సాక్షి, తిరుమల : తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో టీటీడీ కార్యలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధం చేపడతమన్నారు. 15 రోజుల్లో అతిథి గృహాలు, హోటళ్లలో వాటర్ బాటిళ్ల వాడకం నిషేధిస్తామని, వీటికి ప్రత్యామ్నయంగా వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మంచి ఫలితాలు వస్తే నెల తర్వాత తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు అనుమతించమన్నారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు బార్ కోడ్ విధానం ద్వారా లడ్డులు అందిస్తామని, దర్శనం చేసుకున్న వారికే లడ్డులు ఇస్తామన్నారు. అలాగే జీఎంఆర్ సంస్థ ద్వారా తిరుమలలో ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలో తిరుమల రాయ మండపంలో తులభారం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment