gas cylinders
-
పెరిగిన గ్యాస్ ధర.. వరుసగా నాలుగోసారి..
చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పలు మెట్రో నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర శుక్రవారం పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగోసారి. సవరించిన రేటు నేటి నుంచి అమల్లోకి వస్తుంది.ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 62 పెరిగింది. రిటైల్ ధర రూ.1,740 నుండి రూ.1,802లకు ఎగసింది. అంతకుముందు అక్టోబర్‌లో రూ. 48.50, సెప్టెంబరులో రూ. 39, ఆగస్టులో రూ. 8.50 చొప్పున వాణిజ్య ఎల్పీజీ ధరలు పెరిగాయి.ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాలో కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజా పెంపుతో రిటైల్ ధర ఇప్పుడు ముంబైలో రూ.1,754.50, చెన్నైలో రూ.1,964.50, కోల్‌కతాలో రూ.1,911.50గా ఉంది.ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెలా సవరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా తాజాగా నవంబర్ నెలకు గానూ ధరను పెంచాయి. దీని ప్రభావం కమర్షియల్ సిలిండర్లను వినియోగించే హోటళ్లు, ఇతర వాటిపై పడనుంది. -
గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పయిరీ డేట్ తెలుసుకోవడం ఎలా?
ప్రతి ఇంట్లో దాదాపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు తప్పనిసరిగా ఉంటాయి. ఇంతకు ముందు అయితే వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి వాడేవాళ్లు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో పల్లెటూర్లలో కూడా కట్టెల పొయ్యి వాడకం బాగా తగ్గిపోయింది. దాదాపు అందరి ఇళ్లలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్లనే వాడుతున్నారు. అయితే కొందరు సిలిండర్ ఎన్ని రోజులు వాడాలి? దాని ఎక్స్‌పయిరీ డేట్ ఏంటన్నది చాలామందికి అవగాహన ఉండదు. అయితే సిలిండర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దానిపై ఉండే ప్రత్యేక రకం కోడ్‌ను తప్పకుండా చెక్ చేసుకున్నాకే తీసుకోవాలి. ఇంతకీ ఆ కోడ్ ఏంటి? ఎక్స్‌పయిరీ డేట్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలు చూస్తుంటాం. అందుకే గ్యాస్ వాడకంలో కొన్ని జాగ్రత్లు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందుకే గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు సీలు తీసి, పరీక్షించి ఇవ్వమని తెచ్చిన వ్యక్తిని అడగండి లీకేజీ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. వంటగదిలోకి గాలి, వెలుతురు బాగా రావాలి. సిలెండర్‌ను షెల్ఫ్‌లో పెట్టి తలుపులు మూయడం లాంటివి చేయకండి. కాస్త చల్లదనం ఉండే చోటే పెట్టండి. కొంతమంది సిలెండర్‌ను కింద పెట్టి, ఆ పక్కనే స్టౌ పెట్టి వండేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. స్టౌ ఎప్పుడూ సిలెండర్ కంటే ఎత్తులోనే ఉండాలి. గ్యాస్ సిలెండర్‌కు ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుందని చాలామందికి తెలియదు. అందులో ఉండే కోడ్ నెంబర్లను బట్టి గడువు ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ కోడ్ అంటే ఏమిటి..? గ్యాస్ సిలిండర్ పైభాగంలో ప్రత్యేక కోడ్ రాసి ఉంటుంది. ఈ కోడ్ అక్షరాలు, సంఖ్యల రూపంలో ఉంటుంది. ఈ కోడ్ సిలిండర్ గడువు తేదీని సూచిస్తుంది. సిలిండర్‌పై రాసిన A, B, C, D..సంవత్సరంలో 12 నెలలను చూపిస్తుంది. ఈ సిలిండర్ ఎక్స్‌పయిరీ డేట్ గురించి చెబుతుంది.ఏడాదిలో 12 నెలలను నాలుగు భాగాలుగా విభజిస్తారు. A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి. B అంటే ఏప్రిల్, మే, జూన్. C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా సిలిండర్‌పై ఉండే ఏబీసీడీలు నెలలను సూచిస్తుంది. ఉదాహరణకు సిలిండర్లోపై A 23 అని రాసి ఉన్నట్లయితే ఈ సిలిండర్ గడువు 23- జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ముగుస్తుంది అని అర్థం. B 24 అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు ఏప్రిల్, మే, జూన్లలో ముగుస్తుందని అర్థం. దీన్ని బట్టి సిలిండర్ గడువు తేదీని అంచనా వేయొచ్చు. గడువు తేదీ దాటక సిలిండర్‌ను ఉపయోగించడం చాలా ప్రమాదం. సిలిండర్ పేలి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే తీసుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్ అయిపోయిన గ్యాస్ సిలిండర్‌ను తీసుకోరాదు. -
కేరళలో ఘోర అగ్ని ప్రమాదం..పలువురికి గాయాలు
కేరళలోని ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపార సంస్థల్లోని సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ అడ్నిమాపక సిబ్బంది, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని సివిల్‌స్టేషన్ సమీపంలోని వ్యాపార సంస్థల్లో శుక్రవారం హఠాత్తుగా సిలండర్ పేలుడంతో జరిగింది. దీంతో సంఘటన స్థలానికి సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. మంటలు మరింత వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న దుకాణంలోని గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. దీంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ ప్లగ్ నుంచి వైర్ ముక్క తలకు తగలడంతో మరోక వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. గాయపడ్డ బాధితులను అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేగాదు మిగతా దుకాణాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలకుండా వాటిని తక్షణమే తరలించారు అధికారులు. ఈ మేరకు సంఘటనాస్థలికి మరిన్ని అగ్నిమాపక యంత్రాలు చేరుకుని త్వరిత గతిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఈ ప్రమాదం బారిని పడ్డారనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు) -
మోదీ ఫొటోలు కనిపించాలా?.. నిర్మలా సీతారామన్‌గారూ ఇదిగో!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఫ్లెక్సీ ఏర్పాటు వ్యవహారం మరోసారి తెలంగాణను కుదిపేస్తోంది. టీఆర్ఎస్-బీజేపీల మధ్య మాటల తుటాలు పేల్చుకునేలా చేసింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి బీర్కూర్ పర్యటనలో ఉచిత బియ్యం పంపిణీ వద్ద ప్రధాని ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనుషులొచ్చి వాటిని ఏర్పాటు చేస్తారని.. తొలగించకుండా చూసుకునే బాధ్యత మీదే అంటూ కలెక్టర్ జితేశ్ పాటిల్‌కు సూచించారు కూడా. ఈ వ్యవహారంపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కూడా తీవ్రంగానే స్పందించారు. అయితే.. టీఆర్ఎస్ మాత్రం ఆమె చెప్పినట్లే చేసిందట!. వంటగ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రాలీలో.. గ్యాస్ బండలకు ప్రధాని మోదీ ఫొటోలను అంటించి ఉన్నాయ్. ఆ ఫొటోల మీద మోదీజీ.. రూ.1105 అని రాసి ఉంది. పైగా ఫొటోలో మోదీ గట్టిగా నవ్వుతున్నట్లు స్టిల్ ఉంది. ఇది టీఆర్ఎస్ సెటైర్ చేష్టలనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌గారూ.. మీరు చెప్పినట్లే చేశామా? అంటూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కొందరు ప్రస్తుతం ఈ వీడియోను స్ప్రెడ్ చేస్తున్నారు. You wanted pictures of Modi ji , Here you are @nsitharaman ji …@KTRTRS @pbhushan1 @isai_ @ranvijaylive @SaketGokhale pic.twitter.com/lcE4NlsRp5 — krishanKTRS (@krishanKTRS) September 3, 2022 గతంలో ప్రధాని మోదీ ఫ్లెక్సీల వ్యవహారం హైదరాబాద్‌ను కుదిపేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఉద్దేశించి బీజేపీ కార్యకర్తలు ‘సాలు దొర.. అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. కౌంటర్‌గా ‘సంపొద్దు మోదీ.. ’అంటూ టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నగరంలో. పలు సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ ఫ్లెక్సీలు ఉద్రిక్తతలకు దారి తీయడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని వాటిని తొలగించారు. ఇదీ చదవండి: అంతా మీ ఇష్టం అంటే నడవదు- నిర్మలా సీతారామన్ కౌంటర్ -
గ్యాస్ సిలిండర్‌కి ఎక్స్పైరీ తేదీ ఉంటుంది!..గడువు దాటితే ప్రమాదమే
బలిజిపేట: గ్యాస్ కనెక్షన్ కొనుగోలు చేసి వినియోగించడం ప్రస్తుతం ఎంత అవసరమో, దాని వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అందులో అత్యంత ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్‌కూ కాలపరిమితి ఉంటుందని తెలియకపోవడమే. గ్యాస్ సిలిండర్‌కు ఉండే కాలపరిమితిని సాధారణంగా ఎవరూ గమనించరని, కాలపరిమితి దాటితే పెనుప్రమాదం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ తేదీ ముగిసినా వినియోగిస్తే గ్యాస్ లీయయ్యే ప్రమాదం ఉందంటున్నారు. సరఫరా చేసే ప్రతి సిలిండర్‌పై ఎక్స్పైరీ సంవత్సరాన్ని, నెలను కోడ్ విధానంలో మెటల్ ప్లేట్‌పై వంటగ్యాస్ కంపెనీలు ముద్రిస్తాయి. సిలిండర్ మారుతున్నప్పుడల్లా ఎక్స్పైరీ గడువును చూసుకుని తీసుకోవడం, వినియోగించుకోవడం ఎంతో అవసరమని హితవు పలుకుతున్నారు. కాలపరిమితిని ఎలా గుర్తించాలంటే.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఆంగ్ల అక్షరంతో సంవత్సరం, నెల ఉంటుంది. దాని ప్రకారం అది ఏసంవత్సరం, ఏనెల తరువాత ఎక్స్పైరీ అవుతుందో తెలుస్తుంది. ఉదాహరణగా ఎ–24అని ఉంటే ఆ సిలిండర్ 2024 మార్చిలో ఎక్స్పైర్ అవుతుందని అర్థం. ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ఎ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు, బి అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అక్షరం జూలై నుంచి సెప్టెంబరు వరకు, డి అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు అని గుర్తించాలి. గడువును గుర్తించాలి సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేట్‌పై కోడ్ విధానంలో ఉండే ఎక్స్పైరీ గడువును గుర్తించి తీసుకోవాలి. అది నెల రోజులకు సమీపంలో ఉంటే అటువంటి సిలిండర్‌ను తీసుకోకూడదు. చిన్నచిన్న కుటుంబాలవారు, అతి తక్కువ వేతనం సంపాదించేవారు గ్యాస్ వినియోగం ఎక్కువ రోజులు చేస్తుంటారు. కనుక ఎక్స్పైరీ తేదీ లోపల వారి సిలిండర్ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అటువంటి సిలిండర్లతో ప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది. అందుకు గడువును గుర్తించి సిలిండర్ తీసుకోవాలి. దానిస్థానంలో వేరే సిలిండర్ అడిగే హక్కు వినియోగదారునికి ఉంది. సిలిండర్‌కు పదేళ్ల గడువు సిలిండర్ తయారైన నాటి నుంచి పదేళ్ల వరకు దానికి గడువు ఉంటుంది. సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో, లోపల భాగం సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎస్) ప్రమాణాలతో తయారుచేస్తారు. బీఐఎస్ అనుమతుల తరువాతే సిలిండర్ మార్కెట్లోకి వస్తుంది. గడువు ముగిసేవి ఉండవు గ్యాస్ సిలిండర్లు గడువు ముగిసేవి ఉండవు. ముందే వాటిని కండెమ్ సరుకుగా తీసివేస్తారు. తయారై వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు. పకడ్బందీగా చర్యలు ఉంటాయి. హర్ష, గ్యాస్ ఏజెన్సీ యజమాని, పలగర, బలిజిపేట మండలం (చదవండి: రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం) -
గ్యాస్ సిలిండర్‌కు దండలు వేసి..
సాక్షి, హైదరాబాద్: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనగా, సీఎల్పీ నేత భట్టి తన నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా గ్యాస్ సిలిండర్లకు దం డలు వేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాం గ్రెస్, ఫిషర్ మెన్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలకుండా ఉండాలంటే.. ఇవి పాటించాల్సిందే!
ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)తో వంట చేయడమే కనిపిస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన వంట గ్యాస్ వినియోగం నేడు గ్రామాల్లోనూ విస్తరించింది. ఎంతో ప్రాముఖ్యమున్న వంట గ్యాస్ వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. గ్యాస్‌తో ఆటలాడుకోవద్దనే వాదనను అందరూ వినిపిస్తుంటారు. ఎందుకంటే అది ప్రమాదవశాత్తు పేలితే ప్రాణ, ఆస్తి నష్టాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో వంట గ్యాస్ వాడకంపై వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. మహారాణిపేట(విశాఖ దక్షిణ): గ్యాస్ సిలిండర్ పేలుడు.. సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉన్నాయి. ఏదో మూల.. ఏదో ఒక ప్రాంతంలో గ్యాస్ ప్రమాదాల వార్తలు వింటూ ఉన్నాం. కేవలం అవగాహన లోపం... నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న గ్యాస్ సిలిండర్‌తో ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. చిన్న చిన్న జాగ్రత్తలు, గ్యాస్ వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించడం వంటి వాటితో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. చదవండి: హజ్ అరుదైన భాగ్యం.. ఈ నెల 31తో ముగియనున్న గడువు తూకాల్లో మోసాలు.. వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్స్ వెంట తప్పని సరిగా స్ప్రింగ్ త్రాసు ఉండాలనే నిబంధన ఉంది. గృహవసర సిలిండర్ లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు కలుపుకుని మొత్తంగా 29.500 కేజీలు ఉండాలి. మీకు సరఫరా చేస్తున్న సిలిండర్ బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణమే తూకం వేయించాలి. తూకం వేసేందుకు డెలివరీ బాయ్స్ నిరాకరిస్తే వెంటనే జిల్లా సరఫరా అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. మూడు దశల్లో రీ–క్యాలిబ్రేషన్ పరీక్ష గ్యాస్ సిలిండర్ల నాణ్యతకు సంబంధించి నిర్వహించే రీ–క్యాలిబ్రేషన్ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. ముందుగా విజువల్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇందులో సిలిండర్ పనికి రాదని తేలితే దాన్ని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. లేకపోతే హైడ్రాలిక్ పరీక్షలకు పంపుతారు. అక్కడ సిలిండర్లలో నీటిని నింపి 5 సార్లు ఫ్రెషర్ ద్వారా లీకేజీలను గుర్తిస్తారు. ఆ తర్వాత వాలు పరిస్థితిని గమనించి నిమాటి ఫ్రెషర్ పరీక్ష చేస్తారు. సిలిండర్లలో గాలి నింపి ఒత్తిడిని పెంచుతారు. అన్ని పరీక్షల్లో సిలిండర్ మంచిదని తేలితే దానిని ప్రజా వినియోగానికి అనుమతిస్తారు. ఈ పరీక్షను ఏడాదిలో 4 సార్లు నిర్వహించాలి. వంటగదిలో పాటించాల్సిన జాగ్రత్తలు.. ►వంటగదిలో తగినంత గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు ఏర్పాటు చేయాలి. ►గ్యాస్ స్టౌకు ఎదురుగా మాత్రం కిటికీ ఉండకూడదు. ►వంట గదిలో గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండాలి. కిరోసిన్, ఇతర మండే స్వభావం ఉన్న పదార్థాలు ఉంచకూడదు. ►అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్‌ను తొలగించడానికి వీలైనంత స్థలముండాలి. ►స్టౌవ్ పైభాగంలో అలమరాలు ఉండరాదు. ►మీ గ్యాస్ సిలిండర్‌ను ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కారం కాదు. ►గ్యాస్ స్టౌకు సంబంధించిన మరమ్మతులను డీలర్ వద్దగానీ, అనుభవం కలిగిన మెకానిక్ వద్దగానీ చేయించాలి. అంతే కానీ వ్యక్తిగత ప్రయోగాలు చేయరాదు. ► వంట చేసే సమయంలో పిల్లలను దగ్గరకు రానీయకూడదు. వంట చేసే సమయంలోనూ, స్టౌవ్ వాడకంలో ఉన్నప్పుడు వంట గదిలోనే ఉండాలి. కంపెనీల నిర్లక్ష్యం ఎల్పీజీ సిలిండర్ల వాడకంలో వినియోగదారుల మాట అటుంచితే కొన్ని చమురు సంస్థలు తమ కేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కాలం చెల్లిన సిలిండర్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వినియోగంలో దెబ్బతిన్న సిలిండర్లను మార్చడం లేదా, వాటికి మరమ్మతు లు చేయడంలో కంపెనీలు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి గ్యాస్ సిలిండర్లకు 7 సంవత్సరాల జీవిత కాలం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది పూర్తయితే వాటిని రీ–క్యాలీబ్రెషన్ పరీక్షకు పంపాల్సి ఉంటుంది. అంతా ఓకే అనుకుంటేనే దానిని మరో 5 సంవత్సరాల పాటు వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. గ్యాస్ వాసన వస్తుంటే... ♦ గ్యాస్ వాసన వస్తున్నట్టు అనిపిస్తే తక్షణమే రెగ్యులేటర్, తర్వాత స్టౌవ్ ఓపెన్‌ను ఆఫ్ చేయాలి. ♦ విద్యుత్ బోర్డులో స్విచ్‌లు వేయడం, తాకడం వంటివి చేయకూడదు. ♦ అన్ని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ♦ రెగ్యులేటర్‌ను వేరుచేసి సిలిండర్‌పైన సేఫ్టీ కప్ పెట్టి సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. ♦ గ్యాస్ లీకవుతున్నట్టు భావిస్తే ప్రమాదాల నివారణకు దగ్గరలోని అగి్నమాపక కేంద్రాలు, డీలర్లకు ఫోన్ చేయాలి. వినియోగంలో ఇవి తప్పనిసరి.. ♦ గ్యాస్ సిలిండర్ నాబ్కి కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్ వేసినవే తీసుకోవాలి. సీల్ బిగుతా లేకుండా ఊడిపోయినట్లు ఉంటే తిరస్కరించాలి. ♦ సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలి. పడుకోబెట్టడం.. పక్కకు వంచి ఉంచడం చేయరాదు. ♦ గ్యాస్ సిలిండర్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి. ♦ వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ కట్టేయాలి. లీకేజీ సమస్య రాకూడదంటే రెగ్యులేటర్ కట్టేసిన తర్వాత స్టౌపై మంటను అలాగే ఉంచి పరిశీలించాలి. దీని వల్ల ట్యూబులో ఉండే గ్యాస్ పూర్తిగా బయటకు వచ్చి మండిపోతుంది. ♦ సిలిండర్ వినియోగించని సందర్భంలో ప్లాస్టిక్ మూత పెట్టేయాలి. ఖాళీదైనా ఇలాగే చేయాలి. ♦ గ్యాస్ స్టౌని ఎప్పుడూ సిలిండర్ కన్నా ఎత్తులోనే ఉంచాలి. ♦ రెగ్యులేటర్‌కు మరో ట్యూబ్‌ను కలిపి మరో స్టౌకు జత చేయరాదు. ♦ రబ్బరు ట్యూబ్‌కు ఏ విధమైన కవర్ని తొడగరాదు. ♦ సిలిండర్‌ను గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ♦ గ్యాస్ సిలిండర్ కాలపరిమితిని సూచించే నంబర్‌ను పరిశీలించాలి. సిలిండరుకు అతికి ఉన్న ఊచల వెనుక వైపు ఈ నంబర్ ఉంటుంది. ♦ గ్యాస్ పరికరాలను ప్రతి రెండేళ్లకోసారి పరీక్షిస్తూ ఉండాలి. ♦ నాణ్యమైన స్టౌలు వాడాలి. వీటి వాడకం వల్ల ఏడాదికి రెండు సిలిండర్లు వరకు ఆదా చేయవచ్చు. ♦సిలిండర్‌కు రెగ్యులేటర్ బిగించే చోట ఒక రబ్బర్ వాచర్ ఉంటుంది. వాచర్ సరిగ్గా లేకపోతే రెగ్యులేటర్ బిగించిన తరువాత గ్యాస్ లీకవుతుంది. కాబట్టి డెలివరీ బాయ్స్ సిలిండర్ ఇచ్చినప్పుడు దానిపైన ఉన్న సీల్‌ను అతని ముందే తొలగించండి. వాచర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయాలని కోరండి. వారి వద్ద రెగ్యులేటర్ ఉంటుంది. దానిని సిలిండర్‌కు బిగించి పరిశీలిస్తారు. గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే రబ్బర్ వాచర్ మార్చి మరోసారి చెక్ చేస్తారు. సిలిండర్‌పై నంబర్లు పరిశీలించండి.. రీ–క్యాలీబ్రెషన్ పరీక్షకు సంబంధించి ప్రతి సిలిండర్‌పై భాగాన ఉన్న సపోర్టుల్లో ఏదో ఒక దానిపై లోపలి వైపున ఎబీసీడీల అక్షరాలతో ఒక కోడ్‌తో పాటు రెండు నంబర్లు సంవత్సరానికి సంబంధింనవి సూచిస్తారు. నాలుగు అక్షరాలు సిలిండర్‌కు పరీక్ష నిర్వహించాల్సిన నెల కోడ్‌ను సూచిస్తాయి. జనవరి నుంచి మార్చి వరకు–ఎ, ఏప్రిల్ నుంచి జూన్ వరకు–బి, జూలై నుంచి సెపె్టంబర్ వరకు–సి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు –డి కోడ్‌ను కేటాయించారు. ఉదాహరణకు సిలిండర్‌పై డి–20 అని ఉంటే డిసెంబర్ 2020లో ఆ సిలిండర్ జీవిత కాలం పూర్తవుతుందని అర్థం. ఈ విషయంలో గృహిణులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సీల్ లేకుండా డెలివరీ వద్దు గ్యాస్ సిలిండర్ డెలివరీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సిలిండర్‌కు తప్పని సరిగా సీల్ ఉంటుంది. సీల్ లేకుండా ఇచ్చే సిలిండర్లను ఎవరూ తీసుకోవద్దు. సీల్ లేకుండా డెలివరీ చేస్తే డెలివరీ బాయ్స్‌పై, గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్ అంతా తమ వెంట తూనిక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలి. వినియోగదారులు ఎవరైనా అడిగితే సిలిండర్ తూకం వేసి చూపించాలి. వినియోగదారుడి సమక్షంలో గ్యాస్ బాయ్‌లు సీల్ తీసి వాల్వు తనిఖీ చేయాలి. – రొంగలి శివప్రసాద్, రూరల్ డీఎస్వో, విశాఖపట్నం -
పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం
paytm cash back offer : పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. దీంతో సబ్సిడీ లేని సిలిండర్లను కొనుగులు చేయడం సామాన్యులకు కష్టంగా మారింది. అయితే పెరుగుతున్న సిలిండర్ల ధరల్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్కీమ్‌లను ప్రకటించింది. కొత్త, పాత కస్టమర్లకు వేర్వేరు ఆఫర్లు అందిస్తోంది. ♦ పేటీఎం తాజాగా '3పే 2700 క్యాష్ బ్యాక్ ఆఫర్' ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పేటీఎంలో కొత్తగా చేరిన కస్టమర్ మొదటి మూడు నెలల కాలంలో పేటీఎం ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే గరిష్టంగా రూ. 900ల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఒకేసారి మూడు కంపెనీలకు చెందిన మూడు సిలిండర్లు బుక్ చేస్తే ఏకంగా రూ. 2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ♦ ఇక ఇప్పటికే ఉన్న పేటీఎం కష్టమర్లు ఇండేన్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్‌కు చెందిన ఎల్పీజీ సిలీండర్లను బుక్ చేస్తే ప్రతి బుకింగ్ మీద 5000 వరకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అందిస్తోంది. ఈ పాయింట్లను పేటీఎంలో చేసే ఇతర షాపింగుల్లో ఈ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. ♦ పేటీఎం పోస్ట్ పెయిడ్ కష్టమర్లు ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని తర్వాత డబ్బులు చెల్లించవచ్చు -
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవదహనం
జైపూర్: రాజస్థాన్‌లో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును..లారీ ఢీకొట్టింది. దీంతో.. ఒక్కసారిగా తీవ్ర మంటలు వ్యాపించాయి. కాగా, సంఘటన స్థలంలోనే నలుగురు సజీవదహనయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 45 నిముషాల పాటు గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అజ్మీర్-జైపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై పెద్ద ఎత్తును ట్రాఫిక్ జామ్ అయ్యింది. -
ఇదో రకం దందా!
సంస్థాన్‌నారాయణపురం మండలం పల్లగట్టుతండా పంచాయతీకి చెందిన మేగావత్ దేవా చౌటుప్పల్‌లోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ లబ్ధిదారుడు. గ్యాస్ అయిపోవడంతో బుకింగ్ చేశాడు. తండాకు రోడ్డు బాగున్నా గ్యాస్ బండి వెళ్లడం లేదు. దీంతో దేవా తన తండా సమీపంలోని జనగాంలో ఓ దళారికి ఖాళీ సిలిండర్, గ్యాస్‌బుక్ ఇచ్చి వెళ్లాడు. సదరు దళారి అదనంగా కొంత మొత్తం తీసుకొని దేవాకు సిలిండర్ సమకూర్చాడు. ఈ పరిస్థితి దేవా ఒక్కడిదే కాదు.. మారుమూల గ్రామాలు, తండాలకు గ్యాస్ వాహనాలు వెళ్లపోవడంతో ఎంతోమంది లబ్ధిదారులపై అదనపు భారం పడుతుంది. సంస్థాన్ నారాయణపురం : జిల్లాలోని మారుమూల గ్రామాలు, తండాలకు వివిధ కారణాలతో వంట గ్యాస్ వాహనాలు వెళ్లడం లేదు. దళారులు ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని దందాకు తెరలేపుతున్నారు. ఏజెన్సీకి వెళ్లి గ్యాస్ తెచ్చుకోలేని లబ్ధిదారులకు తామే బుకింగ్ జేసి అందజేస్తున్నారు. అందుకు గాను ఒక్కో సిలిండర్‌పై రూ.100నుంచి రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు. దందా సాగుతుందిలా.. తండాలు, మారుమూల గ్రామాలకు రోడ్లు లేవని, ఉన్న చోట అధ్వానంగా ఉన్నాయని తదితర కారణాలు సాకుగా చూపి గ్యాస్ సరఫరా చేయడం లేదు. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెన్సీకి వెళ్లి తెచ్చుకోవాలంటే రోజంతా పడుతుండడం, అంతా వ్యవసాయ కూలీలు కావడంతోపనులు వదులుకొని పట్టణం పోలేని పరిస్థితి ఉంది. దీన్ని సమీప గ్రామాల్లోని దళారులు అవకాశంగా మల్చుకుంటున్నారు. తామే రీఫిల్ సిలిండర్లు సమకూరుస్తామని లబ్ధిదారుల నుంచి గ్యాస్ బుక్‌లు సేకరిస్తారు.వారి సెల్ఫోన్ల నుంచే బుకింగ్ చేస్తారు. గ్యాస్ ఏజెన్సీ వాహనం సిబ్బందితో కుమ్మక్కై వారికి ప్రతి నెలా కొంత ముట్టజెబుతారు. దీంతో సదరు వాహన సిబ్బంది రీఫిల్ గ్యాస్ సిలిండర్లను దళారి ఇంటి వద్ద వేసి వెళ్తారు. బుకింగ్ చేసి ఏజెన్సీ నుంచి తెప్పించి ఇచ్చినందుకు గాను దళారి ఒక్కో సిలిండర్‌పై రూ.100నుంచి రూ.200 వరకు అదనంగా తీసుకుంటాడు. ఇక గ్యాస్ కనెక్షన్ లేని వారికి దళారులు తమ వద్ద అక్రమంగా ఉన్న సిలిండర్‌ను రీఫిల్ చేయించి రూ.200 నుంచి రూ.250 వరకు అదనంగా వసూలు చేస్తారు. కొంతమంది దళారులు అమాయక లబ్ధిదారులు ఉంటే వారి ఏటీఎం కార్డులను తీసుకొని సిలిండర్‌పై వచ్చే సబ్సిడీని నొక్కేస్తున్నారు. చిన్నచిన్న హోటళ్ల నిర్వాహకులు కూడా కమర్షియల్ దళారుల వద్దనే కొనుగోలు చేస్తారు. ఈ విధంగా ఒక్కో దళారి నెలకు నెలకు 60నుంచి 70 వరకు సిలిండర్లు రీఫిల్ చేయిస్తూ రూ.15వేల వరకు సంపాదిస్తున్నారు. వానాకాలం, చలికాలం సంపాదన ఎక్కువగా ఉంటుందని లబ్ధిదారులు అంటున్నారు. నిబంధనలు గాలికి జిల్లాలో వివిధ గ్యాస్ కంపెనీలకు చెందిన 19 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉనాయి. ఏజెన్సీలు నింబంధనల ప్రకారం గ్యాస్ బుకింగ్ చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లకు సిలిండర్ తీసుకెళ్లి ఇవ్వాలి. రవాణా ఖర్చులు తీసుకుంటున్నా అందించడం లేదు. గ్యాస్ ఏజెన్సీలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల తండాలు, మారుమూల ప్రాంతాల్లో లబ్ధిదారులకు అదనపు బారం తప్పడం లేదు.గ్యాస్ కనెక్షన్లు ఇలా.. జిల్లాలో వివిధ గ్యాస్ కంపెనీలకు చెందిన 19 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2,31,283 కనెక్షన్లు ఉన్నా యి. ఇందులో సీఎస్ఆర్ 23,566, డొమస్టిక్ 1,43,645, కమర్షియల్ 2288, దీపం 48,950, ఉజ్వల పథకం కనెక్ష న్లు 12,384 ఉన్నాయి. -
వంటగ్యాస్ కొరత.. బిల్లు జనరేటర్ అవుతున్నా
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సిటీలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. రోజురోజుకు బుకింగ్‌లు పెరుగుతుండడంతో పెండెన్సీ పెద్ద సంఖ్యకు చేరింది. కుటుంబ సభ్యులందరూ ఇంటి గడప దాటక పోవడంతో గృహాల్లో వంటగ్యాస్ వినియోగం భారీగా పెరుగుతున్నది. ఫలితంగా ముందు జాగ్రత్తగా గ్యాస్ బుకింగ్‌లు పెద్దఎత్తున చేస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ నేపథ్యంలో డెలివరీ బాయ్స్ లేక కూడా గ్యాస్ సరఫరా తగ్గుముఖం పట్టింది. ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేయగానే మొబైల్ లకు బుకింగ్, మరుసటి రోజు బిల్లు జనరేట్, త్వరలో సిలిండర్ డెలివరీ జరుగుతుందని సంక్షిప్త సమాచారం వస్తుందే తప్ప.. డోర్ డెలివరీ మాత్రం పత్తా లేక పోవడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డబుల్ సిలిండర్ వినియోగదారులు కొంత వేచి చూస్తుండగా, సింగిల్ సిలిండర్ వినియోగదారుల పరిస్ధితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక చేసేది లేక వంటగ్యాస్ వినియోగదారులు ఖాళీ సిలిండర్‌తో ఏజెన్సీ, గోదాములకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల నగరంలోని టోలిచౌకితో పాటు పాతబస్తీలోని డబీర్‌పురాలో కూడా వినియోగదారులు ఏజెన్సీల ముందు బారులు తీరారు. కనెక్షన్లు ఇలా.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లాలో ప్రధాన చుమురు సంస్ధలకు చెందిన సుమారు 28 లక్షల వరకు గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వినియోగంలో మాత్రం 26.21 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 60 శాతం వరకు సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, మిగితా 40 శాతం డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజు మూడు ప్రధాన కంపెనీలకు చెందిన సుమారు 80 వేల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా జరుగుతాయి. వాస్తవంగా ఒక్కో కంపెనీకి చెందిన ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్లో ప్రతిరోజు సుమారు 60 వేల సిలిండర్ల చొప్పున రీఫిల్ జరిగితే అందులో సగం సిలిండర్లు డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అవుతాయి. డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్ బుకింగ్ ఆధారంగా రెండు మూడు రోజుల్లో డెలివరీ చేస్తూ వస్తున్నారు. తాజాగా లాక్డౌన్ ఫలితంగా చమురు సంస్ధల యూనిట్స్‌లలో రీఫిలింగ్ కూడా తగ్గు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. బాయ్స్ కొరతతో వినియోగదారులకు సరఫరా మొక్కుబడిగా సాగుతుండటంతో గోదాముల్లో సిలిండర్ల నిల్వలు తగ్గిన పరిస్థితి నెలకొంది. పెండింగ్ కాల్స్ పైపైకి.. నగరంలో మూడు ప్రధాన చమురు సంస్థలకు వంట గ్యాస్ పెండింగ్ కాల్స్ జాబితా రోజురోజుకు పైపైకి ఎగబాగుతూనే ఉంది. గత వారంలో రోజుల్లో ఒక్కో చమురు సంస్థకు రెండు లక్షలకు పైగా బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ వినియోగం పెరగడంతో పాటు లాక్ డౌన్ ఇంకా కొనసాగితే.. కొరత ఏర్పడుతుందే మోనన్న భయంతో అవసరం లేకున్నా కొందరు ముందస్తుగానే బుక్ చేసుకోవడం, మరి కొందరు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముందస్తుగా ఒక సిలిండర్‌ను అందుబాటులో ఉంచుకునేందుకు ప్రయత్నించడంతో కాల్స్పెరిగి పోయినట్లు తెలుస్తోంది. అయితే అనవసర బుకింగ్‌ను కట్టడి చేసేందుకు 14 రోజుల వ్యవధికి నిబంధను అమలు చేసేందుకు చమురు సంస్ధలు సిద్దమైనట్లు తెలుస్తోంది. కొరత లేదు...ఆందోళన వద్దు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎమర్జెన్సీ సర్వీసుల కింద వంటగ్యాస్ సరఫరా జరుగుతుంది. వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదు. వినియోగదారులు ఆందోళన చెందవద్దు. అవసరం ఉంటేనే సిలిండర్లు బుక్ చేసుకోవాలి. సోషల్ డిస్టెన్స్‌లో భాగంగా వినియోగదారులు, అపార్ట్మెంట్ వాసులు, గేటెడ్ కమ్యూనిటీ వర్గాలు డెలివరీ బాయ్స్‌కు సహకరించాలి. – అశోక్ కుమార్, అధ్యక్షుడు, వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్, హైదరాబాద్ -
అంతా మా ఇష్టం
నెల్లూరు(పొగతోట) : ఇంటింటికి వంట గ్యాస్‌ను డెలివరీ చేసే సిబ్బంది ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. రవాణా చార్జీల పేరుతో డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి సిలిండర్‌పై అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. సిలిండర్ ధర రూ.847లు ఉంటే రూ.900లు చార్జీ చేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారుగా రవాణా చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ.3 కోట్లు వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు సమాచారం. గ్యాస్ రవాణాకు సంబంధించి పైసా కూడా చెల్లించవద్దని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వినియోగదారులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రవాణా చార్జీల పేరుతో గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్న అక్రమ సంపాదనలో అధికారులకు కూడా వాటాలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అక్రమ వసూళ్లపై ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కొన్ని ఘటనలు.. ♦ జనార్ధన్రెడ్డికాలనీకి చెందిన మస్తాన్ వారం రోజుల కిందట గ్యాస్ బుక్ చేశాడు. ఈ నెల 18వ తేదీన గ్యాస్ డెలివరీ సిబ్బంది సిలిండర్ ఇచ్చాడు. స్లిప్పై రూ.847 నమోదు చేసి ఉంది. డెలివరీ బాయ్ మాత్రం రూ.900లు వసూలు చేశాడు. అదేమని మస్తాన్ ప్రశ్నిస్తే రవాణా చార్జీ అని సమాధానం చెప్పాడు. ♦ ములాపేటకు చెందిన వెంకటేశ్వర్లు గ్యాస్ బుక్ చేశాడు. ఈనెల 18వ తేదీన గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చారు. సిలిండర్‌కు రూ.900లు వసూలు చేశారు. అదేమని ప్రశ్నిస్తే రవాణా చార్జీలని సమాధానం ఇచ్చారు. దూర ప్రాంతాలకు ఆటోలో గ్యాస్ సిలిండర్లు తీసుకురావాలి, పనిచేస్తున్న వారికి భోజనం పెట్టి రోజుకు రూ.300లు ఇవ్వాలని, దాని వలనే సిలిండర్‌పై రూ.50 వసూలు చేస్తున్నామని సమాధానం చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లా వ్యాప్తంగా 80కి పైగా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 8.90 లక్షలకు పైగా గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 18 నుంచి 20 వేల సిలిండర్లు డెలివరీ జరుగుతోంది. నెలకు ఆరు లక్షలకు పైగా సిలిండర్లు వినియోగదారులకు అందజేస్తున్నారు. సిలిండర్‌కు రూ.50 చొప్పున రవాణా పేరుతో నెలకు రూ.3 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారు. గా>్యస్ సిలిండర్లు అధికంగా మహిళలే తీసుకుంటారు. స్లిప్పై ఎంత ఉంటుందో పరిశీలించరు. స్లిప్పై సంతకం పెట్టి గ్యాస్ డెలివరీకి వచ్చిన వారు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. తనిఖీలు లేకపోవడంతోనే.. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడంతో గ్యాస్ ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వసూళ్లపై ఫిర్యాదు చేస్తే సిలిండర్లు సక్రమంగా ఇవ్వరని వినియోగదారులు భయపడుతున్నారు. 15 కిలోమీటర్ల లోపు వరకు సిలిండర్ డెలివరీ ఉచితంగా చేయాల్సి ఉంది. నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో ఏజెన్సీలు రవాణా పేరుతో వినియోగదారుల నుంచి అధికంగా వసూళ్లు చేస్తున్నారు. రవాణా చార్జీలు చెల్లించనవసరం లేదు ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ల డెలివరీకి సంబంధించి అదనపు వసూళ్లు చేయకూడదు. వినియోగదారుల స్లిప్పై ఎంత ధర ఉంటే అంత వరకు మాత్రమే ఇవ్వాలి. సిలిండర్లను ఉచితంగా రవాణా చేయవలసి ఉంది. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.– బాలకృష్ణారావు, డీఎస్ఓ -
నిరుపేదలకు వెసులుబాటు
బొబ్బిలి: నిరుపేదలకు గ్యాస్ బండలు విడిపించుకోవడంలో ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారికి వెసులు బాటు కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ కంపెనీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో గిరిజన, గిరిశిఖర ప్రాంతాలకే కేటాయించిన 5 కిలోల సిలిండర్లను ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెస్తున్నాయి. జిల్లాలోని ఆయా ఏజెన్సీల ద్వారా పేదలు పొందిన గ్యాస్ కనెక్షన్లకు ఈ సిలిండర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం జిల్లాలోని నిరుపేదలయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చారు గానీ... విడిపించుకునేందుకు వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యలను గుర్తించి వారికి అందుబాటులో ఉండే ధరల్లో సరఫరాచేయాలని భావిస్తున్నారు.ఇప్పటికే ఇటువంటి జాబితాలను ఆయా గ్యాస్ ఏజెన్సీలకు పంపించారు. ఆ జాబితాల్లో కొన్ని పేర్లు ఉండగా మరికొన్ని పేర్లను గుర్తించి వెంటనే గ్యాస్ కనెక్షన్లకు 5 కిలోల సిలిండర్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకునే... జిల్లా వ్యాప్తంగా 26 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా దీపం, సీఎస్ఆర్, ఉజ్వల, సాధారణ గ్యాస్ కనెక్షన్లు 5,50,000 ఉన్నాయి. అందులో ఎస్టీలు, ఎస్సీలు పొందిన కనెక్షన్లు అధికంగా ఉన్నప్పటికీ సిలిండర్ ధర రూ.703లు ఉండటంతో పేదలు విడిపించుకోలేకపోతున్నారు. ఇందుకోసం వారికి రెండేసి సిలిండర్లను ఇచ్చి గ్యాస్ కొనుగోలుకు వీలుగా రూ.253లకు 5కిలోల గ్యాస్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి కోసం ప్రస్తుతం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద వారికే ఈ సిలిండర్లు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినప్పటికీ పెద్ద మొత్తం వెచ్చించి గా>్యస్ విడిపించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈజీ గ్యాస్ కార్డులు.. గతంలో పుస్తకాలతో గ్యాస్ విడిపించుకునే వారు. ఇప్పుడు కొంత కాలంగా ఈజీ గ్యాస్ స్మార్ట్ కార్డులను పరిచయం చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లోని నిరుపేదలకు కూడా ఈ ఈజీ గ్యాస్ కార్డులు, 5 కిలోల సిలిండర్లతో వినియోగం పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. 5 కిలోల సిలిండర్లకు ప్రాధాన్యత: ఇప్పటికే ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించిన ప్రభుత్వం ఇప్పుడు విడిపించుకోలేని పేదలను గుర్తించి వారికి 5 కిలోల గ్యాస్ సిలెండర్లను అందించాలని ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం తామే అటువంటి వారిని గుర్తించి చిన్న సిలిండర్లను అందించే చర్యలు ప్రారంభించాం. ప్రతీ ఒక్కరూ తమ ఫోన్ నంబర్‌ను గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్‌కు అందించాలి. దీనివల్ల వారికి అప్డేట్స్ ఇవ్వడం సులువవుతుంది. – జలగం ప్రసాదరావు, వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ -
‘బండ’పై బాదుడు
సాక్షి, సిటీబ్యూరో: గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. గ్రేటర్లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.733.50. ఇది బిల్లుపై సైతం స్పష్టంగా ఉంటుంది. కానీ సిలిండర్‌ను డోర్ డెలివరీ చేసే బాయ్స్ మాత్రం వినియోగదారుల నుంచి రూ.760 వసూలు చేస్తున్నారు. అంటే ఇది నిర్ణీత ధర కంటే రూ.26.50 అదనం. దీంతో వినియోగదారులు నిండా మునుగుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల నిర్లక్ష్య వైఖరితోనే ఈ పరిస్థితి తలెత్తింది. గ్యాస్ ధర, పన్నులు, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ) తదితర కలుపుకొనే డిస్ట్రిబ్యూటర్లు బిల్లింగ్ చేసి, వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే చమురు సంస్థలు నిర్దేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు ఏజెన్సీలు వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కొందరు నామమాత్రంగా వేతనాలు ఇస్తుండగా, మరికొందరు సిలిండర్ డెలివరీపై కమీషన్ అందజేస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం బాయ్స్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని కూడా వినియోగాదారులకు చూపించాలి. నిబంధనలివీ... ♦ ఆన్లైన్లో ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకున్న అనంతరం బిల్ జనరేట్ అయిన తర్వాత డోర్ డెలివరీ చేయాలి. ♦ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా డోర్ డెలివరీ చేయాలి. 6–15 కిలోమీటర్ల దూరం ఉంటే రవాణ చార్జీలకు గాను రూ.10 వసూలు చేయాలి. 16–30 కిలోమీటర్ల దూరం ఉంటే రూ.15 తీసుకోవాలి. ♦ ఒకవేళ వినియోగదారుడు గ్యాస్ గోదాముకు వెళ్లి సిలిండర్ తీసుకుంటే బిల్లులో రూ.8 తగ్గించాల్సి ఉంటుంది. గ్రేటర్లో ఇదీ లెక్క వంటగ్యాస్ వినియోగదారులు 26.80 లక్షలు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు 115 ప్రతిరోజు బుకింగ్ 90వేలు ప్రతిరోజు సరఫరా 60వేలు డెలివరీ బాయ్స్ 1250మంది -
గ్యాస్ సిలిండర్‌పై ‘చిల్లర’ దోపిడీ
సాక్షి, కర్నూలు(సెంట్రల్) : నంద్యాలలోని ఓ గ్యాస్ ఏజెన్సీ బాయ్ సిలిండర్‌ను డెలివరీకి తెచ్చిన సమయంలో రూ.50 అదనంగా ఇవ్వాలని ఓ మహిళను అడిగాడు. ఎందుకివ్వాలని ఆమె ప్రశ్నించింది. కచ్చితంగా ఇవ్వాల్సిందేనని బాయ్ దబాయించాడు. విధిలేని పరిస్థితుల్లో ఆమె రూ.30 ఇచ్చి గ్యాస్ సిలిండర్‌ను తీసుకుంది. ఈ విషయాన్ని బాయ్ మనసులో పెట్టుకుని అక్టోబర్ ఒకటో తేదీన గ్యాస్ బుక్ చేసినా ఇప్పటి వరకు సిలిండర్ తీసుకురాలేదు. ఏజెన్సీ ఆఫీసుకు ఫోన్ చేస్తే ‘మీ గ్యాస్ నంబర్ మీద ఇంకా బిల్లింగ్ కాలేదు. రేపు వస్తుంది. గ్యాస్ డెలివరీ బాయ్‌తో ఎందుకు గొడవపడ్డారు. అతను అడిగిన డబ్బు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?’ అంటూ ఫోన్ పెట్టేశారు. కర్నూలులోని ఓ ఏజెన్సీలో బుధవారపేటకు చెందిన మహిళ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసి.. ఆన్లైన్లో బిల్లు చెల్లించింది. ఆ మరుసటి రోజు డెలివరీ బాయ్ సిలిండర్ తీసుకొచ్చాడు. ఆ మహిళ ముందుగానే బిల్లు చెల్లించి ఉండడంతో ఖాళీ సిలిండర్‌ను ఇంటి బయట పెట్టి ఆఫీసుకు వెళ్లిపోయింది. బాయ్ ఆమెకు ఫోన్ చేశాడు. మీరు రెండో అంతస్తులో ఉన్నారు కాబట్టి రూ.50 డెలివరీ చార్జీ ఇవ్వాలని అడిగాడు. మొత్తం బిల్లులోనే చెల్లించాను కదా అని ఆమె ప్రశ్నించింది. రూ.50 ఇస్తేనే సిలిండర్‌ను ఇక్కడ పెట్టిపోతా.. లేదంటే ఏజెన్సీకే వచ్చి తెచ్చుకోండంటూ వెనక్కి తీసుకెళ్లాడు. జిల్లాలో గ్యాస్ డెలివరీ బాయ్‌ల వ్యవహారం వినియోగదారులకు తలనొప్పిగా మారింది. డబ్బు ఇస్తేనే సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. ఉచితంగా దింపాల్సిన సిలిండర్‌కు ముక్కుపిండి కనీసం రూ.30 డెలివరీ చార్జీని అనధికారికంగా వసూలు చేస్తున్నారు. అపార్టుమెంట్లలో అంతస్తు పెరిగే కొద్దీ రేటు కూడా పెంచుతున్నారు. ఎవరైనా ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే..వారికి వచ్చే నెలలో సిలిండర్ డెలివరీ చేయకుండా వేధిస్తున్నారు. ఇలా దోపిడీ చేసిన మొత్తంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకూ వాటా వెళుతోంది. ఈ వ్యవహారం తెలిసినా పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వినియోగదారులపై రూ.3.5 కోట్ల భారం జిల్లాలో 73 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏడు లక్షలకు పైగానే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. భారత్, హెచ్‌పీ, ఐఓసీ కంపెనీలు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం వినియోగదారులకు సిలిండర్లను డెలివరీ చేసేందుకు ఏజెన్సీలే వాహనాలు, బాయ్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. బాయ్స్‌కు వారే జీతాలివ్వాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులు ఇక్కడే ట్రిక్కు ప్లే చేస్తున్నారు. సొంతంగా ఆటోలున్న వారికి సిలిండర్ల డోర్ డెలివరీ బాధ్యతను అప్పగిస్తున్నారు. ఆటోకు బాడుగ గానీ, డెలివరీ బాయ్‌కు వేతనం గానీ చెల్లించరు. ఆటో యజమానే వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలి. ఇదే అదనుగా వారు దోపిడీ చేస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు అయితే ఆటో యజమానులే ఎదురు చెల్లించి మరీ ఒప్పందం చేసుకుంటున్నారు. తర్వాత సిలిండర్‌పై రూ.30 నుంచి రూ.60 వరకు అదనంగా వసూలు చేసుకుని గిట్టుబాటు చేసుకుంటున్నారు. జిల్లాలోని వినియోగదారుల నుంచి నెలకు సగటున రూ.3.50 కోట్ల వరకు డెలివరీ బాయ్స్ దోపిడీ చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు చిల్లర దోపిడీ గురించి పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదు. నెలవారీగా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎక్కడైనా బాయ్స్ డెలివరీ కోసం డబ్బు వసూలు చేస్తే తమకు చెప్పాలని పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం తప్పా ఎక్కడా డెలివరీ తీరును పరిశీలించడం లేదు. వారు కార్యాలయాలను వదిలి సిలిండర్ల డెలివరీ సమయంలో మెరుపు దాడులు నిర్వహిస్తే దోపిడీ బాగోతం బయటకు వస్తుంది. ఫిర్యాదులు వస్తే స్పందిస్తున్నాం గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఐదు కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుమూ వసూలు చేయరాదు. అలా చేస్తే మాకు ఫిర్యాదు చేయాలి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నాం. 5 నుంచి 15 కిలోమీటర్ల వరకు సిలిండర్‌పై రూ.20, ఆపైన దూరం ఉంటే రూ.30 వసూలు చేయాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. వీటిని ఏజెన్సీలు విధిగా పాటించాలి. – పద్మశ్రీ, జిల్లా పౌరసరఫరాల అధికారి నిబంధనలు ఇవీ.. గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఐదు కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుమూ వసూలు చేయరాదు. 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు సిలిండర్‌పై రూ.20లు, 15 కిలోమీటర్లు దాటితే రూ.30 వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. ఐదు కిలోమీటర్లలోపే సిలిండర్లు డెలివరీ అవుతున్నా..ఒక్కో దానిపై కనీసం రూ.30 డెలివరీ చార్జీ వసూలు చేస్తున్నారు. అదే అపార్టుమెంట్లలో అయితే అంతస్తుకు రూ.15 చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. ఉదాహరణకు మొదటి అంతస్తులోకి సిలిండర్ డెలివరీ చేయాలంటే రూ.45, రెండో అంతస్తు అయితే రూ.60 అధికంగా వసూలు చేస్తున్నారు. -
భోజన పథకానికి గ్యాస్ ‘మంటలు’..!
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేసే మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. రాయితీపై సిలిండర్లు సరఫరా చేయకపోవడం, కనెక్షన్ల కోసం పాఠశాల నిర్వహణ నిధులు వినియోగించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు, భోజన నిర్వాహకుల సంఘాలు తప్పుబడుతున్నాయి. గ్యాస్‌పై వంట చేయడం భారం కావడంతో వంట నిర్వాహకులు స్టౌవ్‌లను మూలకు చేర్చుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 2,635 పాఠశాలల్లో కర్రలపైనే వంటలు సాగుతున్నాయి. భోజన వంటకాలు గ్యాస్ పొయ్యిలపై చేయాలనే కలెక్టర్ ఉద్దేశం మంచిదే అయినా అమలులో చిత్తశుద్ధి లోపించింది. ఇదీ పరిస్థితి... పదేళ్ల కిందట జిల్లాలోని 800 ప్రాథమిక పాఠశాలలకు గ్యాస్ స్టౌవ్(సింగిల్ పొయ్యి)లను పంపిణీ చేశారు. గ్యాస్ సిలిండర్లను రాయితీపై సరఫరా చేయకపోవడంతో వంటలు భారమయ్యాయి. దాదాపు అన్ని పాఠశాలల్లోని స్టౌవ్లూ మూలకు చేరాయి. వీటి కోసంఅప్పట్లో సుమారు రూ.30 లక్షలు సర్వశిక్షా అభియాన్ నిధుల కేటాయించినా ఫలితం లేకపోవడం గమనార్హం. దీనిని చక్కబెట్టకుండానే గత ఏడాది జిల్లాలో స్కూల్ నిర్వహణ నిధులు వస్తున్న 2,635 పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లను బలవంతంగా అంటగట్టారు. గ్యాస్ కనెక్షన్ కోసం అవసరమైన నిధులను ప్రత్యేక గ్రాంట్ల నుంచి కాకుండా ఆయా పాఠశాలల గ్రాంట్ల నుంచి ఎస్ఎస్ఏ యంత్రాంగం నేరుగా తీసుకుంది. ఒక్కో పాఠశాల అకౌంట్ల నుంచి రూ.2,600 వంతున రూ.67.3 లక్షల మొత్తంగా గ్యాస్ ఏజెన్సీలకు చెల్లిందించి. కనెక్షన్ అయితే ఇచ్చారు గానీ స్టౌవ్ కొనలేదు. ఇప్పటికే ఉన్న నిధులు తీసుకుపోవడంతో ఖాతాల్లో సొమ్ములు లేవని సుమారు 1500 స్కూళ్లు స్టౌవ్‌లు కొనుగోలు చేయని పరిస్థితి అప్పట్లో ఏర్పడింది. స్టౌవ్‌లు కొనుగోలు చేసిన పాఠశాలల్లో రాయితీ సిలెండర్ పంపిణీపై రాతపూర్వక ఆదేశాలు రాకపోవడంతో వాటి వాడకం కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో గ్యాస్ వాడకం పేరుతో స్కూళ్ల నిధుల నుంచి తీసుకున్న రూ.67.3 లక్షలు బూడిదపాలయ్యాయి. వినియోగానికి దూరం... గృహావసరాల సిలెండర్‌ను పాఠశాలలకూ సరఫరా చేస్తామని చెబుతున్నా ఆచరణ శూన్యమే అయ్యింది. దీంతో ప్రస్తుతం వాణిజ్య వినియోగంలోనే రూ.950 ధరతో సిలెండర్లను కొనాల్సిన పరిస్థితి. భోజన పథకానికి వచ్చే నిధులు చాలకపోవడంతో కట్టెలనే వాడాల్సి వస్తోందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. నెలకు సరిపడే సంఖ్యలో రాయితీపై సిలెండర్లను ఇప్పించాలంటే జిల్లా యంత్రాంగం నుంచి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలి. అలాంటి చర్యలు ఏవీ తీసుకోకుండా అమలు సాధ్యంకాదని ఉపాధ్యాయులు వాఖ్యానిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీతోపాటు ఆదర్శపాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు కలిపి 335 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇలాంటి పాఠశాలకు సిలెండర్ల సమస్య తప్పక ఎదురవుతుంది. నిబంధనల మేరకు గృహావసరాల సిలెండర్ కావాలంటే 21 రోజులైతే కాని రాయితీతో ఇచ్చే పరిస్థితి లేదు. వందల మంది విద్యార్థులున్న పాఠశాలలకు నెల పొడువునా 15 సిలెండర్లు కనీసం అవసరం పడతాయి. వీటి అమలు సాధ్యం కాదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రాతపూర్వక ఆదేశాలు రావాలి పాఠశాలలల్లో మధ్యాహ్న భోజన వంటల కోసం గ్యాస్ కనెక్షన్లను కలెక్టర్ మంజూరు చేశారు. ఎస్ఎంసీ నుంచి సేకరించిన నిధులను వెచ్చించాం. రెగ్యులర్‌గా సిలెండర్ గ్యాస్ కొనుగోలును ఆయా పాఠశాలల మధ్యాహ్న భోజన మెస్ చార్జీల నుంచి కేటాయించుకోవాలి. రాయితీ సిలెండర్లపై రాతపూర్వక ఆదేశాలు ఇంకారాలేదు. ఆర్థికంగా భారం కాకూడదని సిలెండర్ కేటగిరీని గృహావసరాలకు అనుమతి ఇచ్చారు. – డాక్టర్ బీ.శ్రీనివాసరావు, పీఓ, ఎస్ఎస్ఏ రాయితీ సిలెండర్లపై స్పష్టత తప్పనిసరి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటకు గ్యాస్ కనెన్షన్ ఇచ్చారు. నెలకు సరిపడినన్ని గ్యాస్ సిలెండర్ల పంపిణీని రాయితీపై ఇవ్వడం లేదు. ఇవ్వగలిగితే అందుకు అవసరమైన చట్టబద్ధమైన ఆదేశాలను గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వాలి. గ్యాస్ స్టౌవ్‌లు సాధారణమైనవి కాకుండా ఎక్కువ మందికి వండగలిగే పెద్ద స్టౌవ్‌లను విధిగా ఇవ్వాలి. ఇలాంటి సమ్యలన్నింటినీ అధిగమించకపోతే గ్యాస్ కనెక్షన్లు వృథాగా పడి ఉంటాయి.– టి.సన్యాసిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రధానోపాధ్యాయ సంఘం -
‘కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు’
ఇచ్చోడ(బోథ్): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రజాఫ్రంట్ ఉమ్మడి అభ్యర్థి సోయం బాపూరావు అన్నారు. శుక్రవారం మండలంలోని జామిడి, గెర్జం, చించోలి, నర్సపూర్, దర్మంపూరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఇస్లాంపూర మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నర ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఎన్నికలలో ఎదుర్కొనే శక్తి లేకనే కొందరు నాయకులు స్వార్థం కోసం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ సోయం బాపూరావు కానీ గిరిజనేతరులకు వ్యతిరేకం కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల అండ ఉందన్నారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తుందని తెలిపారు. ఉచితంగా ప్రతీ కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు, ప్రతీ ఇంట్లో ఇద్దరికి రూ.2 వేల పింఛన్లు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్‌జాదవ్, కాంగ్రెస్ నాయకులు మల్లెపూల నర్సయ్య, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు బుర్గుల మల్లెష్, నాయకులు బత్తుల అశోక్, సాగర్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, రవి, శంశొద్దీన్, తెలంగాణ పట్టభద్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెం ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇకపై నో సిలిండర్
తిరువొత్తియూరు: చెన్నైలో ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసేందుకు ఆయిల్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనిపై ఆయిల్ సంస్థ నిర్వాహక అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటి ఉపయోగానికి, హోటళ్లకు వేర్వేరు పరిమాణంలో ఉన్న సిలిండర్లలో వంటగ్యాస్‌ను డోర్ డెలివరీ చేస్తున్నారు. తమిళనాడులో కోటిమందికి పైగా వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నూరులో సహజవాయువు పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు పూర్తయిన వెంటనే చెన్నైలో ఇళ్లకు పైప్‌లైన్ ఏర్పాటుచేసి వంటగ్యాస్ సరఫరా చేసేందుకు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇళ్లకు ప్రత్యేకంగా మీటర్లు బిగించి వంటగ్యాస్ వినియోగించిన మేరకు నగదు వసూలు చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా సిలిండర్లకు బుకింగ్ చేయడం, ఆలస్యం వంటి సమస్యలు ఉండవన్నారు. -
మీ సిలిండర్ పై డేట్ చూసుకున్నారా..
సత్యవేడు: మనం వినియోగించే ప్రతి వస్తువుకూ కాలపరిమితి ఉంటుంది, అలాగే నిత్యం వంట గదిలో మనం ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌కూ గడువు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. కాలం చెల్లిన సిలిండర్‌ను వినియోగించడం ప్రమాదకరం. అందుకే ఆలాంటి కాలపరిమితి తేదీని గుర్తించడం ఎలాగో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముందుగా సిలిండర్ గడువు తేదీని గుర్తించాలి. సిలిండర్‌పై ఉన్న రింగ్‌కు కింద భాగంలో మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వెనుక సిలిండర్ గడవు తేదీ ముద్రించి ఉంటుంది. రింగ్‌కు కింద భాగంలోలో బద్దె పై ముద్రించి ఉన్న తేదీల్లో ఏడాదిలోని 12 నెలలను నాలుగు భాగాలుగా విభజించి ప్రతి మూడు నెలలకు ఒక ఆంగ్ల అక్షరం చొప్పున రాసి ఉంటుంది. నిల్వవుంచే సిలిండర్లు ప్రమాదం.. కొందరు సిలిండర్లు కొన్న తర్వాత నెలలు తరబడి వాడకుండా నిల్వ ఉంచుతారు. మరి కొందరు బ్లాక్‌లో కొని మరీ వాడుతుంటారు. అయితే సిలిండర్లపై గుర్తించిన గడువు తేదీలోగా వాడితేనే ఉత్తమం, కాలం చెల్లిన సిలిండర్లను వాడకం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సిలిండర్లను సంబంధిత డీలర్‌కు వాపస్ చేయాలి. ముఖ్యంగా సిలిండర్ తీసుకున్న తేదీ నుంచి వాడుకునే తేదీ నాటికి గడువు నెలను గమనించి వాడుకోవాలి. -
గ్యాస్ బుకింగ్ వయా ఫేస్బుక్, ట్విటర్
న్యూఢిల్లీ : ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా?. అయితే, మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ విధానంలో సిలిండర్‌ను బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు!. డిజిటలైజేషన్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫేస్బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కల్పించింది. ఫేస్‘బుక్’లో ఇలా.. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన అనంతరం ఐఓసీఎల్ అధికారిక పేజీ (@indianoilcorplimited)కి వెళ్లి, అక్కడ కనిపిస్తున్న బుక్ నౌ (Book Now) అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. తర్వాత మీ వివరాలను నింపితే సరి. ట్విటర్లో ఇలా.. ట్విటర్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయానికొస్తే, లాగిన్ అయిన అనంతరం refill @indanerefill అని ట్వీట్ చేయాల్సి వుంటుంది. అయితే, ట్విటర్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవడం తొలిసారైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం register LPGID అని ట్వీట్ చేయాలి. సామాజిక మాధ్యమాల వినియోగం విస్తృతమవుతున్న తరుణంలో ప్రజలకు సేవలను సునాయాసంగా అందజేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. -
డిచ్‌పల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్లు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లిలో గ్యాస్ సిలండర్ల పేలుడు సంభవించింది. స్ధానికంగా ఉన్న ఓ షాపులో శనివారం నాలుగు సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు పరుగులు తీశారు. చిన్న సిలిండర్లలలో గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మహిళ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిలిండర్ల లారీని ఢీకొన్న మరో లారీ
సాక్షి, లక్కిరెడ్డిపల్లి : వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం మర్రిచెట్టు క్రాస్ వద్ద నేటి ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పులివెందుల నుంచి పుంగనూరుమార్కెట్ యార్డు వైపు వెళ్తున్న పశువుల లారీ, సిలిండర్ల లోడుతో ఉన్న మరో లారీని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. సిలిండర్ల గోడౌన్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన పశువుల లారీ ముందుకెళ్లే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ నిండుగా ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
114 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి కమలానగర్ లో అక్రమ సిలిండర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా సిలిండర్ల వ్యాపారం చేస్తున్న ఆదినారాయణ మూర్తి అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 114 గ్యాస్ సిలిండర్లు, 2 బొలేరో వాహనాలు సీజ్ చేశారు. ఆదినారాయణ అనే ఒక్కరికే 80 సిలిండర్లు సరఫరా చేసిన మదన్నపేట్ లోని భార్గవి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
గ్యాస్ సిలిండర్లు పేలి లారీ దగ్ధం
విశాఖపట్టణం: జిల్లాలోని ఆనందపురం మండలం గుడిలోవ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో కొన్ని సిలిండర్లు పేలాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో అక్కడికి చేరుకున్న జనం.. ఫైరింజన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్ధలికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సిలిండర్లు పేలడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సివుంది. -
తప్పిన పెను ముప్పు
- గ్యాస్ సిలిండర్ల వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు విజయవాడ: గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో వ్యానులోని వంట గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గుర్తించిన ప్రయాణికులు, స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ సంఘటన తాడేపల్లి ఆల్ట్రాటెక్ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్లు లీక్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమిక్షించారు. -
తృటిలో తప్పిన పెనుముప్పు..
-
వంట.. కట్టెలతో తంటా!
మొయినాబాద్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం కట్టెలతో వంట చేయడం నిర్వాహకులకు కష్టంగా మారింది. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకపోవటంతో ఇప్పటికీ పాఠశాలల్లో కట్టెల పొయిల పైనే ఆధార పడుతున్నారు. మొయినాబాద్ మండలంలో 32 ప్రాథమిక పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత, 14 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదులకు పక్కనే వంట గదులు ఉంటున్నాయి. కట్టెల పొయితో వంట చేస్తుండడంతో తరగతి గదుల్లోకి పొగ వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వంట చేసే వారు కూడా పొగతో అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో వంట గదులు సరిగా లేకపోవడంతో ఆరు బయటే వండుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో వంట చేయడం ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు. వంట చెరుకును పాఠశాల గదుల్లో నిల్వ చేస్తున్నారు. ‘దీపం’ తరహాలో సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు. పొగతో ఇక్కట్లు మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు వంట చాలా కష్టంగా ఉంటోంది. పాఠశాలలకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తే బాగుంటుంది. గతంలో అజీజ్‌నగర్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకూ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా గ్యాస్ సరఫరాకు చర్యలు చేపట్టాలి. - ప్రవీణ్, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అద్యక్షుడు -
ఏలూరుపాడులో విజిలెన్స్ దాడులు
కాళ్ల : అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచిన దుకాణంపై ఏలూరు రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు చేశారు. ఏలూరుపాడులో సద్దిశెట్టి రాధాకృష్ణ ఆయిల్స్, తాళ్లు వ్యాపారం చేస్తుంటారు. ఆయన ఇంట్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ వి.సురేష్‌బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం, అధికారులు తనిఖీలు చేశారు. సద్దిశెట్టి రాధాకృష్ణ ఏడాది నుంచి గ్రామంలోని ఓ ఏజెన్సీ నుంచి సిలిండర్లు తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆయన ఇంట్లో మొత్తం 24 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కాళ్ల ఆర్ఐ అడవి కృష్ణ కిశోర్‌కు అప్పగించారు. అనంతరం విజిలెన్స్ ఎస్సై సీతారాం మాట్లాడుతూ.. ఓ వ్యక్తి ఇంట్లో ఇన్ని సిలిండర్లు ఉండడం ఆశ్చర్యంగా ఉందని, గ్యాస్ ఏజెన్సీ నుంచి రాధాకృష్ణ సిలిండర్లు ఎలా తెస్తున్నారో విచారిస్తామని, ఏజెన్సీని కూడా తనిఖీ చేస్తామని వెల్లడించారు. తనిఖీల్లో విజిలెన్స్ తహసీల్దార్ పి.శైలజ, సిబ్బంది, వీఆర్వోలు రాజేంద్ర ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
మంటల్లో చిక్కుకొని కారు దగ్ధం
వేగంగా వెళ్తున్న కారులో మంటలు వ్యాపించి క్షణాల్లో కారు తగలపడిపోయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద బుధవారం వెలుగుచూసింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చే లోపే కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారులో మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు అందులో నుంచి బయటపడ్డారు. వంట కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల సాయంతో కారును నడుపుతుంటంతోటే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మరో రెండు గ్యాస్ సిలిండర్లు ఉండటంతోటే మంటల తీవ్రత అధికంగా ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతలో పేలిన ఎనిమిది గ్యాస్ సిలిండర్లు
-
అనంతలో పేలిన ఎనిమిది గ్యాస్ సిలిండర్లు
అనంతపురం: అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలుడు ఘటన కలకలం సృష్టించింది. రీఫిల్ చేస్తుండగా ఒకేసారి ఎనిమిది సిలిండర్లు పెద్ద శబ్ధంతో పేలాయి. దాంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటన కల్యాణదుర్గం పీ సర్కిల్లో బుధవారం చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి జనం దూరంగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. జనావాసాల మధ్య గ్యాస్ సిలిండర్లను రిఫిల్లింగ్ చేస్తున్నా కూడా అధికారులు ఏమి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గ్యాస్ లారీ-కారు ఢీ.. వ్యక్తికి గాయాలు
హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్‌లోడ్‌తో వెళ్తున్న లారీ కారును ఢీకొట్టడంతో.. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన సికింద్రాబాద్ సమీపంలోని నాగారం గ్రామం దమ్మాయిగూడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లారీకి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో.. పెను ముప్పుతప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
మధురవాడలో అగ్ని ప్రమాదం
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. మధురవాడ శివశక్తి నగర్లో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో నాలుగు పూరిళ్లు దగ్థమయ్యాయి. సుమారు రూ.5లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. -
లారీ ఢీకొని కానిస్టేబుల్ దుర్మరణం
సామర్లకోట : గ్యాస్ సిలిండర్ల లోడు లారీ ఢీకొని ఓ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యారు. కాకినాడ-సామర్లకోట ఏడీబీ రోడ్డులో గురువారం జరిగిన ఈ ఘటనలో సామర్లకోట పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ దంగేటి రాంబాబు(50) మరణించారు. భోజనం క్యారేజ్ తీసుకుని ఆయన స్కూటర్‌పై కాకినాడ నుంచి సామర్లకోటలోని పోలీసుస్టేషన్‌కు విధులకు హాజరవుతున్నారు. ఇదే మార్గంలో ఉన్న రెండు పెట్రోలు బంకుల మధ్య నుంచి వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ ఆయన స్కూటర్‌ను ఢీకొని, సుమారు 30 అడుగుల దూరం ఈడ్చుకుపోయింది. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో రాంబాబు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటనతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్సీ రవిప్రకాష్ సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. అందరితో కలివిడిగా ఉండే రాంబాబు మృతి వార్త తెలిసిన వెంటనే సహచరులతో పాటు ఆటో యూనియన్ నాయకులు, పండ్ల వర్తకులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కంటతడి పెట్టారు. పెద్దాపురం సీఐ కె.శ్రీధర్‌కుమార్, ఎస్సై ఆకుల మురళీకృష్ణ కూడా రాంబాబు మృతదేహాన్ని చూసి.. కన్నీరుమున్నీరయ్యారు. డీఎస్పీ ఎస్.రాజశేఖరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెద్దాపురం ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కాకినాడలోని రాంబాబు స్వగృహానికి తరలించారు. రాంబాబుకు భార్య కృష్ణవేణి, పెద్ద కుమారుడు రామ్‌కుమార్, చిన్న కుమారుడు లక్ష్మణ్, కుమార్తె సుమ ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా, కుమారుడు లక్ష్మణ్ భీమవరంలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. నిత్యం దైవదర్శనం పంచారామ క్షేత్రంలోని స్వామివారిని నిత్యం దర్శనం చేసుకున్నాకే రాంబాబు విధులకు హాజరయ్యేవారని ఆయన దైవభక్తిని ఆలయ అర్చకులు గుర్తుచేసుకున్నారు. అందరితో కలిసిమెలిసి ఉంటూ, అధికారుల మనన్నలు పొందిన కానిస్టేబుల్ రాంబాబు మరణంతో పోలీసు స్టేషన్లో విషాదం నెలకొంది. చిన్నా, పెద్దా, ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవారని సహచరులు పేర్కొన్నారు. మీసాల రాంబాబు పెద్ద మీసాలతో ఉండటంతో ఆయనను మీసాల రాంబాబు అని ముద్దుగా పిలుస్తుంటారు. 1983 లో కాకినాడ రిజర్వ పోలీసులో చేరిన ఆయన 2009లో సామర్లకోటకు వచ్చారు. రాంబాబు మృతికి ఎస్పీ, డీఎస్పీతో పాటు సీఐ కె.శ్రీధర్‌కుమార్, ఎస్సైలు ఆకుల మురళీకృష్ణ, కె. నాగార్జున, సతీష్, ఏఎస్సైలు రాజబాబు, జీవీవీ సత్యనారాయణ , పోలీసుల సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు గంగిరెడ్డి బలరామ్ సంతాపం ప్రకటించారు. డిప్యూటీ సీఎం సంతాపం కానిస్టేబుల్ రాంబాబు మృతికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సంతాపం ప్రకటించా రు. ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని రాయితీలు అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. -
'మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'
అల్లాదుర్గం (మెదక్ జిల్లా) : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన అల్లాదుర్గం పట్టణంలో దీపం పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు గ్యాస్ సిలండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కట్టెల పోయ్యిలతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే గ్యాస్ కనేక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ్గానికి 5 వేల కనేక్షన్లు మంజూరయినట్లు తెలిపారు. విడతల వారిగా అర్హూలైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మంజూరు చేస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మంజూరు చేసినట్లు ఆయన ఆరోపించారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ, వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఎంపీపీ రాంగారి ఇందిర, జెడ్పీటీసీ కంచరి మమత, వైస్ ఎంపీపీ బిక్షపతి, ఎంపీడీఓ కరుణశీల, తహశీల్దార్ చంద్రకళ, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సుభాశ్‌రావ్, టీఆర్ఎస్ నాయకులు ప్రతాప్‌లింగాగౌడ్, ఎంపీటీసీలు అనూరాధ, శివాజీరావ్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
15 అక్రమ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
బెల్లంపల్లి: గృహ అవసరాల కోసం కేటాయించిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై అధికారులు కొరడా ఝులిపించారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సోమవారం పలు హోటళ్ల పై దాడులు నిర్వహించిన సివిల్సప్లై, డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 15 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. -
గ్యాస్ సిలిండర్లు పేలి భారీ విస్ఫోటనం
♦ మహిళ సజీవదహనం ♦ రెండు పూరిళ్లు, గడ్డివామి దగ్ధం ♦ 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు ఆహుతి పోలిపాడు (ఓజిలి) : ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో రెండు గ్యాస్సిలిండర్లు పేలి భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా, రెండు పూరిళ్లల్లో 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.70 వేలు నగదు, బట్టలు, ఇతర సామగ్రి మంటల్లో ఆహుతయ్యాయి. రెండు పూరిల్లు, గడ్డివామి దగ్ధమయ్యాయి. ఈ విషాద ఘటన మండలంలోని భువనగిరిపాళెం పంచాయతీ పోలిపాడులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన పుచ్చకాయల నాగభూషణమ్మ (51), కోడలు నారాయణమ్మ ఇంటిలో చిన్నపాపతో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో పాప ఆకలికి ఏడ్చింది. దీంతో మనమరాలికి పాలు కాసేందుకు గ్యాస్ స్టౌ వెలిగించగా, ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి దట్టమైన మంటలు వ్యాపించాయి. ఇంటిలోనే ఉన్న మరో పుల్ సిలిండర్ కూడా మంటల ధాటికి పేలిపోవడంతో భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో పూరిల్లు తాటి దబ్బలు నాగభూషణమ్మపై పడటంతో మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. హఠాత్ పరిణామంతో కోడలు నారాయణమ్మ చిన్నపాపను తీసుకుని ఇంటి బయటకు పరుగెత్తింది. గ్యాస్ సిలిండర్లు పేలి పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె కుమారుడు నారాయణ, చుట్టు పక్కల వాళ్లు బిందెలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో పూరిల్లు, ఒక గడ్డివామి ఆగ్నికి ఆహుతయ్యాయి. అప్పటి వరకు తమతోనే ఉన్న నాగభూషణమ్మను అంతలోనే మృత్యువు కబళించడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న ఎస్సై సాంబశివరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగభూషణమ్మ మృతదేహం పూర్తిగా మంటల్లో కాలిబూడిదైపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గడువు తీరితే గండమే..!
- గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్పైరీ ఉంటుంది - గుర్తించి వెంటనే మార్చుకోవాలి పటాన్చెరు : మనం వినియోగించే ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తినే పదార్థాల నుంచి వేసుకునే మందులు ఇలా ప్రతి దానికి కాల పరిమితి ఉంటుంది. మరి నిత్యం వంట గదిలో ఉండే గ్యాస్ సిలిండర్ గురించి మీకు తెలుసా? దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని? కాలం తీరిన సిలిండర్ వినియోగిస్తే ప్రమాదకరమని తెలుసా? ఎక్స్పైర్ డేట్ ఎలా గుర్తించాలి? గ్యాస్ సిలిండర్‌పైన ఉన్న రింగ్ కింద నిలువుగా మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వైపు గ్యాస్ సిలిండర్ గడువు తేదీ ముంద్రించి ఉంటుంది. సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజించి మూడు నెలలకు ఒక ఆంగ్ల అక్షరం చొప్పున ఏ,బీ,సీ,డీగా గుర్తిస్తారు. జనవరి నుంచి మార్చి వరకు ‘ఏ’తో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ‘బీ’తో, జులై నుంచి సెప్టెంబర్ వరకు ‘సీ’తో, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ‘డీ’తో గుర్తిస్తారు. ఉదాహరణకు మీ సిలిండర్‌పై ‘డీ15’ అని ఉంటే డిసెంబర్ 2015 వరకు వినియోగించాలి. ఆ తేదీ దాటితే గడువు తీరినట్లే. గడువులోగా వాడితేనే మంచిది సిలిండర్ తీసుకున్న తర్వాత కొంత మంది వాటిని వినియోగించకుండా నెలల తరబడి నిర్వ ఉంచుతుం టారు. మరికొందరు ప్రత్యేక అవసరాల కోసం సిలిండర్లు బ్లాక్‌లో తీసుకుని వాడుతుంటారు. సందర్భం ఏదైనప్పటికీ వాటిపై ఉండే గడువు తేదీలోగా వాడితే మంచిది. కాలం చెల్లిన సిలిండర్లు వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి సిలిండర్లను గుర్తించి సంబంధిత డీలర్‌కు సరెండర్ చేయాలి. సిలిండర్ తీసుకున్న తేదీకి, దానిపై ఉన్న తేదీకి మధ్య కనీసం నాలుగు నెలల సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద ఉన్న తేదీలోగానే సిలిం డర్ వినియోగించాలి ఖాళీ సిలిండర్‌కూ కాల పరిమితి సిలిండర్లోని గ్యాస్ వాడకానికే కాకుం డా ఖాళీ సిలిండర్‌కు కూడా నిర్దిష్ట కాల పరిమితి ఉం టుంది. ఈ విషయం మాత్రం విని యోగదారులకు సంబంధం లేనిది. ఖాళీ సిలిండర్ కాలపరిమితి ఏడేళ్లు. తయారీదారులు తమ వద్ద రికార్డుల్లో లేని బ్యాచ్ నంబర్ల ప్రకారం ఏడేళ్లు తాడిన సిలిండర్లను డీలర్ల నుంచి వెనక్కు తెప్పించి ప్రత్యేక పరికరాలతో పరీక్షిస్తారు. నాణ్యత సరిగ్గా ఉంటే మరో ఐదేళ్ల పాటు విని యోగిస్తారు. లేకుంటే వాటిని నాశనం చేస్తారు. -
‘గివ్ ఇట్ అప్’లో తెలంగాణకు 13వ స్థానం
* దేశవ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు కేంద్రం వెల్లడి * తెలంగాణలో రాయితీ వదులుకుంది 33,777 మంది * 2.45 లక్షల మందితో యూపీకి మొదటి స్థానం * ఏపీలో గ్యాస్ రాయితీ వదులుకుంది 45,559 మంది.. దేశంలో 12వ స్థానం సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని.. వారికి మరిన్ని రాయితీ సిలిండర్లు అందించేందుకు వీలుగా కేంద్రం ఆరంభించిన ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమంలో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,777 మంది వినియోగదారులు తమ గ్యాస్ రాయితీని వదులకున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇండియన్ ఆయిల్ వినియోగదారులు 14,960, హిందుస్థాన్ పెట్రోలియం 8,768, భారత్ పెట్రోలియం 10,049 మంది వినియోగదారులు రాయితీ వదులుకున్నారని వెల్లడించింది. దేశంలో 36 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంటచెరకు, పిడకలపై ఆధారపడి వంట చేసుకుంటున్నాయని, దీనివల్ల ఇంట్లో పొగ చేరడంతో మహిళలు, పిల్లలు ఆనారోగ్యం బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏటా గ్యాస్ సిలిండర్ల ద్వారా ప్రభుత్వం రూ.6 వేల రాయితీని అందిస్తోందని, మార్కెట్ ధరకు గ్యాస్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్న సంపన్న వర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకు రావాలని, దీనివల్ల మరింతమంది పేదలు రాయితీ సిలెండర్లు పొందే అవకాశం ఉంటుందని పదేపదే చెబుతోంది. కేంద్రం పిలుపునకు స్పందించి దేశవ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారని కేంద్ర పెట్రోలియం శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గివ్ ఇట్ అప్’లో 2.45 లక్షల మంది రాయితీని వదులుకోవడంతో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, మహారాష్ట్రలో 2.26 లక్షల మంది గ్యాస్ రాయితీ వదులుకున్నట్లు తెలిపింది. ఇక ఏపీలో 45,559 మంది వినియోగదారులు రాయితీ వదులకోగా.. అందులో ఇండియన్ ఆయిల్ వినియోగదారులు 23,318 మంది, హిందుస్థాన్ పెట్రోలియం 16,400 మంది, భారత్ పెట్రోలియం 5,841 మంది ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ కంటే మెరుగ్గా ఏపీ 12వ స్థానంలో ఉంది. -
వెలగని దీపం!
మంజూరైన కనెక్షన్లు 70వేలు ఒక్కో నియోజకవర్గానికి 5వేలు వచ్చిన దరఖాస్తులు 1.80లక్షలు లబ్ధిదారుల ఎంపికలో జాప్యం నేటికీ కొలిక్కిరాని అర్హుల జాబితా పాలమూరు: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దీపం పథకం ద్వారా ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న సర్కారులక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. కనెక్షన్లు మంజూరై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ గ్యాస్ అందకపోవడం గమనార్హం. గత ఏప్రిల్‌లో నియోజకవర్గానికి ఐదువేల చొప్పున జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 70వేల కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. దరఖాస్తులు స్వీకరించి మూడునెలలైనా అర్హుల జాబితా ఇంతవరకు ఖరారుకాలేదు. కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేకకమిటీ లబ్ధిదారులను ఎంపికచేస్తుంది. మండలస్థాయిలో ఆ బాధ్యతను ఎంపీడీఓలకు కట్టబెట్టారు. గ్రామస్థాయిలో వచ్చిన దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనలకు స్వస్తి పలికారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫార్సులు, సర్పంచ్ల జాబితా మేరకు ఎంపీడీఓలు లబ్ధిదారుల తుదిజాబితా రూపకల్పనలో జాప్యం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగానికి జాబితా చేరలేదు. గ్రామాల నుంచి వచ్చిన వాటిని ఆధార్ ప్రామాణికంగా డేటాఎంట్రీ పూర్తిచేసి జిల్లా పౌరసరఫరాల కార్యాలయానికి పంపించాల్సి ఉంది. జిల్లాలో ఏ మండలంలో కూడా జాబితా రూపకల్పన మొదలుపెట్టకపోగా గ్రామసభల ద్వారా ఎంపికచేసిన జాబితా కూడా చేరలేదని తెలుస్తోంది. కొలిక్కిరాని పంపిణీ ప్రక్రియ జిల్లాలో సమగ్రకుటుంబ సర్వే ప్రకారం 9.85లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 5.21లక్షల గ్యాస్కనెక్షన్లు ఉండగా 4.64లక్షల కుటుంబాలకు కనెక్షన్లు లేవని తేలింది. ప్రభుత్వం మంజూరుచేసిన 70వేల కనెక్షన్లకు 1.80లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ 25శాతం ఎస్సీలు, 16శాతం ఎస్టీలు, మైనార్టీలకు గ్యాస్కనెక్షన్ అందించాలని నిర్ణయించారు. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఒక్కో కనెక్షన్‌కు రూ.1600చొప్పున మొత్తం 70వేల కనెక్షన్లకు రూ.11.20కోట్లు అందజేసింది. మే నెలలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిర్ణీత గడువు దాటినా పంపిణీ ఓ కొలిక్కిరాలేదు. లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్కనెక్షన్లు జారీచేసి ఖాళీ సిలిండర్‌తో పాటు రెగ్యులేటర్ ఇస్తారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా లబ్ధిపొందని వారు, గ్యాస్కనెక్షన్ తీసుకునేందుకు డబ్బు వెచ్చించలేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. గ్రామసభల ద్వారా ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ఆమోదించి ఆ తరువాత జిల్లా మంత్రికి నివేదించిన తరువాతే కనె క్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సి ఉంది. -
జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ
కుల్కచర్ల: గ్యాస్ సిలిండర్ లీకై ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమైపోయాయి. తరచూ గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం సంభవిస్తోంది. అవగాహ న లోపం, సరైన జాగ్రత్తలు పా టించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కుత్బుల్లాపూర్ మండల పరిధిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. తాజాగా శుక్రవారం షాబాద్ మండలం సోలిపేట్లో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2 లక్షల ఆస్తినష్టం జరిగింది.అదృష్టవశాత్తు ప్రాణాపాయం సంభవించలేదు. వంటింట్లో మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. ⇒ ఇంట్లో సిలిండర్ ఎప్పుడు నిలువుగా ఉంచాలి ⇒ మూసి ఉంచిన బీరువాలో గాని డబ్బాలో గాని సిలిండర్‌ను ఉంచరాదు. ⇒ గ్యాస్ సిలిండర్ రబ్బర్ ట్యూబ్, రెగ్యులేటర్ మార్చేందుకు వీలుగా వంటగదిలో ఖాళీ స్థలం ఉంచుకోవాలి. ⇒ గ్యాస్ సిలిండర్ దగ్గర్లో కిరోసిన్, పెట్రోల్ లేకుండా జాగ్రత్తపడాలి. ⇒ సిలిండర్ డెలివరీ సమయంలో దానికి రక్షణ తొడుగు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ⇒ రెగ్యులేటర్‌ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. రెగ్యులేటర్ పెట్టగానే గ్యాస్ లీకైతే వెంటనే దానిని మార్చాలి. ⇒ ఐఎస్ఐ మార్క్ ఉన్న రెగ్యులేటర్ ట్యూబ్, లైటర్లు కొనుగోలు చేయాలి. ⇒ గ్యాస్ స్టౌ ిసిలిండర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. సర్వీసింగ్ చేసిన తర్వాత బర్నల్ సిమ్మర్ సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వంటగదికి వెంటిలేటర్ ఉండాలి. ⇒ తగినంత వెలుతురు, గాలి వంటగదిలోకి రావాలి. వంటగదిలో ఫ్రిజ్‌ను ఉంచుకోరాదు. ⇒ రాత్రి నిద్రించే ముందు రెగ్యులేటర్‌ను కట్టివేయాలి. ⇒ గ్యాస్ స్టౌవ్‌ను డీలర్ వద్ద లేదా అనుభవం ఉన్న మెకానిక్ వద్ద మాత్రమే చేయించాలి. ⇒ గ్యాస్ సేఫ్ పరికరం ఉందా ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ సేఫ్ పరికరాలు లభిస్తున్నాయి. వాటిని సిలిండర్ బిగిస్తే చాలు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు గ్యాస్ సరఫరా ఆటోమెటిక్‌గా నిలిచిపోతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజన్‌తో పాటు 108కు సమాచారం ఇవ్వాలి. గ్యాస్ లీకైన వెంటనే జనాలు ఇంట్లోంచి బయటకు వెళ్లాలి. -
గ్యాస్ సిలెండర్కీ ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుంది!
గత రెండు నెలల కాలంలో గ్యాస్ సిలెండర్లు పేలిన ఘటనలు వార్తల్లో చాలా కనిపించాయి. వేసవి కాలంలో ఇటువంటి ప్రమాదాలు మరింత పెరుగుతుంటాయి. ఇలాంటివి విన్నప్పుడు వంటింట్లోకి వెళ్లాలంటే అడుగులు కాస్త తడబడతాయి. అయితే అంత భయపడాల్సిన పని లేదు. గ్యాస్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చు. గ్యాస్ సిలెండర్‌కు ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుందని చాలామందికి తెలియదు. అదే అసలు సమస్య. సిలెండర్ పైన సంవత్సరాన్ని సూచించే అంకెతో పాటు ఎ,బి,సి,డి అనే అక్షరాలు ఉంటాయి. ఎ అంటే మార్చి, బి అంటే జూన్, సి అంటే సెప్టెంబర్, డి ఉంటే డిసెంబర్ వరకు అని అర్థం. ఆ నెల దాటితే వాడటం ప్రమాదమే. కాబట్టి కచ్చితంగా కాల పరిమితి చూసుకుని తీసుకోండి. సిలెండర్ తీసుకునేటప్పుడు సీలు తీసి, పరీక్షించి ఇవ్వమని తెచ్చిన వ్యక్తిని అడగండి. లీకేజీ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. వంటగదిలోకి గాలి, వెలుతురు బాగా రావాలి. సిలెండర్‌ను షెల్ఫ్‌లో పెట్టి తలుపులు మూయడం లాంటివి చేయకండి. కాస్త చల్లదనం ఉండే చోటే పెట్టండి. కొంతమంది సిలెండర్‌ను కింద పెట్టి, ఆ పక్కనే స్టౌ పెట్టి వండేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. స్టౌ ఎప్పుడూ సిలెండర్ కంటే ఎత్తులోనే ఉండాలి. రబ్బర్ ట్యూబ్‌ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దాని దగ్గరగా ఎటువంటి వేడి వస్తువులూ పెట్టకూడదు. ఐదేళ్లకోసారి ట్యూబ్‌ను తప్పకుండా మార్చాలి. తక్కువ రేటు పొయ్యిలు వాడితే వాటి భాగాలు త్వరగా పాడవుతాయి. ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మంచి స్టౌ వాడాలి. దాన్ని కూడా సంవత్సరానికోసారి పరీక్ష చేయించాలి. గ్యాస్ ఏజెన్సీవాళ్లను పిలిస్తే వాళ్లే వచ్చి చేస్తారు. వంట పూర్తి కాగానే స్టౌ కట్టేసి ఊరుకోకుండా, రెగ్యులేటర్‌ని తప్పకుండా ఆఫ్ చేయండి. -
‘మధ్యాహ్నా’నికి కట్టెల పొయ్యిలే దిక్కు
నిజాంసాగర్ : మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం సరఫరా చేసిన గ్యాస్ సిలిండర్లు, స్టౌలు మూలనపడ్డాయి. పాఠశాలల వారీగా అందించిన గ్యాస్ కనెక్షన్లకు ప్రభుత్వం సబ్సిడీని వర్తింపజేయకపోవడంతో వంట ఏజెన్సీలకు కట్టెల పొయ్యిలే దిక్కయ్యాయి. ఇరుకుగా ఉన్న వంటశాల గదులు, వరండాల్లో వంట తయారీకి ఏజెన్సీల నిర్వాహకులు నానా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం వంట ఏజెన్సీల కష్టాలపై దృష్టి సారించడం లేదు. పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న నిర్వాహకులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెం డు అంచెల పద్ధతిన బిల్లులు చెల్లిస్తున్నాయి. అవి వంట ఏజెన్సీలకు స్లాబ్ ధరలు ఏమాత్రం కడుపునింపడం లేవు. నెలనెలా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల పాలవుతున్నా రు. పాఠశాలల గ్యాస్ బండలకు సబ్సిడీ ఇవ్వకపోవడంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కట్టెలపొయ్యిలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 2,303 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. 2 లక్షల కు పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం లబ్ధిపొందుతున్నారు. పథకం అమలును పర్యవేక్షిస్తున్న అధికారులు.. వంట ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులకు ఒక్కపూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం స్లాబ్రేట్లను పెంచకపోవడంతో కార్మికులు కష్టాలను ఎదుర్కుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 4.35, ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 6 చొప్పున వంట ఏజెన్సీలకు బిల్లులను చెల్లిస్తోంది. ప్రభుత్వం వంట కార్మికులకు చెల్లిస్తున్న బిల్లులు నిర్వాహకులకు ఏమాత్రం సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. సిలిండర్లను సబ్సిడీపై సరఫరా చేయకపోవడంతో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. దీంతో సిలిండర్లను, గ్యాస్ స్టౌలను మూలన పడేశారు. -
గ్యాస్ లేదు.. పామాయిల్ రాదు
భీమడోలు : పండగ వేళ గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. బుక్‌చేసి 20 రోజులు దాటినా సిలిండర్లు సరఫరా కాకపోవడంతో వా రంతా అవస్థలు పడుతున్నారు. సింగిల్ సిలిండర్, దీపం గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నా యి. నాలుగు నెలల క్రితం వరకూ బుక్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే సిలిండర్ అందేది. జూలై 27న తూర్పుగోదావరి జిల్లా నగరం వద్ద గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనతో గ్యాస్ సరఫరా నిలిచిపోరుుంది. అప్పటినుంచి జిల్లాలోని వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందడం లేదు. అక్కడి పైప్‌లైన్ మరమ్మతులు పూర్తికాకపోవడంతో విశాఖపట్నం నుంచి ట్యాంకర్ల ద్వారా గ్యాస్‌ను రాజమండ్రి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ సిలిండర్లలో నింపి గ్యాస్ ఏజెన్సీలకు రవాణా చేస్తున్నా రు. అరుునా సిలిండర్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉంటోంది. హుదూద్ తుపా ను ప్రభావం నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో విశాఖ నుంచి గ్యాస్ ట్యాంకర్లను పెద్దఎత్తున రాజమండ్రికి పంపిస్తున్నారు. అరుునా, వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు సరఫరా కావడం లేదు. డిమాండ్ చాంతాడంత.. సరఫరా అంతంత జిల్లాలో వివిధ కంపెనీలకు సంబంధించి 86 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నారుు. సగటున ఒక్కొ క్క ఏజెన్సీకి నిత్యం రెండు లారీల గ్యాస్ సిలిండర్లు (600) దిగుమతి కావాల్సి ఉంది. ఏలూరు, భీమవరం వంటి పట్టణాల్లోని ఏజెన్సీలకు మూడు నుంచి ఐదు లారీల (900నుంచి 1,500) సిలిండర్లు అవసరమవుతాయి. అయితే, ప్రస్తుతం గ్రామాల్లోని ఏజెన్సీలకు రెండు మూడు రోజులకు ఒక లోడు, పట్టణాల్లోని ఏజెన్సీలకు రెండు, మూడు లారీల్లో మాత్రమే సిలిం డర్లు సరఫరా అవుతున్నాయి. దీంతో గ్యాస్ బుక్ చేసుకున్న విని యోగదారుల సంఖ్య చాంతాడులా పెరిగిపోతోంది. ఒక్క భీమడోలు ఏజెన్సీ పరిధిలోనే సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 15 వేలకు పైగా ఉందంటే పట్టణాల్లో పరిస్థితి ఏమిటో అవగతం చేసుకోవచ్చు. పామా‘యిల్లె’ కాళ్ల : రేషన్ షాపుల ద్వారా పామాయిల్ సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు. గడచిన జూన్ నుంచి రేషన్ డిపోలకు పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో 10 లక్షల 56 వేల 220 మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ఎన్నికల ముందు వరకు ప్రతినెలా బియ్యం, పంచదార, కిరోసిన్‌తోపాటు పామాయిల్, కందిపప్పు, ఉప్పు, పసుపు, కారం, గోధుమలు, చింతపండు, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులు సరఫరా అయ్యేవి. జూన్‌నెల నుంచి పామాయిల్ సరఫరాను నిలిపివేశారు. సెప్టెంబర్ నుంచి మిగిలిన నిత్యావసర వస్తువులనూ నిలుపుదల చేసి కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్ మాత్రమే అందజేస్తున్నారు. చాలా ఏళ్లుగా తరచూ పామాయిల్ సరఫరా నిలిపివేస్తున్నా.. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండగ రోజుల్లో మాత్రం కచ్చితంగా అందించేవారు. అదే రోజుల్లో పంచదార కోటా పెంచి ఇచ్చేవారు. పామాయిల్ సరఫరాను త్వరలోనే పునరుద్ధరిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. పామాయిల్ ఇవ్వకపోవడంతో పండగ వేళ పిండి వంటలు చేసుకునే పరిస్థితి లేక పేద కుటుంబాల వారు ఆవేదన చెందుతున్నారు. -
యానాం ఫెర్రీరోడ్‌లో భారీ అగ్నిప్రమాదం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని యానాం ఫెర్రీరోడ్‌లో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇళ్లలో 3 గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 పూరిళ్లు అగ్నికి ఆహుతి కాగా, 30 కుటుంబాలు నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
అడుగుకో అగ్నిగుండం
జీహెచ్ఎంసీ ‘ఫైర్’ వెబ్సైట్లో సంస్థల వివరాలు ఎట్టకేలకు కదులుతున్న యంత్రాంగం సాక్షి, సిటీ బ్యూరో: గ్యాస్ సిలిండర్లు పేలడం.. రోడ్లు కుంగడమే కాదు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎక్కడికెళ్లినా ఏదో రూపంలో ముప్పు పొంచి ఉంటోంది. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లతో పాటు ఇంజినీరింగ్ విద్యా సంస్థల నుంచి మల్టీప్లెక్స్‌ల దాకా ఎక్కడా భద్రత లేదు. పొరపాటున అగ్ని ప్రమాదం వంటివి జరిగితే తప్పించుకునేందుకు తక్షణ ఏర్పాట్లు లేవు. కనీస రక్షణ చర్యలు అంతకన్నా లేవు. చివరకు ప్రాణాపాయంలో ఆస్పత్రులకు వెళ్తే అక్కడ కూడా గ్యారెంటీ లేదు. గ్రేటర్‌లోని అనేక ఆస్పత్రులకు కనీస ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవు. సాధారణ స్థాయి నుంచి భారీ వ్యాపారాలతో రూ.కోట్లు ఆర్జిస్తూ పేరొందిన సంస్థల వరకూ అన్నిటిదీ ఇదే వరుస. పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్లు నిర్వహించుకునే హాళ్లు, కల్యాణ మండపాల్లో సైతం అగ్ని ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు సేఫ్టీ ఏర్పాట్లంటూ లేవు. సాధారణ ప్రజల నుంచి సైతం ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సుల ఫీజుల వంటి వాటిపై శ్రద్ధ చూపే జీహెచ్ఎంసీ.. ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న వాటిపై ఇంతవరకు దృష్టి సారించలేదు. గతంలో పార్క్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.. పొరుగు రాష్ట్రంలో అగ్నికీలలు ఎగసి పడినప్పుడు హడావుడి చర్యలకు సిద్ధమైనప్పటికీ ఆ తర్వాత మరచిపోయింది. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేని ఆస్పత్రుల లెసైన్సులు రద్దు చేస్తామని భారీ ప్రకటనలే గుప్పించింది. అగ్నిమాపక విభాగం నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) తప్పనిసరి అని పేర్కొంది. కానీ క్రమేపీ ఆ విషయాన్ని మరచిపోయింది. దీంతో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేస్తున్న వారు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటున్నారు. చదువుకునేందుకు విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థుల నుంచి పెళ్లిళ్లకు ఫంక్షన్ హాళ్లకు వెళ్లే వారి దాకా అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముషీరాబాద్‌లో కలప దుకాణంలో అగ్ని ప్ర మాదం జరిగినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం చూసిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ శ్చర్యపోయారు. ప్యారడైజ్ హోటల్లో నూ ఏర్పాట్లు లేకపోవడంపై నోరెళ్లబెట్టారు. ఎట్టకేల కు ఇక ‘సేఫ్టీ లేని సంస్థలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని సంస్థల వివరాలు సేకరించి ప్రజలకు తెలిసేలా వెబ్సైట్లో పెట్టాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచన మేరకు సంబంధిత అ ధికారులు ఆ పనుల్లో మునిగారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేనివి గుర్తించారు. ఆవివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పొందుపరిచారు. ‘వీటిల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు.. ఇక అక్కడ మీ పిల్లలను చదివించాలో లేదో మీరే అంచనా వేసుకోండి’ అని సూచిస్తున్నారు. చిన్నస్కూళ్ల నుంచి రూ.లక్షల్లో ఫీజులు గుంజే సంస్థలు సైతం వీ టిలో ఉన్నాయి. ఏయే సంస్థలకు ఈ ఏర్పాట్లు లేవో ఆ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. కఠిన చర్యలు చేపడతాం... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంస్థలను చూస్తూ ఊరుకునేది లేదని జీహెచ్ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం అడిషనల్ డెరైక్టర్ పి.వెంకటరమణ హెచ్చరించారు. ఇందులో భాగంగా పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈఓలకు, కళాశాలలపై చర్యలకు కళాశాల విద్య కమిషనర్‌కు, ఆస్పత్రులపై చర్యలకు జిల్లాల వైద్యాధికారులకు లేఖలు రాశామన్నారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని వాటికి అనుమతులు రద్దు చేయాల్సిందిగా కోరామన్నారు. వారు స్పందించని పక్షంలో ఫైర్‌సేఫ్టీ చట్టం మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మలిదశలో హోటళ్లు, మల్లీప్లెక్స్‌లు తదితర జనసమ్మర్థం ఎక్కువగా ఉండే సంస్థల సర్వే నిర్వహించి, వాటి వివరాలూ వెబ్సైట్లో పెడతామన్నారు. జీహెచ్ంఎసీ వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు 946 ఆస్పత్రులు, 634 ఫంక్షన్ హాళ్లు, 178 ఇంజినీరింగ్ కళాశాలలకు ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. విద్యాసంస్థలూ వేల సంఖ్యలో ఉన్నాయి. -
గ్యాస్ సంక్షోభం
రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం నెలకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. సిలిండర్ల కొరత వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకునే కృతిమ కొరతను సృష్టిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే, కొత్త సిలిండర్ల కారణంగా తాత్కాలికంగా ఈ సంక్షోభం బయలు దేరిందని ఐవోసీ వర్గాలు పేర్కొంటున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కొన్ని నెలలుగా బుక్ చేసిన రెండు, మూడు రోజుల్లో గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సరఫరా అవుతున్నారుు. గ్యాస్‌కు ఆధార్ కార్డును లింక్ పెట్టి, నగదు బదిలీ పథ కం అమల్లోకి రావడంతో త్వరితగతిన సిలిండర్లు వినియోగదారుల ముగింట వాలాయి. అలాగే, గ్యాస్ సిలిండర్లు సకాలంలో వినియోగదారులకు చేరని పక్షంలో డీలర్ల నడ్డి విరిగేది. అయితే, ఆ విధానం కాస్త కొత్త ప్రభుత్వం రాకతో మరుగున పడింది. ధరల తగ్గింపు నినాదంతో కేంద్రంలో కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే రైలు చార్జీల్ని వడ్డించింది. పెట్రోల్, డీజిల్ మోత ప్రజల నెత్తిన వేసింది. ఇక, గ్యాస్ భారం వేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం మొదలైంది. పార్లమెంట్ బడ్జెట్ దాఖలులో గ్యాస్ ధర పెంపు ప్రకటన వెలువడే అవకాశాలు ఉండడంతో కృత్రిమ కొరత సృష్టించే పనిలో డీలర్లు పడ్డారు. అదే సమయంలో చమురు సంస్థలు డిమాండ్‌కు తగ్గట్టుగా సిలిండర్లను సరఫరా చేయడం లేదన్న ఆరోపణలు డీలర్ల వైపు నుంచి వస్తున్నాయి. ఎదురుచూపులు: పది రోజులుగా రాజధాని నగరంలో సిలిండర్ల కొరత నెలకొంది. ఇది వరకు బుక్ చేసిన రెండు మూడు రోజుల్లో వచ్చే సిలిండర్లు ప్రస్తుతం పది రోజులైనా రాక పోవడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సిలిండర్ ఎప్పుడొస్తుందని డీలర్లకు ఫోన్లు చేయలేని పరిస్థితి. ఇందుకు కారణం సిలిండర్ల బుకింగ్‌కు ప్రత్యేక ఎస్ఎంఎస్ విధానం అమల్లో ఉండటమే. దీంతో సిలిండర్లు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల గత నెల బుక్ చేసిన సిలిండర్లు ఇంకా రాలేదంటూ వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాట: కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ ఓ వైపు ప్రచారం సాగుతుంటే, మరో వైపు మీంజూర్‌లో ఐవోసీ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంలో సిబ్బంది ఆం దోళనబాట పట్టడంతో ఫిల్లింగ్‌కు ఆటం కం ఏర్పడి ఉంది. సిబ్బంది తమ ఆందోళనను ఉధృతం చేసినదృష్ట్యా, బుధవారం నుంచి పూర్తిగా ఆ కేంద్రంలో గ్యాస్ ఫిల్లింగ్ ఆగినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక్కడ ఫిల్లింగ్ సిలిండర్ల సంఖ్యను సైతం తగ్గించడం బట్టి చూస్తే, ధర పెరగనుండడాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షోభాన్ని సృష్టిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఐవోసీ అధికారులు దీన్ని ఖండిస్తున్నారు. ఇక్కడి నుంచి రోజుకు 120 లోడ్లు డీలర్లకు సరఫరా అవుతున్నాయని వివరిస్తున్నారు. అయితే, పదేళ్ల పాటు వినియోగంలో ఉన్న సిలిండర్లను వెనక్కు పంపించి, వాటి స్థానంలో కొత్త సిలిండర్లను తెప్పిస్తున్నామని పేర్కొంటున్నారు. కొత్త సిలిండర్ల రాకలో జాప్యం నెలకొన్నందున, ఇక్కడ కాంట్రాక్టు సిబ్బందిని కుదించినట్లు వివరించారు. ప్రస్తుతం 60 లోడ్ల మేరకు సిలిండర్ల ఫిల్లింగ్ మాత్రం చేయాల్సి ఉందని, దీన్ని అర్థం చేసుకోని సిబ్బంది ఆందోళన బాట పట్టారని చెబుతున్నారు. వీరి ఆందోళన కారణంగా ఫిల్లింగ్‌కు ఆటంకం ఏర్పడిందని, మరో రెండు మూడు రోజుల్లో కొత్త సిలిండర్లు రాగానే, సిలిండర్ల కొరత సమసి పోవడం ఖాయం అని స్పష్టం చేస్తున్నారు. అంతలోపు సిలిండర్ల ధర పెరిగిన పక్షంలో చమురు సంస్థలకు లాభం, వినియోగ దారుడి నెత్తిన భారం ఖాయం. -
దాడులు ముమ్మరం
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో గ్యాస్ అక్రమ వినియోగంపై అధికారులు మూకుమ్మడి దాడులు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో బుధవారం పౌరసరఫరాల ఉప తహశీల్దార్లు రంగంలోకి దిగారు. దాదాపు అన్ని మండలాల్లోనూ దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా 33 గృహోపయోగ, 30 వాణిజ్య సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 38 కేసులు నమోదు చేశారు. ఆరు బృందాల్లో ఒక బృందం జేసీ బంగ్లా ఎదురుగా ఉన్న రెండు టీ స్టాళ్లు, శివరాం స్వీట్స్, ఆర్అండ్బీ బంగ్లా, ఉడాకాలనీల వద్ద గల మానస హొటల్, విజయవాడ టిఫిన్ సెంటర్లలో దాడులు చేపట్టింది. అక్రమంగా వినియోగిస్తున్న ఎనిమిది గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం దా డులు నిర్వహించి గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని, 6ఏ కేసులు నమోదు చేశామని ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఐ కె.జగదీశ్వరరావు, తనిఖీ బృందం అధికారి, బొబ్బిలి సీఎస్‌డీటీ ఎన్వీ రమణ తెలిపారు. అదే విధంగా మరో బృందం 14 కేసులు నమోదు చేసి 24 సిలిండర్లు స్వాధీనం చేసుకుంది. ఇందులో 13 కమర్షియల్, 11 డొమెస్టిక్ సిలిండర్లున్నాయని సీఎస్డీటీలు కోరాడ ప్రసాదరావు, ఎ.సూర్యనారాయణ, ఎన్ఫోర్స్మెంట్ అధికారి రామభద్రరాజు తెలిపారు. వాణిజ్య సిలిండర్లు ఉన్నా.. కేసులు తప్పవు జిల్లాలోని వాణిజ్య సముదాయాలు, వివిధ హొటళ్లలో ఇతరుల కు చెందిన గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారన్న సమాచారం ఉందని తనిఖీ బృందాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులు తెలిపారు. గృహ వినియోగ సిలిండర్లు లభించడంతోపాటు అవసరం కన్నా తక్కువ వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తున్న కారణంగా వాటిని కూడా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. వాణిజ్యగ్యాస్వినియోగిస్తున్న వారిపేరునే బాండ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇదిలా ఉండగా.. జేసీ బి.రామారావు ఆదేశాలమేరకు బుధవారం ఉదయం నుంచే దాడు లు నిర్వహించారు. బొబ్బిలి, గరివిడి ఉప తహశీల్దార్లతో కల సి ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఐ దాడుల్లోపాల్గొన్నారు. వివిధప్రాం తాల్లో ఏకకాలంలో దాడులుకొనసాగించారు. అయితే దాడు లు సాగుతున్నట్లు సదరు వ్యాపారులకు సమాచారం వెళ్లడం తో ముందుగానే చాలా మంది అప్రమత్తమయ్యూరు. గుట్టుచప్పుడు కాకుండా దుకాణాలు మూసేశారు. అరుునప్పటికీ ఎవరినీ వదిలిపెట్టేది లేదని, వరుసగా తనిఖీలు కొనసాగిస్తా మని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను స్థానిక గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించినట్లు చెప్పారు. అక్రమ ఫిల్లింగ్ మాటేమిటి? జిల్లాలోని వాణిజ్య అవసరాలకు ఎక్కువగా గ్యాస్ వినియోగమవుతోంది. కానీ ఈ సిలిండర్ల కొనుగోలు మాత్రం తక్కువగా జరుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ హొటళ్లు, టీ స్టాళ్లు, మెస్‌లు, ఫుడ్ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు గృహవినియోగ సిలిండర్లను కొనుగోలు చేసి.. అక్రమంగా వినియోగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నారుు. అదే విధంగా పలుచోట్ల అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ కూడా జరుగుతోంది. ఇక నుంచి ఫిల్లింగ్ చేసే వారిపైనా దృష్టి సారిస్తామని ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఐ జగదీశ్వరరావు తెలిపారు. అదేవిధంగా వాహనాలకు కూడా గ్యాస్ ఫిల్లింగ్ జరుగుతున్నట్టు తమ వద్ద సమాచారముందని తెలిపారు. ఇదిలా ఉండగా.. గృహావసర గ్యాస్ సిలిండర్ల నుంచి వాణిజ్య సిలిండర్లకు గ్యాస్‌ను మార్చుతున్నారన్న అనుమానాలను తనిఖీ బృందాలు వ్యక్తం చేశాయి. చాలా వరకూ పెద్ద హొటళ్లలో కమర్షియల్ సిలిండర్లను తక్కువగా వినియోగించడం చూస్తే ఇది స్పష్టమవుతోందని గంట్యాడ నుంచి వచ్చిన తనిఖీ బృందంలోని సీఎస్‌డీటీ కోరాడ ప్రసాదరావు తెలిపారు. చిన్న ఇనుము పుల్లతో గ్యాస్‌ను ఎక్కిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. -
బతుకు బుగ్గి
నగరంలో శుక్రవారం తెల్లవారుజామున స్వల్పవ్యవధిలో చోటుచేసుకున్న రెండు అగ్నిప్రమాదాలు ప్రజలను భయకంపితులను చేశాయి. ఒక ప్రమాదంలో సుమారు 150 గుడిసెలు కాలిబూడిదయ్యూరుు. దీంతో పేద ప్రజలు సర్వం కోల్పోరుు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మరో సంఘటన ప్రజల కంటిపై కునుకులేకుండా చేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: నుంగంబాకం పుష్పానగర్ కరుమారియమ్మన్ కోవిల్ సమీపంలో సుమారు 500కు పైగా గుడిసెలు ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఒక గుడిసెలో మంటలు చెలరేగారుు. ఆ ఇంటి లో కాపురం ఉంటున్న వారు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వీరి కేకలకు మేల్కొన్న ఇరుగుపొరుగు వారు కూడా మంటలను చూసి భయంతో బయటకు వచ్చారు. అదే సమయంలో బలమైన గాలులు వీయడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. మంచి నిద్రలో ప్రమాదం సంభవించడంతో ప్రజలు షాక్ నుంచి తేరుకునేలోగా గుడిసెలన్నీ కాలిబూడిదయ్యూరుు. ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్, బీరువాలు తదితర సామగ్రి కాలిబూడిదయ్యూరుు. గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అక్కడికి సమీపంలో పార్కు చేసి ఉన్న 10 మోటార్ సైకిళ్లు కూడా కాలిబూడిదయ్యూరుు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు 150 గుడిసెలు కాలిపోయూరుు. ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. సుమారు రూ.10 లక్షల నష్టం సంభవించినట్టు అధికారులు అంచనావేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వలర్మతి, నగర మేయర్ సైదై దురైస్వామి ఉదయాన్నే వచ్చి బాధితులను పరామర్శించారు. ఇంట్లో దాచుకున్న డబ్బు, రేషన్ కార్డులు, గుడ్డలు సహా కాలిపోగా కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీరుమున్నీరయ్యూరు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని బాధితులకు మంత్రి భరోసా ఇచ్చారు. రెవెన్యూ అధికారులు వచ్చి బాధితుల వివరాలను సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ పేలుడు చేట్‌పట్ సమీపంలో ఒక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో పెద్ద టాన్స్‌ఫార్మర్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ధాటికి శకలాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో చేట్‌పట్, కీల్పాక్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలుడు శబ్దాలు వినపడం, పూర్తిగా చీకట్లు కమ్ముకోవడంతో ఏమి జరిగిందోనని ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఐదు అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకున్న సిబ్బంది రెండుగంటపాటు హోరాహోరీగా పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ సరఫరా లేనికారణంగా ఆ పరిసరాల ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. శుక్రవారం సాయంత్రానికి దశలవారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
10 నుంచి సబ్సిడీ ధరకే వంట గ్యాస్
నగదు బదిలీ తాత్కాలికంగా నిలిపివేత ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఈ ఏడాది సబ్సిడీ సిలిండర్లు పదకొండే.. వచ్చే ఏడాది నుంచి 12 సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్‌కు ఆధార్ బంధం తెగిపోయింది. సోమవారం నుంచి పాత పద్ధతిలో సబ్సిడీ ధరకే గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు అందనున్నాయి. వంట గ్యాస్‌కు నగదు బదిలీపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను గుర్తించిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు బదిలీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి అయిదు రోజుల ముందే వంట గ్యాస్‌కు నగదు బదిలీని రద్దు చేయాలని నిర్ణయించింది. తద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న నగదు బదిలీ విధానంలోని సాఫ్ట్వేర్ స్థానంలో పాత విధానంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు వీలుగా సాఫ్ట్వేర్ రూపకల్పనకు పది రోజులు సమయం పడుతుందని డీలర్లు చెప్పడంతో ప్రభుత్వం కొంత గడువు ఇచ్చింది. సాఫ్ట్వేర్ సిద్ధమవడంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆధార్ లేకపోయినా వినియోగదారులందరికీ ఈనెల పదో తేదీ (సోమవారం ) నుంచి పాత పద్ధతిలో సబ్సిడీ ధరకే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ డీలర్లను ఆదేశించాయి. దీంతో మార్కెట్ ధర రూ.1,167.50 చెల్లించి సిలిండర్ తీసుకుని తర్వాత బ్యాంకు అకౌంట్లో సబ్సిడీ ఎప్పుడు జమ అవుతుందా అని ఎదురుచూడాల్సిన అవసరం ఇకపై వినియోగదారులకు ఉండదు. అయితే, సబ్సిడీ ధరపై ఇంకా స్పష్టత రాలేదు. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ. 441 వరకు ఉండే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం వరకు వినియోగదారులకు 11 సబ్సిడీ సిలిండర్లే వస్తాయని, వచ్చే ఏడాది నుంచి మాత్రం 12 వస్తాయని అధికారులు తెలిపారు. -
ఆధార్ లేకుండా గ్యాస్
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్ : వినియోగదారులకు ఆధార్‌కార్డుతో సంబంధం లేకుండా గ్యాస్ సిలెం డర్లు రాయితీ ధరపై సరఫరా చేయాలని భారత ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో ఆధార్ అమలవుతున్న చిత్తూరు, అనంతపురం, రంగారెడ్డి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వినియోగదారులకు సుమారు రూ.450లకే సిలెండర్ పంపిణీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలోని 7లక్షలకు పైగా ఉన్న వినియోగదారులకు రాయితీ డబ్బు బ్యాంకులో పడిందా లేదా అనే బాధ తప్పుతుంది. దీని అమలుకు మూడు రోజులు పడుతుందని ఏజెన్సీలు చెబుతున్నా యి. సిలెండర్ ఎంతకు అమ్మాలి ? అనే విషయూనికి సంబంధించి ఎల్పీజీ కంపెనీల నుంచి తమకు ఇంకా సమాచారం రాలేదని జిల్లా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఘాట్‌రోడ్డులో గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా
రాపూరు, న్యూస్‌లైన్ : రాపూరు -చిట్వే లి ఘాట్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ల లారీ లోయలో బోల్తా పడింది. గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిం డర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. అదృష్టవశాత్తు సిలిండర్లు పేలకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. లారీ శిథి ల్లో ఇర్కుపోయిన డ్రైవర్ రాత్రంతా నరకయాతన అనుభవించాడు. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా కడప నుంచి బుధవారం రాత్రి 9 గంటలకు 306 ఇండియన్ గ్యాస్ సిలిండర్ల లోడు తో డ్రైవర్ ఎగ్బాల్ జిల్లాలోని ముత్తుకూరుకు బయలుదేరాడు. అర్ధరాతి 12 గం టల సమయంలో రాపూరు 11,12 కిలో మీటర్ల మధ్యలో ఉన్న మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బ్రేక్ ఫెయిల్ అదపు తప్పి ఘా ట్ రోడ్డు పిట్టగోడను ఢీకొని లోయలోకి బోల్తాపడింది. తెల్లవారే వరకు ఎవరూ ఈ సంఘటనను గుర్తించలేదు. ఉద యం 7 గంటల సమయంలో అటుగా వెళుతున్న వాహనదారులు లారీ పడిపోయిన విషయాన్ని గుర్తించారు. డ్రైవ ర్ ఆర్తనాదాలు విని లోయలోకి దిగి అతన్ని రక్షించారు. సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 సిబ్బందికి అందించడంతో అందరూ హుటాహుటిన సంఘటన స్థలానికి చే రుకున్నారు. ైడ్రైవర్ను రాపూరు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి డ్రైవర్ కుటుంబ సభ్యులకు, లారీ యజమానికి, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు తెలియజేశారు. ఎస్ఐలు విశ్వనాథ్‌రెడ్డి, కరిముల్లా నేతృత్వంలో లోయలో పడిన సిలిండర్లను బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తప్పిన పెను ప్రమాదం గ్యాస్ సిలిండర్లు తీసుకుని వస్తున్న లారీ అదుపు తప్పి లోయలో పడినప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రాపూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ సిలిండర్లు పేలినా, డిజిల్ ట్యాంకు లీకై ఉండినా పెద్ద ప్రమాదమే సంభవించి ఉండేది. లారీలో ఎంత మంది ఉన్నారో కూడా తెలిసేది కాదు. రెండు సిలిండర్లకు రంధ్రాలు ప్రమాదంలో లారీ నుంచి బయటపడిన రెండు సిలిండర్లుకు చిన్న రంధ్రాలు ఏర్పడ్డాయి. ఘాట్ రోడ్డులోని లోయల్లో మంచు నిండి ఉండడంతో సిలిండర్లుకు రంధ్రాలు పడినా ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. సిలిండర్లు బయటకు తీసే సమయంలో ప్రమాదం సంభవిస్తుందని అగ్నిమాపక వాహనంతో పాటు వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గ్యాస్ సిలిండర్లను బయటకు తీశారు. వాహనాలు నిలిపివేత ఘాట్ రోడ్డులో గ్యాస్ సిలిండర్లు లారీ బోల్తా పడడంతో అవి పేలిపోతాయని పోలీసులు వాహనాల రాకపోలకలను నిలిపివేశారు. దాదాపు మూడు గంటల సేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
మన గ్యాస్..మన ఇష్టం
సాక్షి, ఏలూరు:గ్యాస్ సిలిండర్ సకాలంలో డెలివరీ కావడం లేదా.. అధిక ధర వసూలు చేస్తున్నారా.. తూకం తక్కువ ఉంటోందా.. మీ ఇంటికి గ్యాస్ ఏజెన్సీ దూరంగా ఉందా.. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ గ్యాస్ కనెక్షన్‌ను సంబంధిత ఏజెన్సీ/కంపెనీ నుంచి మరో ఏజెన్సీ/కంపెనీకి మార్చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ పేరిట వినియోగదారులందరికీ ఈ అవకాశం లభించింది. గ్యాస్ పోర్టబిలిటీ విధానం రాష్ట్రంలోని 19 జిల్లాలకు బుధవారం నుంచి అందుబాటులోకి రాగా, ఆ జాబితాలో మన జిల్లా కూడా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో వినియోగదారులు తమకు నచ్చిన ఏజెన్సీ నుంచి, తాము కోరుకున్న ఎల్పీజీ కంపెనీ నుంచి గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. దీనివల్ల గ్యాస్ కంపెనీల గుత్తాధిపత్యానికి,ప్రజల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఆగడాలకు అడ్డుకట్ట జిల్లాలో 48 గ్యాస్ ఏజన్సీల పరిధిలో దాదాపు 9.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నారుు. వీటిలో సుమారు 80వేల గృహ వినియోగ కనెక్షన్లు బ్లాక్ మార్కెటీర్ల చేతుల్లో ఉన్నాయి. బ్లాక్ మార్కెట్లో రూ.1,200 నుంచి రూ.1,500 చెల్లిస్తే తప్ప సిలిండర్ దొరకడం లేదు. డీలర్లే దీనిని పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వినియోగదారులను డీలర్లు అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఒక్కో ఏజెన్సీకి పరిమితికి మించి కనెక్షన్లు ఉండటం వల్ల వారు ఎవరికీ జవాబుదారీగా ఉండరు. గ్యాస్ సిలిండర్లలోని కొంత గ్యాస్‌ను బయటకు తీసి అమ్మేసుకుంటున్న ఘటనలు ఉన్నారుు. దీనిని అరికట్టేందుకు చమురు సంస్థలు కొత్త విధానాలను తీసుకువస్తున్నాయి. దానిలో భాగంగా అక్రమ గ్యాస్ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కూడా కల్పించాయి. తాజాగా కల్పించిన సౌకర్యంతో గ్యాస్ కంపెనీల మధ్య, డీలర్ల మధ్య పోటీ పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశాలున్నాయి. మరోవైపు బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మార్చుకోండిలా... గ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ చాలా సులభం. వినియోగదారులు ఇంటర్నెట్లో గ్యాస్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి క్లస్టర్లో లభించే ప్రతి కంపెనీ డిస్ట్రిబ్యూటర్లను చూడొచ్చు. గతంలో కల్పించిన స్టార్ రేటింగ్ ద్వారా డీలర్ల పనితీరును తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా కంపెనీ, డిస్ట్రిబ్యూటర్ను ఎంపిక చేసుకోవచ్చు. పాత డిస్ట్రిబ్యూటర్‌కు ఎక్విప్మెంట్ను తిరిగి ఇచ్చేసి, కొత్త డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి కొత్త సిలిండర్, రెగ్యులేటర్ తీసుకోవాలి. కంపెనీ మార్చుకోకుండా ఒకే కంపెనీలో వేరే డిస్ట్రిబ్యూటర్‌కు మారితే సిలిండర్, రెగ్యులేటర్ స్వాధీనం చేయూల్సిన అవసరంలేదు. వ్యతిరేకతను తట్టుకునేందుకేనా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయనే సాకుతో ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచింది. తొమ్మిది సిలిండర్ల వరకూ ప్రభుత్వం దాదాపు రూ.843 సబ్సిడీ ఇస్తోంది. దానికి ఆధార్ లింకుపెట్టి సరిగ్గా ఇవ్వడం లేదు. మరోవైపు సబ్సిడీ లేని సిలిండర్ ధరలను ఏడాదిగా పెంచుతూనే ఉన్నారు. గతేడాది జనవరిలో రూ.46.50 పైసలు పెంచారు. దీనివల్ల జిల్లా గ్యాస్ వినియోగదారులపై రూ.4 కోట్ల భారం పడింది. ఏడాది చివర్లో రాయితీ సిలిండర్‌పై మరో రూ.3 పెంచారు. ఈ ఏడాది ప్రారంభంలో సబ్సిడీ సిలిండర్‌పై రూ.25 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తొమ్మిది సిలిండర్లు దాటి (పదో సిలిండర్ నుంచి) రాయితీ లేని సిలిండరుపై రూ.217 పెంచడంతో ధర రూ.1,326 అయ్యింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.385 పెంచడంతో అదికాస్తా రూ.2,266కి చేరింది. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ ధరలు పెంచి జిల్లా వినియోగదారులపై రూ.11,20,50,00 భారాన్ని మోపారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఓట్లు రాబట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తులు వేస్తోంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ కోరారని సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను 12కు పెంచుతామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. తాజాగా గ్యాస్ కనెక్షన్ పోర్టబులిటీ నిర్ణయం తీసుకున్నారు. -
సబ్సిడీపై 12 సిలిండర్లు
-
సబ్సిడీపై 12 సిలిండర్లు
కేంద్రంలో మాకు మెజారిటీ రాకుండా కుట్ర బలహీన ప్రభుత్వం ఏర్పడేలా మాపై అసత్య ఆరోపణలు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కాంగ్రెస్‌పై రాజ్‌నాథ్ నిప్పులు సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ తమపై కుయుక్తులు పన్నుతోందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నిప్పులు చెరిగారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పాటు కాకుండా, కేవలం పేలవ ప్రభుత్వం ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కుట్రపన్నుతోందని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలతో కలసి రాజ్‌నాథ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి అధ్యక్షోపన్యాసం చేశారు. భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, హరిబాబు, వీర్రాజు, శాంతారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ప్రత్యేక ఆహ్వానితుడిగా కృష్ణంరాజు పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు రాంలీలా మైదాన్‌లో జరగనున్నాయి. రాజ్‌నాథ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: యూపీఏ పదేళ్ల పాలనపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని తెలుసుకున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకుండా, బలహీన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా అసత్య ఆరోపణలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఓటుబ్యాంకు రాజకీయాలకు మారుపేరైన కాంగ్రెస్...మన వల్ల లౌకిక వాదానికి పెనుముప్పంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దీన్ని తిప్పికొట్టేందుకు యూపీఏ పాలనలో జరిగిన స్కాంలు, ఆర్థిక వ్యవస్థ పతనం, ఓటుబ్యాం కు రాజకీయాల వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లోక్‌సభ ఎన్నికల్లో 272 స్థానాల్లో గెలిచి సంపూర్ణ మెజార్టీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తాం. భేటీలో ఏం చేశారంటే... 272 కన్నా ఎక్కువ సీట్ల సాధనకు రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితులపై అగ్రనేతల మేధోమథనం. ఒక ఓటు ఒక నోటు కార్యక్రమం ద్వారా పల్లెపల్లెకు వెళ్లడం, పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి, బూత్‌స్థాయిల్లో సమావేశాల నిర్వహణ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలు, ప్రచార వ్యూహాలపై చర్చ. ఆర్థిక, రాజకీయ తీర్మానాలకు తుదిరూపు సిక్కుల ఊచకోత గుర్తులేదా: బీజేపీ బీజేపీతో లౌకికవాదానికి ముప్పన్న సోనియాగాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా స్పందించారు. దశాబ్దాలపాటు సాగిన కాం గ్రెస్ పాలనలో 13 వేల అల్లర్లు జరిగాయని, 70 వేల మందికిపైగా మృత్యువాతపడటానికి కాంగ్రెస్ మతఛాందసవాద విధానాలే కారణమన్నారు. ముఖ్యంగా తమ పార్టీపై మతతత్వ ముద్ర వేస్తున్న కాంగ్రెస్‌కు 10 వేల మంది సిక్కుల ఊచకోత ఎవరి హయాంలో జరిగిందో గుర్తులేదా? అని దుయ్యబట్టారు. -
ఏడాదికి ఆరు సిలిండర్లు చాలు: పనబాక లక్ష్మి
బాపట్ల, న్యూస్‌లైన్ : గ్యాస్ సిలిండర్ల వినియోగంపై కేంద్ర పెట్రోలియంశాఖ చేయించిన సర్వేలో వినియోగదారులు ఏడాదికి 6.5 సిలిండర్లు మాత్రమే వాడుతున్నట్లు తేలిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. మిగిలిన సిలిండర్లను శుభకార్యాలకు, వంటశాలలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల కొందరు వినియోగదారులు, డీలర్లు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలో వేయటం వలన సిలిండర్ల బుకింగ్ తగ్గిపోయి బుక్‌చేసిన వెంటనే గ్యాస్ అందుతోందన్నారు. ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు మించి ఇవ్వటం అనవసరమన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు డీలర్లు అక్రమ మార్గాలు వెతుకుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ఆధార్‌కార్డు నమోదు జరిగితే అవకతవకలు ఉండవ న్నారు. గ్యాస్ సరఫరాలో ఆధార్ కార్డు లింకేజీ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్డులో పిటిషన్ వేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టవచ్చా..? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ఆయన సమైక్యావాది అని, అయినా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని పేర్కొన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ విషయం తనకు తెలియదన్నారు. -
పండుగ పూట గ్యాస్ కష్టాలు
గజ్వేల్ రూరల్, న్యూస్‌లైన్: పండుగ పూట ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఇంట్లోవారితో సంతోషంగా ఉండాల్సిన పండగనాడు గ్యాస్ దొరకకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకుండా పోతోందని వా పోతున్నారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా సిలిండర్లు గ్యాస్ సిలిం డర్లు ఇవ్వకపోవడంతో గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ రహదారిపై వినియోగదారులు రాస్తారోకో చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పండుగకు గ్యాస్ వస్తుందని ఏజెన్సీ చుట్టూ తిరుగుతన్న వినియోగదారులకు నిరాశ మిగిలింది. గజ్వేల్ పట్టణంలోని ఇండియన్ శేషుమా గ్యాస్ ఏజెన్సీకి నాలుగురోజుగా గ్యాస్ కోసం వినియోగదారులు తిరుగుతున్నారు. ఎప్పడొచ్చినా ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ లేదని చెబుతు నాలుగు రోజులుగా తిప్పుకుంటున్నారని మం డిపడ్డారు. గ్యాస్ కోసం ముందుగా బుక్ చేసుకున్నా సిలిండర్లు అందించడంలో నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నించారు. రోజు మాదిరిగానే ఆదివారం కూడా గ్యాస్ సిలిండర్ కోసం వచ్చిన వినియోగదారులకు ఏజెన్సీ బంద్ చేసి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశా రు. గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా ఉన్న గజ్వేల్- ప్రజ్ఞాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని ఏజెన్సీ నిర్వాహకులను పిలిపించి సమస్యను పరిష్కరించడంతో ఆందోళన విరమించారు. -
గ్యాస్ ధర పెంపు పేదలకు భారం
టీనగర్, న్యూస్‌లైన్: సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర పెంపు పేద ప్రజలకు భారంగా పరిణమిస్తుందని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి జీకే వాసన్ వ్యక్తం చేశారు. చెన్నై పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో పోర్టు ట్రస్ట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం శనివారం జరిగింది. ఈ శిబిరాన్ని జీకే వాసన్ ప్రారంభించారు. పోర్టుట్రస్ట్ చైర్మన్ అతుల్య మిశ్రా, పోర్టుట్రస్ట్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ లలితా గణపతి పాల్గొన్నారు. ఈ శిబిరంలో రూ.2వేల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంతో పాటు మాజీ స్పీకర్ చెల్లపాండియన్ 101 జయంతి వేడుకలు జరిగాయి. చెల్లపాండియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులు 20 మందికి మంత్రి పరికరాలను అందజేశారు. దీనికి సంబంధిం చిన ఏర్పాట్లను చెల్లపాండియన్ కుమారు డు, ట్రస్ట్ చైర్మన్ ఎ.పిచ్చై చేశారు. విలేకరులతో వాసన్ మాట్లాడుతూ పోర్టు ట్రస్ట్ వైద్య శిబిరం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పోర్టుట్రస్ట్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర పెంపు పేద ప్రజలను తీవ్రంగా బాధిస్తుందన్నారు. ఈ ధర పెంపును పునఃపరిశీలించాలని తెలిపారు. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తొమ్మిది నుంచి 12కు పెంచాలని పెట్రోలియం శాఖా మంత్రిని కోరుతున్నట్లు తెలి పారు. జాలర్ల సమస్యపై ఇరు దేశాల జాలర్ల సంఘాల ప్రతినిధులతో జనవరి 20వ తేదీన సమావేశం ఏర్పాటుకానుందన్నారు. కాంగ్రెస్ నాయకత్వా న్ని బలపరిచే పార్టీలతోనే పొత్తులు ఉంటాయని తెలి పారు. గెలుపు కూటమిని త్వరలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. -
64 సిలిండర్ల పట్టివేత
జగిత్యాల/మెట్పల్లి, న్యూస్‌లైన్ : పౌరసరఫరాల శాఖ అధికారులు శుక్రవారం జగిత్యాల, మెట్పల్లి పట్టణాల్లో దాడులు చేసి 64 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్నారు. జగిత్యాల, మంథని, హుజూరాబాద్, మెట్పల్లి, మల్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన డీటీసీఎస్‌లు ఇంక్‌షాప్ అలీ, రాజేష్, రమేష్, రాజేశ్వర్, రవికాంత్‌లతోపాటు పుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఈ దాడులు చేశారు. జగిత్యాలలో 19 దుకాణాల్లో 33 సిలిండర్లను స్వాధీనం చేసుకుని అందరిపై 6ఏ కేసు నమోదు చేశారు. మెట్పల్లిలో జిల్లా అసిస్టెంట్ గ్రేన్ మర్చంట్ అధికారి కాశీవిశ్వనాథ్ ఆధ్వర్యంలో అధికారులు పలు బృందాలుగా విడిపోయి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న హాస్టళ్లతోపాటు వ్యాపారుల గోదాముల్లో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 31 సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.2.70 లక్షల సోయా స్వాధీనం మెట్పల్లి పట్టణం చైతన్యనగర్లోని ఓ గోదాంలో ఎనగందుల అజయ్ అనే వ్యాపారి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2.70లక్షల విలువైన 132క్వింటాళ్ల సోయాను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. అరుణ్ అనే మరో వ్యాపారి గోదాంలో కూడా తనిఖీలు చేయగా.. సోయా, నువ్వుల నిల్వలు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. ఇవి కుప్పులుగా పోసి ఉండడంతో శనివారం వాటిని తూకం వేసి మొత్తం విలువ ఎంతనో నిర్ధాస్తామని కాశీవిశ్వనాథ్ తెలిపారు. ఈ దాడుల్లో పెద్దపల్లి, సుల్తానాబాద్, వేములవాడ, భీమ్దేవరపల్లి, గంగాధర, మల్యాల డీటీసీఎస్‌లు అంజన్న, రవీందర్, నాగార్జున, ఫారూఖ్, అశోక్ ప్రసాద్, లక్ష్మారెడ్డి, రాజేశ్వర్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిజాముద్దీన్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. -
గ్యాస్ దందా
జగిత్యాల, న్యూస్‌లైన్ : సబ్సిడీ గ్యాస్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా.. అక్రమార్కుల ఎత్తుల ముందు చిత్తవుతున్నాయి. సిలిండర్ల సరఫరాను కఠినతం చేసినప్పటికీ.. యథేచ్ఛగా పక్కదారిపడుతూనే ఉన్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతున్న ఈ అక్రమ దందాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. దళారుల సహకారంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్‌గా అమ్ముకుంటూ భారీగా ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు ఇటీవల గ్యాస్ సరఫరాపై అనేక ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఒక పేరుపై ఒకటికంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే వాటిని కట్ చేసింది. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి తొమ్మిది సిలిండర్లు మాత్రమే సరఫరా చేస్తోంది. నగదు బదిలీ అమలులో భాగంగా ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్‌కు లింక్ పెట్టింది. ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని అందరూ ఆశించారు. కానీ వినియోగదారులను నిబంధనల పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్న ఏజెన్సీలు అవే నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారిపట్టిస్తున్నాయి. ఉదాహరణకు జగిత్యాల పట్టణంలో రెండు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో దీపం పథకం కింద రెండు వేల కనెక్షన్లతోపాటు మరో లక్ష డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి గ్యాస్ వినియోగదారునికి ప్రతి సంవత్సరం తొమ్మిది సబ్సిడీ సిలిండర్లు పొందే అవకాశం ఉంది. కానీ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఏడాదికి 3-5 సిలిండర్లు మాత్రమే వినియోగిస్తున్నాయి. మిగిలిన సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీలు దళారులకు అమ్ముకుంటున్నాయి. సబ్సిడీపై రూ.450కి వచ్చే సిలిండర్‌ను దళారులకు రూ.650కి అమ్ముతున్నారు. దళారులు డిమాండ్‌ను బట్టి ఒక్కో సిలిండర్‌ను రూ.800 వరకు విక్రయిస్తున్నారు. వీటిని హోటల్ నిర్వాహకులు, వాహన వినియోగదారులు కొనుక్కొని వాడుకుంటున్నారు. చిన్న గ్యాస్ సిలిండర్లు అమ్మే దుకాణాల్లోను, గ్యాస్ మరమ్మతుల చేసే దుకాణాల్లో, రీఫిల్లింగ్ దుకాణాల్లో పెద్ద సిలిండర్లను కొని కమర్షియల్గానీ, ఇతర అవసరాలకు వినియోగించే వారికి గాని కిలోకు రూ.80-100 వరకు అమ్ముతున్నారు. ఇలా ఒక్కో సబ్సిడీ సిలిండర్‌పై చివరి వినియోగదారునికి చేరుకునే సరికి రూ.1200 పైగా ధర పలుకుతోంది. అంటే మిగిలిన రూ.750తో మధ్యలో ఉన్న దళారులు లబ్దిపొందుతున్నారు. ఈ రకంగా జగిత్యాల పట్టణంలో 70 మంది ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాలు, అన్ని పట్టణాల్లోనూ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కమర్షియల్ సిలిండర్లలో చేతివాటం జగిత్యాలలో కమర్షియల్ సిలిండర్లు మూడు వేలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఈ సిలిండర్లు 21 కిలోల బరువు ఉంటాయి. వీటి ధర రూ.1900. గ్యాస్ ఏజెన్సీ యజమానులు కమర్షియల్ సిలిండర్ల అమ్మకం జరగకపోవడంతో వాటిని దళారులకు రూ.200 తగ్గించి రూ.1700లకు అమ్మకాలు జరుపుతుంటారు. వారు కిలోకు రూ.100 చొప్పున వ్యాపారులకు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ రకమైన సబ్సిడీ మాయను కొంతకాలంగా భారీగా జరుగుతున్నా ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. ఇలా ఒక్క జగిత్యాలలోనే నెలకు రూ.60-70 లక్షలు గోల్మాల్ జరుగుతున్నట్లు అంచనా. -
సిలిం‘డర్’
కొత్త సంవత్సరం శుభాలను మోసుకురావడం అటుంచితే.. మొదటి రోజే చుక్కలు చూపనుంది. పండగ వాతావరణం కాస్తా ఆవిరి కానుంది. సాధారణంగా ఏడాదంతా జనవరి 1వ తేదీ కోసం ఎదురుచూడటం సహజం. అలాంటిది ఆ తేదీ తలచుకొని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తెల్లారితే.. సిలిండర్లు గుదిబండగా మారనున్నాయి. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో చోటు చేసుకున్న పరిణామం ఎన్నో కుటుంబాల్లో పొయ్యి వెలగనివ్వదంటే అతిశయోక్తి కాదు. ఆదోని, న్యూస్‌లైన్: గ్యాస్ సిలిండర్లు భయపెడుతున్నాయి. పేలుతాయని కాదు.. ధర వింటేనే ప్రజలు హడలిపోతున్నారు. రేపటి నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమల్లోకి రానుంది. ఇక నుంచి సిలిండర్ కావాలంటే మొత్తం ధర రూ.1110 చెల్లించాల్సిందే. వీటికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారికే ఈ లబ్ధి చేకూరనుంది. అయితే జిల్లాలో ఇప్పటికీ ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం వరకు బిల్లు చేసిన సిలిండర్లను మంగళవారం పంపిణీ చేసేందుకు గ్యాస్ ఏజెన్సీ ముమ్మర ఏర్పాట్లు చేపట్టాయి. ఇందుకోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశాయి. బుధవారం నుంచి సబ్సిడీ లేని సిలిండర్లను మాత్రమే అందివ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని మొదటి విడతగా రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా రెండో విడతలో మరో ఐదు జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించింది. ఇందులో కర్నూలు జిల్లా ఒకటి. మొదటి విడత పథకం అమలైన జిల్లాల్లో సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లో జమ కాలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు దూరమవుతోంది. జిల్లాలో దాదాపు 5 లక్షలకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 2.30 లక్షల సింగిల్ సిలిండర్లు, 1.29 లక్షల డబుల్ సిలిండర్లు, 1.43 లక్షల దీపం కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం 48 ఏజెన్సీల ద్వారా ప్రతి రోజూ దాదాపు 16వేల సిలిండర్లను వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారు. సబ్సిడీతో కూడిన సిలిండర్ల సరఫరా సమయంలో వినియోగదారులు రూ.406 నుండి రూ.411 చెల్లించేవారు. అలాంటిది ఇకపై ఒక్కో సిలిండర్‌కు రూ.1110 చెల్లించాల్సి ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. సిలిండర్లను మొత్తం ధర చెల్లించి ఎలా కొనుగోలు చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. సబ్సిడీని బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆధార్ నమోదు కొలిక్కిరాని పరిస్థితుల్లో ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. అదేవిధంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మందికి ఆధార్ కార్డులు అందలేదు. పలుచోట్ల ఆధార్ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఇలాంటి వారు జిల్లాలో 40 శాతం పైనే ఉన్నారు. వీరంతా సబ్సిడీని కోల్పోవాల్సి రానుండటంతో.. తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. వంద శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు. -
వసతిగృహాలకు గ్యాస్ సిలిండర్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని బీసీ, సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంట చేసే నిర్వాహకుల కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి వీరు గ్యాస్‌పై చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 2,967 కొత్త గ్యాస్ కనెక్షన్లు కేటాయిస్తూ కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రొసిడింగ్ ఆయా సంబంధిత అధికారులకు అందా యి. పాఠశాలల్లో చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఒక గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్, రెగ్యులెటర్ చొప్పున కేటాయించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు 890, పాఠశాలలకు 1,951, సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు 102, గురుకుల పాఠశాలలకు 22, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు రెండు చొప్పున కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. పాఠశాలలకు కనెక్షన్లు ఇలా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద వంటచేసి పెట్టేందుకు జిల్లాలోని పాఠశాలలకు 1,951 గ్యాస్ కనెక్షన్లు కేటాయించారు. గుడిహత్నూర్, బేల, జైనథ్, తాంసి మండలాలకు 126, కౌటాల, లోకేశ్వరం మండలాలకు 45, ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు 222, ఆసిఫాబాద్, జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణికి 192, ముథోల్, తానూర్‌కు 69, బెజ్జూర్‌కు 36, బెల్లంపల్లి, నెన్నెలకు 44, జన్నారంకు 43, దిలావర్పూర్, సారంగాపూర్లకు 33, తలమడుగుకు 33, వాంకిడి, కెరమెరిలకు 94, బోథ్, బజార్హత్నూర్లకు 79, నేరడిగొండ, ఇచ్చోడకు 70, దహెగాం, సిర్పూర్(టి)లకు 38, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లిలకు 111, నిర్మల్‌కు 44, మందమర్రికి 15, కాసిపేటకు 40, తాండూర్, భీమినిలకు 45, కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్లకు 99, రెబ్బెనకు 34, ఆదిలాబాద్‌కు 86, భైంసా, కుభీర్‌కు 83, దండేపల్లి, కాగజ్‌నగర్‌కు 75, లక్సెట్టిపేటకు 7, ఖానాపూర్, కడెంకు 94, మామాడ, లక్ష్మణచాందకు 35, జైపూర్‌కు 39, మంచిర్యాల మండలానికి 20 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా, ముథోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు 12 కనెక్షన్లు మంజూరు చేశారు. ఆదిలాబాద్‌లోని రాంనగర్లో గల వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలకు మూడు, లక్సెట్టిపేటలోని బీసీ బాలు గురుకల పాఠశాలకు మూడు, మామడలోని కస్తూర్భా గాంధీ విద్యాలయానికి(కేజీబీవీ) నాలుగు గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. వసతిగృహాలు, అంగన్వాడీలకు కేటాయింపు.. సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలకు 102 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఒక్కొ వసతిగృహానికి ఆరు కనెక్షన్ల చొప్పున కేటాయించారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహం(బాలుర, బాలికలు) ఆదిలాబాద్‌కు 12, మందమర్రికి 12, మంచిర్యాలకు, 12, లక్సెట్టిపేటకు 12, నిర్మల్‌కు 12, కాగజ్‌నగర్‌కు 12, ఉట్నూర్‌కు ఆరు, బెల్లంపల్లికి 12, ఆసిఫాబాద్‌కు 12 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి తాంసి, తలమడుగు, ఆదిలాబాద్, గుడిహత్నూర్ మండలాలకు 252 కనెక్షన్లు మంజూరు చేశారు. బోథ్, బజార్హత్నూర్, ఇచ్చోడలకు 147, నేరడిగొండ, ఇచ్చోడలకు 77, సిర్పూర్(టి), కాగజ్‌నగర్‌లకు 68, కౌటాల, బె జ్జూర్లకు 129, భీమినికి 41, బేల, జైనథ్లకు 126, దహెగాం మండలానికి 50 చొప్పున 890 కనెక్షన్లు మంజూరయ్యాయి. -
గ్యాస్ కోసం పడిగాపులు
కావలిఅర్బన్, న్యూస్‌లైన్ : స్థానిక జెండాచెట్టు సమీపంలో ఉన్న శ్రీభవాని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు దీరారు. గ్యాస్ కోసం వచ్చిన వృద్ధులు, చంటి బిడ్డలను తీసుకు వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.గ్యాస్ సిలిండర్ కోసం ఉదయం ఏజెన్సీ వద్దకు వచ్చిన వినియోగదారులు సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. ఏజెన్సీలో విద్యుత్ లేని కారణంగా కంప్యూటర్లు పని చేయకపోవడంతో సిలిండర్లను పంపిణీకి అంతరాయం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా జనరేటర్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైన సిలిండర్ల పంపిణీ సాయంత్రం వరకు సాగింది. -
చెట్టును ఢీకొట్టిన ట్రాలీఆటో
ఉప్పునుంతల, న్యూస్‌లైన్ : చెట్టును ట్రాలీఆటో ఢీకొట్టడంతో ఇద్దరు యు వకులు అక్కడికక్కడే దుర్మరణం పా లయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి జరిగి న ఈ సంఘటన గ్యాస్ సిలిండర్లను తరలి స్తుండగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అమ్రాబాద్ మం డలం ఇప్పలపల్లికి చెందిన మేణావత్ చందులాల్(27), నల్గొండ జిల్లా చం దంపేట మండలం సండ్రల్గడ్డతం డా వాసి కేతావత్ నాగరాజు(17) హై దరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణికాలనీలో ఉంటూ ఆటోలు నడపడంతోపాటు కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి అచ్చంపేట మండ లం ఘనపురం గ్రామానికి చెందిన సభావత్ లక్పతీనాయక్కు చెందిన ట్రాలీఆటోను తీసుకుని అమ్రాబాద్ నుంచి ఇండియన్ గ్యాస్ సిలిండర్లను నగరానికి తరలిస్తున్నారు. మార్గమధ్యంలోని అయ్యవారిపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే ఆటోరోడ్డు పక్కనఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వాహనం క్యాబిన్లో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉప్పునుంతల ఎస్ఐ వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికితీసి పోస్టుమార్టం కోసం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆటోలోని సిలిండర్లను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మృతుడు చందులాల్‌కు భార్య లలితతోపాటు ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. నాగరాజు తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోగా, చెల్లెలు ఉంది. బ్లాక్ మార్కెట్‌కు తరలించే యత్నంలోనే.. వంటగ్యాస్ సిలిండర్లను ఆటోలో దొంగచాటుగా రాత్రివేళ తరలించే ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగి నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఇక్కడ ఒక్కో సిలిండర్ రూ.750కు కొనుగోలు చేసి నగరంలో రూ.1200కు బ్లాక్‌లో అమ్ముతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ఆటోలో ఉన్న 30 సిలిండర్లను ఎంఆర్ఐ సుల్తాన్, వీఆర్వో నిరంజన్ స్వాధీనం చేసుకుని అచ్చంపేటలోని భారత్‌గ్యాస్ గోదాంలో భద్రపర్చారు. దీనిపై విచారణచేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహశీల్దార్ సీహెచ్ నాగయ్య తెలిపారు. -
వంట గ్యాస్ ఆదా చేయండిలా..
పటాన్చెరు రూరల్, న్యూస్‌లైన్: వంటింట్లో గ్యాస్ సిలిండర్ వినియోగం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖర్చును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే 30 శాతం గ్యాస్ ఆదా అవుతుందని అంటున్నారు. అవి ఏమిటంటే... వంట చేసేటప్పుడు వండుతున్న పాత్రలపై మూత పెట్టి ఉంచడం. ప్రెషర్ కుక్కర్లను వినియోగించడం. గ్యాస్ పొయ్యి వెలిగించే ముందే వంటకు కావాల్సిన అన్నిరకాల సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్‌ల నుంచి తీసిన పదార్థాలను వెంటనే స్టౌపై ఉడికించరాదు. పప్పు దినుసులు, బియ్యం వంటివి ముందే నీళ్లలో నాన పెట్టి ఉడకపెట్టడం మంచిది. వండే పరిమితిని బట్టి పాత్రను వాడాలి. వంట పాత్ర అడుగు భాగం వెడల్పుగా ఉండాలి. వంట పాత్రలు మరగడం మొదలైన వెంటనే మంట తగ్గించాలి (సిమ్ చేయాలి). తరచూ స్టౌ బర్నల్ను శుభ్రం చేయించుకోవాలి. బీటలు వారిన పైపు (రబ్బర్ ట్యాబ్)ను వాడకూడదు. గాలి ఎక్కువగా వీచే ప్రాంతంలో వంట చేయరాదు. (కిచెన్‌లో ఎక్కువ గాలి రాకుండా చూసుకోవాలి.) వంట పూర్తయ్యేంత వరకు వంట గదిని విడిచి వెళ్లరాదు. మరిగే పాత్రల నుంచి పదార్థాలు బర్నర్లపై పడకుండా చూడాలి. -
సెప్టెంబర్ నుంచి నగదు బదిలీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గ్యాస్ కనెక్షన్లకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఆధార్ నంబర్లతో తమ బ్యాంక్ అకౌంట్‌ను అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, డీలర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 35 జిల్లాలో నగదు బదిలీ పథకం గ్యాస్ కనెక్షన్లకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం వర్తింపజేయనున్నట్లు, అందులో మన జిల్లా కూడా ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లోగా తమ బ్యాంక్ ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానం చేయకుంటే సబ్సిడీ రాదని పేర్కొన్నారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసిన వినియోగదారులకు రూ.450 జమ అవుతాయని వివరించారు. బ్యాంకులో డబ్బులు జమ అయిన తరువాత రెండు రోజుల్లో సిలిండర్ తీసుకోవాలన్నారు. జిల్లాలో 3.55 లక్షల మంది సాధారణ కనెక్షన్ వినియోగదారులు ఉండగా, 1.50 వేలు దీపం కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు లక్ష మంది వరకు మాత్రమే అనుసంధానం చేసుకున్నారని, మిగతా వారు ఈ వారంలోగా అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ లెటర్, ఎస్వీ జిరాక్స్ కాపీలతో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్, గ్యాస్ ఏజెన్సీ డీలర్లను, బ్యాంకులను సంప్రదించాలని సూచించారు. అధికారులపై ఆగ్రహం గ్యాస్ వినియోగదారుని ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం చేయడం తెలియడం లేదని అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పి 45 రోజులు గడుస్తున్నా ఇంత వరకు పట్టించుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 54 శాతం సీడింగ్ పూర్తి చేశారని, జూలై మొదటి వారంలో 10 శాతం అనుసంధానం చేస్తే 45 రోజుల్లో 44 శాతం ఆధార్‌తో అనుసంధానం చేశారని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్లు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని హెచ్చరించారు. వారం పది రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సుజాత శర్మ, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, డీఎస్వో వసంత్‌రావు దేశ్‌పాండే, ఎఎస్వో సత్యనారయణ, ఎన్ఐసీ డీఐవో రాకేష్ బ్యాంకర్లు, డీలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఏపీలో మరో 7 జిల్లాల్లో వంటగ్యాస్ సబ్సిడీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఐదు జిల్లాల్లో అమలవుతున్న వంట గ్యాస్ సిలిండర్‌కు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం సెప్టెంబర్ 1 నుంచి మరో 7 జిల్లాల్లో అమలు కానుంది. ఏపీలో ప్రస్తుతం అనంతపురం, చిత్తూరు, రంగారెడ్డి, తూర్పు గోదావరి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ పథకం అమలవుతుండగా వచ్చే నెల నుంచి శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, ఆదిలాబాద్, వైఎస్సార్, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమల్లోకి రానుంది. ఏపీతోపాటు గోవా, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్లలోని మరో 35 జిల్లాల్లో ఈ పథకం అమలుకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఆమోదం తెలిపినట్లు ఆ మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమలయ్యే జిల్లాల సంఖ్య 55కు చేరనుంది. ఈ పథకం కింద సిలిండర్లపై సబ్సిడీని ఆధార్‌తో అనుసంధానించిన వినియోగదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్న సంగతి తెలిసిందే.