
గుంటూరు, సాక్షి: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా కంపెనీలో విషవాయువుల లీకేజీ ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారాయన.
ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో కఠిన చర్యలుంటాయని ఆదేశాలిచ్చినా.. కంపెనీలు నిర్లక్ష్య ధోరణిని వీడడం లేదు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,ఎస్పీ ఎం.దీపికతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
Also Read in English: YS Jagan Demands AP Government's Support for Victims of Paravada Pharma Company Incident
Comments
Please login to add a commentAdd a comment