
నీటిలో, నేల మీద జీవించే జీవుల్లో మొసలి ఒకటి. మొసలికి నీటిలో అమితమైన బలం ఉంటుంది. పెద్ద ఎనుగును కూడా ఈడ్చి పడేస్తుంది. అందుకే నీటిలో ఉండే వేటాడి ఆహారం తింటుంది. నేల మీద మొసలి జీవించలగలదు కానీ బలం అంతగా ఉండదు. అయితే నదిలో ఉన్న మొసలి ఒడ్డున ఉన్న కుక్క పిల్లను తినేయాలని చూస్తుంది. ఇంతలో ఓ మహిళ తన చెప్పు తీసి మొసలిని బెదిరించేసరికి తోకముడిచి వెనక్కి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రెడ్ షుల్ట్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఎర్ర తేళ్లేనా?
ఈ వీడియోలో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో నద వద్ద నిలబడి ఉంది. ఈ నదిలో చాలా మొసళ్లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కా గా మహిళ కుక్క అక్కడక్కడే తిరుగుతూ ఉండగా దాన్ని చూసిన మొసలి వేగంగా ఒడ్డు వద్దకు వస్తుంది. అలా వస్తున్న మొసలిని చూసిన మహిళ ఇసుమంత కూడా భయపడకుండా దాన్ని అలాగే చూస్తూ నిల్చుంటుంది. ఆ మొసలి దగ్గరి దాక వచ్చాక మహిళ తన కాలుకు ఉన్న చెప్పును చూపించి బెదిరిస్తుంది. దీంతో ఆ మొసలి భయపడిందో ఏమో గానీ వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి నీళ్లలోకి వెళ్లిపోయింది.
చదవండి: రేయ్! రేయ్!.. తప్పుకోండిరా బాబు... మీదకు వచ్చేస్తోంది..!!
Everyone knows what it means when mom takes the shoe off. 😏😂🐊🥿 pic.twitter.com/CXD94m6PVz
— Fred Schultz (@fred035schultz) November 9, 2021
అన్నట్టు ఇది ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతమైన. కాకాడు నేషనల్ పార్కులో జరిగింది. ఈ వీడియోలోని మహిళ చేసిన ఫన్ నెటిజన్లను ఆకర్షిస్తుంది. దీంతో ట్విట్టర్‌లో మీమ్స్ సృష్టిస్తున్నారు. ఎలాంటి సమస్యకైనా చెప్పు ఉంటే చాలు... పరిష్కారం దొరుకుతుంది. డేరింగ్ లేడి. భర్త ఆలస్యంగా ఇంటికి రావడం, పిల్లలు నటించడం, కుక్కను బెదిరించడం ఇలా ప్రతి దానిలో చెప్పునే ఉపయోగిస్తాం’. అంటూ రకరకాల మీమ్స్ వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment