జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ | gas leakage Prevention of accidents | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ

Published Sun, Mar 8 2015 4:02 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ - Sakshi

జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ

కుల్కచర్ల: గ్యాస్ సిలిండర్ లీకై ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమైపోయాయి. తరచూ గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం సంభవిస్తోంది. అవగాహ న లోపం, సరైన జాగ్రత్తలు పా టించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కుత్బుల్లాపూర్ మండల పరిధిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. తాజాగా శుక్రవారం షాబాద్ మండలం సోలిపేట్‌లో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలింది.

ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2 లక్షల ఆస్తినష్టం జరిగింది.అదృష్టవశాత్తు ప్రాణాపాయం సంభవించలేదు. వంటింట్లో మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.
   
ఇంట్లో సిలిండర్ ఎప్పుడు నిలువుగా ఉంచాలి
మూసి ఉంచిన బీరువాలో గాని డబ్బాలో గాని సిలిండర్‌ను ఉంచరాదు.
గ్యాస్ సిలిండర్ రబ్బర్ ట్యూబ్, రెగ్యులేటర్ మార్చేందుకు వీలుగా వంటగదిలో ఖాళీ స్థలం ఉంచుకోవాలి.
గ్యాస్ సిలిండర్ దగ్గర్లో కిరోసిన్, పెట్రోల్ లేకుండా జాగ్రత్తపడాలి.  
సిలిండర్ డెలివరీ సమయంలో దానికి  రక్షణ తొడుగు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
రెగ్యులేటర్‌ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. రెగ్యులేటర్ పెట్టగానే గ్యాస్ లీకైతే వెంటనే దానిని మార్చాలి.  
ఐఎస్‌ఐ మార్క్ ఉన్న రెగ్యులేటర్ ట్యూబ్, లైటర్‌లు కొనుగోలు చేయాలి.  
గ్యాస్ స్టౌ ిసిలిండర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. సర్వీసింగ్ చేసిన తర్వాత బర్నల్ సిమ్మర్ సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వంటగదికి వెంటిలేటర్ ఉండాలి.
తగినంత వెలుతురు, గాలి వంటగదిలోకి రావాలి. వంటగదిలో ఫ్రిజ్‌ను ఉంచుకోరాదు.
రాత్రి నిద్రించే ముందు రెగ్యులేటర్‌ను కట్టివేయాలి.
గ్యాస్ స్టౌవ్‌ను డీలర్ వద్ద లేదా అనుభవం ఉన్న మెకానిక్ వద్ద మాత్రమే చేయించాలి.  
గ్యాస్ సేఫ్ పరికరం ఉందా
ప్రస్తుతం మార్కెట్‌లో గ్యాస్ సేఫ్ పరికరాలు లభిస్తున్నాయి. వాటిని సిలిండర్ బిగిస్తే చాలు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు గ్యాస్ సరఫరా ఆటోమెటిక్‌గా నిలిచిపోతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజన్‌తో పాటు 108కు సమాచారం ఇవ్వాలి. గ్యాస్ లీకైన వెంటనే జనాలు ఇంట్లోంచి బయటకు వెళ్లాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement