Trolly auto
-
నిర్లక్ష్యంపై బ్యాంక్ ఉద్యోగుల సస్పెన్షన్?
నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎస్బీఐ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ట్రాలీ ఆటోలో రూ.48 కోట్లు తరలించేందుకు సిద్ధపడిన ఘటనలో ముగ్గురు బ్యాంక్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. వీరిలో బ్యాంక్ మేనేజర్‌తోపాటు ఇద్దరు కస్టోడియన్ అధికారులు ఉన్నట్లు సమాచారం. గురువారం జిల్లాకేంద్రంలోని ఎస్బీఐ నుంచి ట్రాలీ ఆటోలో రూ.48 కోట్లను ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా సమీపంలోని గ్రామీణ వికాస్‌బ్యాంక్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుచెప్పిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పత్రికల్లో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు బ్యాంక్ వర్గాల సమాచారం. దీనిపై నల్లగొండ టూటౌన్ సీఐ బాషా..ఎస్బీఐ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. నగదు తరలింపు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు తరలించేటప్పుడు కనీసం పది మంది సాయుధ పోలీసుల రక్షణ అవసరమని పోలీసులు తెలిపారు. కాగా, నగదు తరలింపులో బ్యాంకు అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని జిల్లా పోలీసులు ఆర్బీఐకి నివేదిక పంపుతున్నట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన మరో ఇద్దరు అధికారులపై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం. -
ట్రాలీ ఆటోలో రూ.40కోట్లు
నల్లగొండ క్రైం: స్థానిక స్టేట్ బ్యాంక్ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఓపెన్ ట్రాలీ ఆటోలో రూ.40 కోట్లను తరలించడానికి సిద్ధపడగా, పోలీసులు అడ్డుకున్నారు. ఘటన గురువారం నల్లగొండలో చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ప్రధాన శాఖ నుంచి ట్రాలీలో రూ.40 కోట్లను గ్రామీణ వికాస్ బ్యాంకుకు తరలించేందుకు ట్రాలీ ఆటోలో నోట్ల కట్టలు సర్దారు. నోట్లు బయటకు కనిపించకుండా కనీస ఏర్పాట్లు కూడా చేపట్టలేదు. దీనిపై గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బాషా, ఎస్ఐ చంద్రశేఖర్‌లు బ్యాంకు వద్దకు వెళ్లారు. భారీ మొత్తంలో నగదును పంపించేటప్పుడు బ్యాంకు సెక్యూరిటీ వాహనంలో తరలించాలని, సిబ్బంది లేకపోతే పోలీసుల సహకారం తీసుకోవాలే తప్ప ఇలా పంపించడం సరికాదని అధికారులకు సూచించారు. అనంతరం పకడ్బందీ సెక్యూరిటీతో ఆ నగదును గ్రామీణ వికాస్‌బ్యాంకుకు తరలించారు. కాగా, సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలోనే డబ్బు తరలింపు చర్యలు చేపట్టామని బ్యాంక్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. -
చెట్టును ఢీకొట్టిన ట్రాలీఆటో
ఉప్పునుంతల, న్యూస్‌లైన్ : చెట్టును ట్రాలీఆటో ఢీకొట్టడంతో ఇద్దరు యు వకులు అక్కడికక్కడే దుర్మరణం పా లయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి జరిగి న ఈ సంఘటన గ్యాస్ సిలిండర్లను తరలి స్తుండగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అమ్రాబాద్ మం డలం ఇప్పలపల్లికి చెందిన మేణావత్ చందులాల్(27), నల్గొండ జిల్లా చం దంపేట మండలం సండ్రల్గడ్డతం డా వాసి కేతావత్ నాగరాజు(17) హై దరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణికాలనీలో ఉంటూ ఆటోలు నడపడంతోపాటు కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి అచ్చంపేట మండ లం ఘనపురం గ్రామానికి చెందిన సభావత్ లక్పతీనాయక్కు చెందిన ట్రాలీఆటోను తీసుకుని అమ్రాబాద్ నుంచి ఇండియన్ గ్యాస్ సిలిండర్లను నగరానికి తరలిస్తున్నారు. మార్గమధ్యంలోని అయ్యవారిపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే ఆటోరోడ్డు పక్కనఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వాహనం క్యాబిన్లో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉప్పునుంతల ఎస్ఐ వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికితీసి పోస్టుమార్టం కోసం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆటోలోని సిలిండర్లను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మృతుడు చందులాల్‌కు భార్య లలితతోపాటు ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. నాగరాజు తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోగా, చెల్లెలు ఉంది. బ్లాక్ మార్కెట్‌కు తరలించే యత్నంలోనే.. వంటగ్యాస్ సిలిండర్లను ఆటోలో దొంగచాటుగా రాత్రివేళ తరలించే ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగి నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఇక్కడ ఒక్కో సిలిండర్ రూ.750కు కొనుగోలు చేసి నగరంలో రూ.1200కు బ్లాక్‌లో అమ్ముతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ఆటోలో ఉన్న 30 సిలిండర్లను ఎంఆర్ఐ సుల్తాన్, వీఆర్వో నిరంజన్ స్వాధీనం చేసుకుని అచ్చంపేటలోని భారత్‌గ్యాస్ గోదాంలో భద్రపర్చారు. దీనిపై విచారణచేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహశీల్దార్ సీహెచ్ నాగయ్య తెలిపారు.