ఉప్పునుంతల, న్యూస్‌లైన్ : చెట్టును ట్రాలీఆటో ఢీకొట్టడంతో ఇద్దరు యు వకులు అక్కడికక్కడే దుర్మరణం పా లయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి జరిగి న ఈ సంఘటన గ్యాస్ సిలిండర్లను తరలి స్తుండగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అమ్రాబాద్ మం డలం ఇప్పలపల్లికి చెందిన మేణావత్ చందులాల్(27), నల్గొండ జిల్లా చం దంపేట మండలం సండ్రల్‌గడ్డతం డా వాసి కేతావత్ నాగరాజు(17) హై దరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణికాలనీలో ఉంటూ ఆటోలు నడపడంతోపాటు కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి అచ్చంపేట మండ లం ఘనపురం గ్రామానికి చెందిన సభావత్ లక్పతీనాయక్‌కు చెందిన ట్రాలీఆటోను తీసుకుని అమ్రాబాద్ నుంచి ఇండియన్ గ్యాస్ సిలిండర్లను నగరానికి తరలిస్తున్నారు. మార్గమధ్యంలోని అయ్యవారిపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే ఆటోరోడ్డు పక్కనఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
వాహనం క్యాబిన్‌లో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉప్పునుంతల ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికితీసి పోస్టుమార్టం కోసం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆటోలోని సిలిండర్లను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మృతుడు చందులాల్‌కు భార్య లలితతోపాటు ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. నాగరాజు తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోగా, చెల్లెలు ఉంది.
బ్లాక్ మార్కెట్‌కు తరలించే యత్నంలోనే..
వంటగ్యాస్ సిలిండర్లను ఆటోలో దొంగచాటుగా రాత్రివేళ తరలించే ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగి నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఇక్కడ ఒక్కో సిలిండర్ రూ.750కు కొనుగోలు చేసి నగరంలో రూ.1200కు బ్లాక్‌లో అమ్ముతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ఆటోలో ఉన్న 30 సిలిండర్లను ఎంఆర్‌ఐ సుల్తాన్, వీఆర్వో నిరంజన్ స్వాధీనం చేసుకుని అచ్చంపేటలోని భారత్‌గ్యాస్ గోదాంలో భద్రపర్చారు. దీనిపై విచారణచేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహశీల్దార్ సీహెచ్ నాగయ్య తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన ట్రాలీఆటో
Published Wed, Oct 23 2013 3:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement