సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లిలో గ్యాస్ సిలండర్ల పేలుడు సంభవించింది. స్ధానికంగా ఉన్న ఓ షాపులో శనివారం నాలుగు సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు పరుగులు తీశారు. చిన్న సిలిండర్లలలో గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మహిళ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిచ్‌పల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్లు
Published Sat, Dec 23 2017 11:42 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment