భీమడోలు : విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై నిర్వహిస్తోన్న జీపు ప్రచారయాత్ర గురువారం ఏలూరు నుంచి పోలసానిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌కు చేరింది. అక్కడ ప్రసాద్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10 శాతం మధ్యంతర భృతిని ఇస్తామనడం సరికాదని హితవు పలికారు. డిమాండ్లను అంగీకరించే వరకు ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగులు సంఘం జిల్లా కార్యదర్శి జి.మోహన్, సీఐటీయు జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు, నాయకులు ఎస్‌కే భాషా, దుర్గారావు, సీహెచ్ విఘ్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు