పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. కార్మికుడి దుర్మరణం | Accident In Anakapalli Parawada Pharma City | Sakshi
Sakshi News home page

పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. కార్మికుడి దుర్మరణం

Published Sat, Jan 25 2025 3:20 PM | Last Updated on Sat, Jan 25 2025 4:14 PM

Accident In Anakapalli Parawada Pharma City

సాక్షి,అనకాపల్లిజిల్లా: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. విష్ణు కెమికల్స్‌ ఫ్యాక్టరీలో శనివారం(జనవరి25) జరిగిన ప్రమాదంలో  కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్‌ బెల్ట్‌లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడిగా గుర్తించారు.  ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్‌ పరిశ్రమ స్టోరేజ్‌ ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, గత ఏడాది డిసెంబర్‌లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ప్రొడక్షన్‌ బ్లాక్‌–1లో ఏఎన్‌ఎఫ్‌–డి రియాక్టర్‌ మ్యాన్‌హోల్‌ ఓపెన్‌ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్‌ఆర్‌గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్‌ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. 

ఇదీ చదవండి: మంటల్లో దగ్ధమైన నివాసాలు.. పలువురికి గాయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement