భీమడోలు : రుణమాఫీ అమల్లోకి వచ్చేలోగా రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు చేస్తున్న ఊకదంపుడు ప్రకటనలు వట్టిమాటేనని తేలిపోయింది. ఇదే విషయూన్ని యూనియన్ బ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ కేఎల్ రాజు (విజయవాడ) స్పష్టం చేశారు. భీమడోలు మండలం పోలసానిపల్లిలో గురువా రం ఏటీఎం సెంటర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన ఖాతాదారులతో మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లాకు రుణాల రీ షెడ్యూల్ అమలు చేయడం లేదని చెప్పారు. రాష్ర్టంలోని శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, విజయనగరం జిల్లాలకు మాత్రమే రుణాలను రీ షెడ్యూల్ చేస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. రుణాలు మాఫీ అవుతాయన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు చెందిన 95 శాతం మంది వాయిదాలను చెల్లించడం లేదని చెప్పారు. రైతులు సకాలంలో రుణాలను చెల్లించి ఉంటే తమ బ్యాంకు ద్వారా వారికి ఈ సీజన్‌లో రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకూ రుణాలు ఇచ్చేవారమని పేర్కొన్నారు. రైతులెవరూ బకారుులు చెల్లించకపోవడంతో కొత్తగా రుణాలను పొందలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ భానుప్రకాష్, మేనేజర్ సీహెచ్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రుణాల రీ షెడ్యూల్ వట్టిమాటే
Published Fri, Aug 15 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement