
భీమడోలు: తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను సర్పంచి కూర్మా లక్ష్మి తనను భర్త రాజ్‌కుమార్ హింసిస్తున్నట్లు ఆదివారం రాత్రి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిస అయిన తన భర్త రాజ్‌కుమార్ తొమ్మిది నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెద్దల సమక్షంలో మాట్లాడినా అతడి తీరు మారకపోవడంతో ఇటీవల అంబర్‌పేటలోని తన పుట్టింటికి వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం అంబర్‌పేట వచ్చిన రాజ్‌కుమార్ తనను తీవ్రంగా కొట్టి గాయపర్చి, హింసించారని తెలిపారు. భీమడోలు ఎస్‌ఐ వి.ఎస్.వి.భద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.