలో 14 బాటిళ్ల ఆచూకీ చిక్క లేదని, వాటిలో కొన్ని ప్రజల చేతికి చిక్కగా మిగతావి శాటిలైట్ యాంటెన్నా పాడై పోవడం వల్ల వాటి గమ్యాన్ని గుర్తించలేక పోయామని పరిశోధకులు తెలిపారు. గంగా నదిలోనే ప్లాస్టిక్ బాటిళ్లు ఎక్కువగా చిక్కుకుపోయే అవకాశం ఉండడంతో ఆ నదిలోనే ఎక్కువ బాటిళ్లను వదిలేసినట్లు వారు చెప్పారు. -
ప్లాస్టిక్ బాటిల్‌ను బయటకు కక్కిన పాము
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఈ సమస్య పెనుభూతంగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ప్రకృతికి, భవిష్యత్తులో మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్ వల్ల మనుషులే కాదు జంతువులు, వన్యజీవులు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారు. ఆహారమేదో, ప్లాస్టికేదో గుర్తించలేకపోతున్న జంతువులు.. వాటిని ఆహారంగా తీసుకొని.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఉదంతాలు ఎన్నో బయటపడుతున్నాయి. తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ పోస్టు చేసిన ఓ వీడియో ప్లాస్టిక్ భూతం వన్యజీవులకు ఎంత ప్రమాదమో చాటుతోంది. 48 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో ఓ పాము బద్దకంగా నేలపై పడుండి అవస్థలు పడుతోంది. పాము ఏదో తినడం వల్ల దాని కడుపు ఉబ్బినట్టు కనిపిస్తోంది. ఓ వ్యక్తి దానిని అదిలించడంతో అతికష్టం మీద ఆ పాము తాను తిన్న ఆహారాన్ని బయటకు కక్కడానికి ప్రయత్నించింది. కష్టంగా కదులుతూ కొన్ని ప్రయత్నాల తర్వాత పాము బయటకు కక్కడంతో ఒక గ్రీన్ కలర్ ప్లాస్టిక్ బాటిల్ దాని కడుపులోంచి బయటకు వచ్చింది. ప్లాస్టిక్ ఎంతగా జంతువులను వేధిస్తుందో ఈ వీడియో చాటుతోంది. ప్లాస్టిక్ వస్తువులను పడేసే విషయంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని, బాటిల్స్ లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల వన్యజీవుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఐఎఫ్ఎస్ కశ్వాన్ ఈ వైరల్ వీడియోపై కామెంట్ పెట్టారు. ప్లాస్టిక్ భూతం వల్ల వన్యజీవులకూ ముప్పు తప్పడం లేదని, ప్రకృతి కూడా నాశనం అవుతోందని, ఇప్పటికైనా ప్రజలంతా మేల్కొని.. ప్లాస్టిక్ వినియోగం విషయంలో విచక్షణ పాటిస్తూ పర్యావరణ హితంగా ప్రవర్తించాలని నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. -
స్వచ్ఛ భారత్ కోసం రిలయన్స్ మెగా ప్లాగింగ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ను చెత్తరహిత దేశంగా మార్చేందుకు రిలయన్స్ కు చెందిన ఆర్ ఎలాన్ (ఫ్యాబ్రిక్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ) చేపట్టిన రన్ విజయవంతం అయింది. భారతదేశపు మొదటి ప్లాగర్ రిపు దామన్ భాగస్వామ్యంతో అటు పర్యావరణ పరిరక్షణ ఇటు ఫిట్నెస్ను సాధించే ఉమ్మడి లక్ష్యంతో చేపట్టిన ప్లాగింగ్ రన్‌ను గురువారం విజయవంతంగా ముగించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ గ్రాండ్‌ఫినాలేకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు కూడా హజరయ్యారు. 50 నగరాల ప్రజలు ఈ రన్లో పాల్గొన్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఆర్ఎలాన్ సంస్థ వెల్లడించింది. ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించేందుకు సెప్టెంబర్ 5న కొచ్చిలో ప్రారంభమైన ఈ రన్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పూర్తి అయిందని, ఈ సందర్భంగా తమకు ఘనస్వాగతం లభించిందని తెలిపింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా తదితర 50 నగరాల్లో సుమారు 1000 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ మెగా రన్లో సుమారు 2.7 టన్నుల ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. ‘రన్ టు మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ' కార్యక్రమంపై ప్లాగర్ దామన్ స్పందిస్తూ ఇది డ్రీమ్ రన్ అని పేర్కొన్నారు. తమ ప్రయత్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత క్రీడా అథారిటీ గుర్తించడం గర్వంగా ఉందని దామన్ అన్నారు. ఆర్ఐఎల్ పాలిస్టర్ బిజినెస్ సీఈవో గుంజన్ శర్మ మాట్లాడుతూ ఈ ప్లాగింగ్ రన్ దేశవ్యాప్తంగా లభించిన ఆదరణ తమకెంతో సంతోషానిచ్చిం దన్నారు. పర్యావరణంపై అవగాహనతోపాటు, పౌరులలో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పెంపొందింస్తామన్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్‌తో అద్భుతమైన దుస్తులను తయారుచేస్తామని వెల్లడించారు. కాగా రి లయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్ అద్భుతమైన వస్త్రాలను తయారు చేస్తుంది. ప్లాంట్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ లోని ప్లాంట్ ద్వారా ప్రతి ఏటా ఈ యూనిట్ 2.5 బిలియన్ పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేస్తుంది. దీన్ని పర్యావరణహితమైన గ్రీన్ గోల్డ్ ఫైబర్‌గా మారుస్తున్న సంగతి తెలిసిందే. -
నీటిలో తేలియాడే కృత్రిమ దీవి
సాక్షి, న్యూఢిల్లీ : ఒకరు పనికి రాదని పడేసిన చెత్త, మరొకరికి విలువైనదిగా పనికొస్తుందంటే ఇదే! సముద్రపు ఒడ్డున పర్యాటకులు తాగి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఫ్రెంచ్ కంప్యూటర్ ఇంట్రిప్రీనర్ ఎరిక్ బెకర్ ఏరుకున్నారు. వందలు కాదు, వేలు కాదు, అలా ఏడు లక్షల బాటిళ్లను ఏరి వాటితోని నీటి మీద తేలియాడే కృత్రిమ దీవిని నిర్మించారు. ముందుగా దానిపై తాను ఉండేందుకు ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఈ దీవిని కూడా ఎందుకు వ్యాపారానికి ఉపయోగించుకోకూడదని అనుకున్నారో, ఏమో! ఆ దీవిపై ఒక హోటల్‌ను, ఓ బార్‌ను, రెండు కృత్రిమ స్విమ్మింగ్ పూల్స్‌ను, రాత్రి బసకు రెండు మూడు షెడ్లను నిర్మించి పర్యాటకులకు స్వాగతం పలికారు. అంతే ప్రకతి ప్రేమికులు, పర్యావరన పరిరక్షణ కార్యకర్తలు, ప్లాస్టిట్ వేస్ట్‌ను ఎలా ఉపయోగించారో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు కృత్రిమ దీవికి క్యూలు కట్టారు. ఈ దీవిపై ఒక రోజు గడపడానికి వంద డాలర్లు వసూలు చేస్తున్నారు. ఈ దీవిపై ఆకర్షణీయంగా చెట్లు, పొదలను కూడా పెంచారు. ఈ దీవి వెయ్యి చదరపు మీటర్లు ఉంటుంది. పర్యాటకులు దీనికి పడవపైనే రావాల్సి ఉంటుంది. ఊరికే పగలు చూసి పోవడానికైతే 25 డాలర్లు వసూలు చేస్తారు. రాత్రికి భోజనం, బస చేయాలంటే వంద డాలర్లు వసూలు చేస్తారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని అబిద్జాన్ పట్టణ శివారులో సముద్రం పక్కన నీటి మడుగులో ఈ కృత్రిమ తేలియాడే దీవిని నిర్మించారు. వారానికి వంద మంది పర్యాటకులు వస్తున్నారని, వారితో తనకు అంతో ఇంతో డబ్బు రావడమే కాకుండా, ప్లాస్టిక్ వేస్టేజ్‌ని కొంతైనా సద్వినియోగం చేశానన్న సంతప్తి ఉందని ఆయన ఏఎఫ్‌పీ మీడియాతో వ్యాఖ్యానించారు. -
‘తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతాం’
సాక్షి, తిరుమల : తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో టీటీడీ కార్యలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధం చేపడతమన్నారు. 15 రోజుల్లో అతిథి గృహాలు, హోటళ్లలో వాటర్ బాటిళ్ల వాడకం నిషేధిస్తామని, వీటికి ప్రత్యామ్నయంగా వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మంచి ఫలితాలు వస్తే నెల తర్వాత తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు అనుమతించమన్నారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు బార్ కోడ్ విధానం ద్వారా లడ్డులు అందిస్తామని, దర్శనం చేసుకున్న వారికే లడ్డులు ఇస్తామన్నారు. అలాగే జీఎంఆర్ సంస్థ ద్వారా తిరుమలలో ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలో తిరుమల రాయ మండపంలో తులభారం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
బాటిళ్లలో పెట్రోల్ బంద్!
సాక్షి, కామారెడ్డి: సాధారణంగా బైక్‌పై తిరిగే వారికి ఎప్పుడో ఒకసారి పెట్రోల్ సమస్య తలెత్తుతుంది. వాహనంపై తిరిగినపుడు పెట్రోల్ పోసుకోవడం మరిచిపోయిన సందర్భంలో వాహనం ఆగిపోవడం, వెంటనే ఓ ప్లాస్టిక్ బాటిల్‌ను సంపాదించి దగ్గరలోని బంకుకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకోవడం జరుగుతుంది. కొందరు తమ వాహనం పెట్రోల్ లేక ఆగిపోయిందని స్నేహితులకో, బంధువులకో ఫోన్ చేస్తే.. వారు బాటిళ్లలో పెట్రోల్ తీసుకువచ్చి ఇస్తుంటారు. ఇకపై ఇలా బాటిళ్లలో పెట్రోల్ తీసుకెళ్లడం కుదరదు.. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ అమ్మడంపై సర్కారు ఆంక్షలు విధించింది. ఈ మేరకు అన్ని పెట్రోల్ బంకులలో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో హత్యలు, ఆత్మహత్యలకు పెట్రోల్‌ను వాడుతున్న సంఘటనలు పెరిగాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌పై సురేశ్ అనే వ్యక్తి తన వెంట ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై చల్లి సజీవదహనం చేసిన సంఘటన సంచలనం కలిగించింది. పెట్రోల్ చల్లి నిప్పంటించడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలొదిలింది. కిరోసిన్, డీజిల్ కన్నా పెట్రోల్ వేగంగా దహనం అవుతుంది. కొందరు ఆత్మహత్య చేసుకునే విషయంలో, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడానికి పెట్రోల్ సీసాలతో హల్చల్ చేసిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు పెట్రోల్ అమ్మకాలకు సంబంధించి కొన్ని ఆంక్షలు విధించింది. బాటిళ్లలో ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయొద్దని ఆదేశించింది. దీంతో బంకుల యజమానులు ‘నో పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట, ప్రధాన చౌరస్తాల వద్ద 40 కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. బాటిళ్లలో పెట్రోల్ పోయవద్దన్న ఆదేశాల నేపథ్యంలో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. బాటిళ్లలో సులువుగా పెట్రోల్ తీసుకెళ్లి వ్యక్తులపై పోసి నిప్పంటించడం గాని, తమకు తాము పోసుకుని కాల్చుకోవడం గాని జరగకుండా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుందని పెట్రోల్ బంకుల నిర్వాహకులు అంటున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లలో పెట్రోల్ అయిపోయినా వాహనం తీసుకొస్తేనే పెట్రోల్ పోస్తామని పెట్రోల్‌బంక్ యజమాని ఒకరు ‘సాక్షి’తో తెలిపారు. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పోయవద్దని ప్రభుత్వంనుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. -
ప్లాస్టిక్ బాటిల్స్‌కు కొత్త జీవితం: రిలయన్స్ రికార్డు
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సేవా సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ రికార్డు స్థాయిలో ప్లాస్టిక్ వేస్ట్‌ను సేకరించింది. రీసైకిల్ ఫర్ లైఫ్ ప్రచారంలో భాగంగా రీసైక్లింగ్ కోసం 78 టన్నుల వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించామని శుక్రవారం ప్రకటించింది. మూడు లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు,ఇతర భాగస్వాముల ద్వారా ఈ రికార్డు కలెక్షన్ సాధ్యమైందని ఒక ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది. అక్టోబర్‌లో ప్రారంభించిన రీసైకిల్ ఫర్ లైఫ్ డ్రైవ్‌లో సంస్థ ఉద్యోగులు వారి పరిసరాల నుండి వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి కార్యాలయాలకు తీసుకురావాలని విస్తృత ప్రచారం నిర్వహించింది. దీంతో దేశవ్యాప్తంగా రిలయన్స్, దాని అనుబంధ వ్యాపారాల నుంచి భారీ స్పందన లభించింది. పరిశుభ్రమైన, పచ్చని పుడమి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు. భవిష్యత్ తరాల కోసం మెరుగైన, ప్రకాశవంతమైన, శుభ్రమైన, పచ్చటి ప్రపంచాన్ని సృష్టించడమే లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమానికి రిలయన్స్ ఫౌండేషన్ కట్టుబడి వుందని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రాముఖ్యతను నమ్ముతున్నామన్నారు. క్రమం తప్పకుండా శుభ్రపరిచే కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని నీతా వెల్లడించారు. ‘రీసైకిల్ 4 లైఫ్’ ప్రచారంలో భాగంగా సేకరించిన వ్యర్థ ప్లాస్టిక్ సీసాలు రీసైకిల్ చేస్తామన్నారు. అలాగే వాడిన పెట్ బాటిల్స్‌తో పర్యావరణ అనుకూల, ఉత్పత్తులను, దుస్తులను తయారు చేస్తున్న విషయాన్నిఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. -
ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన గార్డెన్
మిడ్నాపూర్ : పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ డివిజన్ పరిధిలోని పిరకాట రేంజ్‌కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పాపన్ మొహంత ప్లాస్టిక్ సీసాలు, రబ్బరు టైర్లను ఉపయోగించి అందమైన గార్డెన్‌ను సృష్టించారు. నాలుగేళ్లుగా ఎంతో కష్టపడి ఈ గార్డెన్‌ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతిరోజు యధావిధిగా తన విధులను ముగించుకున్న తర్వాత పిరాటక రేంజ్లో ఉన్న ఖాళీ స్థలంలోనే గార్డెన్ పెంపకాన్ని చేపట్టినట్లు మొహంత తెలిపారు. ''తాను మొదటిసారి పోస్టింగ్‌పై పిరాటక రేంజ్‌కు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం వ్యర్థాలతో నిండిపోవడం చూశాను. ఎలాగైనా దీన్ని ఒక అందమైన ప్రదేశంగా తయారు చేయాలని నిశ్చయించుకున్నాను. మొత్తం 1100 ప్లాస్టిక్ బాటిళ్లు, పాడైపోయిన రబ్బర్ ట్యూబ్‌లతో గార్డెన్‌ను తయారు చేశాను. గార్డెన్‌ను సందర్శించిన వారు అభినందించడం తన కష్టాన్ని మరిచిపోయేలా చేసిందని'' మెహంతా చెప్పుకొచ్చారు. గార్డెన్లో రకరకాల సీజనల్ పూల మొక్కల్ని ఏర్పాటు చేసినట్లు మెహంతా తెలిపారు. దీన్ని సందర్శించిన సమీపంలోని పాఠశాలలు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఇదే తరహాలో గార్డెన్లు ఏర్పాటు చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘భవిష్యత్తులో భుమికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని ఉపయోగించి ఇలాంటి కార్యక్రమాలను చేపడితే కొంతవరకైనా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. తాను చేసిన ఈ ప్రయత్నాన్ని సామాజిక బాధ్యతతో పాఠశాలు, ఇతర మార్గాల ద్వారా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాను’ అని మొహంత తెలిపారు. -
‘మహీంద్ర మాటంటే మాటే..’
ముంబై: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపుకు విశేష స్పందన లభిస్తోంది. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలు మోదీ పిలుపు మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘కూలీ నెం.1’ సినిమా షూటింగ్లో ప్లాస్టిక్ వాడకూడదని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీ అభినందించారు. తాజాగా కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర కూడా ఆదే బాటలో పయనిస్తున్నారు. తన కంపెనీ బోర్డు రూముల్లో, సమావేశాల్లో ప్లాస్టిక్ బాటిళ్లను వాడకూడదని నిర్ణయించారు. స్టీల్, రాగి బాటిళ్లనే వాడాలని బోర్డు సభ్యులను కోరారు. తన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టిన బోర్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే గత జులైలోనే బోర్డు సమావేశాల్లో, రూముల్లో ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో స్టీల్ బాటిళ్లను వాడాలని ఆనంద్ మహీంద్రకు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి బదులుగా ‘ప్లాస్టిక్ బాటిళ్లను నిషేదించాలి. ప్రస్తుత పరిస్థితులకు మనమందరమూ కారణమే. తప్పకుండా మీ సూచనను పాటిస్తాం’అంటూ రిట్వీట్ చేశారు. అయితే ప్లాస్టిక్ వాడకంపై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇచ్చిన మాటను మహీంద్ర నిలబెట్టుకున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా పలువురికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తన వంతు సహాయం అందేలా చేశారు ఆనంద్ మహీంద్ర. తాజాగా రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదవారి ఆకలి తీరుస్తున్న 'ఇడ్లీ బామ్మ’కు ఉచితంగా వంట గ్యాస్ అందేలా చేశారు. కేరళ వరద బాధితుల సహాయార్థం తన సైకిల్‌ను ఇచ్చిన చిన్నారి మంచి మనసుకు చలించిపోయిన ఈ కార్పొరేట్ దిగ్గజం ఆ చిన్నారికి సైకిల్‌ను కానుకగా అందించాడు. తాజాగా ప్లాస్టిక్ వాడకంపై ఆనంద్ మహీంద్ర తీసుకున్న నిర్ణయంపై మాట ఇస్తే నిలబెట్టుకుంటారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
బాటిల్ క్రష్ చేస్తే ఫోన్ రీచార్జ్
న్యూఢిల్లీ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో భారత రైల్వే సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో ప్రయాణీకులను చైతన్యపరిచేదిశగా అడుగులు వేస్తోంది. రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ మిషన్ల ద్వారా ప్రయాణీకుల ఫోన్లను ఉచితంగా రీచార్జ్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో 400 ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ మిషన్లను ఏర్పాటుచేస్తున్నట్టు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే.యాదవ్ వెల్లడించారు. బాటిల్ క్రషింగ్ మిషన్లను వినియోగించుకునే ప్రయాణికుల ఫోన్ నంబర్లో ఉన్న కీ ద్వారా వారి ఫోన్ రీచార్జ్ అవుతుందనీ ఆయన తెలిపారు. అయితే రీచార్జ్‌కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దేశంలో 128 స్టేషన్లలో 160 బాటిల్ క్రషింగ్ మెషిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రైల్వే స్టేషన్లలోని వాడివేసిన అన్ని ప్లాస్టిక్ బాటిల్స్‌ని సేకరించి, వాటిని రీసైక్లింగ్‌కి పంపాల్సిందిగా రైల్వే సిబ్బందికి సూచించామని యాదవ్ తెలిపారు. ఇదే నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అక్టోబర్ 2న ప్రతిజ్ఞ కూడా చేయబోతున్నారు. -
ప్లాస్టిక్ ఇల్లు
ప్లాస్టిక్ చెత్తను వదిలించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా.. చిత్రంలో కనిపిస్తున్నది అలాంటి ఓ ప్రయత్నం తాలూకూ ఫలితమే. స్పష్టంగా చెప్పాలంటే దాదాపు ఆరు లక్షల ప్లాస్టిక్బాటిళ్లను ఉపయోగించుకుని కట్టిన ఇల్లు. ఇది. అలాగని దృఢంగా ఉండదని అనుకుంటారమో... భారీస్థాయి తుపాన్లను కూడా తట్టుకునేలా రూపొందించారు దీన్ని. వివరాల్లోకి వెళదాం. కెనెడాలో జేడీ కాంపోజిట్స్ అని ఓ నిర్మాణ కంపెనీ ఉంది. నోవా స్కాటియా అనే ప్రాంతంలో వీరు ఈ వినూత్నమైన ఇంటిని నిర్మించారు. సుమారు ఆరు లక్షల పన్నెండు వేల పెట్ బాటిళ్లను కరిగించి చిన్న చిన్న గుళికలుగా మార్చడంతో ఈ ఇంటి నిర్మాణం ప్రారంభమైంది. ఆర్మాసెల్ అనే కంపెనీ ఈ ప్రక్రియను చేపట్టింది. గుళికలన్నింటినీ ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా ప్రీఫ్యాబ్రికేటెడ్ గోడలుగా మార్చారు. ఆ తరువాత వాటిని డిజైన్ ప్రకారం అమర్చడంతో ఇల్లు రెడీ అయింది. ఒక బెడ్రూమ్, రెండు బాత్రూమ్లు, ఆధునిక వంటగదితోపాటు పైకప్పుపై బీబీక్యూ రూమ్ కూడా ఉన్న ఈ ఇంటి పేరు బీచ్‌హౌస్. ఇందులో వాడిన ప్యానెళ్లను పరీక్షించినప్పుడు అవి గంటకు 324 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకుని నిలబడుతుందని తేలింది. కాలంతోపాటు ఇంటిలో ఏవైనా మార్పులు వస్తాయా? దృఢత్వం దెబ్బతింటుందా? అన్న విషయాలను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే సమీప భవిష్యత్తులోనే ఈ సరికొత్త ప్లాస్టిక్ భవన టెక్నాలజీని వేర్వేరు రంగాల్లో వాడుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. -
వావ్.. బాటిల్‌ని ఇలా కూడా వాడొచ్చా?!
చాలా సార్లు మనం పనికి రాని చెత్తగా భావించి పడేసిన వస్తువులే అద్భుతమైన కళాఖండాలుగా రూపుదిద్దుకోవడం చూస్తూనే ఉంటాం. మనకు పనికి రాని వస్తువు మరొకరికి ‘పని’ చూపించడం నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు. ఇలాంటి ఆవిష్కరణలు మనం కూడా చేయగలం. కాకపోతే దానికి కావల్సిందల్లా కాస్తంతా సృజనాత్మకత. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాకు రూపమే ఇక్కడ ఫోటోలో ఉన్న చెప్పులు. వీటిని తయారు చేసిన వస్తువులు చూస్తే నిజంగానే మతి పోతుంది. మనం తాగి పారేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఇలా చెప్పులుగా మార్చిన వైనానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. న్యూజిలాండ్‌కు చెందిన ఓ మహిళ ఖాళీ బాటిళ్లకు ప్లాస్టిక్ స్ట్రాప్స్ జత చేసింది. ఇంకేముంది.. నిమిషాల్లో పనికి రాని బాటిళ్లు కాస్తా పాదరక్షలుగా మారాయి. ఇలా తయారు చేసిన తన ఈ కొత్త జాండల్స్(సాండల్స్ కాదు)ని అమ్మకానికి పెట్టింది. ధర కూడా చాలా చీప్ కేవలం రూ. 1400 అంటే ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టింది. వీటిని చూసిన నెటిజన్ల సదరు మహిళ ఐడియాను మెచ్చుకోవడమే కాక ‘వీటిని కేవలం నీటిలో నడిచేందుకే వాడాలి’, ‘ఇవి కాస్తా జారి పోయేలా ఉన్నాయి.. కార్ టైర్‌తో చేసినవి ఐతే బాగుంటాయం’టూ కామెంట్ చేస్తున్నారు. -
ప్లాస్టిక్ బాటిల్‌తో పండు ఈగలకు ఎర!
పండు ఈగల వల్ల కూరగాయలు, పండ్లకు నష్టం జరుగుతూ ఉంటుంది. పండు ఈగ కాటేసిన కాయపై ఆ గాటు దగ్గర నుంచి వృత్తాకారంలో కొద్ది రోజుల్లో కుళ్లిపోతుంది. అపురూపంగా పెంచుకుంటున్న సేంద్రియ కూరగాయలు, పండ్లకు పండు ఈగ కలిగించే నష్టం ఇంటిపంటల సాగుదారులను నిరుత్సాహపరుస్తూ ఉంటుంది.. విస్తారంగా సాగు చేసే రైతులను తీవ్ర ఆర్థిక నష్టానికి గురి చేస్తుంటుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన సీనియర్ ఇంటిపంటల సాగుదారు దశిక చంద్రశేఖర శాస్త్రి పండు ఈగలను ఆకర్షించి నశింపజేసేందుకు ప్లాస్టిక్ బాటిల్‌తో ట్రాప్లను తయారు చేసి వాడుతున్నారు. వాడేసిన లీటరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను తీసుకొని.. దానికి నాలుగు వైపులా ఆంగ్ల క్యాపిటల్ లెటర్ ‘హెచ్’ ఆకారంలో బ్లేడుతో.. కుడి, ఎడమల వైపున రెండు అంగుళాల పొడవున కత్తిరించాలి. మధ్యన (అంగుళం ఎత్తులో) అడ్డంగా కత్తిరించి, ఆ రెండు ముక్కలను(45 డిగ్రీల కోణంలో) లోపలికి వంచాలి. ఈ కిటికీ ద్వారా పండు ఈగ బాటిల్లోకి ప్రవేశించి బయటకు రాలేక.. లోపలే పడిపోతుంది. పండు ఈగను బాటిల్ వైపు ఆకర్షించడానికి పసుపు, నీలం ఆయిల్ పెయింట్ రంగులను బాటిల్‌కు పూస్తున్నారు. పెయింట్ అందుబాటులో లేకపోతే.. ఇన్సులేషన్ టేప్‌ను బాటిల్‌పై అతికించవచ్చని శాస్త్రి సూచిస్తున్నారు. అరటి పండు తొక్కను బెల్లంతో కలిపి.. ఈ బాటిల్లో అడుగున ఉంచాలి. దీని వాసన.. బాటిల్‌పై పసుపు, నీలం రంగులకు పండు ఈగలు ఆకర్షితమై నశిస్తున్నాయని, ఇది చాలా సులభమైన, ఖర్చులేని మార్గమని ఆయన వివరించారు. అరటి పండు తొక్క, బెల్లం పెట్టిన వారం రోజుల వరకు పనిచేస్తుందన్నారు. అరటి తొక్క కుళ్లిపోయిన తర్వాత తీసివేసి, మళ్లీ పెట్టుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు పండు ఈగలకు ఈ ట్రాప్స్ పెట్టుకుంటే మంచిదని ఆయన తెలిపారు. దీనికి బదులు, చిన్నపాటి సోలార్ ఎల్.ఇ.డి. లైటు కొనుగోలు చేసి పెట్టుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ లైటు పగలు సూర్యరశ్మితో చార్జ్ అవుతుంది. చీకటి పడగానే వెలుగుతుంది. ఈ లైటు అడుగున వాడేసిన ఫుడ్ ప్యాకింగ్ ప్లాస్టిక్ బాక్స్‌ను అమర్చి.. వేపనూనె కలిపిన నీటిని పోయాలి. లైటు రాత్రి 10.30 గం. వరకు వెలుగుతుంది. ఈ వెలుతురుకు దగ్గరకు వచ్చే పండు ఈగలు వేపనూనె నీటిలో పడి చనిపోతాయని శాస్త్రి (81211 58628) వివరించారు. పండు ఈగ సమస్యను అధిగమించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ‘సాక్షి ఇంటిపంట’ జేజేలు పలుకుతోంది. చంద్రశేఖర శాస్త్రి, ∙పండు ఈగ, సోలార్ లైట్ ట్రాప్ -
రైల్వే వినూత్న ఆఫర్ : వాటిపై క్యాష్‌బ్యాక్
వడోదర : దేశీయ రైల్వే మరో వినూత్న ఆఫర్ ప్రకటించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి రైల్వే రివార్డ్స్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైకిల్ చేయడానికి ఉపయోగపడితే ప్రయాణికులకు రివార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికోసం వడోదర రైల్వే స్టేషన్లో బాటిల్ క్రషర్లను ఇన్స్టాల్ చేసింది. ఈ స్కీమ్ కింద క్రషింగ్ మిషన్‌లో ప్లాస్టిక్ బాటిల్ వేస్తే, ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ప్రయాణికుల పేటీఎం అకౌంట్లో క్రెడిట్ చేయనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి, బాటిల్‌ను వేసిన తర్వాత ప్రయాణికులు మొబైల్ నెంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ మొబైల్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న పేటీఎం అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్తాయి. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా దేశీయ రైల్వే ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీంతో కొంతమేర ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చని దేశీయ రైల్వే యోచిస్తోంది. వడోదరతో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి మిషన్లనే ఏర్పరించింది.