గడువు తీరితే గండమే..!
- గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్‌పైరీ ఉంటుంది
- గుర్తించి వెంటనే మార్చుకోవాలి
పటాన్‌చెరు : మనం వినియోగించే ప్రతి వస్తువుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. తినే పదార్థాల నుంచి వేసుకునే మందులు ఇలా ప్రతి దానికి కాల పరిమితి ఉంటుంది. మరి నిత్యం వంట గదిలో ఉండే గ్యాస్ సిలిండర్ గురించి మీకు తెలుసా? దానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని? కాలం తీరిన సిలిండర్ వినియోగిస్తే ప్రమాదకరమని తెలుసా?
ఎక్స్‌పైర్ డేట్ ఎలా గుర్తించాలి?
గ్యాస్ సిలిండర్‌పైన ఉన్న రింగ్ కింద నిలువుగా మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వైపు గ్యాస్ సిలిండర్ గడువు తేదీ ముంద్రించి ఉంటుంది. సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజించి మూడు నెలలకు ఒక ఆంగ్ల అక్షరం చొప్పున ఏ,బీ,సీ,డీగా గుర్తిస్తారు. జనవరి నుంచి మార్చి వరకు ‘ఏ’తో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ‘బీ’తో, జులై నుంచి సెప్టెంబర్ వరకు ‘సీ’తో, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ‘డీ’తో గుర్తిస్తారు. ఉదాహరణకు మీ సిలిండర్‌పై ‘డీ15’ అని ఉంటే డిసెంబర్ 2015 వరకు వినియోగించాలి. ఆ తేదీ దాటితే గడువు తీరినట్లే.
గడువులోగా వాడితేనే మంచిది
సిలిండర్ తీసుకున్న తర్వాత కొంత మంది వాటిని వినియోగించకుండా నెలల తరబడి నిర్వ ఉంచుతుం టారు. మరికొందరు ప్రత్యేక అవసరాల కోసం సిలిండర్లు బ్లాక్‌లో తీసుకుని వాడుతుంటారు. సందర్భం ఏదైనప్పటికీ వాటిపై ఉండే గడువు తేదీలోగా వాడితే మంచిది. కాలం చెల్లిన సిలిండర్‌లు వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి సిలిండర్లను గుర్తించి సంబంధిత డీలర్‌కు సరెండర్ చేయాలి. సిలిండర్ తీసుకున్న తేదీకి, దానిపై ఉన్న తేదీకి మధ్య కనీసం నాలుగు నెలల సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద ఉన్న తేదీలోగానే సిలిం డర్ వినియోగించాలి
ఖాళీ సిలిండర్‌కూ కాల పరిమితి
సిలిండర్‌లోని గ్యాస్ వాడకానికే కాకుం డా ఖాళీ సిలిండర్‌కు కూడా నిర్దిష్ట కాల పరిమితి ఉం టుంది. ఈ విషయం మాత్రం విని యోగదారులకు సంబంధం లేనిది. ఖాళీ సిలిండర్ కాలపరిమితి ఏడేళ్లు. తయారీదారులు తమ వద్ద రికార్డుల్లో లేని బ్యాచ్ నంబర్ల ప్రకారం ఏడేళ్లు తాడిన సిలిండర్లను డీలర్ల నుంచి వెనక్కు తెప్పించి ప్రత్యేక పరికరాలతో పరీక్షిస్తారు. నాణ్యత సరిగ్గా ఉంటే మరో ఐదేళ్ల పాటు విని యోగిస్తారు. లేకుంటే వాటిని నాశనం చేస్తారు.