అలివెర కంపెనీ ల్యాబ్ లో అగ్నిప్రమాదం
Published Mon, Jan 25 2016 11:35 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
విశాఖ: విశాఖపట్నంలోని పరవాడ ఫార్మాసిటీ సెజ్ లోని అలివెరా కంపెనీలో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ ల్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను మంటలను అదుపు చేశారు. జంతువులకు సంబంధించి మందులు తయారు చేస్తున్న ల్యాబ్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని పరవాడ సీఐ రమణమార్తి సందర్శించారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని ఆయన వెల్లడించారు.
Advertisement
Advertisement