narayana colleage
-
విశాఖ: ‘సీజ్ ద నారాయణ కాలేజ్’
విశాఖపట్నం, సాక్షి: సీజ్ ద నారాయణ కాలేజ్ నినాదంతో మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజ్ క్యాంపస్ మారుమోగుతోంది. యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడగా.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈ ఉదయం ఆందోళనకు దిగాయి.ఒడిశా రాయ్‌పూర్‌కు చెందిన చంద్రవంశీ(17) అనే విద్యార్థి.. మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో సెకండ్ఇయర్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ.. కాలేజీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే అతను చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఇప్పుడు ధర్నాకు దిగాయి.చంద్ర వంశీ ఆత్మహత్యపై కళాశాలలో నిన్న రాత్రి(బుధవారం) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. గేట్లు వేసి, హాస్టల్ రూమ్‌లకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే బంధించింది. ఆపై రంగ ప్రవేశం చేసిన పోలీసులు సైతం విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం.విషయం తెలిసిన ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గరకు చేరుకుని ధర్నాచేపట్టాయి. చంద్ర వంశీ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతో నారాయణ కళాశాల యాజమాన్యం రెచ్చిపోతుందని ఆరోపించాయవి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
‘నారాయణ’ ఫీ‘జులుం’కి విద్యార్థి బలి..
అనంతపురం ఎడ్యుకేషన్/సాక్షి, అమరావతి: నారాయణ కళాశాలల ధన దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఫీజులు చెల్లించకపోతే కళాశాలలోకి అనుమతించకుండా గంటల తరబడి బయటే నిలబెట్టడంతో అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆ తర్వాత కళాశాలలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురువారం అనంతపురంలో చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన చరణ్ అనంతపురం నగర శివారు సోములదొడ్డి సమీపంలోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం గురువారం చరణ్‌ను తన సోదరుడు కళాశాలలో విడిచిపెట్టాడు. ఈ సమయంలో ఫీజు బకాయి మొత్తం చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. చరణ్ సోదరుడు సర్దిచెప్పి వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో.. మూడో అంతస్తులోని తరగతి గదిలో ఉన్న చరణ్ అధ్యాపకుడి ముందునుంచే ఒక్కసారిగా బయటకొచ్చి కిందకు దూకేశాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం చరణ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. రక్తమోడిన ప్రాంతమంతా ఎవరూ రాకుండానే హడావుడిగా శుభ్రం చేసేశారు. కాలేజీ యాజమాన్యం తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపా«ద్యక్షుడు నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్, నగర అధ్యక్షుడు కైలాష్‌తో పాటు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ తదితర విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్ద ఆందోళన చేశారు. అలాగే, ఈ ఘటనపై విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేసింది. -
‘నారాయణ’ అకృత్యాలపై కన్నెర్ర.. రూ.5 లక్షల జరిమానా
అనంతపురం: సోములదొడ్డి వద్దనున్న నారాయణ జూనియర్ కళాశాలను జిల్లా పర్యవేక్షణ కమిటీ (డి స్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీ) చైర్మన్ జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాసికరమైన భోజనం అందిస్తున్నారని, చదువులో వెనుకబడిన వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని, వార్డెన్ ప్రవర్తన తీరు బాగోలేదని విద్యార్థులు కమిటీ దృష్టికి తెచ్చారు. నిర్దేశిత ఫీజులకు మించి వసూలు చేయడమే కాకుండా నాసిరకమైన భోజనం పెడుతూ.. విద్యార్థులపై అకృత్యాలకు పాల్పడతారా అంటూ సిబ్బందిపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ కళాశాలకు రూ.5 లక్షల జరిమానా విధించారు. కార్యక్రమంలో డీఎంఎస్ఎసీ కన్వీనర్ వెంకటరమణ నాయక్, ఆర్ఐఓ డాక్టర్ సురేష్‌బాబు, సైకియాట్రిస్ట్ డాక్టర్ రవికుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్ -
వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల బాగోతం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖ కమిషన్ చేపట్టిన పాఠశాలల తనిఖీల్లో జూనియర్ కాలేజీలు నారాయణ, శ్రీ చైతన్యల అధిక ఫీజుల వసూళ్ల బాగోతం బట్టబయలైంది. రాష్ట్రంలోని పలు పాఠశాలపై విద్యాశాఖ కమిషన్ నాలుగు బృందాలు బుధవారం తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రొఫెసర్ నారాయణరెడ్డి, డాక్టర్ ఈశ్వరయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పాఠశాలల యాజమాన్యాలపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ సంక్రాంతికి 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయల వరకు ఫీజులు కట్టించుకున్నారంటూ విద్యార్థులు అధికారులతో ఎదుట వాపోయారు. టాయిలెట్లలో కనీస సౌకర్యాలు లేవని, ప్రతి ఏడుగురికి ఒక బాత్రూమ్ కేటాయించారని తెలిపారు. ఇంటర్ మొదటి ఏడాదికి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇక గూడవల్లి శ్రీ చైతన్య కళాశాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కనీస వసతులు కూడా లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. తాగునీరు, బాత్రూమ్ కుళాయిలు లేకపోవటంతో కమిషన్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నారాయణ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని, జీవో 51ని కూడా యాజమాన్యం అమలు చేయడం లేదని వెల్లడించారు. నారాయణ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని కమిషన్ సభ్యులు సీఏవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంతేగాక కాలేజీల్లో సామాజిక దూరం అమలు చేయడం లేదని, కనీసం శానిటైజర్లు కూడా అందుబాటు ఉంచలేదన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారని మండిపడ్డారు. సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మౌలిక వసతులు కూడా సరిగా లేని కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కళాశాలలు ఉల్లంఘించాయన్న ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. -
విద్యామంత్రం.. నారాయణ కుతంత్రం. ఆత్మహత్యలు నిత్యకృత్యం
ఇరుకు గదులు.. వసతికి మించిన విద్యార్థులు.. కనిపించని ల్యాబ్‌లు.. మానసికోల్లాసానికి కరువైన మైదానాలు.. ఇదీ జిల్లాలో నారాయణ కళాశాలల దుస్థితి. ‘40 ఇయర్స్ ఎక్స్‌లెన్సీ’ ‘నారాయణ ప్రతిభకు పట్టం’ నినాదాలతో తల్లిదండ్రులను బురిడీ కొట్టించడం వాటికి వెన్నతోపెట్టిన విద్య. లాభాపేక్షే ధ్యేయంగా.. కనీస సదుపాయాలకు దూరంగా కళాశాలలు నెట్టుకురావడం ఆ యాజమాన్యానికే చెల్లుతోంది. ప్రతిభ పక్కనబెడితే బట్టీ చదువులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తీవ్ర ఒత్తిడిని భరించలేక.. అధిక ఫీజులు చెల్లించలేక విద్యార్థులు మానసికంగా కుంగిపోవడం సర్వసాధారణమవుతోంది. తల్లిదండ్రులను ఒప్పించలేక.. విద్యాసంస్థ పెట్టే వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. సాక్షి, తిరుపతి : నారాయణ కళాశాలల యాజమాన్యం ఒత్తిడి భరించలేక విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బట్టీ చదువులతో కుస్తీ మినహా మానసిక పరివర్తనకు చొరవ చూపడం లేదనే ఆరోపణలున్నాయి. కళాశాలలు 8 వేల చ.అ. విస్తీర్ణంలో 20 శాతం పార్కింగ్ స్థలం ఉంచాలని నిబంధనలు వివరిస్తున్నాయి. 20/20 చ.అ. విశాలమైన గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసించేందుకు కూర్చోగలరని చట్టాలు చెబుతున్నాయి. మానసిక ఆటవిడుపు కోసం కచ్చితంగా ఆటస్థలం ఉండాలి. విద్యార్థులు మైరుగైన లక్ష్యాల కోసం ల్యాబ్‌లు తప్పనిసరి. ఇవేమీ ‘నారాయణ’ విద్యా సంస్థల్లో కనిపించవని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నారాయణ రెసిడెన్షియల్ ఇంటర్మీడియెట్ క్యాంపస్‌లు 8 ఉన్నాయి. వీటి పరిధిలో 7,330 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ విద్యనభ్యసిస్తున్నారు. ఆయా కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వరుస వివాదాల్లో విద్యాసంస్థలు ఇటీవల నారాయణ కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. తిరుపతి గాంధీరోడ్డులో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థి ఫీజు చెల్లించలేదని సోమవారం ఏకంగా విద్యార్థి తండ్రి గోవిందురెడ్డిపై యాజమాన్యం దాడికి దిగింది. ఫీజుల కోసం విద్యార్థులను అవమానాలపాలు చేయడం ఏమాత్రం సరైంది కాదని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. మంగళవారం రేణిగుంట నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్ విద్యనభ్యసిస్తున్న గోరంట్లకు చెందిన మహేంద్రరెడ్డి(16) ఆత్మహత్యకు యత్నించాడు. యాజమాన్యం ఒత్తిడి భరించలేక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. సకాలంలో సహచర విద్యార్థులు పసిగట్టడంతో మహేంద్రరెడ్డి ప్రాణాలు దక్కాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆటవిడుపు లేకపోవడమే అందుకు కారణమని నిపుణులు భావి స్తున్నారు. ఇరుకు గదులు.. తీవ్రమైన ఒత్తిడి రేణిగుంట నారాయణ కళాశాల విద్యార్థులకు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. వసతికి మించి విద్యార్థులను గదుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. మొదటి సంవత్సరం విద్యార్థులు 342 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 270 మంది ఉన్నారు. 612 మందికి కేవలం 40 గదులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. సరాసరిగా గదికి 15 మంది విద్యార్థులను హాస్టల్లో ఉంచినట్లు సమాచారం. విద్యార్థుల మంచాల మధ్య ఎలాంటి ఖాళీ స్థలం లేదు. మధ్యలో ఉన్న దారి నుంచి నేరుగా మంచంపైకి ఎక్కేందుకే మార్గముంది. తరగతి గదులు సైతం ఇరుకుగానే ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాడు మంత్రిగా అలాంటి ప్రకటనలే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి హోదాలో నారాయణ సింగపూర్ తరహాలో రాజధాని నిర్మిస్తామని ఆర్భాటపు ప్రకటనలతో ఐదేళ్లు నెట్టుకొచ్చారు. ఆచరణలో రిక్తహస్తం చూపించారు. తన కళాశాలల్లో సైతం ఉన్నత ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా రోజూ 14గంటలు బట్టీ చదువులతో కుస్తీ మినహా విద్యార్థుల్లో మానసిక పరివర్తనకు చొరవ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగు గోడలు మధ్య కంఠస్థ పాఠాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆటవిడుపు కోసం ఆట స్థలమే లేదు. 612 మంది విద్యార్థులున్న క్యాంపస్‌లో కనీస ఆటవిడుపు లేకపోవడం తీవ్రమైన మానసిక ఒత్తిడికి విద్యార్థులు గురవుతున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. ఇదిలాఉంటే విద్యార్థులకు మెరుగైన ఫలితాల కోసం కనీసం ల్యాబ్‌లు ఉంచాలనే దిశగా నారాయణ యాజమాన్యం ఆలోచించలేదు. సామాన్యులకు నిబంధనల పేరుతో వేధించే అధికారగణానికి ‘నారాయణ’ పరపతి ముందు ఇవేమీ కనిపించడం లేద నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠాలు చెప్పడంలోనే సెక్షన్లు విధిస్తూ విద్యార్థులను మానసిక వేదనకు గురిచేస్తున్నట్లు సమాచారం. మార్కులు అత్యధికంగా వచ్చిన వారి పేర్లతో ప్రచారం నిర్వహించే లాభాపేక్ష ఎత్తుగడ మినహా విద్యార్థులకు కనీస వసతులు ఉండాలనే సంకల్పం లేదని పలువురు వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని విద్యార్థి సంఘాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. విద్యాలయాలను లాభాపేక్షతో కాకుండా పవిత్ర ఆలయాలు చూడాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నం రేణిగుంట : నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన ఎం.నరసింహారెడ్డి కుమారుడు మహేంద్రరెడ్డి(16) రేణిగుంట సమీపంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తన గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అప్పటికే అటుగా వెళుతున్న తోటి విద్యార్థులు గుర్తించి అతన్ని సురక్షితంగా కాపాడారు. విషయం కళాశాల యాజమాన్యానికి తెలిపారు. తోటి విద్యార్థులు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు కళాశాలకు చేరుకుని మహేంద్రరెడ్డిని విచారించారు. 10వ తరగతిలో 10కి 10 జీపీఏ సాధించిన అతడు కళాశాలలో ఇంటర్నల్‌గా జరిగిన వీక్లీ పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడాన్ని అవమానంగా భావించాడు. దీనికితోడు తోటి విద్యార్థులు కొందరు హేళనగా మాట్లాడడంతో జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులతో చెప్పారని తెలుస్తోంది. విచారణ అనంతరం పోలీసు సిబ్బంది అక్కడ నుంచి వెళ్లిపోయి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించిన మహేంద్రరెడ్డిని కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ వెంటనే ఓ అటెండర్‌ను జతచేసి బలవంతంగా అతని స్వగ్రామం గోరంట్లకు పంపేయడం అనుమానాలకు తావిస్తోంది. గతంలోనూ ఆత్మహత్య ఈ కళాశాలలో మూడేళ్ల కిందట ఓ విద్యార్థి యాజమాన్యం వేధింపులు తాళలేక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనతో అప్పట్లో యాజమాన్యాన్ని నిందిస్తూ విద్యార్థులు కళాశాలలో భవన కిటికీలు పగులగొట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘాలు కూడా పెద్దస్థాయిలో ఆందోళనలు చేశాయి. అయితే అప్పట్లో మంత్రి నారాయణ కేసును పూర్తిగా నీరుగార్చి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కుటుంబానికి అన్యాయం చేశారు. ఈ ఘటన తర్వాత కూడా అనేకమార్లు కళాశాల యాజమాన్యం, లెక్చరర్ల వేధింపులు తాళలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినా, సమాచారం బయటకు పొక్కకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. నారాయణ విద్యాసంస్థలలో విద్యార్థులకు రక్షణ కరువవుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
అనుమతుల వెనుక..
