Parawada pharma city
-
పరవాడ ప్రమాదం.. ప్రభుత్వమే ఆదుకోవాలి
గుంటూరు, సాక్షి: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా కంపెనీలో విషవాయువుల లీకేజీ ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారాయన.ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో కఠిన చర్యలుంటాయని ఆదేశాలిచ్చినా.. కంపెనీలు నిర్లక్ష్య ధోరణిని వీడడం లేదు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,ఎస్పీ ఎం.దీపికతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. Also Read in English: YS Jagan Demands AP Government's Support for Victims of Paravada Pharma Company Incident -
పరవాడ ఫార్మాసిటీ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్‌లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగాగాయపడిన మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ ప్రమాదంపై పరవాడ పోలీసులు తెలిపిన మేరకు.. లారస్ పరిశ్రమ యూనిట్–3లో మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్–6లో డ్రైమర్ రూమ్‌ను మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన బి.రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన రాజేష్‌బాబు, అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడకు చెందిన రాపేటి రామకృష్ణ, చోడవరం మండలం పెన్నవోలు గ్రామానికి చెందిన మజ్జి వెంకటరావు, విజయనగరం జిల్లాకు నెల్లిమర్లకు చెందిన ఎడ్ల సతీష్ శుభ్రం చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్లాష్‌ఫైర్ సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన గది మొత్తం రబ్బరుతో నిండి ఉంది. నిప్పురవ్వలు పడి రబ్బరు నిల్వలు అంటుకోవడంతో గది అంతా మంటలు, దట్టమైన పొగతో నిండిపోయింది. గదిలో ఉన్న ఐదుగురు కారి్మకులు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే పరిశ్రమకు చెందిన అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేసి గాయపడినవారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మార్గంమధ్యలోనే బి.రాంబాబు (32), రాజేష్‌బాబు (36), రాపేటి రామకృష్ణ (32), మజ్జి వెంకటరావు (36) మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్ మార్చురికీ తరలించారు. ఎడ్ల సతీష్ (36) నగరంలోని కిమ్స్ ఐకాన్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అగ్నిప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పరవాడ సీఐ పి.ఈశ్వరరావు, ఎస్ఐ తేజేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదస్థలాన్ని అనకాపల్లి ఎస్పీ గౌతమిశాలి సోమవారం రాత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం పరవాడలోని లారస్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను, ఇక్కడి పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తెలియజేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడికి వైద్యసహాయం అందించాలని వైద్యాధికారులను, ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను మంత్రి ఆదేశించారు. మృతులు వీరే.. బి.రాంబాబు (32) ఖమ్మం జిల్లా, రాజేష్‌బాబు (36) గుంటూరు జిల్లా, రాపేటి రామకృష్ణ (32) అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడ, మజ్జి వెంకటరావు (36) చోడవరం మండలం పెన్నవోలు. -
విశాఖ: పరవాడలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
-
పరవాడలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. గ్యాస్ లీక్..
సాక్షి, విశాఖపట్నం: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ ట్యాంకర్‌ను లిప్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. లిప్ట్ చేస్తుండగా ట్యాంకర్‌కు రంథ్రం ఏర్పడింది. ట్యాంకర్ బోల్తా పడిన ప్రాంతంలో విద్యుత్ సరాఫరా నిలిపివేశారు. ట్యాంకర్ పడిన ప్రాంతంలో కంపెనీలను అధికారులు అప్రమత్తం చేశారు. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో -
మల్లేష్‌ను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పరవాడ ఫార్మా సిటీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరిలోవ హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెమిస్ట్ మల్లేష్‌ను ఎంపీలు విజయసాయి రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు పరామర్శించారు. బుధవారం ఉదయం నేరుగా విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న ఎంపీలు పినాకిల్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న మల్లేష్‌ను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమరనాథ్, నేతలు కేకే రాజు, వంశీకృష్ణ యాదవ్, పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా తదితరులు ఉన్నారు. ( ‘వరుస ఘటనల వెనుక కుట్ర దాగుందా?’ ) (అప్పుడు అమ్మ.. ఇప్పుడు నాన్న) -
అప్పుడు అమ్మ.. ఇప్పుడు నాన్న
సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల: పరవాడ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తల్లి జ్ఞాపకాల నుంచి ఆ పిల్లలు తేరుకోకముందే తండ్రి కూడా వారిని విడిచివెళ్లిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో అనకాపల్లి మండలం బట్లపూడి పంచాయతీ రాయుడుపేటకు చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావు(50) మృతి చెందడంతో అతని పిల్లలు, తల్లి శోకసంద్రంలో మునిగిపోయారు. గవరపాలెం, బట్లపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాండ్రేగుల శ్రీనివాసరావు, పార్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. కొద్దిపాటి ఆదాయంతో సాగుతున్న వారి జీవితాల్లో విధి విషం చిమ్మింది. కాండ్రేగుల శ్రీనివాసరావు స్వస్థలం అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో పరవాడ ఫార్మాసిటీలో విశాఖ సాల్వెంట్ కంపెనీలో కెమిస్టిగా ఐదేళ్ల కిందట చేరాడు.( నిర్వహణ లోపంతోనే అగ్ని ప్రమాదం) కొద్ది సంవత్సరాల కిందట అనకాపల్లి మండలంలోని బట్లపూడి గ్రామానికి వెళ్లి అక్కడ ఒక పాత ఇంటిని కొనుగోలు చేసి తల్లి సన్నమ్మడుతో కలిసి నివాసముంటున్నాడు. తన ఇద్దరు పిల్లలు రోషిత్‌కుమార్, జస్వంత్ కుమార్‌లను విజయవాడలో ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్పించి చదివిస్తున్నాడు. దురదృష్టవశాత్తు రెండేళ్ల కిందట శ్రీనివాసరావు భార్య పార్వతి అనారోగ్యంతో మృతి చెందింది. ఆ విషాదం నుంచి ఆ కుటుంబ ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే ఫార్మాసిటీలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. శ్రీనివాసరావు మృతిచెందిన విషయం కుటుంబ సభ్యులకు మొదట తెలియలేదు. విధుల్లో ఉన్న తమ తండ్రి క్షేమంగా ఉన్నారని భావించిన పిల్లలు తెల్లారేసరికి పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో భవన శిథిలాల కింద శ్రీనివాసరావు మృతదేహం బయటపడడంతో ఇద్దరు కుమారులు, మృతుని తల్లి గుండెలవిసేలా రోదించారు. శ్రీనివాసరావు స్వస్థలమైన గవరపాలెం, అటు నివాసముంటున్న బట్లపూడి రాయుడుపేట లో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాసరావుతో పరిచయం ఉన్నవారంతా తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని అందరూ విజ్ఞప్తి చేశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు కటుంబానికి పరిహారం అందజేయాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీకుడు దాడి రత్నాకర్ కోరారు. శ్రీనివాసరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఫార్మా కంపెనీలను తనిఖీ చేయడానికి కమిటీ వేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు. విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం -
పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని సాల్వెంట్ కంపెనీలో రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక శకటాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది గాయపడినట్లు సమాచారం. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరవాడ ఫార్మాసిటీలోని వేరువేరు కంపెనీలో మందులు తయారు చేసే క్రమంలో వచ్చే ఒక రకమైన వృథా ఆయిల్‌ను తిరిగి శుభ్రం పరిచే ప్రక్రియ ఈ కంపెనీలో జరుగుతుంది. ప్రతి రోజు మాదిరిగానే రాత్రి పది గంటలకు నైట్ షిఫ్ట్ మొదలైన కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల రసాయన వాయువులు లీకై ఇద్దరు మృతి చెందిన సాయినాథ్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి సమీపంలోనే ఈ పరిశ్రమ ఉండటం గమనార్హం. -
అలివెర కంపెనీ ల్యాబ్ లో అగ్నిప్రమాదం
విశాఖ: విశాఖపట్నంలోని పరవాడ ఫార్మాసిటీ సెజ్ లోని అలివెరా కంపెనీలో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ ల్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను మంటలను అదుపు చేశారు. జంతువులకు సంబంధించి మందులు తయారు చేస్తున్న ల్యాబ్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని పరవాడ సీఐ రమణమార్తి సందర్శించారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని ఆయన వెల్లడించారు. -
వేగేశ్న ఫార్మాసిటీలో పేలుడు,8మందికి గాయాలు
విశాఖ : విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరోసారి పేలుడు సంభవించింది. వేగేశ్న ఫార్మా కంపెనీలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలి ఎనిమిదిమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలు దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు ధాటికి కంపెనీలోని ఉత్పత్తి బ్లాక్‌లు ధ్వంసం అవటంతో పాటు, ప్లాస్టిక్ షెడ్లు కూలాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించటంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. మరోవైపు ఫార్మా కంపెనీ సమీపంలోని గ్రామస్తులు ఏమి జరుగుతుందో అర్థం కాగా భయాందోళనలకు గురయ్యారు. కాగా గాయపడినవారిని చికిత్స నిమిత్తం గాజువాక లంకెలపాలెం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో రాఘవరాజు, రవికాంత్, సూర్య, సతీష్ తదితరులు ఉన్నారు.