Watch: Crow Holding Plastic Bottle Looking For A Dustbin To Throw Garbage, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Crow Holding Bottle Viral Video: ‘కాకి ఇలా కూడా చేస్తుందా?’.. ఇంతకుముందెన్నడూ చూడని స్ఫూర్తిదాయక వీడియో!

Jul 22 2023 12:49 PM | Updated on Jul 22 2023 1:25 PM

crow holding plastic bottle looking for a dustbin - Sakshi

సోషల్‌ మీడియాలో లెక్కుమించిన వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని వింతైనవి, మరికొన్ని అమూల్యమైనవి కూడా ఉంటాయి. అయితే గతంలో ఎవరూ కూడా చూడని ఒక వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీనిని చూసినవారంతా కాకి ఇలాంటి పనిచేయడమేమిటంటూ, తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు. ఈ వీడియో ప్రతీఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉండటం విశేషం. అలాగే ఈ వీడియోను చూసిన వారంతా ఇకపై తాము కూడా బాధ్యతగా మెలుగుతామని కూడా చెప్పడం విశేషం. 

ఈ వీడియోను ట్విట్టర్‌లో @TansuYegen పేరుతో ఒక యూజర్‌ షేర్‌ చేశారు. ఈ 20 సెకెన్ల వీడియోలో ఒక కాకి తన ముక్కుతో ఒక ప్లాసిట్‌ బాటిల్‌ పట్టుకుని, ఇటునటు ఎగరడం కనిపిస్తుంది. తరువాత దానికి ఒక డస్ట్‌బిన్‌ కనిపించగానే దానిపై కూర్చుని, పలు ప్రయత్నాల అనంతరం ఆ బాటిల్‌ను ఆ డస్ట్‌బిన్‌ రంధ్రంలో నుంచి లోనికి పడవేస్తుంది. ఈ కాకి చేసిన పని చూసినవారంతా ఆశ్యర్యపోతున్నారు. ఈ విధమైన కాకిని ఎక్కడా చూడలేదని అంటున్నారు. 

అంత్యంత వేగంగా వైరల్‌ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 2 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోను చూసినవారంతా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మనుషులు చేయాల్సిన పనిని ఒక పక్షిచేయడాన్ని చూసి మనమంతా సిగ్గుపడాలని అన్నారు. మరో యూజర్‌ పక్షులను చూసి మనం మరో గుణపాఠం నేర్చుకోవాలన్నారు. 
ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement