ఇటీవల సెల్‌ఫోన్ వాడకం అన్నది ఎంత సాధారణమైన అంశంగా మారిందో మనకు తెలియంది కాదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబ సభ్యుడికీ మొబైల్‌ఫోన్ ఉండనే ఉంటుంది. అందరకూ ఒకేసారి ఉపయోగించకపోయినా... ఒకరు కాకపోతే మరొకరు సెల్‌ఫోన్‌ను ఉపయోగిస్తూనే ఉంటారూ. ఇలాంటి వేళల్లో సెల్‌ఫోన్ నుంచి రేడియేషన్ వచ్చే మాట నిజమే. సెల్ టవర్‌కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్ కనెక్ట్ అవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సెల్‌ఫోన్ వాడటం వల్ల మెదడులో గడ్డలు వస్తాయన్న అపోహలు చాలామందిలో ఉన్నాయి. అయితే సెల్‌ఫోన్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి ఇంతవరకు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదు. అయినా ముందుజాగ్రత్తగా కొన్ని సూచనలు పాటిస్తే సెల్‌ఫోన్‌ను సేఫ్‌గా ఉపయోగించినట్లవుతుంది.
- వీలున్న అన్ని సందర్భాలలో సాధారణ ఫోన్స్ (లైన్డ్ ఫోన్స్)లో మాట్లాడాలి.
- సెల్‌ఫోన్ సంభాషణలు క్లుప్తంగా ఉండేట్లు చూసుకోవాలి.
- చాలాసేపు సెల్‌ఫోన్ వాడటం తప్పనిసరి అయినప్పుడు హెడ్‌ఫోన్స్ వాడటం మంచిది. ఒకవేళ హెడ్‌ఫోన్స్ వాడని సందర్భాల్లో... సెల్‌ఫోన్‌ను మరీ చెవికి ఆనించి దగ్గరగా పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్లు దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- రింగ్ చేసిన నెంబరు, కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే సెల్‌ఫోన్‌ను చెవి వద్దకు తీసుకెళ్లాలి.
- పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు... రోజు మొత్తం మీద కాల్స్ కలిసి, మూడునాలుగు గంటలు దాటుతున్నట్లు గమనిస్తే సెల్‌ఫోన్ వాడకాన్ని ప్రత్యేకంగా నియంత్రించడం మంచిది. వీలైన సందర్భాల్లో ఎస్‌ఎంఎస్, చాటింగ్, యాప్ బేస్‌డ్ మెసేజింగ్, డేటా సర్చింగ్ వంటి అవసరాలకు మాత్రమే సెల్‌ఫోన్‌ను పరిమితం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment