మిడ్నాపూర్ : పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ డివిజన్ పరిధిలోని పిరకాట రేంజ్‌కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పాపన్ మొహంత ప్లాస్టిక్ సీసాలు, రబ్బరు టైర్లను ఉపయోగించి అందమైన గార్డెన్‌ను సృష్టించారు. నాలుగేళ్లుగా ఎంతో కష్టపడి ఈ గార్డెన్‌ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతిరోజు యధావిధిగా తన విధులను ముగించుకున్న తర్వాత పిరాటక రేంజ్‌లో ఉన్న ఖాళీ స్థలంలోనే గార్డెన్ పెంపకాన్ని చేపట్టినట్లు మొహంత తెలిపారు.
''తాను మొదటిసారి పోస్టింగ్‌పై పిరాటక రేంజ్‌కు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం వ్యర్థాలతో నిండిపోవడం చూశాను. ఎలాగైనా దీన్ని ఒక అందమైన ప్రదేశంగా తయారు చేయాలని నిశ్చయించుకున్నాను. మొత్తం 1100 ప్లాస్టిక్ బాటిళ్లు, పాడైపోయిన రబ్బర్ ట్యూబ్‌లతో గార్డెన్‌ను తయారు చేశాను. గార్డెన్‌ను సందర్శించిన వారు అభినందించడం తన కష్టాన్ని మరిచిపోయేలా చేసిందని'' మెహంతా చెప్పుకొచ్చారు. గార్డెన్‌లో రకరకాల సీజనల్ పూల మొక్కల్ని ఏర్పాటు చేసినట్లు మెహంతా తెలిపారు. దీన్ని సందర్శించిన సమీపంలోని పాఠశాలలు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఇదే తరహాలో గార్డెన్లు ఏర్పాటు చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు.
‘భవిష్యత్తులో భుమికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని ఉపయోగించి ఇలాంటి కార్యక్రమాలను చేపడితే కొంతవరకైనా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. తాను చేసిన ఈ ప్రయత్నాన్ని సామాజిక బాధ్యతతో పాఠశాలు, ఇతర మార్గాల ద్వారా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాను’ అని మొహంత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment