విద్యార్థులతో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్
అనంతపురం: సోములదొడ్డి వద్దనున్న నారాయణ జూనియర్ కళాశాలను జిల్లా పర్యవేక్షణ కమిటీ (డి స్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ సూపర్‌వైజింగ్ కమిటీ) చైర్మన్ జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాసికరమైన భోజనం అందిస్తున్నారని, చదువులో వెనుకబడిన వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని, వార్డెన్ ప్రవర్తన తీరు బాగోలేదని విద్యార్థులు కమిటీ దృష్టికి తెచ్చారు.
నిర్దేశిత ఫీజులకు మించి వసూలు చేయడమే కాకుండా నాసిరకమైన భోజనం పెడుతూ.. విద్యార్థులపై అకృత్యాలకు పాల్పడతారా అంటూ సిబ్బందిపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ కళాశాలకు రూ.5 లక్షల జరిమానా విధించారు. కార్యక్రమంలో డీఎంఎస్‌ఎసీ కన్వీనర్ వెంకటరమణ నాయక్, ఆర్‌ఐఓ డాక్టర్ సురేష్‌బాబు, సైకియాట్రిస్ట్ డాక్టర్ రవికుమార్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment