సాక్షి, అనకాపల్లి: ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వరుస ప్రమాదాలతో కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, గత ఏడాది డిసెంబర్‌లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇరువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్‌ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్‌హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్‌ఆర్‌గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment