Safety precautions
-
అకాల వానలు, పిడుగులు.. ఆ సమయాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వేసవే అయినా మబ్బులు భయపెడుతున్నాయి. అకాల వానలతో పాటు పిడుగులు ప్రాణాలను బలికొంటున్నాయి. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమని వైద్యులు, వాతావరణ వేత్తలు సూచిస్తున్నారు. వర్షాల సమయంలో బయట పనులకు వెళ్లేవారు, పొలంలో పనిచేసే రైతులు, ఉపాధి వేతనదారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏం చేయకూడదు..? ►జోరు వాన కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదు. ►ఉరుములు, మెరుపుల సమయాల్లో పొలాల్లో ఉండకూడదు. ►మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లే దా అంతకంటే తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలో పిడుగుపడే అవకాశముంది. ►మెరుపు కనపడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లకపోవడం మేలు. ►గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్‌ఫోన్ ఉంటే స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ►వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండరాదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. ►గుండె సంబంధిత వ్యా«ధులు ఉన్నవారు మె రుపులు, ఉరుములతో భయాందోళనకు గురవుతారు. ఇలాంటి వారు ఇళ్లలో ఉండడం మేలు. ఇలా చేయండి... ఆమదాలవలస: పిడుగు పాటుపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమదాలవలస డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.జగన్నాథరావు సూ చించారు. మేఘం నల్లబడే సమయంలో పొలాల్లో, ఆరుబయట ఎవరూ ఉండకూడదని వెంటనే దగ్గరలో ఉన్న షెల్టర్‌లోకి చేరుకోవాలని సూచించారు. ము ఖ్యంగా భారీ చెట్లు, తాటిచెట్టు, ఈత చెట్టు వంటి వాటి కిందకు వెళ్లకూడదన్నారు. వర్షం కురుస్తున్న సమయంలో గొడుగు కూడా వేసుకొని బహిరంగ ప్ర దేశాల్లోకి వెళ్తే వారిపై పిడుగు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. గ త్యంతరం లేని పరిస్థితుల్లో పొలంలో ఉండిపోతే వెంటే ఎలాంటి చెట్లు లేని దగ్గర కాళ్ల ముడుకులు గుండె భాగానికి తగిలేలా కూర్చుని, చెవులు రెండు చేతులతో మూసుకొని కూర్చుంటే 80 శాతం రక్షణ పొందవచ్చునని తెలిపారు. ప్రథమ చికిత్స చేయాలి పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడిబట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లను ఒక అడుగు పైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలో ఉంచి అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమచికిత్స చేయాలి. సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి. – యండ భవ్యశ్రీ, వైద్యాధికారి, సరుబుజ్జిలి చదవండి: ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే..ఇప్పుడు కర్మాగారాల ఖిల్లా! -
కరోనా కాలం.. అండగా నిలిచే ఆర్థిక సూత్రాలు
అసాధారణమైన కోవిడ్–19 మహమ్మారి సంక్షోభం ప్రపంచాన్ని ఒక్కసారిగా చుట్టేసింది. దీనితో వ్యాపారాలు కుదేలై, ఉద్యోగాలు కోల్పో యి, ఆదాయాలు పడిపోయి, ఖర్చులు పెరిగిపోయి ఎందరో సతమతమవుతున్నారు. ఇళ్లు గడవడం కోసం చాలా మంది రిస్కు చేసి మరీ పనిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కష్టకాలమే అయినప్పటికీ భద్రమైన భవిష్యత్తును నిర్మించుకోవడంలో ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని గురించిన అనేక పాఠాలు చెబుతోంది. కష్టసమయంలో మీ ఆర్థిక పరిస్థితులను నియంత్రణలో ఉంచుకోవడానికి తోడ్పడే అంశాలు కొన్ని ఉన్నాయి. * ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మదింపు చేసుకోవాలి: మీకు ఆదాయం వచ్చే అన్ని వనరులను (జీతభత్యాలు, పెట్టుబడులు–పొదుపు మొత్తాలపై రాబడులు మొదలైనవి) పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆస్తులు, పెట్టుబడుల జాబితా తయారు చేసుకోవాలి. అవసరమైతే అప్పటికప్పుడు లిక్విడేట్ (వెంటనే విక్రయించి నగదు పొందగలిగేవి) చేయగలిగేవి, 1–3 నెలల వ్యవధిలో విక్రయించగలిగేవి, అమ్మడానికి సమయం పట్టేసేవి (స్థిరాస్తులు, లాకిన్ పరిమితులు ఉండే ఫండ్లు, బాండ్లు వంటివి) అన్నీ ఒక లిస్టు రూపొందించుకోవాలి. ఆ తర్వాత మీ బాకీలు, చెల్లించాల్సిన రుణాలు మొదలైనవి రాసుకోవాలి. * ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి: పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదాయాలు, వ్యయాలు, పొదుపు, పెట్టుబడులు, రుణాలు మొదలైనవన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన స్వల్పకాలిక .. దీర్ఘకాలిక అవసరాలు, ఆకాంక్షలు, జీవిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలి. మారే అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా మధ్య, మధ్యలో ఆయా ప్రణాళికల్లో అవసరమైతే సవరణలు చేసుకుంటూ ఉండాలి. కొంత మొత్తాన్ని సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లలో ఇన్వెస్ట్ చేయడం పరిశీలించవచ్చు. ఇవి ఎక్కువ భారంగా ఉండవు. పన్నుపరంగానే కాకుండా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల సగటు పెట్టుబడి వ్యయం కొంత తగ్గుతుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా జీవితం ఎంత అస్థిరమైనదన్నది కరోనా మహమ్మారి ప్రపంచానికి తెలియజెప్పింది. కాబట్టి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ ఇంటి పెద్దకు ఏదైనా అనుకోనిది జరిగినా కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా తగు స్థాయి కవరేజీతో జీవిత బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇందుకోసం తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీనిచ్చే టర్మ్ ప్లాన్లను పరిశీలించవచ్చు. ప్రస్తుత ఆర్ధిక సంక్షోభ పరిస్థితుల్లో గ్యారంటీగా రాబడులు ఇచ్చే పథకాల్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇటీవలి కాలంలో జీవన శైలికి సంబంధించిన వ్యాధులు, చికిత్స వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలి. తగినంత కవరేజీ ఉండేలా చూసుకోవాలి. అత్యవసర నిధి ఆర్థిక సంక్షోభ సమయంలో అత్యవసర నిధే ఆదుకుంటుంది. దాదాపు 6–12 నెలల ఆదాయానికి సరిపడేంత స్థాయిలో ఇలాంటి ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే చేతిలో ఉండేలా చూసుకోవాలి. మరో విషయం, దీన్ని కేవలం ఎమర్జెన్సీలోనే ఉపయోగించాలన్న సూత్రాన్ని నిబద్ధతతో పాటించాలి. రుణాల వలలో చిక్కుకోవద్దు కొంగొత్త ఉత్పత్తులు, మార్కెటింగ్ గిమ్మిక్కులు, సులభంగా రుణాలు లభించే అవకాశాలు మొదలైన వాటి ఆకర్షణలో పడిపోతే రుణాల వలలో చిక్కుకునే ముప్పు ఉంది. ఇది మీ ఆర్థిక ప్రణాళికకు ప్రతికూలమే కాకుండా, ఆర్థిక సంక్షోభ పరిస్థితి ఎదురైనప్పుడు గట్టి దెబ్బతీసే అవకాశం ఉంటుంది. వివిధ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుబడులన్నీ ఒకే సాధనంలో ఉంచకండి. షేర్లు, డెట్ (బాండ్లు మొదలైనవి), పసిడి, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో కొంత కొంతగా ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల రిస్కులు తగ్గించుకోవడంతో పాటు కొంత ఎక్కువ రాబడిని పొందగలిగే అవకా>శాలు ఉంటాయి. ఆర్థిక సాధనం ఎంచుకునేటప్పుడు ఎన్నాళ్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ అవసరానికి ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది దృష్టిలో ఉంచుకోవాలి. ఉదాహరణకు ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించగలవు. ఇవి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడం, చాలా రిస్కులతో ముడిపడి ఉన్నవి కావడం వల్ల స్వల్పకాలిక అవసరాల కోసం వీటిలో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం కాదు. స్థూలంగా చెప్పాలంటే, జీవితంలో ఎత్తుపల్లాలను అధిగమించాలంటే, నిశ్చింతగా ముందుకెళ్లాలంటే ఆర్థిక క్రమశిక్షణ, వివేకంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ప్రస్తుత కరోనా మహమ్మారి కొన్నాళ్లకు వెళ్లిపోవచ్చు. కానీ ఈ సంక్షోభం నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాల సారాంశాన్ని గ్రహించి, ఇకపైనా అమలు చేయడం కొనసాగించగలిగితే.. భవిష్యత్తులో మరో సవాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనగలము. - కార్తీక్ రామన్, సీఎంవో, ఏజీఎస్ ఫెడరల్ లైఫ్ ఇన్సురెన్స్ చదవండి: ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
స్థిరాస్తి అమ్మాలా ? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టపరంగా వ్యవహరించాల్సిన తీరు తెన్నుల గురించి మనం తెలుసుకుంటున్నాం. గత వారం కొనే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. ఈ వారం అమ్మేవారికి వర్తించే విషయాలు, జాగ్రత్తలు తెలుసుకుందాం. స్థిరాస్తి విక్రయంలో ప్రతిఫలం ఎలా తీసుకోవాలి? ఒప్పందంలో పేర్కొన్న మొత్తాన్ని ప్రతిఫలం అంటారు. ఇంత మొత్తమే తీసుకోవాలి. నగదు రూపంలో తీసుకోకూడదు. అన్ని వ్యవహారాలు బ్యాంకు ద్వారానే జరగాలి. నగదు తీసుకోవచ్చా? నగదు రూపంలో ప్రతిఫలం తీసుకోకూడదు. అలా తీసుకుంటే అంతకు అంత పెనాల్టీలు పడతాయి. స్థిరాస్తి అమ్మగా వచ్చే లాభాలను ఎలా పరిగణిస్తారు? స్థిరాస్తి అమ్మగా వచ్చే లాభాలను ఆదాయపు పన్ను చట్ట పరిభాషలో ’మూలధన లాభాలు’ అంటారు. మూలధన లాభాలపై పన్ను భారం పడుతుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలంటే ఏమిటి? స్థిరాస్తులకు ’హోల్డింగ్ పీరియడ్’ ఉంటుంది. అంటే ఓనర్షిప్. ఓనర్షిప్ ఎన్నాళ్లుగా ఉందన్న దానిబట్టి స్వల్ప, దీర్ఘకాలిక పీరియడ్‌ను లెక్కిస్తారు. రెండు సంవత్సరాల లోపు ఉంటే స్వల్పకాలికమని, రెండు సంవత్సరాలు దాటితే దీర్ఘకాలికమని అంటారు. పన్నుభారంపరంగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? రెండింటి మీద లాభాలను ఆదాయంగా పరిగణిస్తారు. స్వల్పకాలికం మీద ఎటువంటి మినహాయింపు రాదు. అంతే కాకుండా లాభాన్ని ఇతర ఆదాయాలతో కలిపి పన్ను భారాన్ని శ్లాబుల ప్రకారం లెక్కిస్తారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై మినహాయింపు పొందవచ్చు. ఇంకా ఆదాయం మిగిలిపోతే ఆ మొత్తం మీద 20 శాతం బేసిక్ రేట్ పన్ను భారం పడుతుంది. అమ్మే స్థిరాస్తి మీద ఆదాయం చూపించాలా? స్థిరాస్తి అమ్మేవరకు ఆ ఇంటి మీద ఆదాయాన్ని సెల్ఫ్–ఆక్యుపైడ్‌గా గానీ అద్దెకి ఇచ్చినట్లుగా గానీ తప్పనిసరిగా చూపించాలి. స్థిరాస్తి స్వభావం ఎలాంటిదై ఉండాలి? స్థిరాస్తి అంటే ’రెసిడెన్షియల్’ ప్రాపర్టీ మాత్రమే. కమర్షియల్ ప్రాపర్టీలకు మినహాయింపు వర్తించదు. కొనే ఆస్తిని స్వదేశంలోనే కొనుగోలు చేయాలా? పన్ను మినహాయింపు పొందాలంటే కొనబోయే ఆస్తిని మన దేశంలోనే కొనుగోలు చేయాలి. విదేశాలలో కొనే ఇంటిపై ఎటువంటి మినహాయింపులు రావు. ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయి? ఈ మినహాయింపులు కేవలం వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయి. కొత్త ఆస్తి కొనాల్సిందేనా లేక కట్టుకోవచ్చా? కొత్త ఆస్తి అంటే ఇల్లు కాని ప్లాట్ కానీ కావచ్చు. ఇల్లు కొనవచ్చు .. కట్టుకోవచ్చు.. కట్టించుకోవచ్చు. అలాగే ప్లాటు కొనుక్కోవచ్చు. పై చెప్పిన విషయాల్లో గడవులు ఉన్నాయా? æస్థిరాస్తి అమ్మిన తేదీ నుంచి 3 సంవత్సరాల లోపల ఇల్లు/ప్లాటు కొనవచ్చును. అలాగే కట్టించుకోవచ్చు. అలా కాకుండా అమ్మిన తేదికి ఒక ఏడాది ముందుగా కొన్నా ప్రయోజనం పొందవచ్చు. ఒకవేళ నిర్మిస్తున్నదయితే ఒక సంవత్సరం ముందుగా మొదలుపెట్టి 2 సంవత్సరాల లోపు పూర్తి చేయాలి. కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: ఆన్లైన్ బ్యాకింగ్‌లో ఈ సూచనలు కచ్చితం..! లేకపోతే అంతే సంగతులు..! -
కరోనా ఎఫెక్ట్ : బిక్కుబిక్కుమంటూ బస్సు ప్రయాణాలు
సాక్షి, నిజామాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అనే భావనను కరోనా మాయం చేస్తోంది. ఈ మాయాదారి వైరస్ విజృంభిస్తుండడంతో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. నిత్యం బస్సుల్లో ప్రయాణికులు తమతమ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ బస్సులో కోవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ఆర్టీసీ తూ తూ మాత్రాంగా చర్యలు చేపట్టడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. బిక్కు బిక్కుమంటూ బస్సుల్లో ప్రయాణం నిజామాబాద్ రీజియన్ పరిధిలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. వీటీ పరిధిలో నిజామాబాద్‌లో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డిపో–1, డిపో–2, కామారెడ్డిలో బాన్సువాడ, కామారెడ్డి మొత్తం ఆరు డిపోలు ఉన్నాయి. మొత్తం 640 బస్సుల్లో అద్దె బస్సులు 181 ఉన్నాయి. ప్రతి రోజు బస్సులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు సైతం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. నిత్యం లక్షకుపైగా ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో బస్టాండ్లలో, బస్సుల్లో కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కేవలం నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడలల్లో బస్టాండ్లలో శానిటైజేషన్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోని, భౌతిక దూరం పాటించాలని మైక్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మండల కేంద్రల్లో, గ్రామాల్లో ఉన్న బస్టాండ్లలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. కరోనా నిబంధనలు అమలు కావడం లేదు కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు తమతమ పనుల నిమిత్తం పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తున్నారు. పలు బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మేర ప్రయాణికులు కూర్చుంటున్నారు. కొన్నింటిలో నిల్చుని మరి ప్రయాణం చేస్తున్నారు. దీంతో కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. సీటుకు ఒకరు కూర్చున్న బస్సుల్లో ఒకరికి పాజిటివ్ ఉంటే మిగతా వారికే వైరస్ సోకే అవకాశం ఉంది. కానీ బస్సుల్లో భౌతిక దూరం అమలు కావడం లేదు. అధికారులు కూడా నామమాత్రపు చర్యలతో సరి పెడుతున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు ఒక్కసారీ ముందస్తుగా శానిటైజేషన్ చేస్తున్నాం. అలాగే ప్రధాన బస్టాండ్‌లో మైక్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రయాణికులు మాస్కులు పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – సుధాపరిమళ, ఆర్టీసీ రీజీనల్ మేనేజర్ ( చదవండి: కోవిడ్ ఎఫెక్ట్.. ఇక అంబులెన్స్ సేవలు ఫ్రీ.. ) -
జాగ్రత్త సుమ! ఇలా వాడితే మీ సెల్‌ఫోన్ సేఫ్..
ఇటీవల సెల్‌ఫోన్ వాడకం అన్నది ఎంత సాధారణమైన అంశంగా మారిందో మనకు తెలియంది కాదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబ సభ్యుడికీ మొబైల్‌ఫోన్ ఉండనే ఉంటుంది. అందరకూ ఒకేసారి ఉపయోగించకపోయినా... ఒకరు కాకపోతే మరొకరు సెల్‌ఫోన్‌ను ఉపయోగిస్తూనే ఉంటారూ. ఇలాంటి వేళల్లో సెల్‌ఫోన్ నుంచి రేడియేషన్ వచ్చే మాట నిజమే. సెల్ టవర్‌కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్ కనెక్ట్ అవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సెల్‌ఫోన్ వాడటం వల్ల మెదడులో గడ్డలు వస్తాయన్న అపోహలు చాలామందిలో ఉన్నాయి. అయితే సెల్‌ఫోన్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి ఇంతవరకు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదు. అయినా ముందుజాగ్రత్తగా కొన్ని సూచనలు పాటిస్తే సెల్‌ఫోన్‌ను సేఫ్‌గా ఉపయోగించినట్లవుతుంది. వీలున్న అన్ని సందర్భాలలో సాధారణ ఫోన్స్ (లైన్డ్ ఫోన్స్)లో మాట్లాడాలి. సెల్‌ఫోన్ సంభాషణలు క్లుప్తంగా ఉండేట్లు చూసుకోవాలి. చాలాసేపు సెల్‌ఫోన్ వాడటం తప్పనిసరి అయినప్పుడు హెడ్‌ఫోన్స్ వాడటం మంచిది. ఒకవేళ హెడ్‌ఫోన్స్ వాడని సందర్భాల్లో... సెల్‌ఫోన్‌ను మరీ చెవికి ఆనించి దగ్గరగా పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్లు దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రింగ్ చేసిన నెంబరు, కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే సెల్‌ఫోన్‌ను చెవి వద్దకు తీసుకెళ్లాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు... రోజు మొత్తం మీద కాల్స్ కలిసి, మూడునాలుగు గంటలు దాటుతున్నట్లు గమనిస్తే సెల్‌ఫోన్ వాడకాన్ని ప్రత్యేకంగా నియంత్రించడం మంచిది. వీలైన సందర్భాల్లో ఎస్ఎంఎస్, చాటింగ్, యాప్ బేస్డ్ మెసేజింగ్, డేటా సర్చింగ్ వంటి అవసరాలకు మాత్రమే సెల్‌ఫోన్‌ను పరిమితం చేయాలి. -
అక్కడ కేసులు పెరుగుతున్నా పెద్ద ముప్పేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్నంత వేగంగా తెలంగాణలో కరోనా వైరస్ విస్తరించే అవకాశం తక్కువ అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కె.మిశ్రా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 55.5శాతం మందిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్లు తమ పరిశోధనలో వెల్లడైందని.. దీనికితోడు ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ఇక్కడ వైరస్ ఉధృతి తక్కువగా ఉందని పేర్కొ న్నారు. కరోనా వ్యాక్సిన్లు సురక్షితమేనని భరోసా ఇచ్చారు. రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 14 రోజులకు యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతా యని.. అయితే 20 నుంచి 30% మందిలో తొలి డోసుతోనే వృద్ధి చెందినట్లు గుర్తించామని తెలి పారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఆరో వార్షిక సదస్సు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది కార్డియాలజిస్టులు దీనికి హాజరయ్యారు. ఈ సదస్సులో రాకేశ్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా టీకాల కార్యక్రమానికి వైద్య సిబ్బంది నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదని, అన్ని వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా అవసరమన్నారు. జాగ్రత్తలు తప్పనిసరి కోవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని రాకేశ్ మిశ్రా చెప్పారు. ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉండటంతోనే ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించిందని.. శుభకార్యాలు, తీర్థయాత్రలు, విహారయాత్రల కోసం కాదని పేర్కొన్నారు. వైరస్ పీడ ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. ఈ విషయం తెలియక చాలా మంది సినిమాలు, షికార్లు, పార్టీలు, ఫంక్షన్ల పేరుతో గుమిగూడుతున్నారని చెప్పారు. అలాంటి వారి ద్వారా ఇంట్లో ఉన్న వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతర వ్యాధిగ్రస్తులు వైరస్ బారిన పడుతున్నారని వివరించారు. టీకాతో గుండెపోటు ముప్పు ఉండదు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ తెలంగాణ సదస్సు నిర్వాహకులు డాక్టర్ కేఎంకేరెడ్డి, డాక్టర్ ఆర్కే జైన్ స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తర్వాత కేసులు పెరిగాయనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. సాధారణ రోజుల్లో ఎంత మంది గుండెపోటుకు గురయ్యారో.. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత అంతే మంది అనారోగ్యం బారిన పడ్డారని వివరించారు. తనతోపాటు చాలా మంది వైద్యులు ఇప్పటికే రెండో డోసు టీకా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని, అంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు. -
మెట్రో రైళ్లలో చేయకూడని పనులివీ..
సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): గ్రేటర్‌వాసుల కలల మెట్రో జర్నీకి సిటీజన్ల నుంచి ఆదరణ పెరుగుతోన్న విషయం విదితమే. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్(29కి.మీ.), నాగోల్–హైటెక్‌సిటీ(28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు రూట్లలో నిత్యం సుమారు మూడు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వీరిలో కొందరు కొత్తవారు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో జర్నీలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెట్రో అధికారులు ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆ వివరాలివీ. స్టేషన్లు, రైలులో చేయాల్సిన పనులివీ.. మీ చేతిలో లేదా బ్యాగులోని చెత్త, చెదారాన్ని విధిగా చెత్తకుండీలోనే వేయాలి. స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిదీ. మెట్రోస్టేషన్ పరిసరాలకు చేరుకున్న తరవాత మీ ప్రయాణానికి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వినిపించే అనౌన్స్మెంట్లను జాగ్రత్తగా వినాలి. మీకేదైనా సహాయం కావాలంటే కస్టమర్ సర్వీస్ బృందం, స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి. మెట్రో స్టేషన్ లేదా భోగీలో నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలున్నట్లు అనుమా నిస్తే సిబ్బందికి వెంటనే తెలియజేయాలి. స్టేషన్‌లోపలికి వెళ్లే సమయంలో వ్యక్తిగత, బ్యాగేజీ తనిఖీ విషయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలి. తోటి ప్రయాణీకులు,మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్‌తో మర్యాదగా ప్రవర్తించండి. మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లపై వెళుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీరు దిగాల్సిన స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోవాలి. ఎస్కలేటర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎడమవైపున మాత్రమే ఉండాలి. భోగీలో హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని నిలబడాలి. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూర్చునేందుకు మీ వంతుగా సహకరించాలి. చిన్నారులను తీసుకొచ్చే బేబీ బగ్గీస్, వీల్చైర్లలో వచ్చేవారు విధిగా ఎలివేటర్లలో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లాలి. ఎస్కలేటర్ దిగిన వెంటనే దానికి దూరంగా జరగాలి. టిక్కెట్ కౌంటర్, టిక్కెట్ విక్రయ యంత్రాలు, ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్లో నిలబడాలి. ప్రయాణిస్తున్నప్పడు సిబ్బంది టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపమని తనిఖీ చేసినపుడు వారికి సహకరించాలి. టిక్కెట్ లేని ప్రయాణీకులపై కఠిన చర్యలు తప్పవు. అత్యవసర అనౌన్స్మెంట్ వినిపించినపుడు హడావుడిగా రైలు దిగాలి. రైలు ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే భోగీలోనికి ప్రవేశించాలి. రైలు కోసం పరుగెత్తరాదు. రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఉండే సందులో ఎలాంటి వస్తువులు, కాళ్లను పెట్టరాదు. చేయకూడని పనులివీ.. స్టేషన్లు, భోగీలు, పరిసరాల్లో ఉమ్మివేయడం, చూయింగ్‌గమ్ ఊయడం, సిగరెట్లు తాగడం, పాన్ నమలరాదు. రైలులోనికి ప్రవేశించిన తరవాత ఫొటోలు తీయడం నిషిద్ధం. నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు. మీ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషేధం.. ప్రమాదకర వస్తువులు, అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్ పరిసరాలు, భోగీల్లోకి తీసుకురావద్దు. ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోరాదు. ప్లాట్‌ఫాంపై వేచిఉండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి ముందుకు రావద్దు. మీ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో విడిచిపెట్టరాదు. -
జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ
కుల్కచర్ల: గ్యాస్ సిలిండర్ లీకై ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమైపోయాయి. తరచూ గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం సంభవిస్తోంది. అవగాహ న లోపం, సరైన జాగ్రత్తలు పా టించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కుత్బుల్లాపూర్ మండల పరిధిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. తాజాగా శుక్రవారం షాబాద్ మండలం సోలిపేట్లో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2 లక్షల ఆస్తినష్టం జరిగింది.అదృష్టవశాత్తు ప్రాణాపాయం సంభవించలేదు. వంటింట్లో మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. ⇒ ఇంట్లో సిలిండర్ ఎప్పుడు నిలువుగా ఉంచాలి ⇒ మూసి ఉంచిన బీరువాలో గాని డబ్బాలో గాని సిలిండర్‌ను ఉంచరాదు. ⇒ గ్యాస్ సిలిండర్ రబ్బర్ ట్యూబ్, రెగ్యులేటర్ మార్చేందుకు వీలుగా వంటగదిలో ఖాళీ స్థలం ఉంచుకోవాలి. ⇒ గ్యాస్ సిలిండర్ దగ్గర్లో కిరోసిన్, పెట్రోల్ లేకుండా జాగ్రత్తపడాలి. ⇒ సిలిండర్ డెలివరీ సమయంలో దానికి రక్షణ తొడుగు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ⇒ రెగ్యులేటర్‌ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. రెగ్యులేటర్ పెట్టగానే గ్యాస్ లీకైతే వెంటనే దానిని మార్చాలి. ⇒ ఐఎస్ఐ మార్క్ ఉన్న రెగ్యులేటర్ ట్యూబ్, లైటర్లు కొనుగోలు చేయాలి. ⇒ గ్యాస్ స్టౌ ిసిలిండర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. సర్వీసింగ్ చేసిన తర్వాత బర్నల్ సిమ్మర్ సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వంటగదికి వెంటిలేటర్ ఉండాలి. ⇒ తగినంత వెలుతురు, గాలి వంటగదిలోకి రావాలి. వంటగదిలో ఫ్రిజ్‌ను ఉంచుకోరాదు. ⇒ రాత్రి నిద్రించే ముందు రెగ్యులేటర్‌ను కట్టివేయాలి. ⇒ గ్యాస్ స్టౌవ్‌ను డీలర్ వద్ద లేదా అనుభవం ఉన్న మెకానిక్ వద్ద మాత్రమే చేయించాలి. ⇒ గ్యాస్ సేఫ్ పరికరం ఉందా ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ సేఫ్ పరికరాలు లభిస్తున్నాయి. వాటిని సిలిండర్ బిగిస్తే చాలు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు గ్యాస్ సరఫరా ఆటోమెటిక్‌గా నిలిచిపోతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజన్‌తో పాటు 108కు సమాచారం ఇవ్వాలి. గ్యాస్ లీకైన వెంటనే జనాలు ఇంట్లోంచి బయటకు వెళ్లాలి. -
స్వైన్‌ఫ్లూపై పోరాడండిలా..