పెద్దఅంబర్‌పేట: పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలో అధికారుల కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ నిర్మాణాల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి అధికారుల తీరుతో ఇటు హెచ్ఎండీఏకు, అటు పురపాలక సంఘానికి కోట్లాది రూపాయల మేర గండి పడుతోంది. పాలకవర్గంలోని కొందరు సభ్యులతో చేతులు కలిపిన ఇక్కడి అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ వాటి వల్ల వచ్చే సొమ్మును ‘తిలాపాపం తలాపిడికెడు’ అనే చందంగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దఅంబర్‌పేట 5వ వార్డు పరిధిలోకి వచ్చే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కార్పొరేట్ భవనం నుంచి హెచ్ఎండీఏ, పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘానికి రావాల్సిన సుమారు రూ. 2 కోట్ల రూపాయలను దారి మళ్లించారు. అధికారులు, కొంతమంది సభ్యులు సదరు భవన నిర్మాణదారుడి నుంచి రూ. 50లక్షలు (అరకోటి) ముడుపులు తీసుకున్నారనే విమర్శలు స్థానికంగా గుప్పుమంటున్నాయి. సుమారు లక్ష నుంచి లక్షా ముప్పై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన, నిర్మిస్తున్న భవనాలను అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోయి ఉచిత సలహాలు ఇస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. రెండు భవనాలూ అక్రమంగానే.. 5వ వార్డు పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొనసాగుతున్న రెండు భవనాలు కూడా అక్రమ నిర్మాణాలే. అందులో ఒకటి హెచ్ఎండీఏ అనుమతితో నిర్మాణం చేపట్టామని చెబుతున్నప్పటికీ, అధికారుల ఇచ్చిన అనుమతి మ్యాప్‌లో ఒక విధంగా ఉంటే నిర్మాణం మాత్రం అందుకు విరుద్ధంగా కొనసాగుతోంది. సాధారణంగా హెచ్ఎండీఏ అధికారులు సెల్లార్‌ను వాహనాల పార్కింగ్‌కు కేటాయిస్తూ అనుమతిస్తారు. అయితే, అలా కాకుండా సెల్లార్‌ను మొత్తం గదులతో నిర్మించి హెచ్ఎండీఏ అధికారులను సైతం మోసగించే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు ఈ భవానికి పక్కనే నిర్మిస్తున్న (దాదాపు పూర్తికావచ్చిన ) భవనానికి పదేళ్ల క్రితం సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి సంతకాలతో కూడిన అనుమతి పత్రాలతోనే భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.ఇదే భవనం తరహాలోనే మరో భవనానికి పునాదులు తీసి పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ తతంగం అంతా స్థానిక పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలోని అధికారులకు, పాలకవర్గంలో పలువురు సభ్యులకు తెలిసే జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారానికి సహకరిస్తున్న అధికారులకు, పలువురు సభ్యులకు నిర్మాణదారుడు రూ. అరకోటి వరకు ముడుపులు చెల్లించారని విశ్వసనీయ సమాచారం. ఏపీ మంత్రికి చెందిన కళాశాల కొనసాగింపు అయితే, ఈ అక్రమ భవనాల్లో ఒక దాంట్లో ప్రస్తుత ఏపీ మంత్రి నారాయణకు చెందిన కళాశాల కొనసాగుతోంది. దీంతోపాటు పక్కనే నూతనంగా నిర్మాణం పూర్తి చేస్తున్న భవనాలు కూడా వచ్చే జూన్‌లో ఇదే కళాశాల యాజమాన్యానికి అప్పగించాలనే లక్ష్యంతో కొనసాగిస్తున్నారు. అయితే, వీటిలో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిర్మించడంతో వందలాది మంది విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతారా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే ఉన్నత విద్యామండలి అధికారులు సైతం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. -
‘నారాయణ-చైతన్య’ మధ్య ర్యాంకుల గొడవ
-
‘చైతన్య-నారాయణ’ మధ్య ర్యాంకుల వార్
