
సాక్షి, లక్కిరెడ్డిపల్లి : వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం మర్రిచెట్టు క్రాస్ వద్ద నేటి ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పులివెందుల నుంచి పుంగనూరుమార్కెట్ యార్డు వైపు వెళ్తున్న పశువుల లారీ, సిలిండర్ల లోడుతో ఉన్న మరో లారీని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. సిలిండర్ల గోడౌన్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన పశువుల లారీ ముందుకెళ్లే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ నిండుగా ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment