
నల్లగొండ క్రైం: స్థానిక స్టేట్ బ్యాంక్ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఓపెన్ ట్రాలీ ఆటోలో రూ.40 కోట్లను తరలించడానికి సిద్ధపడగా, పోలీసులు అడ్డుకున్నారు. ఘటన గురువారం నల్లగొండలో చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ నుంచి ట్రాలీలో రూ.40 కోట్లను గ్రామీణ వికాస్ బ్యాంకుకు తరలించేందుకు ట్రాలీ ఆటోలో నోట్ల కట్టలు సర్దారు. నోట్లు బయటకు కనిపించకుండా కనీస ఏర్పాట్లు కూడా చేపట్టలేదు.
దీనిపై గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బాషా, ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు బ్యాంకు వద్దకు వెళ్లారు. భారీ మొత్తంలో నగదును పంపించేటప్పుడు బ్యాంకు సెక్యూరిటీ వాహనంలో తరలించాలని, సిబ్బంది లేకపోతే పోలీసుల సహకారం తీసుకోవాలే తప్ప ఇలా పంపించడం సరికాదని అధికారులకు సూచించారు. అనంతరం పకడ్బందీ సెక్యూరిటీతో ఆ నగదును గ్రామీణ వికాస్‌బ్యాంకుకు తరలించారు. కాగా, సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలోనే డబ్బు తరలింపు చర్యలు చేపట్టామని బ్యాంక్ మేనేజర్ శివకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment