ఆత్మహత్యకు యత్నించిన విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు | Power Contract Employees Attempted Suicide | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు

Published Thu, Jul 26 2018 11:18 AM | Last Updated on Mon, Jul 30 2018 3:01 PM

Power Contract Employees Attempted Suicide - Sakshi

 ఆత్మహత్యకు యత్నిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను అడ్డుకుంటున్న విజిలెన్స్‌ అధికారులు 

స్టేషన్‌ఘన్‌పూర్‌ వరంగల్‌ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌లోని సబ్‌స్టేషన్‌ వద్ద చేపట్టిన సమ్మె శిబిరంలో విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు మామిండ్ల శ్రీను, నామోజు అశోక్‌ పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్మకు యత్నించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి.

ఫత్తేపూర్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న మామిండ్ల శ్రీను, ఘన్‌పూర్‌ టౌన్‌లో అన్‌మ్యాన్డ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నామోజు అశోక్‌పై ట్రాన్స్‌కో డీఈ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. విషయం తెలుసుకున్న వారు సమ్మె శిబిరం వద్ద పురుగుల మందు డబ్బాతు తెచ్చుకుని ఆత్మహత్యకు యత్నించారు.

అయితే ముందే విషయం తెలుసుకున్న విజిలెన్స్‌ అధికారులు కిరణ్, పాషా వారి వద్ద నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, కార్యదర్శి రాము మాట్లాడారు. సమ్మె చేస్తున్న కార్మికులపై విద్యుత్‌శాఖ అధికారులు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతుండడం తగదన్నారు.

మాపై అక్రమంగా కేసులు పెట్టారు..

సమ్మెకు ఉద్యోగులను బలవంతంగా సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లను తీసుకొస్తున్నామని ఆరోపిస్తూ తమపై అక్రమంగా పోలీస్‌స్టేషన్‌లో డీఈ కేసులు పెట్టారని శ్రీను, అశోక్‌ వాపోయారు. సం ఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మూర్తి, ఎన్‌.రాజేంద్రప్రసాద్, సీహెచ్‌.రామ్‌రెడ్డి, కె.రాము, ఎం.శ్రీహరి, సుధాకర్, రాజేందర్, రాజు, అశోక్, కిషన్, శ్రీనివాస్, సురేష్‌  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement