ఇద్దరు చిన్నారులను బలిగొన్న అతివేగం
Published Sat, Oct 19 2013 3:22 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
భీమడోలు, న్యూస్‌లైన్ : అతివేగం ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. భీమడోలు సమీపంలో జాతీయ రహదారిపై కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలవ్వగా, ఆ కారు పల్టీలుకొట్టడంతో దానిలో ప్రయూణిస్తున్న మరో బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి విజయవాడ వెళ్లేందుకు కొమ్మిరెడ్డి శంకర వెంకట భాస్కర్, భార్య సుబ్బలక్ష్మి, కుమారుడు బాల బాలాజీతో పాటు బంధువులు పోతుల పద్మిని సత్యవేణి, కొర్లపాటి సోమునాయుడు బంధువులకు పెళ్లి శుభలేఖలు ఇచ్చేందుకు శుక్రవారం షిఫ్ట్ కారులో బయలుదేరారు.
కారును యాజమాని కొమ్మిరెడ్డి శంకర వెంకట భాస్కర్ నడుపుతున్నాడు. కారు భీమడోలు-పాతూరు గ్రామాల మధ్య కంచికామాక్షి కాలనీ వద్దకు వచ్చేసరికి కాలనీకి చెందిన వీరవాసరపు నవీన్‌తేజ బహిర్భూమికి వెళ్లి వస్తూ రోడ్డు దాటుతుండగా అప్పటికే అతివేగంగా వస్తున్న కారు అతనిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలుకొడుతూ ఏలూరు రోడ్డు వైపు రహదారి పక్కనే ఉన్న డ్రె యిన్‌లోకి దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జు అరుు్యంది.
పమాదంలో కారు యాజమాని ఆరేళ్ల కుమారుడు కొమ్మిరెడ్డి బాల బాలాజీకి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కారులో ప్రయూణిస్తున్న సుబ్బలక్ష్మిని విజయవాడ ఆసుపత్రికి, కొమ్మిరెడ్డి శంకర్ వెంకట భాస్కర్‌ను అమలాపురం తరలించారు. దుర్మరణం చెందిన నవీన్‌తేజ(14) భీమడోలు జెడ్పీ హైస్కూలులో 8వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు అక్కలు ఉన్నారు. తండ్రి జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఆ తల్లి చేసిన రోదనలు చూపరులను కలచి వేసింది. భీమడోలు ఎస్సై ఎం.సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement