
సాక్షి, అనంతపురం: ప్రైవేట్ ఆస్పత్రులో దోపిడీపై జాయింట్ కలెక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. హర్షిత ఆస్పత్రికి రూ.20 లక్షలు, చంద్ర ఆస్పత్రికి రూ.9 లక్షలు జరిమానా విధించారు. 14 ఆస్పత్రులకు రూ.39 లక్షలు జరిమానా విధించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వం ఆదేశాలు పాటించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పదేపదే అధిక ఫీజులు వసూలు చేసినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జేసీ హెచ్చరించారు.
చదవండి: ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్
ట్విన్ బ్రదర్స్... ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment