Bhimadolu
-
భర్తపై గృహహింస కేసు పెట్టిన టీడీపీ సర్పంచ్
భీమడోలు: తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను సర్పంచి కూర్మా లక్ష్మి తనను భర్త రాజ్‌కుమార్ హింసిస్తున్నట్లు ఆదివారం రాత్రి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిస అయిన తన భర్త రాజ్‌కుమార్ తొమ్మిది నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దల సమక్షంలో మాట్లాడినా అతడి తీరు మారకపోవడంతో ఇటీవల అంబర్‌పేటలోని తన పుట్టింటికి వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం అంబర్‌పేట వచ్చిన రాజ్‌కుమార్ తనను తీవ్రంగా కొట్టి గాయపర్చి, హింసించారని తెలిపారు. భీమడోలు ఎస్ఐ వి.ఎస్.వి.భద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చింతమనేనికి పదవీ గండం?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. దౌర్జన్యాలు, దాడులకు ట్రేడ్ మార్క్‌గా నిలిచిన చింతమనేనికి భీమడోలు కోర్టు షాక్ ఇచ్చింది.2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దాడి చేయడంతో పాటు ఎంపీ కావూరి సాంబశివరావుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని వట్టి వసంత్‌కుమార్ గన్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 5 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేయగా విచారణ చేసిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి అధికారులు, ప్రతిపక్ష నాయకులు, పోలీసులు, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తూ వస్తున్న చింతమనేనిపై 42 కేసులు 1996 నుంచి నమోదు కాగా ఇప్పుడు శిక్ష పడటంతో రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడింది. కేసులో శిక్ష పడటం తో కచ్చితంగా తన విప్ పదవికి వెంటనే రాజీనామా చేయాల్సి ఉంది. మరోవైపు శాసనసభ్యుడిగా కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కేసును కొట్టివేస్తేనే చింతమనేనికి ఊరట లభిస్తుంది లేనిపక్షంలో శిక్ష ఖరారు అయితే శాసన సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో పాటు 2019లో పోటీ చేసే అవకాశం లేకుండా పోతుంది. అధికారులు సహకరించకున్నా.. దెందులూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి 2011 నవంబర్ 26వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి మంత్రి వసంతకుమార్‌తోపాటు ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావులు హాజరయ్యారు. ఈ క్రమంలో రచ్చబండ కార్యక్రమం జరుగుతుండగానే స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మంత్రి వట్టి వసంత్‌కుమార్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చింతమనేని ప్రభాకర్ దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడుతూ వసంతకుమార్‌పై చెయ్యి చేసుకున్నారు. అడ్డుకున్న గన్‌మెన్‌ను పక్కకు నెట్టేశారు. దీంతో గన్‌మెన్ ఎం.సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చింతమనేని ప్రభాకర్‌తో పాటు మరో 14 మందిపై దెందులూరు పోలీసులు క్రైమ్ నెంబర్ 218 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి అధికారులు చింతమనేనికి భయపడి సాక్ష్యం చెప్పలేదు. ఆ సమయంలో ఏం జరిగిందో గుర్తులేదంటూ తప్పుకునే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ గత నెలలో కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. అయితే ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు ఉండటంతో శిక్ష నుంచి తప్పుకునే అవకాశం చింతమనేనికి లేకుండా పోయింది. పూర్తి సాక్ష్యాధారాలు ఉండటంతో భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె.దీపదైవకృప సంచలన తీర్పు చెప్పారు. ఈ తీర్పు జిల్లాలో సంచలనం సృష్టించింది. కోర్టుకు హాజరైన చింతమనేని తీర్పు అనంతరం డీలా పడ్డారు. ఆయనకు మద్దతుగా ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, దెందులూరు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోర్టుకు తరలివచ్చారు. దౌర్జన్యాలు, దాడులకు కేరాఫ్ కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం, ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి, ఐసీడీఎస్ అధికారులకు బెదిరింపులు, ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోవడం, అంగన్వాడీ కార్యకర్తలను దుర్బాషలాడటం, పోలీస్ కానిస్టేబుల్ మధును చితక్కొట్టడం, అటవీ శాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపడం, ఇటీవల కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్టే అంశంలో అప్పటి జిల్లా ఎస్పీపై నోరుపారేసుకోవడం, తాజాగా గత ఏడాది మే నెలలో గుండుగొలను జంక్షన్లో ట్రాఫిక్ మళ్లింపు విధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్సై, సీపీఓలపై దాడి.. ఇలా ఎన్నో కేసులు నమోదయ్యాయి. 1996 నుంచి ఇప్పటి వరకూ కోర్టులో కేసులు కొట్టివేసినవి మినహాయిస్తే ప్రస్తుతం 42 కేసులు చింతమనేనిపై నమోదయ్యాయి. ఏలూరు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో రౌడీషీటు కూడా ఉంది. ఎన్ని కేసులు ఉన్నా ఇప్పటివరకూ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు బాధితులు భయపడటంతో శిక్షలు పడకుండా ఉన్నాయి. భీమడోలు కోర్టు తీర్పుతో చింతమనేని ప్రభాకర్ ఆగడాలకు చెక్‌పడుతుందో లేదో చూడాలి. -
చురుగ్గా సాగునీటి ప్రాజెక్టుల పనులు
భీమడోలు : రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి వెళుతూ శనివారం భీమడోలులోని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇంటి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 491 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి వదిలేశామన్నారు. రాష్ర్టంలో 47.8 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించున్నామని చెప్పారు. సగటున రోజుకు 2 నుంచి 3 టీఎంసీల గోదావరి నీరు వృథాగా పోతోందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలనేది పోలవరం, పట్టిసీమ ప్రొజెక్టుల నిర్మాణం ప్రధాన ఉద్దేశమన్నారు. గోదావరి వరద నీటిని కృష్ణా ఆయకుట్టుకు మళ్లించి, ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే కృష్ణా వరదనీటిని శ్రీశైలం, హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రొజెక్టుల ద్వారా రాయలసీమకు మళ్లిస్తామన్నారు. దీనిద్వారా కొంతమేరైనా సాగు, తాగునీటి సమస్య తీరుతుందన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు పూర్తి స్థాయిలో తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తర్వాతే కృష్ణా ఆయుకట్టుకు నీటిని మళ్లిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు, కంట్రాక్టర్ల సమన్వయంతో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ కె.భాస్కర్, ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు. ఆయిల్ పైపులైన్ నిర్మాణం పరిశీలన దేవరపల్లి(గోపాలపురం): గోపాలపురం మండలం భీమోలు వద్ద జరుగుతున్న గెయిల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ పైపులైన్ నిర్మాణ పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం పరిశీలించారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు సుమారు 15 ఏళ్ల క్రితం ఆయిల్ పైపులైన్లు ఏర్పాటు చేసి ఆయిల్‌ను పంపింగ్ చేస్తున్నారు. పైపులైన్ పోలవరం కాలువ తవ్వకానికి అడ్డుగా ఉండటం వల్ల ఇటీవల తొలగించి కాలువ అడుగుభాగం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను మంత్రి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భీమోలు నుంచి గోపాలపురం వరకు సుమారు 3 కిలోమీటర్ల పైపులైను వేస్తున్నారు. మంత్రి వెంట కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
భీమడోలు : విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై నిర్వహిస్తోన్న జీపు ప్రచారయాత్ర గురువారం ఏలూరు నుంచి పోలసానిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌కు చేరింది. అక్కడ ప్రసాద్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10 శాతం మధ్యంతర భృతిని ఇస్తామనడం సరికాదని హితవు పలికారు. డిమాండ్లను అంగీకరించే వరకు ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగులు సంఘం జిల్లా కార్యదర్శి జి.మోహన్, సీఐటీయు జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు, నాయకులు ఎస్కే భాషా, దుర్గారావు, సీహెచ్ విఘ్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు -
గ్యాస్ లేదు.. పామాయిల్ రాదు
భీమడోలు : పండగ వేళ గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. బుక్‌చేసి 20 రోజులు దాటినా సిలిండర్లు సరఫరా కాకపోవడంతో వా రంతా అవస్థలు పడుతున్నారు. సింగిల్ సిలిండర్, దీపం గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నా యి. నాలుగు నెలల క్రితం వరకూ బుక్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే సిలిండర్ అందేది. జూలై 27న తూర్పుగోదావరి జిల్లా నగరం వద్ద గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనతో గ్యాస్ సరఫరా నిలిచిపోరుుంది. అప్పటినుంచి జిల్లాలోని వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందడం లేదు. అక్కడి పైప్‌లైన్ మరమ్మతులు పూర్తికాకపోవడంతో విశాఖపట్నం నుంచి ట్యాంకర్ల ద్వారా గ్యాస్‌ను రాజమండ్రి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ సిలిండర్లలో నింపి గ్యాస్ ఏజెన్సీలకు రవాణా చేస్తున్నా రు. అరుునా సిలిండర్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉంటోంది. హుదూద్ తుపా ను ప్రభావం నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో విశాఖ నుంచి గ్యాస్ ట్యాంకర్లను పెద్దఎత్తున రాజమండ్రికి పంపిస్తున్నారు. అరుునా, వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు సరఫరా కావడం లేదు. డిమాండ్ చాంతాడంత.. సరఫరా అంతంత జిల్లాలో వివిధ కంపెనీలకు సంబంధించి 86 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నారుు. సగటున ఒక్కొ క్క ఏజెన్సీకి నిత్యం రెండు లారీల గ్యాస్ సిలిండర్లు (600) దిగుమతి కావాల్సి ఉంది. ఏలూరు, భీమవరం వంటి పట్టణాల్లోని ఏజెన్సీలకు మూడు నుంచి ఐదు లారీల (900నుంచి 1,500) సిలిండర్లు అవసరమవుతాయి. అయితే, ప్రస్తుతం గ్రామాల్లోని ఏజెన్సీలకు రెండు మూడు రోజులకు ఒక లోడు, పట్టణాల్లోని ఏజెన్సీలకు రెండు, మూడు లారీల్లో మాత్రమే సిలిం డర్లు సరఫరా అవుతున్నాయి. దీంతో గ్యాస్ బుక్ చేసుకున్న విని యోగదారుల సంఖ్య చాంతాడులా పెరిగిపోతోంది. ఒక్క భీమడోలు ఏజెన్సీ పరిధిలోనే సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 15 వేలకు పైగా ఉందంటే పట్టణాల్లో పరిస్థితి ఏమిటో అవగతం చేసుకోవచ్చు. పామా‘యిల్లె’ కాళ్ల : రేషన్ షాపుల ద్వారా పామాయిల్ సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు. గడచిన జూన్ నుంచి రేషన్ డిపోలకు పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో 10 లక్షల 56 వేల 220 మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ఎన్నికల ముందు వరకు ప్రతినెలా బియ్యం, పంచదార, కిరోసిన్‌తోపాటు పామాయిల్, కందిపప్పు, ఉప్పు, పసుపు, కారం, గోధుమలు, చింతపండు, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులు సరఫరా అయ్యేవి. జూన్‌నెల నుంచి పామాయిల్ సరఫరాను నిలిపివేశారు. సెప్టెంబర్ నుంచి మిగిలిన నిత్యావసర వస్తువులనూ నిలుపుదల చేసి కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్ మాత్రమే అందజేస్తున్నారు. చాలా ఏళ్లుగా తరచూ పామాయిల్ సరఫరా నిలిపివేస్తున్నా.. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండగ రోజుల్లో మాత్రం కచ్చితంగా అందించేవారు. అదే రోజుల్లో పంచదార కోటా పెంచి ఇచ్చేవారు. పామాయిల్ సరఫరాను త్వరలోనే పునరుద్ధరిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. పామాయిల్ ఇవ్వకపోవడంతో పండగ వేళ పిండి వంటలు చేసుకునే పరిస్థితి లేక పేద కుటుంబాల వారు ఆవేదన చెందుతున్నారు. -
రుణాల రీ షెడ్యూల్ వట్టిమాటే
భీమడోలు : రుణమాఫీ అమల్లోకి వచ్చేలోగా రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు చేస్తున్న ఊకదంపుడు ప్రకటనలు వట్టిమాటేనని తేలిపోయింది. ఇదే విషయూన్ని యూనియన్ బ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ కేఎల్ రాజు (విజయవాడ) స్పష్టం చేశారు. భీమడోలు మండలం పోలసానిపల్లిలో గురువా రం ఏటీఎం సెంటర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన ఖాతాదారులతో మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లాకు రుణాల రీ షెడ్యూల్ అమలు చేయడం లేదని చెప్పారు. రాష్ర్టంలోని శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, విజయనగరం జిల్లాలకు మాత్రమే రుణాలను రీ షెడ్యూల్ చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. రుణాలు మాఫీ అవుతాయన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు చెందిన 95 శాతం మంది వాయిదాలను చెల్లించడం లేదని చెప్పారు. రైతులు సకాలంలో రుణాలను చెల్లించి ఉంటే తమ బ్యాంకు ద్వారా వారికి ఈ సీజన్లో రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకూ రుణాలు ఇచ్చేవారమని పేర్కొన్నారు. రైతులెవరూ బకారుులు చెల్లించకపోవడంతో కొత్తగా రుణాలను పొందలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ భానుప్రకాష్, మేనేజర్ సీహెచ్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
లారీ కిందకు దూసుకుపోయిన బస్సు
ఏలూరు : మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. గమ్యానికి చేరాల్సిన ప్రయాణీకులు గాయలతో బయటపడ్డారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున యామిని ట్రావెల్స్‌కు చెందిన బస్సు (AP07 TC 3444) ఆగివున్న లారీని ఢీ కొట్టింది. దీంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. విజయనగరం నుంచి గుంటూరుకు వెళ్తున్న యామిని ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆగివున్న లారీని అతి వేగంగా ఢీ కొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు 30 మంది ప్రయాణికులు బస్సులో వున్నారు. ఏమి జరిగిందో అర్థంగాక... బస్సులోని వాళ్లు భయంతో పెద్దగా అరిచారు. మరి కొంతమంది ధైర్యం చేసి... బస్సులు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కాళ్లు నుజ్జయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్యాబిన్లో చిక్కుకుపోయిన బస్సు డ్రైవర్‌ను క్రేన్ సాయంతో బయటకు తీశారు. మంచు విపరీతంగా కురవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. దీనికి తోడు నిబంధనలకు విరుద్దంగా లారీ జాతీయ రహదారిపైనే నిలపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అయితే చివరి నిమిషంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఘోర ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. -
అశ్రునయనాల నడుమ..
చెట్టున్నపాడు (భీమడోలు), న్యూస్‌లైన్ : భీమడోలు మండలం చెట్టున్నపాడులో చెరువు లీజు విషయమై రెండు వర్గాల మధ్య రాజుకున్న రావణకాష్టంలో బలైన ముగ్గురి మృతదేహాలకు బుధవారం అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో చెట్టున్నపాడులో విషాదం నెలకొంది. ఈ అంత్యక్రియల్లో గ్రామస్తులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం దేవదాసు లలిత్, నేతల రంగరాజు, బొంతు జయరాజు మృతదేహాలు మంగళవారం రాత్రి చెట్టున్నపాడుకు తీసుకువచ్చారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద మృతదేహాలను కుటుంబ సభ్యులు, బంధువుల కడసారి చూపునకు ఉంచారు. తమ వారి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వారి కన్నీరుమున్నీరు చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. ఘనంగా అంత్యక్రియలు గ్రామానికి సమీపంలో ముగ్గురి మృతదేహాలను క్రైస్తవ సంప్రదాయంలో అంత్యక్రియలు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంత్యక్రియల్లో గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లికార్జునరావు, జిల్లా ఎన్ జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్. విద్యాసాగర్, తహసిల్దార్ బి.సోమశేఖర్, దళిత సంఘాల నేతలు నివాళులర్పించారు. నన్నెవరు చూస్తారు నాన్నా.. నువ్వు వెళ్లిపోయావు.. నన్నెవరు చూస్తారు నాన్నా.. అంటూ మృతుడు బొంతు జయరాజు కుమార్తె సౌజన్య కన్నీరుమున్నీరయ్యింది. ఆమె వికలాంగురాలు కావడంతో జయరాజు అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. నాన్న ఇక లేడని తెలిసిన సౌజన్య జయరాజు మృతదేహం వద్ద మూగగా రోదించడం చూసి గ్రామస్తులు కంటనీరు పెట్టారు. శవ పేటిక వద్ద భార్య జయమణి, కుమారుడు క్రీస్తురాజు, కుమార్తె ఉషారాణి, మృతుని చెల్లెలు కుమారి రోధించారు. పెద్ద దిక్కును కోల్పోయాం చిన్న రైతుగా జీవిస్తున్న నేతల రంగరాజుకు పిల్లలంటే ఎంతో ప్రేమ. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తనకున్న 17 సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ వ్యవసాయ కూలీగా కూడా పనిచేస్తున్నారు. కుమార్తె రత్నంకు వివాహం చేశాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయామని రంగరాజు భార్య ధనలక్ష్మి, కుమారుడు రవి వాపోయారు. నాన్నా.. మాకు దిక్కెవ రు.. నాన్నా.. మాకు దిక్కెవరూ అంటూ దేవదాసు లలిత్ కుమారుడు శ్రీనివాసరావు గుండెలావిసేలా రోధించడం చూపరులను కలచి వేసింది. లలిత్ భార్య, కుమారులను ఓదార్చడం బంధువుల వల్ల కూడా కాలేదు. గ్రామంలో అందరికీ తలలో నాలుకగా ఉండే దేవదాసు లలిత్ మృతితో చెట్టున్నపాడు మూగబోయింది. చిన్నకారు రైతైన ఆయన గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవాడు. చెరువు లీజు పాత కమిటీ పెద్దగా ఉండి అనేక సమస్యలను పరిష్కరించడంతో దేవదాసును గ్రామస్తులు ఎంతో అభిమానించేవారు. అతడికి భార్య మరియమ్మ, ముగ్గురు కుమారులు రాజ్‌కుమార్, శ్రీనివాసరావు, బంగారు స్వాములున్నారు. తహసిల్దార్‌ను అడ్డుకున్న మృతుల బంధువులు భీమడోలు, న్యూస్‌లైన్ : చెట్టున్నపాడులో మృతదేహాలకు నివాళులర్పించేందుకు వచ్చిన తహసిల్దార్ బి.సోమశేఖర్‌ను బుధవారం మృతుల బంధువులు అడ్డుకున్నారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఉంచిన మృతదేహాలకు నివాళులర్పించేందుకు తహసిల్దార్ వెళ్లారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరినా పట్టించుకోలేదని, చస్తే చూడడానికి వచ్చారా అంటూ విరుచుకుపడ్డారు. గ్రామ పెద్దలు, జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని తహసిల్దార్ వారిని ఓదార్చారు. -
40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పూళ్ల(భీమడోలు), న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై పూళ్ల వద్ద గూడ్స్ క్యారి యర్ వ్యాన్ ప్రమాదానికి గురికాగా దానిలో అక్రమంగా రవాణా చేస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యూన్ని రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్, యజమాని బాలకృష్ణను పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పూళ్ల సమీపంలోని కస్తూరి రైస్ మిల్లులో ఉంచారు. వివరాల్లోకి వెళ్లితే.. కృష్ణాజిల్లా విస్సన్సపేట నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గూడ్స్ క్యారియర్ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్నారు. మార్గం మధ్యలో పూళ్ల వద్దకు వచ్చేసరికి రోడ్డుపై భారీ గోతులు ఉండడంతో అదుపు తప్పిన వ్యాన్ డివైడర్‌పై పడి బోల్తా కొట్టింది. దీంతో వ్యాన్‌లో ఉన్న 80 బియ్యం బస్తాలు బయట పడ్డాయి. స్థానికులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని యజమాని బాలకృష్ణ నుంచి వివరాలు సేకరించారు. విన్సన్నపేట పరిసర గ్రామాల్లోని చౌకడిపో డీలర్ల నుంచి కేజీ రూ.12లు వంతున కొనుగోలు చేసినట్లు అతను చెప్పాడు. లారీ తాడేపల్లిగూడెం వెళ్లి అక్కడ నుంచి మధ్యవర్తి ద్వారా మండపేటకు వెళ్తుందని అధికారులు చెప్పారు. విజిలెన్స్ సీఐ వెంకటేశ్వరరావు, సీఎస్‌డీటీ జి.విజయకుమార్‌రాజు, ఏసీటీవో రాజేంద్రప్రసాద్, వీఆర్వోలు అనిత, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ బాషా పాల్గొన్నారు. -
ఇద్దరు చిన్నారులను బలిగొన్న అతివేగం
భీమడోలు, న్యూస్‌లైన్ : అతివేగం ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. భీమడోలు సమీపంలో జాతీయ రహదారిపై కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలవ్వగా, ఆ కారు పల్టీలుకొట్టడంతో దానిలో ప్రయూణిస్తున్న మరో బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి విజయవాడ వెళ్లేందుకు కొమ్మిరెడ్డి శంకర వెంకట భాస్కర్, భార్య సుబ్బలక్ష్మి, కుమారుడు బాల బాలాజీతో పాటు బంధువులు పోతుల పద్మిని సత్యవేణి, కొర్లపాటి సోమునాయుడు బంధువులకు పెళ్లి శుభలేఖలు ఇచ్చేందుకు శుక్రవారం షిఫ్ట్ కారులో బయలుదేరారు. కారును యాజమాని కొమ్మిరెడ్డి శంకర వెంకట భాస్కర్ నడుపుతున్నాడు. కారు భీమడోలు-పాతూరు గ్రామాల మధ్య కంచికామాక్షి కాలనీ వద్దకు వచ్చేసరికి కాలనీకి చెందిన వీరవాసరపు నవీన్‌తేజ బహిర్భూమికి వెళ్లి వస్తూ రోడ్డు దాటుతుండగా అప్పటికే అతివేగంగా వస్తున్న కారు అతనిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలుకొడుతూ ఏలూరు రోడ్డు వైపు రహదారి పక్కనే ఉన్న డ్రె యిన్‌లోకి దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జు అరుు్యంది. పమాదంలో కారు యాజమాని ఆరేళ్ల కుమారుడు కొమ్మిరెడ్డి బాల బాలాజీకి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కారులో ప్రయూణిస్తున్న సుబ్బలక్ష్మిని విజయవాడ ఆసుపత్రికి, కొమ్మిరెడ్డి శంకర్ వెంకట భాస్కర్‌ను అమలాపురం తరలించారు. దుర్మరణం చెందిన నవీన్‌తేజ(14) భీమడోలు జెడ్పీ హైస్కూలులో 8వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు అక్కలు ఉన్నారు. తండ్రి జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఆ తల్లి చేసిన రోదనలు చూపరులను కలచి వేసింది. భీమడోలు ఎస్సై ఎం.సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.