vanastali puram
-
డబుల్ ఆత్మగౌరవం : కేటీఆర్
హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న స్లమ్ ఫ్రీ అభివృద్ధి పనులు దేశంలోని మరే రాష్ట్రంలో జరగడం లేదని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే.టీ.రామారావు అన్నారు. వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో రెండెకరాల విస్తీర్ణంలో రూ. 28.03 కోట్ల వ్యయంతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూం ఇళ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో రూ. 9,714 కోట్ల వ్యయంతో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందులో దాదాపు 90 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావొస్తుందని చెప్పారు. ఇప్పటికే 10 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల వంటివి మరే రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు. నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అంకురార్పణ చేశారని మంత్రి వివరించారు. వనస్థలిపురంలో సెల్లార్, స్టిల్ట్, 9 అంతస్తులలో మూడు బ్లాకుల్లో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూం ఇళ్ల విలువ మార్కెట్లో దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ఇక్కడ భూమి విలువ గజానికి రూ.లక్షకు పైగానే ఉంటుందని చెప్పారు. సీఎం కార్యాలయానికి ఏ లిఫ్ట్‌లు అయితే వాడుతున్నారో, ఇక్కడ కూడా ఆ కంపెనీకి చెందిన లిఫ్ట్‌లు వాడుతున్నామన్నారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు యాజమాన్య పట్టాలను, ఇంటి తాళం చెవులను కేటీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి
-
ఒయో లాడ్జిలో మహిళ ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఓ మహిళా అనుమానాస్పదంగా మృతి చెందింది. అభ్యుదయనగర్‌లోని ఒయో లాడ్జిలో బుధవారం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్న విచారణ ప్రారంభించారు. విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. మృతిచెందిన మహిళను బెంగాల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంగీతగా గుర్తించారు. మూడేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయిన లోకేష్ అనే యువకుడి కోసం సంగీత హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా లోకేష్, సంగీత కలిసి ఒయో లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగిందని లాడ్జి సిబ్బంది తెలిపారు. దీంతో సంగీత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగీతకు 48ఏళ్లు కాగా, లోకేష్‌కు 28 ఏళ్లు ఉండొచ్చని విచారణలో వెల్లడైంది. కాగా లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు. -
నారాయణ కాలేజ్‌లో గ్యాంగ్‌వార్
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్ జరగడం కలకలం రేపుతోంది. నిక్ నేమ్‌తో పిలిచినందుకు ఇంటర్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తరగతి గదిలో నిక్ నేమ్‌లతో పిలుస్తున్నాడని మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు. అంతేగాక తలపై రాళ్లతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటనకు కారణమైన ఐదుగురి విద్యార్థులపై బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
114 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి కమలానగర్ లో అక్రమ సిలిండర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా సిలిండర్ల వ్యాపారం చేస్తున్న ఆదినారాయణ మూర్తి అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 114 గ్యాస్ సిలిండర్లు, 2 బొలేరో వాహనాలు సీజ్ చేశారు. ఆదినారాయణ అనే ఒక్కరికే 80 సిలిండర్లు సరఫరా చేసిన మదన్నపేట్ లోని భార్గవి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఉడ్ వరల్డ్ లో అగ్నిప్రమాదం
వనస్థలిపురం: వనస్థలిపురంలో హైవే పక్కన ఉన్న ఉడ్వరల్డ్ ఫర్నిచర్ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా లోపలి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. నిర్వాహకుల సమాచారంతో ఫైరింజన్ అక్కడికి చేరుకుంది. దట్టమైన మంటలు, పొగ కారణంగా మంటలు వెంటనే అదుపులోకి రాలేదు. దీంతో ఫైర్ సిబ్బంది వెలుపలి నుంచే మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
వనస్థలిపురంలో పేకాటరాయుళ్ల అరెస్టు
వనస్థలిపురం: నగరంలోని వనస్థలి పురంలో పేకాట స్ధావరాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. స్ధానిక ఓ హోటలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 68 వేలు నగదు, పదహారు సెల్ఫోన్లు, ఒక ఇన్నోవా వాహనంతో పాటు అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్ కు తరలించారు.