సాక్షి, హైదరాబాద్ : ర్యాంకుల వ్యవహారంలో కార్పోరేట్ కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ యాజమాన్యాల మధ్య వార్ వేడెక్కింది. తమ ర్యాంకులను నారాయణకు వచ్చినట్టు చెప్పుకుంటున్నారని చైతన్య కాలేజీల చైర్మన్ బీవీ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎంసెట్‌లో తమకు టాప్ ర్యాంకు వస్తే నారాయణకు వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ, శ్రీ చైతన్య కలిసి స్టార్ట్ చేసిన శార్వాణి గ్రూప్ పనిచేయడం లేదని, ప్రస్తుతం ఈ రెండు వేర్వేరని స్పష్టం చేశారు. ఇక నుంచి చైనా( చైతన్య-నారాయణ) బ్యాచ్‌లు ఉండవన్నారు. శ్రీ చైతన్య స్కూల్లో చదువుకున్న విద్యార్థులను నారాయణ.. తమ విద్యార్థులుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు. జేఈఈలోని టాప్ 5 ర్యాంకులు తమ విద్యార్థులవేనని, కానీ నారాయణ ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్, జేఈఈ, ఎంసెట్ ఫలితాల్లో ఇరు కాలేజీలు ఒకే ర్యాంకులు వచ్చాయని ప్రకటనలివ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. -
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
-
నారాయణలో మరో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి అలిపిరి: కార్పొరేట్ కళాశాలల్లో ప్రతిభా కుసుమాలు రాలిపోతున్నాయి. తిరుపతిలో న్యూమారుతీనగర్‌లో ఉన్న నారాయణ మెడికల్ అకాడమీలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న మండి శ్రీహర్ష (17) మంగళవారం సాయంత్రం హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. చిత్తూరు జిల్లా బీ.కొత్తకోటకు చెందిన శ్రీధర్‌కు ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు శ్రీహర్ష పదో తరగతిలో 9.8 శాతం గ్రేడ్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. శ్రీహర్షను డాక్టర్‌ను చేయాలనే కోరికతో తండ్రి శ్రీధర్ తిరుపతి నారాయణ మెడికల్ అకాడమీలో చేర్చారు. చదువులో చురుగ్గా ఉండే శ్రీహర్ష గత శనివారం ఇంటికి వెళ్లి ఆదివారం అమ్మానాన్నలతో గడిపాడు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం కళాశాలకు చేరుకుని స్నేహితులతో కలిసి మెస్‌లో భోజనం చేసి తలనొప్పిగా ఉందని చెప్పి రూమ్‌కి వెళ్లాడు. సాయంత్రం తరగతులు ముగిశాక గది తలుపులు తీసిన స్నేహితులకు శ్రీహర్ష ఉరేసుకుని కనిపించాడు. దీంతో విద్యార్థులు విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. వెంటనే విద్యార్థిని రుయా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కాగా, శ్రీహర్ష చదువులో చురుగ్గా ఉంటాడనీ, సున్నిత మనస్తత్వమని చెబుతున్న కళాశాల యాజమాన్యం బలవన్మరణానికి కారణాలు తెలియదంటోంది. కళాశాల ప్రిన్సిపల్ మాధవరెడ్డి, ఏజీఎం శంకరరావులు ఆస్పత్రి దగ్గర మీడియాతో మాట్లాడారు. రెండు రోజులు ఇంటిదగ్గర ఉండి వచ్చిన శ్రీహర్షకు ఏమైందో తెలియదని, కాలేజీలో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పారు. శనివారం ఇంటికి వచ్చిన తన కుమారుడు మంగళవారం తిరిగి కాలేజీకి వెళ్తూ ‘ఆరోగ్యం జాగ్రత్త నాన్నా’ అని చెప్పి వెళ్లాడని తండ్రి శ్రీధర్ భోరున విలపిస్తూ చెప్పారు. ఈ మధ్యనే తాను కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్‌ని కలిసి వచ్చాననీ, బాగా చదువుతున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. రుయాకు చేరుకున్న విద్యార్థి సంఘాలు శ్రీహర్ష ఆత్మహత్య గురించి తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు రాత్రి 8 గంటలకు రుయా ఆస్పత్రికి చేరుకుని కళాశాల యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి నారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు మురళీధర్, హేమంత్‌కుమార్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, దాము, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘ నాయకులు నాగరాజు, వసీం అక్రం తదితరులు రుయా దగ్గర నిరసన వ్యక్తం చేశారు. -
నారాయణ, శ్రీచైతన్య హాస్టళ్లు నరకానికి నకళ్లు
-
నారాయణ, శ్రీచైతన్య హాస్టళ్లు నరకానికి నకళ్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు చెందిన హాస్టళ్లలో విద్యార్థులకు నరకం కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కంటి నిండా నిద్ర.. కడుపు నిండా తిండి లేదు. కాలేజీలు, హాస్టళ్లలో సమయ పాలన లేదు.. ఆటలు లేవు.. కనీసం సెలవు దినాల్లోనూ విరామం ఇవ్వడం లేదని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక బృందాలు జరిపిన తనిఖీల్లో బయటపడింది. వారం రోజులపాటు నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 146 హాస్టళ్లలో బోర్డు అధికారుల బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయగా.. ఈ లోపాలు బయటపడినట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. అనుబంధ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఆయా కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 15 రోజుల సమయం ఇచ్చామని, సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. బోర్డు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేట్ కాలేజీల వ్యవహారం, విద్యార్థుల పరిస్థితి, తాము చేపడుతున్న చర్యలను వివరించారు. వివరాలు అశోక్ మాటల్లోనే.. బోర్డు చట్టంలోనూ మార్పులు! కాలేజీలు, హాస్టళ్లపై నియంత్రణకు బోర్డు చట్టంలోనూ మార్పులు తీసుకువస్తాం. హాస్టళ్లను బోర్డు పరిధిలోకి తెస్తాం. పీఆర్వోల వ్యవస్థను పెట్టుకొని తల్లిదండ్రులను ఆకర్షించి విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఇందుకు ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తున్నాయి. మంచి ర్యాంకులు వచ్చాయంటూ ప్రకటనలతో కాలేజీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దీన్ని నిషేధించేందుకు చర్యలు చేపడతాం. సమగ్ర పరిశీలన జరిపి సిఫారసులు చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో బోర్డు కార్యదర్శితోపాటు అధికారులు, తల్లిదండ్రులు, న్యాయ నిపుణులు, యాజమాన్యాల ప్రతినిధులు ఉంటారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం కమిటీ సభ్యుల పేర్లను త్వరలో ఖరారు చేస్తాం. రెసిడెన్షియల్ కాలేజీగానే ‘గుర్తింపు’ ఇకపై కాలేజీ పేరుతో అనుబంధ గుర్తింపు ఇవ్వం. హాస్టళ్లు ఉన్న వాటికి రెసిడెన్షియల్ కాలేజీ పేరుతోనే గుర్తింపు ఇస్తాం. నిబంధనల ప్రకారం ఉంటేనే హాస్టళ్లు నడిపేందుకు అనుమతి. హాస్టళ్ల నియంత్రణకు ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటితోపాటు కొత్త నిబంధనలను అందుబాటులోకి తెస్తాం. అలాగే ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో యాజమాన్యాలు చేస్తున్న అడ్డగోలు ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతాం. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేస్తాం. కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. తర్వాత జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు విధానం రూపొందిస్తాం. ఆన్లైన్ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఫిర్యాదులకు త్వరలోనే కాల్‌సెంటర్ ప్రైవేటు కాలేజీల ఆగడాలు, ఫీజులు, ఇతర సమస్యలకు సంబంధించి వారం రోజుల్లో బోర్డు కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. కార్పొరేట్ కాలేజీల ఆగడాలను నియంత్రించేందుకు, వాటి అవకతవకలపై అనేక చర్యలు చేపట్టాం. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 29 కాలేజీలకు నోటీసులు ఇవ్వడమే కాకుండా రూ.1.66 కోట్లు వసూలు చేశాం. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం చర్యలు చేపట్టాకే అనుబంధ గుర్తింపునకు అవకాశం కల్పించాం. ఫిబ్రవరిలో అనుబంధ గుర్తింపు ప్రక్రియ 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించిన అనుబంధ గుర్తింపు ప్రక్రియను వచ్చే ఫిబ్రవరిలోనే చేపడతాం. మార్చిలో పూర్తి చేసి, మార్చి 31వ తేదీలోగా గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, గుర్తింపు లభించని కాలేజీల జాబితా ప్రకటిస్తాం. గుర్తింపు లేని వాటిలో చేరవద్దు. ఇప్పుడు ఎవరు ప్రవేశాలు చేపట్టినా చెల్లవు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. 146 హాస్టళ్లు ఆ రెండింటివే! ఇంటర్ బోర్డు బృందాలు తనిఖీలు చేసిన 146 కాలేజీల హాస్టళ్లు నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలవే. రంగారెడ్డిలో 35, మేడ్చల్‌లో 51, హైదరాబాద్‌లో 60 కాలేజీల హాస్టళ్లలో తనిఖీలు జరిపారు. వాటిలో అకడమిక్ కేలెండర్ అమలు చేయడం లేదు. ఉదయం 10.00 నుంచి సాయంత్రం 4 వరకే బోధన చేపట్టాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ఉదయం 6.00 నుంచి రాత్రి 8.00 వరకు చదువే చదువు. భోజనంలో నాణ్యత లేదు. పోనీ క్యాంటిన్లో తిందామంటే విద్యార్థుల నుంచి 3 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. వాష్‌రూమ్‌లు, టాయిలెట్లు సరిగ్గా, సరిపడా లేవు. నలుగురి నుంచి ఆరుగురు ఉండాల్సిన గదుల్లో 8 నుంచి 12 మందిని ఉంచుతున్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సెలర్లను నియమించలేదు. ఆదివారాల్లోనూ విద్యార్థులను తల్లిదండ్రులతో కలవనీయడం లేదు. దీనిపై విద్యార్థులతో మాట్లాడాం. ఆధారాలు సేకరించాం. నోటీసులకు యాజమన్యాల సమాధానాలు వచ్చాక అవి సంతృప్తికరంగా లేకుంటే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడేది లేదు. విద్యార్థుల ఆత్మహత్యలు జరిగిన అన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చాం. ఎక్కువ సంఖ్యలో కాలేజీలు ఉండి, హాస్టల్ సదుపాయాలు ఉన్న యాజమన్యాలు మరో 18 వరకు ఉన్నాయి. వాటిలోనూ త్వరలో తనిఖీలు చేస్తాం. 7న డిప్యూటీ సీఎం భేటీ కాలేజీల్లో లోపాలను సవరిం చుకోవాలని, నిబంధనలను పాటించాలని చెప్పేందుకు, ఇతర సమస్యలపై చర్చించేందుకు యాజమాన్యాలతో ఈనెల 7న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశం కానున్నారు. సచివాలయంలో సాయం త్రం 4 గంటలకు జరిగే సమావేశానికి 20 యాజమాన్యాలు, అనుబంధ హాస్టళ్లు ఉన్న కాలేజీలకు చెం దిన కరస్పాండెంట్లు, యజమానులు హాజరుకానున్నారు. -
నారాయణ కాలేజ్‌లో గ్యాంగ్‌వార్
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్ జరగడం కలకలం రేపుతోంది. నిక్ నేమ్‌తో పిలిచినందుకు ఇంటర్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తరగతి గదిలో నిక్ నేమ్‌లతో పిలుస్తున్నాడని మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు. అంతేగాక తలపై రాళ్లతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటనకు కారణమైన ఐదుగురి విద్యార్థులపై బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థిని ఆచూకీ లభ్యం
హైదరాబాద్: చదువుపై ఆసక్తి లేదని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన ఓ విద్యార్థిని ఆచూకీ లభించింది. మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు వివరాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలం అడ్డగుంటపల్లికి చెందిన శ్రీనివాస్ కుమార్తె సాయిప్రజ్వల(17) హైదరాబాద్ శివారులోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. ఈ నెల 10న సాయిప్రజ్వల కాలేజీలో ఉన్నప్పుడు నీరసంగా కనిపించింది. ప్రిన్సిపాల్ పిలిచి ‘ఎందుకు డల్‌గా ఉన్నావు’అని అడగగా నాకు చదువుకోవాలని లేదని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తండ్రి శ్రీనివాస్ బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని చెంగిచర్ల వెంకటసాయి నగర్ కాలనీలో ఉండే సాయిప్రజ్వల మామ లక్ష్మీనారాయణకు తీసుకుని రమ్మని చెప్పారు. 10వ తేదీ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయానే సాయిప్రజ్వల ఇంట్లో ఉత్తరం రాసి 11.30 గంటల నుంచి కనిపించకుండా పోయింది. పది రోజులుగా నాలుగు టీంలుగా ఏర్పడి ముమ్మరంగా గోదావరిఖని, తిరుపతి, ఖమ్మం, హైదరాబాద్ నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్, ఇమ్లీబన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్‌ల్లో గాలించారు. చివరకు గురువారం రాత్రి పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని ఉప్పల్ డిపో వద్ద ఉన్న ఆరాధ్య లేడీస్ హాస్టల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఆచూకీ లభ్యమైంది ఇలా...: ప్రజ్వల కేసును పోలీసులు ఓ ఫోన్ కాల్ సమాచారం ద్వారా ఛేదించారు. మేడిపల్లి పోలీసులు 4 టీంలుగా ఏర్పడి నగరంతోపాటు తిరుపతి, గోదావరిఖని, ఖమ్మంలలో గాలించినా చిన్న క్లూ కూడా దొరకలేదు. చివరికి అమ్మాయి స్నేహితులకు, బంధువుల ఫోన్స్ సీఆర్ డాటా పరిశీలించారు. ఆరాధ్య లేడీస్ హాస్టల్ నుంచి ఓ అమ్మాయి మొబైల్ తీసుకుని ఓ ఫోన్‌కు తరుచుగా కాల్ చేస్తోంది. పోలీసులు ఆ డేటా ఆధారంగా ఫోన్ లొకేషన్‌ను బట్టి ఉప్పల్ డిపో పరిసర ప్రాంతంలో ఉన్న లేడీస్ హాస్టళ్లన్నింటినీ పరిశీలించారు. చివరికి ఆరాధ్య లేడీస్ హాస్టల్లో దొరికింది. -
సాయి ప్రజ్వల కోసం ముమ్మర గాలింపు
హైదరాబాద్: ఈ నెల 11న మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకట్సాయినగర్ కాలనీలో ఉంటున్న తన మామయ్య ఇంటి నుంచి కనిపించకుండా పోయిన సాయి ప్రజ్వల కోసం మేడిపల్లి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రజ్వల జాడ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు ఒక బృందంగా ఏర్పడి ప్రజ్వల.. బైపీసీ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న బండ్లగూడలోని నారాయణ కాలేజీ హాస్టల్‌కు వెళ్లారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను విచారించారు. ప్రజ్వల హాస్టల్ రూంను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక నోట్‌బుక్‌లో మూడు ఫోన్ నంబ ర్లను గుర్తించి ఫోన్ కాల్స్ చేయగా రెండు నంబర్లు ప్రజ్వల క్లాస్మేట్ రుతికకు సంబంధించినవిగా తెలిసింది. మరొకటి దోమలగూడకు చెందిన మహిపాల్‌రెడ్డి పేరు మీద ఉంది. ఆ ఫోన్‌ను ఆయన మేనల్లుడు వినయ్ వాడుతున్నాడు. అతను ఆరేళ్లుగా బెంగళూరులో చదువుకుంటు న్నట్లు తెలిసింది. వినయ్‌కు మేడిపల్లి పోలీసులు ఫోన్ చేయగా ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదని కాల్ కట్ చేశాడు. సోమవారం ఒక బృందం ప్రజ్వల తండ్రి శ్రీనివాస్‌ను తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్ బస్టాండుల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. మరో బృందం నారాయణ విద్యా సంస్థల హాస్టళ్లకు వెళ్లి వివరాలు సేకరించింది. ఇంకొక బృందం నాంపల్లి రైల్వేస్టేషన్, సీబీఎస్ బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలు తిరిగింది. సాయంత్రం 6 గంటల తర్వాత తిరుపతి నుంచి ఓ వ్యక్తి మేడిపల్లి ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి టీవీలో కనపడకుండా పోయిందని చూపిస్తున్న అమ్మాయిని ఓ హోటల్ వద్ద టిఫిన్ చేస్తుండగా చూశానని చెప్పాడు. దీంతో అక్కడకు ఓ బృందాన్ని పంపిస్తున్నారు. అయితే అది నమ్మశక్యంగా లేదని పోలీసులు భావిస్తున్నారు. ప్రజ్వల సాయిబాబా భక్తురాలు కావడంతో షిర్డీకి వెళ్లి ఉంటుందని, అక్కడకు మరో బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిసింది. ప్రజ్వల వద్ద ఫోన్ లేకపోవడంతో ఒక్క క్లూ కూడా దొరకలేదని పోలీసులు అంటున్నారు. -
'నారాయణ అయినా మరొకరైనా శిక్ష తప్పదు'
తిరుపతి: 'ప్రభుత్వానికి ఎవరూ చుట్టం కాదు..తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు..నారాయణ అయినా మరొకరైనా చట్టానికి అందరూ సమానమే' అని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లా కడపలోని నారాయణ కాలేజ్ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల మృతి పై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ముగిసింది. దీంతో నివేదికను సోమవారం కమిటీ చైర్మన్ విజయలక్ష్మీ తిరుపతిలో గంటాకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మృతిపై త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసిందని, ఇంకా పరిశీలించలేదన్నారు. నివేదికను ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేయమని అధికారులకు సూచించినట్టు ఆయన తెలిపారు. ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా పలు చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయం చేయాలని మృతుల తల్లిదండ్రులు అడిగినమాట వాస్తవమేనని ఆయన సాక్షికి తెలిపారు. ఆత్మహత్యల ఘటనపై కమిటీ నివేదిక ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. పవన్ వ్యాఖ్యల్ని తాము పాజిటివ్‌గా తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని, పరోక్షంగా పవన్ తమకు సహకరించారని ఆయన అన్నారు.