తప్పిన పెను ముప్పు
Published Mon, Jan 9 2017 12:23 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
- గ్యాస్ సిలిండర్ల వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు
విజయవాడ: గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో వ్యానులోని వంట గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గుర్తించిన ప్రయాణికులు, స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ సంఘటన తాడేపల్లి ఆల్ట్రాటెక్ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్లు లీక్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమిక్షించారు.
Advertisement