బతుకు బుగ్గి
నగరంలో శుక్రవారం తెల్లవారుజామున స్వల్పవ్యవధిలో చోటుచేసుకున్న రెండు అగ్నిప్రమాదాలు ప్రజలను భయకంపితులను చేశాయి. ఒక ప్రమాదంలో సుమారు 150 గుడిసెలు కాలిబూడిదయ్యూరుు. దీంతో పేద ప్రజలు సర్వం కోల్పోరుు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మరో సంఘటన ప్రజల కంటిపై కునుకులేకుండా చేసింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: నుంగంబాకం పుష్పానగర్ కరుమారియమ్మన్ కోవిల్ సమీపంలో సుమారు 500కు పైగా గుడిసెలు ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఒక గుడిసెలో మంటలు చెలరేగారుు. ఆ ఇంటి లో కాపురం ఉంటున్న వారు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వీరి కేకలకు మేల్కొన్న ఇరుగుపొరుగు వారు కూడా మంటలను చూసి భయంతో బయటకు వచ్చారు. అదే సమయంలో బలమైన గాలులు వీయడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి.
మంచి నిద్రలో ప్రమాదం సంభవించడంతో ప్రజలు షాక్ నుంచి తేరుకునేలోగా గుడిసెలన్నీ కాలిబూడిదయ్యూరుు. ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్, బీరువాలు తదితర సామగ్రి కాలిబూడిదయ్యూరుు. గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అక్కడికి సమీపంలో పార్కు చేసి ఉన్న 10 మోటార్ సైకిళ్లు కూడా కాలిబూడిదయ్యూరుు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు 150 గుడిసెలు కాలిపోయూరుు.
ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. సుమారు రూ.10 లక్షల నష్టం సంభవించినట్టు అధికారులు అంచనావేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వలర్మతి, నగర మేయర్ సైదై దురైస్వామి ఉదయాన్నే వచ్చి బాధితులను పరామర్శించారు. ఇంట్లో దాచుకున్న డబ్బు, రేషన్ కార్డులు, గుడ్డలు సహా కాలిపోగా కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీరుమున్నీరయ్యూరు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని బాధితులకు మంత్రి భరోసా ఇచ్చారు. రెవెన్యూ అధికారులు వచ్చి బాధితుల వివరాలను సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
సబ్‌స్టేషన్లో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు
చేట్‌పట్ సమీపంలో ఒక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో పెద్ద టాన్స్‌ఫార్మర్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. పేలుడు ధాటికి శకలాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో చేట్‌పట్, కీల్‌పాక్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలుడు శబ్దాలు వినపడం, పూర్తిగా చీకట్లు కమ్ముకోవడంతో ఏమి జరిగిందోనని ప్రజలు బెంబేలెత్తిపోయారు.
ఐదు అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకున్న సిబ్బంది రెండుగంటపాటు హోరాహోరీగా పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ సరఫరా లేనికారణంగా ఆ పరిసరాల ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. శుక్రవారం సాయంత్రానికి దశలవారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.