హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్‌లోడ్‌తో వెళ్తున్న లారీ కారును ఢీకొట్టడంతో.. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్‌లు పేలకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటన సికింద్రాబాద్ సమీపంలోని నాగారం గ్రామం దమ్మాయిగూడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లారీకి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో.. పెను ముప్పుతప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
గ్యాస్ లారీ-కారు ఢీ.. వ్యక్తికి గాయాలు
Published Mon, Jun 27 2016 8:53 AM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM
Advertisement
Advertisement