గ్యాస్ లేదు.. పామాయిల్ రాదు
భీమడోలు : పండగ వేళ గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. బుక్‌చేసి 20 రోజులు దాటినా సిలిండర్లు సరఫరా కాకపోవడంతో వా రంతా అవస్థలు పడుతున్నారు. సింగిల్ సిలిండర్, దీపం గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నా యి. నాలుగు నెలల క్రితం వరకూ బుక్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే సిలిండర్ అందేది. జూలై 27న తూర్పుగోదావరి జిల్లా నగరం వద్ద గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనతో గ్యాస్ సరఫరా నిలిచిపోరుుంది. అప్పటినుంచి జిల్లాలోని వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందడం లేదు. అక్కడి పైప్‌లైన్ మరమ్మతులు పూర్తికాకపోవడంతో విశాఖపట్నం నుంచి ట్యాంకర్ల ద్వారా గ్యాస్‌ను రాజమండ్రి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ సిలిండర్లలో నింపి గ్యాస్ ఏజెన్సీలకు రవాణా చేస్తున్నా రు. అరుునా సిలిండర్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉంటోంది. హుదూద్ తుపా ను ప్రభావం నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో విశాఖ నుంచి గ్యాస్ ట్యాంకర్లను పెద్దఎత్తున రాజమండ్రికి పంపిస్తున్నారు. అరుునా, వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు సరఫరా కావడం లేదు.
డిమాండ్ చాంతాడంత.. సరఫరా అంతంత
జిల్లాలో వివిధ కంపెనీలకు సంబంధించి 86 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నారుు. సగటున ఒక్కొ క్క ఏజెన్సీకి నిత్యం రెండు లారీల గ్యాస్ సిలిండర్లు (600) దిగుమతి కావాల్సి ఉంది. ఏలూరు, భీమవరం వంటి పట్టణాల్లోని ఏజెన్సీలకు మూడు నుంచి ఐదు లారీల (900నుంచి 1,500) సిలిండర్లు అవసరమవుతాయి. అయితే, ప్రస్తుతం గ్రామాల్లోని ఏజెన్సీలకు రెండు మూడు రోజులకు ఒక లోడు, పట్టణాల్లోని ఏజెన్సీలకు రెండు, మూడు లారీల్లో మాత్రమే సిలిం డర్లు సరఫరా అవుతున్నాయి. దీంతో గ్యాస్ బుక్ చేసుకున్న విని యోగదారుల సంఖ్య చాంతాడులా పెరిగిపోతోంది. ఒక్క భీమడోలు ఏజెన్సీ పరిధిలోనే సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 15 వేలకు పైగా ఉందంటే పట్టణాల్లో పరిస్థితి ఏమిటో అవగతం చేసుకోవచ్చు.
పామా‘యిల్లె’
కాళ్ల : రేషన్ షాపుల ద్వారా పామాయిల్ సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు. గడచిన జూన్ నుంచి రేషన్ డిపోలకు పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో 10 లక్షల 56 వేల 220 మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ఎన్నికల ముందు వరకు ప్రతినెలా బియ్యం, పంచదార, కిరోసిన్‌తోపాటు పామాయిల్, కందిపప్పు, ఉప్పు, పసుపు, కారం, గోధుమలు, చింతపండు, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులు సరఫరా అయ్యేవి. జూన్‌నెల నుంచి పామాయిల్ సరఫరాను నిలిపివేశారు. సెప్టెంబర్ నుంచి మిగిలిన నిత్యావసర వస్తువులనూ నిలుపుదల చేసి కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్ మాత్రమే అందజేస్తున్నారు. చాలా ఏళ్లుగా తరచూ పామాయిల్ సరఫరా నిలిపివేస్తున్నా.. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండగ రోజుల్లో మాత్రం కచ్చితంగా అందించేవారు. అదే రోజుల్లో పంచదార కోటా పెంచి ఇచ్చేవారు. పామాయిల్ సరఫరాను త్వరలోనే పునరుద్ధరిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. పామాయిల్ ఇవ్వకపోవడంతో పండగ వేళ పిండి వంటలు చేసుకునే పరిస్థితి లేక పేద కుటుంబాల వారు ఆవేదన చెందుతున్నారు.