చాలా సార్లు మనం పనికి రాని చెత్తగా భావించి పడేసిన వస్తువులే అద్భుతమైన కళాఖండాలుగా రూపుదిద్దుకోవడం చూస్తూనే ఉంటాం. మనకు పనికి రాని వస్తువు మరొకరికి ‘పని’ చూపించడం నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు. ఇలాంటి ఆవిష్కరణలు మనం కూడా చేయగలం. కాకపోతే దానికి కావల్సిందల్లా కాస్తంతా సృజనాత్మకత. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాకు రూపమే ఇక్కడ ఫోటోలో ఉన్న చెప్పులు. వీటిని తయారు చేసిన వస్తువులు చూస్తే నిజంగానే మతి పోతుంది. మనం తాగి పారేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఇలా చెప్పులుగా మార్చిన వైనానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.
న్యూజిలాండ్‌కు చెందిన ఓ మహిళ ఖాళీ బాటిళ్లకు ప్లాస్టిక్ స్ట్రాప్స్ జత చేసింది. ఇంకేముంది.. నిమిషాల్లో పనికి రాని బాటిళ్లు కాస్తా పాదరక్షలుగా మారాయి. ఇలా తయారు చేసిన తన ఈ కొత్త జాండల్స్(సాండల్స్ కాదు)ని అమ్మకానికి పెట్టింది. ధర కూడా చాలా చీప్ కేవలం రూ. 1400 అంటే ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టింది. వీటిని చూసిన నెటిజన్ల సదరు మహిళ ఐడియాను మెచ్చుకోవడమే కాక ‘వీటిని కేవలం నీటిలో నడిచేందుకే వాడాలి’, ‘ఇవి కాస్తా జారి పోయేలా ఉన్నాయి.. కార్ టైర్‌తో చేసినవి ఐతే బాగుంటాయం’టూ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment