అనంతలో పేలిన ఎనిమిది గ్యాస్‌ సిలిండర్లు | Eight Gas Cylinders blasted at Kalyanadurgam | Sakshi
Sakshi News home page

అనంతలో పేలిన ఎనిమిది గ్యాస్‌ సిలిండర్లు

Published Wed, Aug 17 2016 11:47 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

Eight Gas Cylinders blasted at Kalyanadurgam

అనంతపురం: అనంతపురం జిల్లాలో గ్యాస్‌ సిలిండర్లు పేలుడు ఘటన కలకలం సృష్టించింది. రీఫిల్‌ చేస్తుండగా ఒకేసారి ఎనిమిది సిలిండర్లు పెద్ద శబ్ధంతో పేలాయి. దాంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటన కల్యాణదుర్గం పీ సర్కిల్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి పక్కనే పెట్రోల్‌ బంక్‌ ఉండటంతో అక్కడి జనం దూరంగా పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. జనావాసాల మధ్య గ్యాస్ సిలిండర్లను రిఫిల్లింగ్ చేస్తున్నా కూడా అధికారులు ఏమి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement