114 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
Published Tue, Jul 11 2017 3:07 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి కమలానగర్ లో అక్రమ సిలిండర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా సిలిండర్ల వ్యాపారం చేస్తున్న ఆదినారాయణ మూర్తి అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అతని నుంచి 114 గ్యాస్ సిలిండర్లు, 2 బొలేరో వాహనాలు సీజ్ చేశారు. ఆదినారాయణ అనే ఒక‍్కరికే 80 సిలిండర్లు సరఫరా చేసిన మదన్నపేట్ లోని భార్గవి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Advertisement
Advertisement