నారాయణ కాలేజ్‌లో గ్యాంగ్‌వార్‌ | gang war in  in narayana college in vanasthalipuram | Sakshi
Sakshi News home page

నారాయణ కాలేజ్‌లో గ్యాంగ్‌వార్‌

Published Fri, Nov 3 2017 2:40 PM | Last Updated on Fri, Nov 3 2017 3:38 PM

gang war in  in narayana college in vanasthalipuram - Sakshi

సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్‌ జరగడం కలకలం రేపుతోంది. నిక్‌ నేమ్‌తో పిలిచినందుకు ఇంటర్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తరగతి గదిలో నిక్ నేమ్‌లతో పిలుస్తున్నాడని మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు.

అంతేగాక తలపై రాళ్లతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన​కు కారణమైన ఐదుగురి విద్యార్థులపై బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement