
సాక్షి, జనగాం: జనగాంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. ఓ మొబైల్ టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment