2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్‌ కోసం వెతికారో తెలుసా? | Do You Know The Most Searched Food On Internet In 2023 | Sakshi
Sakshi News home page

2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్‌ కోసం వెతికారో తెలుసా?

Published Wed, Dec 13 2023 4:24 PM | Last Updated on Wed, Dec 13 2023 5:55 PM

Do You Know The Most Searched Food On Internet In 2023 - Sakshi

ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే 2024లో అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 2023లో ఫ్యాషన్‌, బ్యూటీ, ఫుడ్ విషయంలో అనేక కొత్త ట్రెండ్స్‌ వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫుడ్‌ రెసిపిల్లోనూ వెరైటీ ప్రయోగాలెన్నో చూశాం. అలా 2023లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన 10 ఆహార పదార్థాలుఏంటో చూసేద్దాం.


మిల్లెట్స్‌

2023 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన ఆహార పదార్థాల్లో మిల్లెట్స్‌​ పేరు ముందుంది. మిల్లెట్స్‌ తయారీ విధానం, దాని ప్రయోజనాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపించారు. దీనికి ప్రధాన కారణం.. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడమే. 

అవకాడో
అవకాడో ఒక అమెరికన్‌ ఫ్రూట్‌. దీన్ని తెలుగులో వెన్నపండు అంటారు. గూగుల్‌లో అత్యధికంగా వెతిక ఆహార పదార్థాల్లో అవకాడో ఒకటి. అవకాడలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫ్రూట్‌కి బాగా డిమాండ్‌ ఉంది. అరటిపండు కంటే అవోకాడోలో ఎక్కువ పొటాషియం ఉంది.

అవకాడో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి డిన్నర్‌ వరకు అవకాడోను పలు స్మూతీల్లో, సలాడ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కాస్త కాస్ట్‌లీ అయినప్పటికీ అవకాడోలోని పోషకాలు, హెల్తీ ఫ్యాట్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కారణంగానే గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌లో ఒకటిగా నిలిచింది. 

మటన్‌ రోగన్‌ జోష్‌
గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన ఫుడ్‌ ఐటమ్స్‌లో మటన్‌ రోగన్‌ జోష్‌ మూడో స్థానం దక్కించుకుంది. ఇది పాపులర్‌ కశ్మీరీ వంటకం. నాన్‌ లేదా రైస్‌తో తినే ఈ స్పైసీ ఫుడ్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ ఏడాది ఎక్కవుగా సెర్చ్‌ చేసిన టాప్‌-3 ఐటెం ఇది. 

కతి రోల్స్‌
2023లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆహార పదార్థాల్లో కతి రోల్స్‌ నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతాలోని పాపులర్‌ స్ట్రీట్‌ఫుడ్స్‌లో ఇది ఒకటి. రోల్స్‌లో స్టఫింగ్‌ కోసం వెజ్‌ లేదా నాన్‌వెజ్‌ను ఎంచుకోవచ్చు. వీటిని చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తారు.   

టిన్ట్‌ ఫిష్‌
చేపల్లో ప్రోటీన్‌, ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. 2023లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన వంటకాల్లో టిన్ట్‌ ఫిష్‌ కూడా ఉంది. సలాడ్‌,శాండ్‌విచ్‌, పాస్తా,,క్యాస్రోల్‌ వంటకాల్లో ఎక్కువగా టిన్ట్‌ ఫిష్‌ను ఉపయోగిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement